కరెంట్

11:45 - August 13, 2017

విజయనగరం : జిల్లా భోగాపురం మండలం చాకివలసలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ ఒకే కుటుంబంలోని ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బయటకు వెళ్లిన పైడమ్మ కరెంట్ వైర్ పై కాలేయండంతో అక్కడికక్కడే మృతి చెందింది. పైడమ్మను వెతుకుతూ మేనల్లుడు కూడా కరెంట్ వైర్ ను తాకడంతో ఆయన మృతి చెందాడు. 

08:37 - July 26, 2017

రాజన్నసిరిసిల్ల : వ్యవసాయానికి 24 గంటల కరెంట్‌ వద్దు... 9 గంటల కరెంటే ముద్దు అంటున్నారు  అక్కడి గ్రామ రైతులు... అంతటా .. కరెంటో రామచంద్రో అంటూ  అరుస్తుంటే... ఆ  రైతులు మాత్రం ... 24 గంటల కరెంట్‌ వద్దు అని వేడుకుంటున్నారు. దీనికోసం తీర్మానం కూడా చేశారు. 
9 గంటల విద్యుత్‌ అందించాలని తీర్మానం  
ఎక్కడైనా.. రైతులు 24 గంటల విద్యుత్ కావాలని డిమాండ్‌ చేస్తారు. కానీ రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరంట్లలో పరిస్థితి దీనికి భిన్నం. తమకు పగటపూట 9 గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని  కోరుతూ తీర్మానించారు. ఆ తీర్మాన ప్రతులను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రభుత్వానికి  అందించేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.  
భూగర్భ జలాలపైన ఆధారపడి వ్యవసాయం 
గ్రామానికి ఎటువంటి నీటి వనరులు లేకపోవడం వల్ల... భూగర్భ జలాలపైనే ఆధారపడి వ్యవసాయం చే‌స్తున్నారు ఇక్కడి రైతులు. అయితే 24 గంటలు నిరంతరాయంగా విద్యుత్‌ను అందించడంతో నీటిని ఇష్టానుసారం వాడుతున్నారని.. దాంతో భూగర్భ జలాలు ఎండిపోతున్నాయని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  ఈ కారణంగా తొమ్మిది గంటల కరెంట్ తమకు సరిపోతుందని రైతులు చెబుతున్నారు. 
చిన్న కుంటల్లో నీరు ఉండేలా కృషి అవసరం
తొమ్మిది గంటల కరెంట్‌తో పాటు... పరిసర ప్రాంతాల్లోని చిన్న చిన్న కుంటల్లో నీరు ఉండే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని రైతులు కోరుకుంటున్నారు. గ్రామానికి ఓ పక్కన లోతువాగులో చెక్‌ డ్యాంలు, ఊరి పైభాగాన ఉన్న మైసమ్మ చెరువుకు మరమ్మతులు  చేయాలని కోరుతున్నారు. అలాగే ఎర్రకుంట వి‌స్తీర్ణాన్ని పెంచి అందులో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు.  ఊరికి సమీపంలో ఉన్న పెద్ద బోరుగుట్ట మెట్టు గుట్టల మధ్యన చెక్‌ డ్యాంను నిర్మిస్తే గ్రామంలో భూగర్భ జలాలు పెరుగుతాయంటున్నారు. భూగర్భ జలాలు పెరిగేలా చర్యలు తీసుకుని... ఆ తర్వాత.. 24 గంటలు కరెంట్‌ ఇస్తే.. ఉపయోగకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు. 

 

07:38 - July 19, 2017

హైదరాబాద్ : వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు చేపట్టాల్సిన శాశ్వత చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన అన్నదాతలను ఆదుకొనేందుకు కొన్నికార్యక్రమాలు అమలు చేయాలని నిర్ణయించారు. వ్యవసాయానికి 24 గంటలు నిరంతరాయం విద్యుత్‌ సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా కరెంటు సరఫరా, పంపిణీ వ్యవస్థలను పటిష్టం చేస్తారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌ నుంచి రైతులకు ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి అందిచాలని నిర్ణయించిన నేపథ్యంలో... గ్రామాల వారీగా రైతు సంఘాలను ఏర్పాటు చేస్తారు. భూ రికార్డుల సక్రమ నిర్వహణను చర్యలు చేపడతారు. ఈ రెండు కార్యక్రమాలపై అవగాహన కోసం తర్వలో హైదరాబాద్‌లో సదస్సులు నిర్వహించాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు.

సమైక్య రాష్ట్రంలో జరిగిన వివక్ష
సమైక్య రాష్ట్రంలో జరిగిన వివక్ష, నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రైతులు చితికిపోయిన విషయాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. అందుకే మలిదశ తెలంగాణ ఉద్యమం రైతు సమస్యల పునాదిగా నిర్మితమైందని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెంచిన కరెంటు చార్జీలకు నిరసనగా తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన విషయాన్ని గుర్తు చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంణాలో రైతు అభ్యున్నతే ముఖ్యమన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. కోటి ఎకరాలు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన విషయాన్ని ప్రస్తావించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న కర్షకులను దళారుల దోపిడీ, మార్కెట్‌ మాయాజాలం నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన రైతు సంఘాల ఏర్పాటును వెంటనే ప్రారంభించాలని కేఆర్‌ ఆదేశించారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉండే పంటలు పండించే విధంగా క్రాప్‌ కాలనీలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ చర్యలతో ఐదేళ్లలో రైతుల బతుకులు బాగుపడతాయన్న ఆశాభాన్ని ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారులు రైతుల ఇళ్ల ముందు నిలబడి అప్పులు ఇచ్చే పరిస్థితి రావాలన్నది కేసీఆర్‌ ఆకాంక్ష. ఇది తప్పక నెరవేరుతుందన్న ధీమా వ్యక్తం చేశారు.  

11:00 - June 24, 2017

కర్నూలు : జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మళ్లి కరెంట్ పోయింది. మాతా శిశుసంరక్షణ విభాగంలో రాత్రంతా కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు, చిన్నారులు, బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తరచు ఆసుపత్రిలో కరెంటు పోవడం పై మంత్రి కామినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

 

20:34 - May 18, 2017

హైదరాబాద్ : పిడుగు పడుద్ది..కానీ అంతకు ముందే మొబైల్ మోగుద్ది. అవును మరి పిడుగు ఆకాశాన్ని చీల్చుకుని రాకముందే అలర్ట్ బీ కేర్ ఫుల్ అంటోంది. జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుర్తుచేస్తుంది. ఇప్పటి వరకు ప్రమాద వశాత్తూ ఎన్నో ప్రాణాలు పిడుగుల పాలిట పడ్డాయి. కానీ ఇక ముందు ఆ పరిస్థితి రాదు. ఏపీలో ప్రవేశ పెట్టిన టెక్నాలజీతో ఇపుడు సీన్ మారనుంది. మేఘాలు పిడుగుకు సై అనకముందే ఇక్కడ సేఫ్ ప్లేస్ లో సర్దుకునే అవకాశం వస్తోంది. ఇదే అంశం పై నేటి వైడాంగిల్ స్టోరి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

16:52 - October 1, 2015

వరంగల్ : జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. రేగొండ మండలం తిరుమలగిరిలో పిట్టల కుమారస్వామి.. అప్పుల భారంతో పత్తిచేను వద్దే ఉరేసుకున్నాడు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుమారస్వామి.. తనకున్న 2 ఎకరాలకు తోడు మరో 2 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తిసాగు చేస్తున్నాడు. వర్షాభావానికి తోడు.. కరెంట్‌ సరఫరా లేక పంట ఎండిపోయింది. పంట కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. దీనికి తోడు రుణమాఫీ కాక.. ప్రభుత్వం నుంచి చేయూత అందక తీవ్ర మనస్తాపానికి గురైన కుమారస్వామి.. చివరకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

 

Don't Miss

Subscribe to RSS - కరెంట్