కాదు

21:42 - August 12, 2017

ప్రేమ దీనికి సరైన అర్థం చెప్పిన వారు ఎవరు లేరు....ప్రేమను రకరకాలుగా చెప్పేవారున్నారు.... రకరకాలుగా పంచేవారున్నారు...అందులో ఓ అబ్బాయి ఆమ్మాయి మధ్య ప్రేమ మాత్రం విషాదాలను నింపుతుంది....మనోవేదనకు గురి చేస్తోంది...ప్రేమే జీవితం అనుకునే ఎందరో అబ్బాయిలు తమ బంగారు భవిష్యత్ ను కోల్పోతున్నారు. ఇది తెలుసుకోలేని ఎందరో ప్రాణాలు తీసుకుంటున్నారు. త్యాగం పేరుతో తుది శ్వాస విడుస్తున్నారు...ప్రేమ కోసం బలైతున్న వారిలో నరేష్ ఒకడు...తనకు ఆమె ప్రేమ దూరమైందని నరేష్ లోకాన్ని విడిచాడు. కానీ నరేష్ తెలుసుకోలేనిది ఒక్కటే తను దూరమైయ్యేది తన వారి నుంచి అని.....తనవారికి జీవితాంతం కన్నీటిని మిగుల్చుతున్నానని...అందరికి ఒక్కటే నరేష్ మరణం ఓ గుణపాఠం కావాలి....ఓ హెచ్చరిక కావాలి...ఓ ఆలోచను పంచాలి...ఇది కాథ కాదు ఏ రియల్ స్టోరీ..పూర్తి వివరాలుకు వీడియో చూడండి.

13:27 - August 1, 2017

హైదరాబాద్ : కాలనీ ఒక్కటే. లే అవుట్‌ కూడా ఒక్కటే. కానీ ఆదాయ వ్యత్యాసాలు వారి మధ్య తరగని అంతరాన్ని పెంచాయి. తరగని వివక్షకు తెరలేపాయి. ఎల్‌ఐజీ ప్లాట్ల వాళ్లు తమ ప్లాట్లవైపు తొంగి చూడకూడదంటూ ఎంఐజీ, హెచ్‌ఐజీ ప్లాట్ల ఓనర్లు ఆంక్షలు పెట్టారు. ఉమ్మడి ఆస్తులైన పార్కులు, క్లబ్బులను వాడుకోకుండా అడ్డుకుంటున్నారు. మనసుల్లోనే కాదు.. ఏకంగా కాలనీలోనే ఓ పెద్ద అడ్డుగోడను కట్టేశారు. హైదరాబాద్‌లో సుప్రసిద్ధ మలేసియా టౌన్‌షిప్‌లో ఫ్లాట్ల ఓనర్ల మధ్య వివక్ష కొనసాగుతోంది. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

18:01 - July 31, 2017

విజయవాడ : ఉద్దానం సమస్య రాజకీయ విమర్శల వల్ల పరిష్కారం కాదన్నారు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌. ఉద్దానం సమస్యను మానవీయ కోణంలో చూడాలన్నారు. మీడియావల్లే ఉద్దానం సమస్య తనదాకా వచ్చిందన్న పవన్‌.. సమస్య పరిష్కారానికి తనవంతు బాధ్యతగా పనిచేస్తాన్నారు. సీఎం చంద్రబాబు చొరవ తీసుకుని కొంత వరకు ఉపశమనం కలిగించారని... అయితే ఉద్దానం సమస్య మూలాలను తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అక్టోబర్ నుండి ప్రజాల్లోనే ఉంటా.. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటా. ప్రజల సమస్యలు తెలుసుకుంటా..చేనేత కార్మికులను జీఎస్టీ నుండి తగ్గించాలని సీఎం తో చెప్పా.. కేంద్రంతో మాట్లాడమని చెప్పా అనిగరగపర్రు అంశం చాలా సున్నితమైంది. లోకల్ అడ్మినిస్ట్రేటివ్ విఫలం.. ఆదిలోనే పరిష్కరించకపోవడం వల్ల ప్రజల్ని ఇబ్బంది పెట్టిందని పవన్ అన్నారు.అల్లూరి, అంబెడ్కర్ లాంటి వాళ్ళు మహనీయులు వాళ్ళని ఒక కులానికి వర్గానికి ముడిపెట్టడం సరికాదు ఆయన అభిప్రాయపడ్డారు.అంబెడ్కర్ సిద్దాంతాలని అర్ధం చేసుకుంటే అందరికి మహనీయుడు అవుతాడని,అల్లూరి సీతారామ రాజు గిరిజినులతో కలిసి బ్రతికిన వ్యక్తి.. క్షత్రియ కులంకే ముడిపెట్టడం సరికాదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.సమాజాన్ని విభజించి పాలించే రాజకీయాలు జనసేన చెయ్యదు..అందరిని కలిపే రాజకీయాలు చేస్తుందని ఆయన అన్నారు.గోదావరి ఆక్వా పార్క్ నిబంధనలు పాటిస్తే ప్రజల నుండి వ్యతిరేకత రాదని, ప్రభుత్వం చిత్త శుద్దిగా వ్యవహరించాలని, పోలీసులతో సమస్య పరిష్కరం అవ్వదని పవన్ అన్నారు. నేను కాపు కులానికి చెందినవాన్ని.. సినిమాల్లో ఉన్నప్పుడు కులలపై అవసరం ఉండదు.. కానీ రాజకీయాల్లోకి వచ్చాక అన్నీనిటీపై స్పందించాలని, కాపుల రేసేర్వేషన్ డిమాండ్ చాలా దశాబ్దాల నుండి ఉందని ఆయన తెలిపారు. బీసీ లకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్ అంశం పరిష్కరించాలని ఆయన కోరారు. నాకు పాదయాత్ర చెయ్యాలని ఉంది.. కానీ నా కార్ ని కూడా యువత ముందుకు వెళ్ళనివ్వడం లేదు.. అందుకే ఆలోచిస్తున్నా.. లేదంటే పాదయత్రకి ఎప్పుడు సిద్ధమే అని పవన్ ప్రకటించారు.

20:52 - July 30, 2017

విశాఖ : ఉద్దానం కిడ్నీ జబ్బులపై హార్వర్డ్ యూనివర్శిటీ వైద్యుల బృందంతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖలో సమావేశ అయ్యారు. శనివారం ఉద్దానంలో పర్యటించి అధ్యయనం చేసిన వివరాలను హార్వర్డ్స్ వైద్యులు పవన్‌కు వివరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాలన్నారు పవన్. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. గత పాలకులు ఈ సమస్యను పట్టించుకోలేదని ఈ ప్రభుత్వం అయినా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు. సమస్య పరిష్కారానికి అవసరమైతే ప్రతిపక్ష వైసీపీ మద్దతు కూడా కోరతానన్నారు. ప్రజల కోసం పనిచేయడానికి ఎవరు తనతో కలిసి వచ్చినా ఆహ్వానిస్తానని పవన్‌ పేర్కొన్నారు. ఉద్దానంలో కిడ్నీవ్యాధులకు శాశ్వత పరిష్కారం చూపినప్పుడే తన ప్రయత్నం ఫలించినట్లని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజల కోసమే గానీ.. రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. మానవత్వం మంటగలుస్తున్నా పోరాడేవారు లేకపోవడం బాధాకరమన్నారు. సమస్య పరిష్కారం కావాలన్నదే తన అభిమతమని, మనిషి మేధస్సు ఉద్దానం సమస్యను పరిష్కరించగలదని పవన్ అభిప్రాయపడ్డారు. నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య ఎంతో కాలంగా వేధిస్తోందని, దాని పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తే విమర్శలు చేశారని గుర్తు చేశారు.

సమస్యల పట్ల మానవత్వంతో
తాను ప్రభుత్వాలకు కాదు...ప్రజలకు సేవ చేస్తానని పవన్ స్పష్టం చేశారు. మన తోటి మనుషులు బాధపడుతుంటే పరిష్కారం వెదక్కుండా రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. ఇలాంటి సమస్యల పట్ల మానవత్వంతో స్పందిస్తే దానిని నివారించడం పెద్ద కష్టం కాదని అన్నారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య తీవ్రంగా ఉందని హార్వర్డ్‌ యూనివర్సిటీ వైద్యులు అన్నారు. బాధితుల శాంపిల్స్‌ ఎప్పటికప్పుడు సేకరించి విశ్లేషించాలని, బయో మార్కర్స్‌తో వ్యాధి తీవ్రతను గుర్తించి...సమస్య తీవ్రం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డాక్టర్‌ జోసెఫ్‌ సూచించారు. ఉద్దానంతో పాటు శ్రీలంక, సెంట్రల్‌ అమెరికా, యూరప్‌ దేశాల్లో కూడా కిడ్నీ వ్యాధి ఉందని అన్నారు. కిడ్నీ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయని, వ్యాధి మూలాలు అంతుబట్టడం లేదని డాక్టర్‌ రవిరాజు పేర్కొన్నారు. ఉద్దానం సమస్యపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిందని, బాధితులకు అవసరమైన వైద్యం అందిస్తున్నామని ఆయన తెలిపారు. కిడ్నీ సమస్యపై అధ్యయనానికి ప్రపంచ స్థాయి రీసెర్చ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని మరో డాక్టర్‌ సుధాకర్‌ అన్నారు. సమస్యను ప్రాథమిక దశలోనే గుర్తిస్తే నివారణ సులభం అవుతుందని అభిప్రాయపడ్డారు.

చంద్రబాబుతో భేటీ
ఉద్దానం సమస్యపై ఎప్పటికప్పుడు డేటా సేకరించి ప్రపంచ పరిశోధకుల దృష్టికి తీసుకెళ్తే పరిష్కారం లభిస్తుందని, ప్రపచంలోనే అతికొద్ది ప్రాంతాల్లో ఈ సమస్య ఉందని ఆయన అన్నారు. ఉద్దానంలో అయితే సమస్య తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు సోమవారం పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ కానున్నారు. ఉద్దానంలో హార్వర్డ్‌ యూనివర్సిటీ వైద్యుల బృందం చేపట్టిన అధ్యయన వివరాలను సీఎంకు సమర్పించనున్నారు. 

17:51 - July 11, 2017

నిజామాబాద్ : సీఎం కేసీఆర్‌ విద్యార్థుల, నిరుద్యోగ సమస్యలను విస్మరించారని... కాంగ్రెస్‌ నాయకుడు, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌ బంగారు తెలంగాణ కాకుండా... బంగారు కుటుంబాన్ని నిర్మించుకుంటున్నాడని విమర్శించారు. తాండూర్‌లో చత్రవాస్‌ అధికార్‌ పాదయాత్ర పేరుతో ఎన్‌ఎస్‌యూ ఆధ్వర్యంలో చేపట్టిన 110 కిలోమీటర్ల పాదయాత్రను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. 2019లో కచ్చితంగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తుందని.. రాగానే నిరుద్యోగులకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు.

18:57 - February 14, 2017

హైదరాబాద్ : హెచ్ సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు కొత్త మలుపు తిరుగుతోంది. కేసును నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోహిత్ వేముల దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ నిర్ధారించింది. రోహిత్ ది వడ్డేర కులమని విచారణ కమిటీ తేల్చింది. గతేడాది జనవరి 17న రోహిత్ వేముల ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుల వివక్ష, వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో రోహిత్ స్పష్టంగా పేర్కొన్నారు. ఇదిలావుంటే తాజాగా ప్రభుత్వ కమిటీ ప్రకటనపై దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, సామాజిక వేత్తలు మండిపడుతున్నాయి.
కేసులో ఉన్నవారిని కాపాడేందుకు కుట్ర : భాస్కర్  
రోహిత్ కులం మార్చి...ఆ కేసులో  కేసులో ఉన్నవారిని కాపాడేందుకు పన్నాగం పన్నుతున్నారని కేవీపీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ అన్నారు. ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబులు కలిసి... రోహిత్ దళితుడు కాదని ప్రభుత్వ కమిటీ చేత నిర్ధారింప చేశారని ఆరోపించారు. నరేంద్రమోడీ, చంద్రబాబులు ఆర్ ఎస్ ఎస్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తీవ్రమైన దళిత ప్రతిఘటన ఎదుర్కొనక తప్పదని స్పష్టం చేశారు. దళితుల వైపు నిలబడకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు మోడీ, చంద్రబాబులకు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇది రాజకీయ దురుద్ధేశపు చర్య : మాల్యాద్రి 
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దురుద్ధేశంతో చేస్తున్న చర్యగా ఏపీ కేవీపీఎస్ నేత మాల్యాద్రి అభిర్ణించారు. 
ప్రభుత్వాలు దళితులకు వ్యతిరేకంగా వ్యవహిరించడం సరికాదన్నారు.
దళితులపై వ్యతిరేక క్యాంపెయిన్ : కంచె ఐలయ్య
ప్రభుత్వాలు దళితులపై వ్యతిరేక క్యాంపెయిన్ చేసి.. లబ్ధి పొందాలనుకుంటున్నాయని సామాజికవేత్త కంచె ఐలయ్య అన్నారు. రిజర్వేషన్లు సరిగ్గా అమలు కావడం లేదని తెలిపారు. ఏపీలోని దళితులు సీరియస్ గా ఆలోచించాలని తెలిపారు. ఎక్కడికక్కడే దళితులను అణచివేస్తామంటే ఎలా కరెక్టు అవుతుందన్నారు.
రోహిత్ దళితుడు కాదనడం సరికాదు : బి.వెంకట్
రోహిత్ వేముల దళితుడు కాదని గుంటూరు కలెక్టర్ నిర్ధారణ చేయడం రాజ్యాంగ విరుద్ధమని సీపీఎం రాష్ట్రకార్యదర్శి వర్గం సభ్యులు బి.వెంకట్ అన్నారు. ఇది ఒక వ్యక్తికి జరిగిన ఘటన కాదని.. సమాజానికి జరిగిన ఘటన అన్నారు. కేసు నుంచి తప్పించుకోవడానికి కుట్ర పన్నుతున్నారని తెలిపారు. రోహిత్ తల్లి రాధికమ్మ దళిత ..మాల కులానికి చెందిన మహిళ అని చెప్పారు. రోహిత్ గత 20 సం. లుగా తల్లి సంరక్షణలో పెరిగాడు. కుల నిర్ధారణ చేసేటప్పుడు గ్రామ ప్రజల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. ఈ కేసు విషయంలో బిజెపి కుట్ర పన్నుతోందని ఆరోపించారు. కుట్రలో సీఎం కేసీఆర్, సీఎం చంద్రబాబు పాత్రదారులు అన్నారు. వీరిని దోషులుగా చేల్చాలని చెప్పారు. ఇది చాలా దుర్మార్గమన్నారు. రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. దీన్ని ఉద్యమం లాగా తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు.
హెచ్ సీయూ విద్యార్థి సంజయ్...
రోహిత్ కేసులో కేంద్రమంత్రి, వీసీ అప్పారావు ముద్దాయిలుగా ఉన్నారు.. వారిపై ఎస్సీ, ఎస్టీ ఎఫ్ ఐఆర్ అయింది.
ఈ కేసు నుంచి వారిని తప్పించేందుకు రోహిత్ దళితుడు కాదని కమిటీ తేల్చిందని చెప్పారు. రోహిత్ కు అన్యాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.  
టీకాంగ్రెస్ నేత మల్లు రవి... 
ప్రభుత్వ కమిటీ వాస్తవ పరిస్థితులను బట్టి నిర్దారించలేదు. పై నుంచి ప్రభుత్వాలు ఆదేశించినట్లు కమిటీ నడుచుకుంది. వేరే కమిటీ చేత నిజ నిర్ధారణ చేయాలి. 

 

16:31 - October 2, 2016

విజయవాడ : పరిశ్రమలకు సిపిఎం వ్యతిరేకం కాదని... నిషేధించబడిన పరిశ్రమల ఏర్పాటును మాత్రమే అడ్డుకుంటోందని ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో ప్రజల ఇష్టానికి వ్యతిరేకంగా నిర్మించే ఆక్వా పరిశ్రమ ఏర్పాటు  ప్రక్రియను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆక్వా, రసాయన, తోళ్ల పరిశ్రమల హబ్‌గా రాష్ట్రాన్ని మార్చేందుకు సర్కారు ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఆక్వా పరిశ్రమ సందర్శన సందర్భంగా భీమవరంలో మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకొని దౌర్జన్యానకి పాల్పడ్డారని తెలిపారు. భీమవరం పోలీసులు నిర్దాక్షిణ్యంగా వ్యవహించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వాఫుడ్ పార్క్ ఏర్పాటు ప్రాంతాన్ని సందర్శించకుండా అడ్డుకున్నారని తెలిపారు. ఈనెల 4న  పోలీసులు అనుమతి ఇచ్చినా... ఇవ్వకపోయినా... పెద్ద ఎత్తున సిపిఎం కార్యకర్తలతో తుందుర్రు సందర్శిస్తామని స్పష్టం చేశారు. 

Don't Miss

Subscribe to RSS - కాదు