కాజోల్

18:12 - August 5, 2018

హైదరాబాద్ : బాలీవుడ్ స్టార్ కాజోల్ నటించిన 'హెలికాప్టర్ ఈలా' సినిమా ట్రైలర్ విడుదల అయింది. కాజోల్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్ విడుదల చేసింది. ప్రదీప్ సర్కార్ దర్శకత్వంలో తెరకెక్కిన హెలికాప్టర్ ఈలా సినిమా.. సెప్టెంబర్ 7న సినిమా విడుదల కానుంది.

15:14 - October 29, 2016

టాలీవుడ్ లో ప్రస్తుతం రెండు భారీ చిత్రాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఒకటి బాలకృష్ణ వందో చిత్రం 'గౌతమి పుత్ర శాతకర్ణి' కాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 150వ చిత్రం 'ఖైదీ నెంబర్ 150'. ఈ చిత్రాలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజైన సంగతి తెలిసిందే. ఇటీవలే 'బాలయ్య' టీజర్ కూడా విడుదల చేశారు. దాదాపు ఎనిమిదేళ్ల తరువాత చిరు వెండితెరకు రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీనిపై భారీ ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి. మెగాస్టార్ ఎలా కనిపిస్తాడో ? ఎలా నటిస్తాడోనన్న అభిమానుల్లో ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. దీపావళి పండుగ సందర్భంగా 'చిరంజీవి'కి సంబంధించిన న్యూ లుక్స్ ను విడుదల చేశారు. ఇందులో బాస్ ఈజ్ బ్యాక్ అనేలా 'చిరు' కనిస్తుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోస్టర్ లో న్యూ యంగ్ లుక్ లో కనిపిస్తుండడంతో చిత్రంలో ఎలా కనిపిస్తారోనన్న ఉత్కంఠ పెరిగిపోయింది. మెగాస్టార్ చిరంజీవి'ని తెరపై ఎప్పుడెప్పుడు చూడాలని మెగా ఫ్యాన్స్ తహతహలాడుతున్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే 'చిరంజీవి' బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా షూటింగ్ లో పాల్గొంటున్నాడట. 'ఖైదీ నెంబర్ 150' సినిమాకి 'వినాయక్' దర్శకత్వం వహిస్తోన్న సంగతి తెలిసిందే.

సంక్రాంతికి రిలీజ్...
గతంలో 'వినాయక్', 'మెగాస్టార్' కాంబినేషన్ లో 'ఠాగూర్' వీరివురి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాగా మిగిలిపోయింది. ఇటీవలే ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో 'చిరంజీవి', 'కాజల్' ఇతర నటీనటులపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారని టాక్. 'ఖైదీ నెంబర్ 150' సినిమా సెట్స్ పైకి వెళ్లిన నాటి నుంచి గ్యాప్ లేకుండా షూటింగ్ జరుగుతోంది. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని అనుకున్న విధంగా సంక్రాంతికి రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోంది. అందుకే 'చిరంజీవి'తో సహా ప్రతి ఒక్కరూ పగలు రాత్రి తేడా లేకుండా షూటింగ్ లో పాల్గొంటున్నారని సమాచారం. 

13:02 - April 14, 2016

హైదరాబాద్ : ఏపీ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా అజయ్ దేవగణ్, కాజోల్ వ్యవహరించనున్నారన్న అంశంపై చర్చ మొదలైంది. టాలీవుడ్‌లో ఎంతోమంది స్టార్లు ఉండగా.. అజయ్‌ నియామకంపై అనేక విమర్శలు తలెత్తుతున్నాయి. మరి అజయ్ ఆయన సతీమణి.. నవ్యాంధ్ర నిర్మాణాన్ని ఉరుకులు పెట్టిస్తారా ?
ఎపికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా అజయ్‌ దేవగణ్‌ దంపతులు 
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బ్రాండ్‌ అంబాసిడర్లుగా కొనసాగేందుకు బాలీవుడ్‌ నటుడు అజయ్‌ దేవగణ్‌ దంపతులు ముందుకు వచ్చారు. మంగళవారం నాడు సీఎం చంద్రబాబును కలిసిన అజయ్‌.. ఈ అంశంపై చర్చించారు. వీరి ప్రతిపాదనను సీఎం అంగీకరించారు. 
అజయ్‌దేవగణ్‌ దంపతుల నియామకంపై సర్వత్రా విమర్శలు 
అయితే.. ఏపీ ప్రచారకర్తలుగా అజయ్‌దేవగణ్‌ దంపతుల నియామకంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్‌లో ఎంతోమంది హీరోలు ఉండగా వారినే ఎందుకు నియమించారని పలువురు సందేహాలు వెలిబుచ్చుతున్నారు. 
ఇప్పుడిదే హాట్ టాఫిక్.. 
అజయ్ దేవగణ్, కాజోల్‌లు ఏపీ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్లుగా పనికివస్తారా.. ఇప్పుడిదే హాట్ టాఫిక్.. చిరంజీవీ, పవన్ కల్యాణ్ వంటి నటులు రాజకీయ పార్టీల్లో ఉన్నందున్న వారిని పక్కన పెట్టారనుకోవచ్చు.. కానీ తెలుగు హీరోలుగా ఓ వెలుగు వెలుగుతున్న మహేష్‌బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్‌చరణ్ తేజ్ లేదంటే అగ్ర హీరోలు నాగార్జున, వెంకటేశ్‌లు ప్రచారకర్తలుగా పనికిరారా ? బాహుబలి ప్రభాస్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా పనికిరాడా ?... టాలీవుడ్ కు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన దర్శకుడు రాజమౌళి పేరు ఎందుకు పరిశీలించలేదని విమర్శలు వస్తున్నాయి. అయితే ఏపీ తాజా నిర్ణయంపై సర్వత్రా చర్చ మొదలైంది. అజయ్ దేవగణ్, కాజోలు స్వచ్చందంగా ముందుకు వచ్చారని సీఎం కార్యాలయ వర్గాలు చెబుతున్నా.. వారి రాక వెనుక వ్యాపార ప్రయోజనాలు దాగున్నాయనే చర్చ జరుగుతోంది. 
ఎంటర్‌టైన్‌మెంట్‌ పార్క్, స్టూడియో నిర్మాణానికి ప్లాన్‌
అమరావతిలో ఎంటర్ టైన్‌మెంట్ పార్క్, ఓ స్టూడియోతో మరికొన్ని నిర్మాణాలకు అజయ్ దేవగణ్ ప్లాన్ చేస్తున్నారు.. సీఎంతో భేటీలోనూ అజయ్ అండ్ టీం.. పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా  ఏపీలో తాము పెట్టబోయో, ప్రతిపాదిత ప్రాజెక్టుల కోసం వివరించారు.. ఈ ప్రయోజనాన్ని మరింత చేరువగా వినియోగించుకోవడానికి ప్రచారకర్తలుగా అవతారమెత్తారనే విమర్శ వినిపిస్తోంది.. అజయ్ దేవగణ్ పాన్ మసాల కంపెనీలకు ప్రచారకర్తగా ఉన్నారు.. ఆయనపై విమర్శలొచ్చినా.. ఆ యాడ్స్ విషయంలో వెనుకడుగు వేయలేదు.. చివరికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. అజయ్ భార్య కాజోల్ ద్వారా చెప్పించినా అజయ్.. యాడ్స్ నుంచి తప్పుకోలేదు. అలాంటి వ్యక్తి బ్రాండ్ అంబాసిడర్‌గా వర్కవుట్ అవుతాడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇండియన్ బ్యాడ్మింటన్ కోచ్, ఆల్ ఇంగ్లండ్ టోర్నీ విజేత పుల్లెల గోపీచంద్, మరో క్రీడాకారిణి పీవీ సింధు, కోనేరు హంపి, హరికృష్ణలతో వివిధ రంగాల్లో లబ్ద ప్రతిష్టులుగా ఉన్నవారు ఎంతో మంది ఉన్నారు.. వీరిలో ఎవరినైనా అంబాసిడర్‌గా నియమించవచ్చు.. వాళ్లు స్వచ్చంధంగా ముందుకు వచ్చారని ఎలా నిర్ణయం తీసుకుంటారనే ప్రశ్న తలెత్తుతోంది.. తెలంగాణలో టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు.. ఆమెకు ప్రభుత్వం ముట్టజెబుతున్న మొత్తంపై పెదవి విరుపులున్నా... కేసీఆర్ సెలక్షన్ సరైనదే అనే అభిప్రాయం ఉంది... కానీ ఏపీ సర్కార్ తాజా నిర్ణయంపై విమర్శలు నేపథ్యంలో సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.. 

 

10:32 - November 10, 2015

బాలీవుడ్ నటులు షారుఖ్ ఖాన్, కాజోల్, వరుణ్ ధావన్, కృతి సనన్ లు నటించిన చిత్రం 'దిల్ వాలే' సినిమా ట్రైలర్ మంగళవారం విడుదలైంది. రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ ని బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ 'దిల్ వాలే' అధికారిక ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. 'అందరికీ దిల్ ఉన్నా.. అందరూ దిల్ వాలే కాలేరు' అంటూ మనసును తట్టే డైలాగ్ తో స్టార్ట్ అవుతుంది. షారూక్ - కాజోల్ ఎంటర్ అయిపోయి.. ప్రేమ కురిపించేస్తారు. 15 ఏళ్ల క్రితం విడిపోయిన జంటగా కనిపించనున్నారు. యంగ్ జనరేషన్ అయిన వరుణ్ ధావన్ - క్రితి సనోన్ ప్రేమ కోసం ఇద్దరూ ఒకరితో ఒకరు పోటీ పడబోతారని తెలుస్తోంది. కానీ 'మోసపోయింది నేను.. ఏం చెయ్యాలో నేను చూసుకుంటాను' అని షారుఖ్ అనడం..చివరలో 'మళ్లీ మొహం చూపించద్దు. ప్రాణం తీసేస్తానని' షారూఖ్ చెప్పే డైలాగ్స్ చిత్రంపై ఆసక్తి పెంచింది.
బాలీవుడ్‌ తెరపై షారుక్‌ఖాన్‌, కాజోల్‌ సూపర్‌ హిట్‌ పెయిర్‌. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం 'దిల్‌ వాలే దుల్హనియా లేజాయెంగే' భారతీయ సినీ పరిశ్రమలోనే ఓ అద్బుతంగా నిలిచింది. ఏళ్ళ తరబడి ముంబైలోని మరాఠా మందిర్‌లో ప్రదర్శితమైన సంగతి తెలిసిందే.

15:56 - August 9, 2015

కాజోల్..బాలీవుడ్ నటి. ప్రస్తుతం ఆమెకు వచ్చిన ఫోన్ కాల్ పై బాలీవుడ్ జనం తెగ చర్చించేసుకుంటున్నారు. ఆమెకు ఎవరు ఫోన్ చేశారు ? ఎందుకలా వెళ్లిపోయింది ? అనే టాక్స్ వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందంటే ముంబైలోని ప్రముఖ నాటకక్షేత్రంలో 'ద జురి' అనే నాటకాన్ని తిలకించేందుకు వెళ్లింది. ఈ నాటకంలో కాజల్ సోదరి తనీషా ప్రధాన పోత్ర పోషించింది. ఈ నాటకాన్ని తిలకించిన అనంతరం మీడియాతో కాజల్ మాట్లాడింది. అప్పుడే కాజోల్ చేతిలో ఉన్న ఫోన్ రింగ్ ఆపకుండా రింగ్ అయ్యింది. చివరకు కాజోల్ రిసీవ్ చేసుకున్న అనంతరం 'సారీ' అంటూ విలేకరులతో చెప్పేసి హడావుడిగా వెళ్లిపోయింది. ఆ సమయంలో కాజోల్ ఒకింత ఆందోళనకు గురయ్యారని టాక్. అసలు ఏమి జరిగిందో ? తెలియాలంటే కాజోల్ చెబితేగాని బయటపడదు.

Don't Miss

Subscribe to RSS - కాజోల్