కరెంటు

08:25 - June 10, 2018

కొమరం భీం : 70 ఏళ్ల స్వతంత్ర భారతంలోనూ చీకటి బతుకులు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ అక్కడ కరెంటు లేదు. కొమరం భీం జిల్లాలో చిమ్మచీకట్లో బతుకులీడుస్తున్న ఆదివాసీల గోస బాహ్యప్రపంచానికి తెలియచేసేందుకు టెన్ టివి నడుం బిగించింది. నేరుగా అక్కడి వారితో మాట్లాడింది. వారి గూడాల్లో చిమ్మచీకటి నెలకొంది. ఆదివాసీ గ్రామాల్లో ఇప్పటికీ కరెంటు లేదు. చిమ్మచీకట్లో ఆదివాసీలు బతుకులీడుస్తున్నారు. దేశం వెలిగిపోతుందనే నేతలకు సిగ్గు చేటైన విషయం. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

21:07 - January 13, 2018

హైదరాబాద్ : తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చిన ఘనత తమదే అంటూ టీఆర్‌ఎస్‌ చెబుతుంటే.. జేబులు నింపుకునేందుకే ప్రైవేటు సంస్థల దగ్గర విద్యుత్‌ కొనుగోళ్లు చేస్తున్నారని ప్రధాన ప్రతిపక్షం ఆరోపిస్తోంది. మరోసారి కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి టీ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భద్రాద్రి పవర్‌ ప్రాజెక్టు నిర్మాణంలో నిబంధనలు ఉల్లంగించి తప్పుడు అగ్రిమెంట్లు చేయడంతో 23 మంది అధికారులపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ విషయంలో బాల్కసుమన్‌ ఇద్దరిపైనే కేసులు అయ్యాయంటున్నారని.. దీన్ని బట్టే టీఆర్‌ఎస్‌ అవినీతి అర్థమవుతుందని రేవంత్‌రెడ్డి అన్నారు.

విద్యుత్‌ కొనుగోళ్లలో తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని రేవంత్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన ఆరోపణలు తప్పని తేలితే అరెస్ట్‌ చేసి జైల్లో పెట్టాలన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పారదర్శకంగా పనిచేస్తే ... సెంట్రల్‌ విజిలెన్స్‌తో గానీ సీబీఐతో గానీ విచారణ జరపాలన్నారు. తన ఆరోపణలు తప్పని తేలితే అబిడ్స్‌లో ముక్కు నేలకు రాస్తానని రేపంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

మరోవైపు 24 గంటల విద్యుత్ పంపిణీని కాంగ్రెస్ తట్టుకోలేకపోతోందని మీడియా చిట్‌చాట్‌లో రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను, రైతులను కాల్చుకుతింటే తాము కరెంట్ ఇచ్చి అదుకుంటున్నామని చెప్పారు. విద్యుత్‌ కొనుగోళ్లలో అవినీతి జరిగిందని ఆరోపించే వాళ్లు ఆధారాలుంటే భయటపెట్టాలన్నారు. జైలుకు వెళ్లి వచ్చిన వాళ్ళు అడిగితే సమాధానం చెప్పాలా అని కేటీఆర్‌ ప్రశ్నించారు. ప్రతిపక్షాల విమర్శలతో ఇమేజ్‌ డ్యామేజ్‌ అవుతుందని గ్రహించిన టీఆర్‌ఎస్‌.. కిందిస్థాయి నేతలతో సవాళ్లకు ప్రతిసవాళ్లు చేయిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్‌ కొనుగోళ్ల ఒప్పందాలను బయటపెట్టాలన్న విపక్షాల డిమాండ్‌కు మంత్రుల నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడం విమర్శలకు మరింత బలం చేకూర్చుతోంది. 

21:12 - January 12, 2018

హైదరాబాద్ : విద్యుత్‌ ప్రాజెక్టు కాంట్రాక్టుల అవినీతి ఆరోపణలపై సీబీఐ లేదా సీవీసీ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు వెనక్కతగ్గిన టీఆర్‌ఎస్‌ నేతల వైఖరిపై కాంగ్రెస్‌ నాయకుడు రేవంత్‌ రెడ్డి మండిప్డడారు. విద్యుత్‌ ప్రాజెక్టు టెండర్ల కాంట్రాక్టుల్లో ముఖ్యంత్రి కేసీఆర్‌కు భారీగా ముడుపులు ముట్టాయని ఆరోపించారు. ఈ విషయాన్ని తాను నిరూపించకపోతే హైదరాబాద్‌ అబిడ్స్‌ చౌరాస్తాలో ముక్కు నేలకు రాస్తానని రేవంత్‌ మరోసారి సవాల్‌ విసిరారు. యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం విద్యుత్‌ ప్రాజెక్టు నిర్మాణ టెండర్లలో భారీ ఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ నేత రేవంత్‌ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని టీఆర్‌ఎస్‌ ఎంపీ బాల్క సుమన్‌ సవాల్‌ విసిరారు. దీనిని రేవంత్‌ స్వీకరించడంతో ఆత్మరక్షణలో పడ్డ టీఆర్‌ఎస్‌ నేతలు.. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. రేవంత్‌కు విశ్వసనీయతలేదంటూ.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నేత జానారెడ్డి, ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ చర్చకు రావాలని మెలిక పెట్టారు. అయినా రేవంత్‌రెడ్డి వెనక్కితగ్గకుండా బహిరంగ చర్చకు సిద్ధమై, తన అనుచరులతో కలిసి అసెంబ్లీ సమీపంలోని గన్‌ పార్క్‌ వద్దకు వచ్చారు. విద్యుత్‌ ప్రాజెక్టుల టెండర్లలో అవినీతి బయటపడుతుందనే భయంతోనే బహిరంగ చర్చకు రాకుండా టీఆర్‌ఎస్‌ నేతలు తోక ముడిచారని రేవంత్‌ మండిపడ్డారు. టెండర్లు పిలువకుండా 30,400 కోట్ల పనులను బీహెచ్‌ఈఎల్‌కు ఎలా అప్పగించారాలో టీఆర్‌ఎస్‌ నేతలు సమాధానం చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ లేదా సీవీసీతో విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ పాలనలో జరిగిన అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్న రేవంత్‌రెడ్డి, వీటిని ప్రజల ముందువుంచి, ముఖ్యమంత్రిని ప్రగతి భవన్‌ నుంచి చర్లపల్లి జైలుకు పంపిస్తాని హెచ్చరించారు. 

21:25 - December 28, 2017

హైదరాబాద్ : డిసెంబర్ 31 అర్ధరాత్రి నుండి వ్యవసాయానికి 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకొంటోంది. రైతాంగానికి నూతన సంవత్సర కానుకగా సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని 23 లక్షల పంపు సెట్లకు 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.

ఇప్పటి వరకు వ్యవసాయానికి కొన్ని రాష్ట్రాలు 9 గంటలపాటు ఉచిత్ విద్యుత్ అందిస్తున్నాయి. మరికొన్ని రాష్ట్రాల్లో 24 గంటలు సరఫరా చేస్తున్నా.. అక్కడ ఉచితంగా ఇవ్వడం లేదు. ఇక 24 గంటలు ఉచితంగా వ్యవసాయానికి కరెంటు ఇచ్చే రాష్ట్రంగా తెలంగాణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి విద్యుత్ సరఫరాలో మెరుగుదలకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం.. రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించడంతో పాటు.. అన్ని వర్గాలకు 24 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని నిర్ణయించింది.

నిరంతర ఉచిత విద్యుత్‌ను తెలంగాణ ప్రభుత్వం 2016 జూలైలో పాత మెదక్, నల్గొండ, కరీంనగర్ జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అందించింది. ఆ తర్వాత 2016 నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకు 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోని ఉచిత విద్యుత్ సరఫరా చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 2018 జనవరి 1 నుంచి రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించాలని నిర్ణయం తీసుకున్నారు. 15 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని పంపుసెట్లకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా అందించిన తర్వాత విద్యుత్ సంస్థలు ఒక అంచనాకు వచ్చాయి.

రైతులకు 24 గంటల సరఫరా ద్వారా ఏర్పడే డిమాండ్‌ను కూడా ముందుగానే అంచనా వేసిన విద్యుత్ సంస్థలు అందుకు కావాల్సిన కరెంట్‌ను సమకూర్చుకోవడానికి కూడా వ్యూహాలు ఖరారు చేసాయి. 2014 జూన్ 2కు ముందు రాష్ట్రంలో 5,240 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేసేందుకు అవసరమైన ఆరు 400 కెవి సబ్ స్టేషన్లు మాత్రమే ఉండేవి. వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి దాదాపు 13వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయగల సామర్థ్యం కలిగిన 400 కెవి సబ్ స్టేషన్లు అవసరమని భావించిన విద్యుత్ శాఖ కొత్తగా 9 సబ్ స్టేషన్ల నిర్మాణానికి పూనుకున్నది. ఇక 24 గంటల నిరంతర విద్యుత్‌ సరఫరా గడువు సమీపిస్తుండటంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 24 గంటలు కరెంటు ఇవ్వడం వల్ల పడే భారంపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. నిరంతర విద్యుత్ సరఫరాకు రూ.12 వేల 610 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రస్తుతం 14,845 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉత్పత్తి అందుబాటులో ఉంది. భవిష్యత్తులో మరో 13 వేల మెగావాట్ల విద్యుత్ సమకూర్చుకోవడం కోసం కొత్త ఉత్పత్తి కేంద్రాలు నిర్మిస్తున్నారు. దీంతో 2022 నాటికి తెలంగాణలో 28వేల మెగావాట్ల విద్యుత్‌ను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధమవుతోంది. 

17:13 - December 28, 2017

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 24గంటల పాటు విద్యుత్ ను అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రైతులకు ఉచితంగా 24గంటల పాటు విద్యుత్ అందిస్తామని అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అందుకనుగుణంగా విద్యుత్ అధికారులు కొన్ని జిల్లాల్లో ట్రయల్ రన్ నిర్వహించారు. వస్తున్న సమస్యలు..ఏర్పడే సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ

సమయంలో 13 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండానే విద్యుత్ సరఫరా చేశారు. అనంతరం నిరంతర విద్యుత్ సరఫరా అందించే వీలుందని నిర్ధారించుకుని ఏర్పాట్లు చేశాయి. డిసెంబర్ 31 అర్ధరాత్రి నుండి విద్యుత్ సరఫరా చేయాలని, ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. విద్యుత్ సౌధ వద్ద పరిస్థితిని ట్రాన్స్ కో సీఎండీ పర్యవేక్షించారు. 24గంటలు కరెంటు ఇవ్వడంపై పడే భారాన్ని చర్చిస్తున్నారు. రూ. 12,600 కోట్ల భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

21:17 - November 21, 2017

విజయవాడ : వ్యవసాయరంగానికి పగలు ఏడు గంటలు విద్యుత్‌ సరఫరా చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. తర్వలోనే సరఫరా ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. రైతుల ఆత్మహత్యలు లేనప్పుడే వ్యవసాయరంగం నిజమైన అభివృద్ధి సాధించినట్టు అవుతుందని ఈ అంశంపై సభలో జరిగిన స్వల్పవ్యవధి చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. మరోవైపు స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి సభా హక్కుల నోటీసు ప్రవేశపెట్టారు.

ఐక్యరాజ్య సమితి లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధిపై జరిగిన చర్చలో పలువురు సభ్యులు పాల్గొని... సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ఈ అంశంపై జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి యనమల సమాధానం ఇచ్చిన తర్వాత.. ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. విభజన తర్వాత రాష్ట్రం పలు సమస్యలు ఎదుర్కొంటున్నా సంక్షేమం, అభివృద్ధిక సమాన ప్రాధాన్యత ఇస్తున్న విషయాన్ని సభ దృష్టికి తెచ్చారు.

ఆ తర్వాత స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేత అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ.. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పల్లె రఘునాథరెడ్డి సభా హక్కుల నోటీసు ప్రవేశపెట్టారు. రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్‌ స్థానాన్ని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడిన తీరు సభా హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ ఇచ్చిన నోటీసుకు హక్కుల కమిటీకి నివేదించాలని కోరారు.

అనంతరం వ్యవసాయ, అనుబంధ రంగాలపై జరిగిన చర్చకు... వ్యవయసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సమాధానం ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకుని.. వ్యవసాయరంగానికి పగలు ఏడు గంటలు విద్యుత్‌ ఇచ్చే అంశాన్ని ప్రస్తావించారు. రైతుల ఆత్మహత్యలు లేనిరోజే వ్యవసాయరంగం నిజమైన అభివృద్ధి చెందినట్టు అవుతుందంటూ.. ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న విషయాన్ని చంద్రబాబు సభ దృష్టికి తెచ్చారు. వ్యవసాయ, అనుంబంధ రంగాలపై చర్చ ముగిసిన తర్వాత స్పీకర్‌ కోడెల అసెంబ్లీని బుధవారానికి వాయిదా వేశారు.

06:30 - November 12, 2017

రాజన్న సిరిసిల్ల : జిల్లా తంగళ్లపల్లి మండలంలో మంత్రి కేటీఆర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. జిల్లెల నుంచి ముస్తాబాద్‌ వరకు 2 కోట్ల 80 లక్షల నిధులతో చేపట్టనున్న రెండు వరుసల రహదారి పనులకు శంకుస్థాపన చేశారు. కరెంట్‌ కోసం అర్ధరాత్రి వరకు రైతులు పొలాల్లో కాపలా కాయాల్సిన పరిస్థితులు పోయాయని..వ్యవసాయానికి 24 గంటలు విద్యుత్‌ ఇస్తున్న ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. 

18:50 - November 5, 2017

హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్‌ సర్కార్‌ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ప్రభుత్వ సంకల్పం రైతన్నల పాలిట కల్పవృక్షంగా మారబోతోంది. రేపు రాత్రి నుంచి రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా కార్యక్రమాన్ని ప్రయోగత్మకంగా చేపట్టనుంది. ట్రయల్‌ రన్‌లో లోటు పాట్లు అంచనా వేసి..వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి నిరంతర విద్యుత్‌ సరఫరా చేయాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా అందించబోతోంది. ప్రయోగాత్మకంగా సోమవారం నుంచి ఐదారు రోజులపాటు 24 గంటలు విద్యుత్‌‌ సరఫరాను చేయబోతోంది. సీఎం కేసీఆర్‌ ఇచ్చిన ఆదేశాల మేరకు విద్యుత్ సంస్థలు ఈ మేరకు ఏర్పాట్లు పూర్తిచేశాయి. ప్రయోగాత్మకంగా అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటల సరఫరాతో కలిగే ప్రభావాన్ని, అన్ని విధాల అంచనా వేసేలా చర్యలు తీసుకుంది. 2018 ఏప్రిల్ నుంచి వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ 24 గంటలు సరఫరా చేయాలని సీఎం ఆదేశాలతో విద్యుత్ సంస్థలు ఏడాది నుంచి ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఇప్పటికే మూడు జిల్లాల పరిధిలో ఈ విధానం అమలులో ఉంది. ఇప్పుడు రాష్ట్రమంతటా దీన్ని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా తొలి అడుగువేస్తున్నారు. అన్నదాతలకు 24 గంటల కరెంటు సరఫరా చేసే విషయంపై సీఎం కేసీఆర్.... జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావుతో చర్చించారు. వచ్చే మార్చి-ఏప్రిల్ నుంచి రాష్ట్రంలోని వ్యవసాయదారులందరికీ 24 గంటలపాటు నిరంతరాయ విద్యుత్ అందించడానికి పంపిణీ,సరఫరా వ్యవస్థలను సిద్ధం చేయాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో సోమవారం రాత్రి నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు ఐదారు రోజుల పాటు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంటు సరఫరా చేస్తామని సిఎండి ప్రభాకర్ రావు చెప్పారు. 24 గంటలపాటు కరెంటు ఇవ్వడం వల్ల వచ్చే ప్రభావాన్ని అన్ని విధాలా అంచనా వేసి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన ప్రతిపాదించారు. దీనికి సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు.

తెలంగాణతో పాటు దేశంలో కొన్ని రాష్ట్టాల్లో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా జరుగుతున్నప్పటికీ ఎక్కడా 24 గంటల కరెంటు మాత్రం అందడం లేదు. 24 గంటలపాటు రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్ అందించడం దేశచరిత్రలో రికార్డుగా నిలవనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు విద్యుత్‌ కోతలతో రైతులు అల్లాడిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొన్ని రోజులకే రైతులకు 9 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. రైతులందరికీ 24 గంటల విద్యుత్ అందివ్వాలని సీఎం కేసీఆర్ ఏడాదిక్రితం విద్యుత్ శాఖను ఆదేశించారు.

సీఎం ఆదేశాలతో తెలంగాణలోని జెన్ కో, ట్రాన్స్ కో, ఎస్.పి.డి.సి.ఎల్, ఎన్.పి.డి.సి.ఎల్. ఏర్పాట్లు చేశాయి. 12వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టి పంపిణీ, సరఫరా వ్యవస్థలను పటిష్టం చేశారు. గత జూన్ 17 నుంచి పాత మెదక్ జిల్లా పరిధిలో, జూన్ 18 నుంచి పాత కరీంనగర్, నల్గొండ జిల్లాల్లో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఈ మూడు జిల్లాల పరిధిలో 9.58 లక్షల పంపుసెట్లకు 24 గంటల కరెంటును విజయవంతంగా సరఫరా చేయగలుగుతున్నారు. వచ్చే ఏప్రిల్‌ నుంచి మిగతా అన్ని జిల్లాల్లో 24 గంటల విద్యుత్ సరఫరా ఇవ్వడం వల్ల మరో 1500-2000 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ అదనంగా వచ్చే అవకాశం ఉంది. అందుకు తగ్గ విద్యుత్‌ను సమకూర్చుకోవడానికి విద్యుత్ సంస్థలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి.

07:17 - October 2, 2017

కర్నూలు : కరెంట్‌ తీగలు తగిలి అన్నాచెల్లెలు మరణించిన విషాద ఘటన కర్నూల్‌ జిల్లా మునగాల మల్లాపురం గ్రామంలో చోటు చేసుకుంది. మొహర్రం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ తీగలు షార్ట్‌ సర్క్యూట్‌ అవ్వడంతో.. అక్కడే ఉన్న తండ్రి పిల్లలకు షాక్‌ తగిలింది. ఈ ప్రమాదంలో గిరి, దస్తగిరమ్మ అనే అన్నాచెల్లెల్లు చనిపోయారు. వీరి తండ్రి దస్తగిరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇతని పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. 

06:36 - August 17, 2017

సిరిసిల్ల : కరెంట్‌ సమస్య తీర్చండి మహాప్రభో అని రైతులు వేడుకుంటే ధర్నాలు, రాస్తారోకోలు చేయాలని స్వయంగా మంత్రే సూచించారు. మెమోరాండాలతో పనికాదని.. రోడ్డెక్కితేనే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలో మంత్రి కేటీఆర్‌ ఓ పంక్షన్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు తమకు 24 గంటల కరెంట్‌ వద్దని, 24 గంటలు కరెంట్‌ ఇవ్వడంతో మోటార్లు కాలిపోతున్నాయని..నీరు వృధాగా పోతోందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. వినతిపత్రం ఇవ్వబోయారు. అయితే కేటీఆర్‌ వినతిపత్రాలతో పనికాదని.. మీ సమస్య తీరాలంటే ముఖ్యమంత్రికి తెలిసేలా ధర్నా చేయాలని సూచించారు. ఇదే విషయం దేశం మొత్తం తెలవాలంటే తమకోసమైనా రైతులు ధర్నా చేయాలని చెప్పారు. దీంతో అవాక్కవ్వడం రైతుల వంతయ్యింది.

Pages

Don't Miss

Subscribe to RSS - కరెంటు