కామెడీ

06:39 - November 26, 2017

హైదరాబాద్ : కామెడీ పేరుతో టీవీ ఛానెళ్లలో ప్రసారమవుతున్న అసభ్యకరమైన కార్యక్రమాలపై మహిళా, ప్రజా సంఘాలు గళమెత్తాయి. రేటింగ్స్ కోసం పోటీ పడి ఛానెళ్లు విలువలకు తిలోదకాలిచ్చి.. మహిళలను, పిల్లలను కించపర్చేలా చూపించడం దారుణమని ధ్వజమెత్తాయి. అనాథపిల్లలపై జబర్దస్త్‌ ప్రోగ్రామ్‌లో హైపర్‌ ఆది చేసిన వ్యాఖ్యలపై మహిళా లోకం మండిపడింది.తోంది. సదరు నటులు, చానెళ్లపై చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు HRC ని ఆశ్రయించాయి. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెళ్లలో కామెడీ షోస్‌ వివాదాస్పదమవుతున్నాయి. వినోదం పేరుతో అశ్లీలత, అసభ్యతను పెంచిపోషిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాస్యం అంటే ఆస్వాదించేలా ఉండాలి కానీ.. జుగుప్సాకరంగా ఉండకూడదని మహిళా, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి.

హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏది బూతు, ఏది కామెడీ పేరుతో నిర్వహించిన చర్చాకార్యక్రమం వాడివేడీగా సాగింది. హాస్యం పేరుతో ప్రముఖ చానెల్స్‌లో పలు కార్యక్రమాలు అసభ్యత, అశ్లీలత ఎక్కువయ్యిందని పలువురు అభిప్రాయపడ్డారు. రేటింగ్‌ మత్తులో పడిన కార్పొరేట్‌ మీడియాకి అశ్లీలత కనిపించడం లేదని..వారు చేస్తున్న తప్పులేంటో తెలియజేయాలన్నారు సామాజిక కార్యకర్త దేవి. ఛానల్‌, ప్రొడక్షన్‌, నటులతో పాటు వ్యాఖ్యాతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

హైపర్‌ ఆదిపై సినీ విమర్శకులు కత్తిమహేష్‌ విరుచుకుపడ్డారు. తను నటిస్తున్న ప్రోగ్రామ్‌ సమాజానికి కీడు చేస్తుందని తెలిసి కూడా ఓ కళాకారుడుగా ఆది స్పందించకపోవడం దురదృష్టకరమన్నారు. పవన్‌పై తాను చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా తనను టార్గెట్‌ చేశారన్నారు. ఇలాంటి షోలను బ్యాన్‌ చేయాలని డిమాండ్ చేశారు. జబర్దస్త్‌ కార్యక్రమంలో హైపర్ ఆది తమను కించపరిచేలా మాట్లాడారని ఆరోపిస్తూ.. అనాథ విద్యార్థులతో కలిసి మహిళా సంఘాలు సైపాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదితో పాటు ఆ ప్రోగామ్‌ ప్రసారం చేసిన చానెల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

10:51 - November 11, 2017

నన్ను చంపేయకండి..బతికే ఉన్నా అంటున్నారు సీనియర్ నటుడు కోట శ్రీనివాస రావు. తన కామెడీ నటనతో..విలనిజంతో ఎంతో పాపులర్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆయనపై గత కొంతకాలంగా ఓ వార్త సోషల్ మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో ఉన్నారని..ఆయన కన్నుమూశారని పుకార్లు షికారు చేశాయి. దీనితో కోట శ్రీనివాస రావు మీడియా ముందుకొచ్చారు. జూబ్లీహిల్స్‌లోని తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. 40 ఏళ్లుగా చిలన చిత్ర రంగంలో ఉన్నానని..ఎందుకో తనపై ఇలాంటి వార్తలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యంపై బంధువులు..స్నేహితులు వాకబు చేస్తున్నారని..ఫోన్ చేస్తున్నారని పేర్కొన్నారు. వయసు రీత్యా మెట్లు ఎక్కలేనని...కూర్చొనే చేసే పాత్రలు చేయగలనని చెప్పడంతో వారు కూడా అలాంటి పాత్రలే ఇస్తున్నారని తెలిపారు. ఇటీవలే కామెడీ నటుడు వేణు మాధవ్ పై కూడా ఇలాంటి వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కోట శ్రీనివాస్ రావు స్పందనతో ఇలాంటి వార్తలకు ఫుల్ స్టాప్ పడుతుందా ? లేదా ? అనేది చూడాలి. 

14:55 - August 30, 2017

ఒకే ఒక సినిమాతో స్టార్ డైరెక్టర్ రేంజ్ కి వెళ్లిన డైరెక్టర్ మరో స్టోరీతో రాబోతున్నాడు. ఈ సారి మరో సినిమా స్క్రిప్ట్ ని లాక్ చేసుకున్నాడు. విశేషం ఏంటంటే ఈ సారి టోటల్ కామెడీ తో రాబోతున్నాడు. యాక్టర్స్ అందరూ కొత్త వాళ్ళు కూడా. కొత్త డైరెక్టర్ గా ఫస్ట్ స్టెప్ 'పెళ్లి చూపులు' సినిమాతో టాప్ లిస్ట్ లో చేరిపోయాడు తరుణ్ భాస్కర్. హీరోగా 'విజయ్ దేవరకొండ' కూడా 'పెళ్ళిచూపులతో' హిట్ హీరో జాబితాలో చేరిపోయాడు. రెగ్యులర్ మూస కథల్లా కాకుండా డిఫరెంట్ జోనర్ లో స్టోరీ సెలక్షన్ చేసుకుంటున్నాడు ఈ యంగ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. ఇదే స్పీడ్ ని కంటిన్యూ చేస్తూ తరుణ్ భాస్కర్ మరో సినిమాతో రాబోతున్నాడు.

'పెళ్లి చూపుల్లో' కూడా మంచి లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీకి హాస్యాన్ని జోడించిన తరుణ్ ఈసారి మరో కామెడీ స్క్రిప్ట్ తో రాబోతున్నాడు. 'పెళ్లి చూపులు' మూవీతో దర్శకుడు తరుణ్ భాస్కర్ సాధించిన సక్సెస్ చిన్నదేమీ కాదు. చిన్న సినిమాలకు ఇది ట్రెండ్ సెట్టర్ అనాల్సిందే. తన రెండో సినిమా విషయంలో కూడా అంతా తన స్క్రిప్ట్ ప్రకారమే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు టాక్. ఈ దర్శకుడు ఇచ్చిన క్యాస్టింగ్ కాల్ కు 1100కు పైగా ప్రొఫైల్స్ వచ్చాయట. ఈ స్థాయి రెస్పాన్స్ ఊహించలేదని.. అయితే అక్టోబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభించి.. కేవలం 45 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసేస్తామని చెబుతున్నాడు తరుణ్ భాస్కర్.

11:56 - August 29, 2017

డాన్సర్ గా తన కెరీర్ స్టార్ట్ చేసి, నటుడిగా, ఇప్పుడు దర్శకుడిగా ఎదిగిన హీరో కం డైరెక్టర్ కొత్త సినిమా రెడీ చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఆల్రెడీ తాను చేసిన హారర్ సినిమాలు హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ ని టచ్ చేసాయి. అదే ట్రెండ్ ని కంటిన్యూ చేస్తూ మరో హారర్ కామెడీకి తెరతీయబోతున్నాడు ఈ డైరెక్టర్.

ఒకప్పుడు డ్యాన్స్ మాస్టర్ గా ఎంత పేరు సంపాదించాడో.. దర్శకుడిగా హార్రర్ కామెడీ సినిమాలతో అదే స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు 'రాఘవ లారెన్స్’. అతను తీసిన కాంచన.. గంగ సినిమాలు ఎంత పెద్ద విజయం సాధించాయో తెలిసిందే. ‘ముని’తో మొదలుపెట్టి ఈ సిరీస్ లో మూడు సినిమాలు తీసిన లారెన్స్.. త్వరలోనే ఈ కోవలో మరో సినిమా చేయబోతున్నాడు. ‘గంగ’ బ్లాక్ బస్టర్ అయినప్పుడే ఈ సిరీస్ లో మరో సినిమా చేస్తానని ప్రకటించిన లారెన్స్.. గత రెండేళ్లలో ఆ దిశగా ప్రయత్నాలేమీ చేయలేదు.

రెండేళ్లకు పైగా దర్శకత్వం పక్కన పెట్టేసి హీరోగా మొట్ట శివ కెట్ట శివ.. శివలింగ లాంటి సినిమాలు చేసిన లారెన్స్.. మళ్లీ కొత్త కథపై దృష్టిపెట్టాడు.హారర్ కామెడీ తో అదే తరహా కధని ఎంచుకుని సినిమా రెడీ చేయబోతున్నట్లు చెప్పాడట. మరి లారెన్స్ ఇలా దొరికిందే డొంక ర అని ఒకే కథని అటు తిప్పి ఇటు తిప్పి మాడిపోయిన మసాలా దోసల సినిమాలు తీస్తే ఆడియన్స్ ఇంటికి పంపిస్తారు అని ఫిలిం నగర్ వాసులు అనుకుంటున్నారట. కథలు పాతవా కొత్తవా అనేది పక్కన పెడితే లారెన్స్ మాత్రం కలక్షన్స్ బాగానే రాబడుతున్నాడు.

15:47 - May 23, 2017

హైదరాబాద్ : సినీ నటుడు చలపతిరావు వ్యాఖ్యలపై మహిళా సంఘాల నేతలు భగ్గుమన్నారు. సినీ రంగం నుంచి చలపతిరావును వెలేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు మహిళలను బహిరంగంగా అవమానించడమే అని.. మానవ హక్కులపై దాడి అంటూ ధ్వజమెత్తారు. మహిళలను కించపరిచేవారిపై ఇకనుంచి కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. చలపతిరావు బహిరంగ క్షమాపణ చెప్పినా.. అంగీకరించేది లేదన్నారు.

18:55 - May 19, 2017

చిన్న సినిమాలకు పెద్ద హీరోగా మారి ..తన బ్లాక్ బస్టర్ రన్ ని కంటిన్యూ చేస్తున్న నిఖిల్ కేశవ అనే ఇంటెన్సిఫైడ్ సబ్జెక్ట్ తో ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పోస్టర్స్, టీజర్స్ తోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథవిషయానికొస్తే..హీరో ఫ్యామిలీ మొత్తాన్ని ఒక యాక్సిడెంట్ ద్వారా నాశనం చేసిన పోలీసుల మీద పగతీర్చుకోవడం అనే సింగిల్ ఎలిమెంట్. వినడానికి ఇంత సింపుల్ గా ఉన్న ఈ కథని తన స్క్రీన్ ప్లేతో కొత్తగా మార్చి .. ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చెయ్యాలని చూశాడు డైరెక్టర్ సుధీర్ వర్మ. కథనం గురించి క్లుప్తంగా చెప్పాలంటే..కేశవ అనే లా స్టూడెంట్ చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ లో తన తల్లితండ్రులనుకోల్పోతాడు. ఆ యాక్సిడెంట్ కి కారణమైన పోలీస్ ఆఫీసర్స్ ని చంపుతూ.. ఒక్క క్లూ కూడా వదలకుండా..పోలీస్ డిపార్ట్ మెంట్ కి తలనొప్పిగా మారతాడు. అతని కేస్ ని ఇన్వెస్టిగేట్ చెయ్యడానికి స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ అయిన ఈషాకొప్పికర్ తన తెలివితేటలతో.. ఆ హత్యలు చేసింది కేశవ అని కనుక్కొని అతన్ని అరెస్ట్ చేస్తుంది. ఇంటర్వెల్ లోనే హంతుకుడు అని తెలిసిన కేశవని స్పెషల్ ఆఫీసర్ ఈషా ఎలా డీల్ చేసింది..? అరెస్టయిన కేశవ ఎలా విడుదల అయ్యాడు..? తన పగను తీర్చుకున్నాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల విషయానొకస్తే.. తన పర్ ఫార్మెన్స్ తో సినిమాను నిలబెట్టే సత్తా ఉన్న నిఖిల్ ఈ సినిమాకు కూడా బ్యాక్ బోన్ లా నిలిచాడు. ఓపెనింగ్ టూ ఎండింగ్ ఇంటెన్సిటీ నిండిన చూపులతో , మెచ్యూర్డ్ యాక్టింగ్ తో అద్బుతమైన హావభావాలను పలికిస్తూ.. కేశవ క్యారెక్టర్ ను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేశాడు. ఓపక్క తన పగ తీర్చుకుంటూ.. మరోపక్క రైట్ సైడ్ హార్టెడ్ పర్సన్ గా తన స్ట్రగుల్ చూపిస్తూ.. రెండు షేడ్స్ ని బాగా పోషించి మెప్పించాడు. పెళ్లిచూపులు సినిమాతో మంచి పర్ఫార్మర్ గా పేరుతెచ్చుకున్న రీతూవర్మకి ఈ సినిమాలో లిమిటెడ్ క్యారెక్టర్ దక్కినప్పటికీ ..దానిక పూర్తి న్యాయం చేసింది. ఇక ప్రియదర్శి, వెన్నెలకిషోర్, సత్య, కామెడీతో నవ్వించారు. ఇక ఒకప్పుడు తన బ్యూటీతో ఆడియన్స్ ని తెగ మెప్పించిన ఈషా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మెప్పించడానికి ట్రై చేసింది. అయితే పూర్తిగా సక్సెస్ కాలేకపోయింది. ఇక రావురమేష్ , అజయ్, బ్రహ్మాజీ, రవిప్రకాష్ , జీవా తదితరులు అందరూ తమ పాత్ర పరిధిమేరకు 100పర్సెంట్ నటించారు.

ఇక టెక్నీషియన్స్ విషయానొకస్తే.. స్వామిరారాతో సెన్సేషనల్ హిట్ , దోచెయ్ తో డిజాస్టర్ అందుకున్న డైరెక్టర్ సుధీర్ వర్మ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి, కసిగా, పకడ్బందీగా కేశవ స్క్రిప్ట్ ను తయారుచేసుకున్నాడు. ఈ ధ్రిల్లర్ మూవీని అవసరమైన మేరకు కామెడీతో టచప్ చేస్తూనే .. బాగానే డీల్ చేశాడు. అయితే ఫస్టాఫ్ వరకూ చాలా పక్కాగా , గ్రిప్పింగ్ గా నడిచిన సినిమా.. సెకండాఫ్ లో గాడి తప్పింది. సింగిల్ పాయింట్ తో స్టోరీ అల్లుకోవడం వల్ల, ఇంటర్వెల్ తోనే కథ క్లైమాక్స్ కి చేరుకోవడంతో, ఛాలెంజింగ్ గా మారిన సెకండాఫ్ ని కాస్త తడబడుతూ నడిపించాడు. తాను అనుకున్నంత స్తాయిలో సినిమా అవుట్ పుట్ లేకపోయినా.. చాలావరకూ మేనేజ్ చేశాడు. కెమెరామెన్ దివాకర్ మణి.. ఈ సినిమా డైరెక్టర్ కి చాలా సపోర్ట్ గా నిలిచాడు, కామెడీని, థ్రిల్లర్ మూడ్ ని అతను బ్లెండ్ చేసిన విధానం ఆకట్టుకుంటుంది. సినిమాలో చాలాచోట్ల అతని పనితనం కనిపిస్తుంది. ఇక సుధీర్ వర్మ కి పర్మెనెంట్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన సన్నీ.m.r పాటలకు స్కోప్ తక్కువగా ఉండడంతో.. ఉన్నంతలోనే తన మార్క్ ఎలివేట్ అయ్యేలా మ్యూజిక్ ఇచ్చాడు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిన ప్రశాంత్ పిళ్లై సినిమాకి హార్ట్ లాంటి నేపధ్య సంగీతంతో చాలా ప్రయోగాలు చేశాడు. అవన్నీ బాగా వర్కవుట్ అయ్యి సినిమా మూడ్ ని కాపాడాయి. ప్రొడ్యూసర్ అభిషేక్ నామా.. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేశారు. కష్ణచైతన్య, అర్జున్ కార్తీక్ ఇద్దరూ కలిసి సుధీర్ వర్మ పాయింట్ ఆఫ్ వ్యూ లో కరెక్ట్ గా సింక్ అయ్యేలా తక్కువ మాటలతో ఎక్కువ భావాలు కన్వే అయ్యేలా చేశారు. మిగతా డిపార్ట్ మెంట్స్ అన్నీ.. డైరెక్టర్ విజన్ ను ఎలివేట్ చేస్తూ.. హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పుట్ ఇచ్చాయి.

ఓవరాల్ గా చెప్పాలంటే.. ఈ సినిమాకు ఫుల్ ఫామ్ లో ఉన్న నిఖిల్ తో పాటు.. గంటా 59 నిమిషాల షార్ట్ రన్ టైమ్ బాగా హెల్ప్ అయ్యింది. బి, సి సెంటర్స్ లో కాస్త్ అటూ, ఇటూ గా రిసీవింగ్ ఉన్నా,, మల్టీప్లెక్స్ లో మాత్రం బాగా ఫేర్ చేస్తుంది అనడంలో మాత్రం నోడౌట్. థ్రిల్లర్ ఎలిమెంట్స్, కామెడీ పంచెస్, కరెక్ట్ గా కనెక్ట్ అయితే.. సినిమా రేంజ్ మరో విధంగా ఉంటుంది.

 

ప్లస్

నిఖిల్ పర్ఫార్మెన్స్

గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే

సినిమాటోగ్రఫీ

కామెడీ

బ్యాక్ గ్రౌండ్ స్కోర్

 

మైనస్..

స్పాన్ లేని కథ

సెకండాఫ్ లో గాడి తప్పిన కథనం

రాంగ్ కాస్టింగ్

తేలిపోయిన క్లైమాక్స్

 

రేటింగ్ కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

11:02 - May 2, 2017

మంచు విష్ణు, ప్రగ్యా జైశ్వాల్‌ జంటగా బ్రహ్మానందం కీలక పాత్రలో జి.నాగేశ్వర్‌రెడ్డి దర్శకత్వంలో ఎం.ఎల్‌.కుమార్‌ చౌదరి సమర్పణలో పద్మజ పిక్చర్స్‌ పతాకంపై కీర్తి చౌదరి, కిట్టు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ఆచారి అమెరికా యాత్ర' త్వరలో రెగ్యులర్‌ షూటింగ్‌ జరుపుకోబోతోంది. పద్మశ్రీ డా||మోహన్‌బాబు జన్మదినం సందర్భంగా మార్చి 19న చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. త్వరలోనే షూటింగ్ నిమిత్తం అమెరికాకు వెళ్లనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రానికి మంచు విష్ణు, బ్రహ్మానందం కాంబినేషన్‌ హైలైట్‌గా నిలవనుందని చిత్ర దర్శక, నిర్మాతలు వెల్లడించారు. కృష్ణమాచారి తప్పులు.. అప్పలాచారి తిప్పలేెంటివనేది ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుందన్నారు.

15:32 - March 27, 2017

'మిస్టర్' సినిమా ట్రైలర్ రిలీజ్ తో 'శ్రీనువైట్ల' ఈజ్ బాక్ అనుకుంటున్నారు ఇండస్ట్రీ పీపుల్. ఒకప్పుడు టాప్ లెవెల్ లో ఉన్న శ్రీనువైట్ల ట్రెండ్ మిస్ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్నాడు. కామెడీ ట్రాక్ తో యాక్షన్ స్టోరీ లైన్స్ మిక్స్ చేసి సినిమాలు తీసే డైరెక్టర్ చాల గ్యాప్ తరువాత 'మెగా' సినిమాతో మళ్ళీ రాబోతున్నాడు. కామెడీ ని వెపన్ గా మార్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చెయ్యగల డైరెక్టర్ తన సినిమాలో యాక్షన్ తో పాటు కామెడీ కి కూడా పెద్ద పీట వేసే టాప్ రేంజ్ డైరెక్టర్ శ్రీను వైట్ల. 2011లో 'దూకుడు' తో సూపర్ హిట్ సినిమాని తెలుగు సినిమా ప్రపంచానికి ఇచ్చాడు శ్రీను వైట్ల. 'మహేష్ బాబు' లాంటి హీరో కి సూట్ అయ్యే యాక్షన్ స్టోరీ లైన్ ని ఫాదర్ సెంటిమెంట్ తో కనెక్ట్ చేసి హ్యూమర్ తగ్గకుండా ప్రెజెంట్ చేసి హిట్ కొట్టాడు శ్రీను వైట్ల. ఇండస్ట్రీ లో ఆల్మోస్ట్ అందరూ పెద్ద హీరోలను తన స్క్రిప్ట్ తో బంధించి సినిమాలు తీసాడు. 'దూకుడు' తరువాత అదే తరహా కధలు ఎంచుకోవడం వల్ల ఆడియన్స్ జడ్జిమెంట్ కి పక్కకెళ్ళిపోయి కొత్త థాట్స్ తో మళ్ళీ రాబోతున్నాడు శ్రీను వైట్ల.

మెగా ఫామిలీ లో పర్ఫెక్ట్ ఫిజిక్, మంచి ఎక్సప్రెస్సివ్ ఎలెమెంట్స్ ఉన్న నటుడు 'వరుణ్ తేజ్'. బాలీవుడ్ నటుడి లక్షణాలు పుష్కలంగా ఉన్న ఈ మెగాహీరో తాను సెలెక్ట్ చేసుకునే కధల్లో వైవిధ్యం ఉండేలా జాగర్తపడుతూ అడుగులు వేస్తున్నాడు. నటించింది మూడు సినిమాలే అయినా మంచి ఫ్యాన్ ఫాల్లోవింగ్ తో ఉన్నాడు వరుణ్ తేజ్. కుల వ్యవస్థ మీద వచ్చిన ప్రేమకథ చిత్రం 'కంచె'. ఈ సినిమా లో మెచూర్డ్ యాక్టింగ్ పెర్మార్మ్ చేసి ఆడియన్స్ తో వెరీ గుడ్ అనిపించుకున్నాడు వరుణ్.

ఆకట్టుకున్న ట్రైలర్..
రీసెంట్ గా రిలీజ్ ఐన ట్రైలర్ లో అన్ని అంశాలు ఆకట్టుకునేలా ఉన్నాయ్. అందమైన ప్రేమ కథను... శ్రీనువైట్ల తనదైన స్టైల్లో కమర్షియాలిటీని ఎక్కడా మిస్ కాకుండా గ్రాండియర్ గా ఈ చిత్రాన్ని నిర్మించారు. ట్రైలర్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. మంచి ఎమోష‌న్స్‌కి, హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైనింగ్‌కి, మ్యూజిక్‌కి, విజువ‌ల్స్‌కు స్కోప్ ఉన్న క‌థ‌ ఇది. స్పెయిన్‌లోని ప‌లు అద్భుత‌మైన లొకేష‌న్ల‌లో షూట్ చేశారు. అలాగే ఇండియాలోని చిక్ మంగ‌ళూర్‌, చాళ‌కుడి, ఊటీ, హైద‌రాబాద్ ఏరియాల్లో ఒరిజిన‌ల్ లొకేష‌న్స్‌లో షూట్ చేశారు. మిక్కి జె.మేయ‌ర్‌ ఆరు పాట‌లు ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉన్నాయి. ఈనెల 29న ఆడియోను రిలీజ్ చేసి... ఏప్రిల్ 14న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

11:55 - March 7, 2017

తెలుగు సినిమాలు సగం హిట్టు కొట్టేది కామెడీ తోనే. ఆడియన్స్ కి ఫన్ కావాలి, సరదాగా కాసేపు నవ్వుకోవాలి, సినిమాని ఎంజాయ్ చెయ్యాలి. ఇలా ఇవన్నీ జరగాలంటే స్క్రీన్ మీద మంచి టైమింగ్ ఉన్న కమెడియన్ కనిపించాలి. ఎన్నో ఏళ్లుగా బ్రహ్మానందం చేస్తున్న కామెడీ ఆడియన్స్ కి బోర్ కొట్టేసింది అని రియలైజ్ అయ్యారు ఫిలిం మేకర్స్. కొత్త కమెడియన్స్ కోసం వెయిట్ చేస్తున్న ఫిలిం మేకర్స్ కి కరెక్ట్ టైం లో దొరికాడు సునీల్. కొత్తరకం డైలాగ్ డెలివరీ తో వచ్చాడు, మంచి టైమింగ్ తో కామెడీ పండించాడు, ఆడియన్స్ ని అలరించాడు ఈ ఫన్నీ స్టార్ సునీల్.

సునీల్ హీరోగా ఎంట్రీ..
సునీల్ టాప్ కమెడియన్ గా ఎదుగుతున్న టైం లోనే హీరోగా ఎంట్రీ తీసుకున్నాడు. మల్లి కమెడియన్ కోసం టాలీవుడ్ వెతుక్కోవలసిన పరిస్థితి వచ్చింది. ఈ గ్యాప్ లో చాల మంది కమెడియన్స్ వచ్చినా ఎవరు 'సునీల్' స్థాయిలో మెప్పించలేకపోయారు. టైం కెన్ గివ్ ఆన్సర్ అన్నట్టు వచ్చాడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ 'పృథ్వి రాజ్'. ఆ ఒక్కటి అడక్కు అంటూ అప్పుడెప్పుడో స్క్రీన్ మీద కనిపించిన పృథ్వి మళ్ళీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఖడ్గం తో ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నాడు.

విన్నర్ లో ..
ఇప్పుడొస్తున్న సినిమాల్లో 'పృథ్వి' లేకుండా ఉన్న పెద్ద హీరోల సినిమాలు చాలా తక్కువ. మంచి నటుడిగా, టైమింగ్ ఉన్న కమెడియన్ గా పేరు తెచ్చుకున్న 'పృథ్వి' ప్రతి హిట్ సినిమాలో దర్శనం ఇస్తున్నాడు. రీసెంట్ గా అయితే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అంటూ వచ్చిన సినిమాలో ఏకంగా హీరో లెవెల్ రోల్ ని ప్లే చేసాడు. సలోని హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మంచి వేరియేషన్స్ చూపించాడు. టాలీవుడ్ హీరోలని తన కామెడీ యాంగిల్ తో ఇమిటేట్ చెయ్యగల 'పృథ్వి' సరైనోడు, బాబు బంగారం, రీసెంట్ ఫిలిం విన్నర్ లో కూడా మంచి రోల్స్ తీసుకున్నాడు. ఆడియన్స్ ని నవ్విస్తున్నాడు.

08:43 - November 26, 2016

'కళ్యాణ్ రామ్' రూట్ మార్చాడు. కామెడితో సక్సెస్ కొట్టాలని ఈ నందమూరి హీరో ప్లాన్ చేస్తున్నాడు. 'ఇజం'తో రివర్స్ పంచ్ పడడంతో ఈ హీరో కామెడి ట్రై చేయడానికి రెడీ అవుతున్నాడు. అందుకే ఓ కామెడి డైరెక్టర్ తో న్యూ మూవీకి రెడీ అయ్యాడు. 'ఇజం' తరువాత 'కళ్యాణ్ రామ్' కెరీర్ గ్రాఫ్ పూర్తిగా మారిపోతుందని చాలా మందే అనుకున్నారు. అంతేకాదు 'ఇజం' తర్వాత ఈ హీరోతో సినిమా చేయడానికి చాలామంది క్రేజ్ దర్శకులు క్యూలో ఉన్నారనే ప్రచారం సాగింది. ఈ క్రమంలో 'ఫటాస్' దర్శకుడు అనిల్ రావిపూడి ఈ హీరో కోసం మరో మంచి స్క్రిప్టు రెడీ చేశాడనే వినిపించాయి. అంతేకాదు ఎ.ఎస్.రవికుమార్ చౌదరి, పరశురామ్, దేవా కట్టా ఇలా చాలా పేర్లే వినిపించాయి. కానీ ఇవన్ని వట్టి పుకార్లే అని తెలిపోయింది. లేటేస్ట్ గా 'కళ్యాణ్ రామ్' ఓ కామెడి దర్శకుడితో న్యూ మూవీకి ఫిక్స్ అయ్యాడట. నిజానికి 'కళ్యాణ్ రామ్' 'ఇజం' సినిమాపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. ఫస్ట్ టైం 'పూరీ' జగన్నాథ్ లాంటి బడా డైరెక్టర్ తో మూవీ చేస్తుండడంతో తన కెరీర్ ప్లస్ అవుతుందని భావించాడు. కానీ కెరీర్ మారడమేమో కానీ పూర్తిగా డైలామాలో పడేశాడు. 'కళ్యాణ్ రామ్' బాడీ లాగ్వేంజ్ ని మార్చేసిన 'పూరీ' ఈ హీరో కి హిట్టు మాత్రం ఇవ్వలేకపోయాడు. దీంతో ఇక యాక్షన్ స్టోరీస్ కి పుల్ స్టాప్ పెట్టి కామెడి స్టోరీస్ పై ఫోకస్ చేయాలని 'కళ్యాణ్ రామ్' ఫిక్స్ అయ్యాడట.
కామెడీ చిత్రాల స్పెషలిస్టు జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో 'కళ్యాణ్ రామ్' న్యూ మూవీ చేయబోతున్నాడట. 'షేర్', 'ఇజం' లాంటి సీరియస్ సినిమాలు దెబ్బ కొట్టడంతో 'ఫటాస్' లాంటి ఎంటర్ టైనర్ అయితేనే బెటర్ భావిస్తున్నాడట. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు హిట్లిస్తాడని పేరున్న నాగేశ్వరరెడ్డి మరి 'కళ్యాణ్ రామ్' కి సక్సెస్ ఇస్తాడో చూడాలి.

Pages

Don't Miss

Subscribe to RSS - కామెడీ