కలకలం

18:49 - May 9, 2018

బెంగుళూరు : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు రెండు రోజుల ముందు ఫేక్ ఓటర్‌ ఐడీ కార్డులు కలకలం రేపాయి. కొత్త ఓటర్ల ముసుగులో భారీ ఎత్తున చీకటి వ్యవహారం నడుస్తున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో బెంగళూరులోని జాలహళ్లిలోగల ఎస్‌ఎల్వీ అపార్డ్‌మెంట్‌పై అధికారులు దాడిచేశారు. సుమారు 10 వేల ఓటర్‌ ఓటర్‌ ఐడీకార్డులతో పాటు, అప్లికేషన్లు, ఐదు ల్యాప్‌టాప్‌లు, ఓ ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజరాజేశ్వరి నగర్‌ నియోజకవర్గానికి చెందిన ఓటర్ల ఐడిలుగా అధికారులు గుర్తించారు. అపార్ట్‌మెంట్‌ యజమాని మంజులా నంజామురి బిజెపి నేత కావడం గమనార్హం. ఓటర్‌ కార్డుల వ్యవహారంలో ఆరోపణలు, ప్రత్యారోపణలు మిన్నంటాయి. ఆర్‌ ఆర్‌ నగర్‌లో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ విమర్శించగా.... ఎన్నికల్లో ఓటమి భయంతో బిజెపి ఆడుతున్న నాటకమని కాంగ్రెస్‌ ఎదురు దాడి చేసింది.

 

16:02 - April 29, 2018

మెదక్ : జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం చిరుత కలకలం చెలరేగింది. గజగట్లపల్లి శివారులో పశువులపై చిరుత వరుసగా దాడులు చేస్తోంది. కొన్ని రోజులుగా  లేగదూడలు, మేకలపై దాడిచేసి హతమార్చుతోంది. దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.  అటు  రామాయంపేట మండలం దంరేపల్లి తండాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.  చిరుత సంచార సమాచారం గ్రామస్తులు అధికారులకు చెప్పడంతో వారు గ్రామాల్లో పర్యటించారు. చిరుతతోపాటు హైనా, తోడేళ్లు దాడులకు పాల్పడుతున్నట్టు గుర్తించారు. 

12:08 - April 24, 2018

కరీంనగర్‌ : జిల్లాలోని జమ్మికుంటలో కిడ్నాప్‌ వ్యవహారం కలకలం రేపింది. కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు కవలపిల్లలు ఇంటి ముందు ఆడుకుంటుండగా కొందరు వ్యక్తులు వీరిని కిడ్నాప్‌ చేసేందుకు యత్నించారు. చిన్నారులను ఎత్తుకొని పరుగులు తీస్తుండగా చిన్నారులు అరవడంతో గ్రామస్థులు అప్రమత్తమై కిడ్నాపర్‌లలో ఒకరిని పట్టుకొని చితకబాదారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. కిడ్నాపర్‌ను విచారించగా పిల్లలను వేరే రాష్ట్రానికి తరలిస్తున్నట్లు చెప్పాడు. 

 

20:07 - April 1, 2018

హైదరాబాద్‌ : నగర పోలీస్ కమిషనర్‌ అంజనీ కుమార్ ఇంట్లో పాము కలకలం రేపింది. అంబర్ పేట్‌లోని ఆయన ఇంటి గేట్ ముందు 6అడుగుల జెర్రిపోతు సంచరించుతుండగా.... సెక్యూరిటి సిబ్బంది హుస్సేనీ అలం పోలీస్ ష్టేషన్‌లో పనిచేస్తున్న నాయక్‌కు సమాచారం అందించారు. నాయక్ పాముని పట్టుకొని స్నేక్‌ సోసైటీకి అప్పగించాడు.

10:34 - March 25, 2018

విజయనగరం : జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కాల్పులు కలకలం రేగింది. అప్పలరాజు అనే రియల్టర్ పై పాత నేరస్తుడు మోహన్ కుమార్ కాల్పులు జరిపారు. అప్పలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు అంటున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

11:23 - February 16, 2018
21:53 - February 15, 2018

గుంటూరు : మార్చి ఐదున బీజేపీతో కటీఫ్‌ అన్నారు.. అంతలోనే తూచ్‌.. అట్లాంటిదేమీ లేదని వివరణ ఇచ్చుకున్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి.. రాష్ట్ర ప్రయోజనాలను సాధించుకుంటామని చెప్పుకొచ్చారు. గంట వ్యవధిలోనే మారిన మంత్రి ఆదినారాయణరెడ్డి స్వరమిది. 

టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం తర్వాత.. ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి ప్రకటనలు.. రాష్ట్రంలో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. మార్చి ఐదులోగా.. విభజన హామీల అమలుకు రోడ్‌మ్యాప్‌ ఇవ్వకుంటే.. అదేరోజు.. బీజేపీ ప్రభుత్వం నుంచి తమ మంత్రులు వైదొలుగుతారని మంత్రి ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. 

ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించడంతో.. చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడిన ఆదినారాయణరెడ్డికి తీవ్ర అక్షింతలు వేశారు. దీంతో ఆదినారాయణరెడ్డి వెనక్కి తగ్గారు. మళ్లీ మీడియా ముందుకు వచ్చి.. అంతకు ముందు తాను చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని ప్రకటించారు. సమన్వయ కమిటీ సమావేశంలో వచ్చిన అభిప్రాయాలకు తన అభిప్రాయాన్ని జోడించానని వివరణ ఇచ్చుకున్నారు. మొత్తానికి ఆదినారాయణరెడ్డి ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఓ గంటపాటు.. పెను ప్రకంపనలనే సృష్టించింది. 


 

19:19 - January 21, 2018

పశ్చిమ గోదావరి : పశ్చిమ ఏజెన్సీలో తల్లీ కూతుళ్ళ మృతదేహాలు కలకలం రేపాయి. బుట్టాయగూడెం మండలం ఎర్రాయగూడెం సమీపంలోని జీడిమామిడి తోటలో రెండు మృతదేహాలు బయటపడ్డాయి.  మృతులు పోలవరం మండలం ఎల్‌ఎన్‌డి పేట గ్రామానికి చెందిన తల్లీ కూతుళ్ళు ఈళ్ల సావిత్రి, పులిబోయిన మంగతాయారుగా పోలీసులు నిర్ధారించారు.  కుటుంబ కలహాలతో వారి భర్తలే హత్యచేసి ఉంటారని  పోలీసులు భావిస్తున్నారు. ఈళ్ళసావిత్రి భర్త రామాంజనేయులు, పులిబోయిన మంగతాయారు భర్త పులిబోయిన నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

 

21:18 - January 6, 2018

పెద్దపల్లి : జిల్లాలోని గోదావరిఖని జీవీకే ఇంక్లైన్‌ 1లోని 33వ డీప్‌లో విషవాయువులు వెలువడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన గని అధికారులు..కార్మికులను బయటకు పంపుతున్నారు. ఈ ఘటనలో పలువురు కార్మికులు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

11:31 - January 4, 2018

గుంటూరు : జిల్లాలో కిడ్నీల రాకెట్ వ్యవహారం కలకలం రేపుతోంది. నర్సరావుపేటలో రోగి బంధువు పేరిట బయటి వ్యక్తి ఆధార్ మార్ఫింగ్ సృష్టించి అనుమతి పొందే ప్రయత్నం బెడిసికొట్టడంతో ఈ విషయం వెలుగు చూసింది. గుంటూరు చంద్రమౌళి నగర్ కు చెందిన శివ నాగమల్లేశ్వరరావు రెండు కిడ్నీలు చెడిపోయి వేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కిడ్నీ మార్పిడి విషయంలో నర్సరావుపేటలోని ప్రకాష్ నగర్ కు చెందిన అతని బంధువు రవి చౌదరిని సంప్రదించాడు. వీరిద్దరూ కలిసి దుర్గి మండలం ముటుకూరుకు చెందిన ముదావత్ వెంకటేశ్వర నాయక్ ను కలిశారు. కిడ్నీ మార్పిడి విషయాన్ని వెల్లడించారు. కిడ్నీలు ఇవ్వాలంటే బంధువులు ఇవ్వాలి..లేనిపక్షంలో ఇతరులు ఇస్తే ఎమ్మార్వో అనుమతి పొందాల్సి ఉంటుంది. దీనితో వీరు ఒక డ్రామా ఆడాలని నిర్ణయించుకున్నారు. అనంతరం రావూరి రవి చౌదరి ఆధార్ కార్డును మార్ఫింగ్ చేసి వెంకటేశ్వర నాయక్ ఫొటో పెట్టారు. ఇతరత్రా..వివరాలు జోడించి ఎమ్మార్వో దగ్గర దరఖాస్తు పెట్టారు. ఎమ్మార్వో కు అనుమానం రావడంతో దర్యాప్తు చేపట్టారు. దీనితో అసలు మోసం బయటపడింది. 

Pages

Don't Miss

Subscribe to RSS - కలకలం