కార్యకర్తలు

16:48 - July 8, 2018

హైదరాబాద్ : వైఎస్సార్‌ జయంతి సందర్భంగా వైఎస్‌ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఘన నివాళులర్పించారు. దివంగత నేత వైఎస్ఆర్‌కు పలువురు వైసీపీ నేతలు, వైసీపీ రాజకీయాల కార్యదర్శి నేత సజ్జల రామకృష్ణ రెడ్డి, సీనియర్ వైసీపీ నేత బొత్స నివాళుల్పరించారు. దివంగత నేత మాజీ ముఖ్యంత్రి వైఎస్ఆర్ 69వ జయంతి సందర్భంగా పలువురు నేతలు నివాళుల్పారించారు. అయన హాయంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. అంతే కాదు అయన ఏదైనా కార్యక్రమం చేపట్టితే అది చిరస్థాయిగా ఉంటుందని బొత్స అన్నారు. దేశంలోనే వ్యవసాయానికి పెద్ద పీటవేస్తూ.. రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత వైఎస్ఆర్ దే అని ఆయన అన్నారు. జగన్ మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రంలో ఉన్న ఆశయాలు అన్ని నెరవేరుతాయని అన్నారు. 

 

13:35 - June 28, 2018

అనంతపురం : పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది. ఆర్ ఆండ్ బీ గెస్ట్ హౌస్ వద్ద టీడీపీ, బీజేపీ కార్యకర్తలు ఘర్షణ పడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రెస్ మీట్ ను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. బీజేపీ, టీడీపీ నాయకుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఇరువర్గాలు పిడిగుద్దులు కురిపించుకున్నారు. 

13:41 - May 5, 2018

హైదరాబాద్ : తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా  పాల్గొన్న  నేతలకు ఇప్పుడు  టెన్షన్ పట్టుకుంది.  ఉద్యమ సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై కోర్టు ఓ  యువనేతకు శిక్ష విధించడం  అధికార పార్టీ నేతలను కలవరపెడుతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసులు ఎత్తి వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో... ఉద్యమ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. 
ఉద్యమ సమయంలో కార్యకర్తలపై కేసులు 
టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, నేతలకు  కేసుల భయం పట్టుకుంది.  రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమ సంమయంలో ఎంతో మంది గులాబి పార్టీ కార్యకర్తలపై పోలీసు కేసులు నమోదయ్యాయి. తెలంగాణా వ్యాప్తంగా జరిగిన వివిధ ఆందోళనల్లో  వారు ప్రత్యక్షంగా పాల్గొనడంతో పోలీసులు అప్పట్లో కేసులు నమోదు చేశారు.  ఉద్యమ ఆకాంక్ష నెరవేరింది. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన గులాబి పార్టీకి తెలంగాణాలో అధికార పగ్గాలు దక్కాయి. కాని ఉద్యమకారులపై ఉన్న కేసులు మాత్రం ఇంకా  కొలిక్కి రాలేదు. 
అమలుకు నోచుకోని కేసుల ఎత్తివేత నిర్ణయం 
అప్పట్లో నమోదైన కేసులను పూర్తిగా ఎత్తి వేయాలన్న ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నా అది ఇంకా పూర్తి స్థాయిలో అమలుకు నోచుకో లేదు. కొంత మందిపై ఉన్న కేసులు  మాత్రమే  నిబంధనల ప్రకారం ఎత్తి వేసేందుకు పోలీసులు, న్యాయశాఖ చొరవ చూపాయి. ఇంకా వందలాది మంది గులాబి పార్టీ కార్యకర్తలు కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.   మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన విద్యార్థి విభాగం నేత మున్నూరు రవికి కోర్టు ఇటీవల ఆరు నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. దీంతో  కేసులు ఎదుర్కొంటున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో మరోసారి  టెన్షన్  మొదలైంది.  రాష్ట్ర ఆకాంక్ష నెరవేరినా....రాష్ట్ర సాధన కోసం తాము చేసిన  పోరాటంలో దోషులుగా నిర్ధారణ కావడంతో  జీవితాంతం తాము నేరగాళ్లుగా ముద్రవేసుకున్నట్లు అవుతుందన్న ఆందోళన ఉద్యమ నేతలను వెంటాడుతోంది. 
4ఏళ్లయినా కొలిక్కిరాని కేసులు 
టీఆర్‌ఎస్‌ అధికార పగ్గాలు చేపట్టి నాలుగేళ్లు పూర్తవుతున్నా...  ఉద్యమ కారుల కేసులు కొలిక్కి రాకపోవడం వెనుక పార్టీలో  ఉన్న గ్రూపు రాజకీయాలు కూడా  ఓ కారణమన్న వాదన వినిపిస్తోంది. గులాబిపార్టీలో చేరిన బయటి నేతలు .. ఉద్యమ కారులపై కక్ష సాధింపుకు పాల్పడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రభుత్వ పరంగా జరుగుతున్న జాప్యం , పోలీసు శాఖ వ్యవహరిస్తున్న తీరుతో  ఉద్యమ నేతలపై ఉన్న కేసుల వ్యవహారం  అధికార పార్టీలో మరోసారి  చర్చనీయంశంగా మారింది.

 

20:15 - March 2, 2018

కరీంనగర్ : చట్టాలు ఎన్ని ఉన్నా దళితులపై దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది...  కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని రామచంద్రాపురంలో ఓ దళిత కుటుంబంపై ఆర్ఎస్‌ఎస్‌ కార్యకర్తలు దాడి చేశారు. మోజేష్‌ కుటుంబంపై జరిగిన దాడి ఘటనలో మన్యాల్ అనే యువకునికి కాలు విరిగింది.  ఆతను కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.. దాడి విషయం తెలుసుకున్న కుల వివక్ష పోరాట సమితి నాయకులు.. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. దళిత కుటుంబంపై దాడిచేసిన  హిందూత్వ వాదులపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కేవీపీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. 

 

09:06 - January 23, 2018
12:05 - December 19, 2017

నిజామాబాద్ : జిల్లా కంటేశ్వర్ లో ఎమ్మార్పీఎస్ కార్యకర్తల ఆందోళనకు దిగారు. మందకృష్ణను తక్షణం విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మందకృష్ణ అరెస్టుకు నిరసనగా ఓ కార్యకర్త బీఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

15:18 - November 6, 2017

హైదరాబాద్ : ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలంటూ ఎమ్మార్పీఎస్ జరిపిన హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ కార్యకర్త మృతి చెందడంతో తీవ్ర కలకలం రేగింది. పోలీసులే ఆమెను చంపేశారని ఎమ్మార్పీఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద ఆమె మృతదేహంతో నేతలు..కార్యకర్తలు ధర్నా చేపట్టారు. పోలీసులు..కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తుండడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ఎమ్మార్పీఎస్ నేతలు..కార్యకర్తలు భారీగా హైదరాబాద్ కలెక్టరేట్ కు చేరుకున్నారు. వారిని అడ్డుకొనేందుకు పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం..తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు వారిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీనితో అక్కడనే ఉన్న కార్యకర్త భారతి సృహ తప్పిపడిపోయింది. అనంతరం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందింది.

దీనిపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రి వద్ద చేరుకున్న నేతలతో టెన్ టివి మాట్లాడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి జరుగుతోందని..అందులో భాగంగా రంగారెడ్డి..హైదరాబాద్ కలెక్టరేట్ల ముట్టడి జరిగిందన్నారు. కానీ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ కార్యకర్త భారతిని నెట్టివేయడంతో ఆమె మృతి చెందిందని ఆరోపించారు. సంవత్సరం నుండి అఖిలపక్షాన్ని తీసుకెళుతామంటూ మాటల గారడీ చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:57 - October 31, 2017

ఢిల్లీ : తెలంగాణ టిడిపి‌ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు పెరిగాయి. తెలంగాణా వ్యాప్తంగా అన్ని‌ జిల్లాల నుంచి ఢిల్లీకి దాదాపు 350 మంది‌ మాజీ‌ టిడిపి నేతలు వచ్చారు. ఇందులో మాజీ  మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులు,కార్పొరేటర్లు,వార్డు మెంబర్లు కూడా ఉన్నారు. కాసేపట్లో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో రేవంత్‌రెడ్డి భేటీ కానున్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

13:31 - October 23, 2017

అనంతపురం : జిల్లా ముదిరెడ్డిపల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ మేళాపురంలో వైసీపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. సమీపంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ నేతలు... నిరసన తెలుపుతున్న వైసీపీ కార్యకర్తలపై దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే శివాలెత్తిపోయారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

15:22 - October 3, 2017

అనంతపురం : నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ తన తీరు మార్చుకోలేదు. టీడీపీ కార్యకర్తపై మరోసారి చేయి చేసుకున్నారు బాలయ్య. అనంతపురం జిల్లా హిందూపురంలో ఇంటింటికీ టీడీపీ ప్రచారంలో ఈ ఘటన జరిగింది. తనను దాటుకొని ముందుకెళ్తున్న కార్యకర్త చెంపను బాలయ్య చెళ్లుమనిపించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - కార్యకర్తలు