కాలిఫోర్నియా

12:58 - November 12, 2018

అమెరికా: అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియా కార్చిచ్చు 31 మంది ప్రాణాలను బలితీసుకుంది. దాదాపు 83,275 ఎకరాలను విస్తరించిన ఈ మంటలను ఆర్పేందుకు 8 వేల మంది అగ్నిమాపక సిబ్బంది అహొరాత్రులు శ్రమిస్తున్నా ఆదివారం నాటికి కేవలం 10 శాతం మంటలను మాత్రమే అదుపు చేయగలిగారు. గాలుల ప్రభావంతో మంటలు తీవ్రంగా ఎగసిపడి ఇతర ప్రాంతాలకు ఎగబాకుతుండటంతో మంటలను అదుపుచేయడం కష్టంగా మారింది. అయితే.. గాలుల తీవ్రత కొద్దిగా తగ్గడంతో ఫైర్ సిబ్బంది తమ కార్యకలాపాలను తీవ్రతరం చేస్తున్నారు. కార్చిచ్చు కారణంగా మరణించిన వారిని గుర్తించేందుకు ప్రత్యేక టీములు రంగంలోకి దిగాయి. ప్యారడైజ్ నగరంలో మృతుల సంఖ్య 29 కు చేరింది. లాస్ ఏంజల్స్ లో మరో ఇద్దరు మరణించినట్టు అధికారులు దృవీకరించారు. దీంతో మరణించినవారి సంఖ్య 31కు చేరింది. ఆదివారం నాటికి మంటలు 1.11 లక్షల ఎకరాలకు పెరిగింది. మంటలు కేవలం 25 శాతం మాత్రమే అదుపులోకి వచ్చినట్టు అధికారులు చెప్పారు. 
ఇప్పటివరకు 50 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా.. 1300 మంది శిబిరాలలో ఉన్నారు. సోమవారం ఉదయం వరకు ప్రమాద హెచ్చరికలు జారీచేసి చుట్టుపక్కల వారిని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేశారు.
 

 


 

18:19 - November 8, 2018

కాలిఫోర్నియా: అమెరికాలో కాలిఫోర్నియాలోని ధౌజండ్ ఓక్స్ ప్రాంతంలోని బార్ లో గురువారం తెల్లవారు ఝూమున ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో 13మంది మరణించారు. పలువురికి  గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక దళాలు, అంబులెన్స్లు ఘటనాస్దలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాలిఫోర్నియాలోని బోర్డర్ లైన్ బార్ అండ్ గ్రిల్ అనే పబ్ లో ఓకళాశాలకు చెందిన సుమారు 200 మందికి పైగా విద్యార్ధులు పార్టీ చేసుకుంటుండగా ఆగంతకుడు పబ్ లోకి ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. పబ్ లోకి వస్తూనే పొగ వచ్చే గ్రెనేడ్లు విసిరి కాల్పులుకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. సుమారు 30 రౌండ్లు కాల్పులు జరిపిన ఆంగతకుడు కూడా బార్ లోనే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. కాల్పుల ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.  ఇటీవల అమెరికాలో  స్కూళ్లు, ప్రార్ధనా మందిరాలు, పబ్ లు రెస్టారెంట్లుతో సహా బహిరంగప్రదేశాలలో ఇటీవల  దుండగులుకాల్పులు జరిపే ఘటనలు ఎక్కువయ్యాయి. 

15:26 - September 20, 2018

అమెరాకా :  వేడి వేడి వాతావరణంలో చల్ల చల్లని ఐస్‌క్రీమ్ తింటే ఆ మజాయే వేర కదా. కానీ చల్లటి వాతావరణ వున్న దేశాలవారు ఐస్‌క్రీమ్స్ తినరా? అంటే ఎందుకు తినరు? తింటారు. అసలే భూతల స్వర్గంగా పేరొందిన అమెరికాలో చల్లచల్లని వాతావరణంలో ఐస్‌క్రీమ్ తినాలంటే కొంచెం ధైర్యం చేయాల్సిందే. కానీ తినే ఐస్‌క్రీమ్ కూడా వెరీ వెరీ స్పెషల్‌‌గా వుంటే ఆ కిక్ మరింత రంజుగా వుంటుంది. మరి ఇప్పుడు అటువంటి ఐస్‌క్రీమ్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక ఐస్‌క్రీమ్ క్రీమ్ తినాలంటే మహా ఐతే రెండు వందలవుతుంది. కానీ మనం చెప్పుకునే ఈ వెరీ వెరీ స్పెషల్ ఐస్‌క్రీమ్ మాత్రం లక్షల్లో వుంటుందంటే నమ్ముతారా? నమ్మి తీరాల్సిందేనండీ..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఐస్‌క్రీమ్ ధర 60 వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ. 42 లక్షలు మాత్రమే. ఐస్‌క్రీమ్‌ను కాలిఫోర్నియాకు చెందిన 'త్రీ ట్విన్స్' అనే సంస్థ అందిస్తోంది. 
ఈ ఐస్‌క్రీమ్ తినాలనుకుంటే ముందుగానే డబ్బు చెల్లించాల్సి వుంటుంది. మిగతా కథంతా 'త్రీ ట్విన్స్' నడిపిస్తుంది. మిమ్మల్ని ఫస్ట్‌క్లాస్ విమాన ప్రయాణంతో టాంజానియా తీసుకెళ్లి లగ్జరీ రిసార్టులో బస ఏర్పాటు చేసి.. అనంతరం ప్రపంచంలో అత్యంత ఎత్తయిన పర్వతాల్లో ఒకటైన కిలిమంజారో పైకి తీసుకెళతారు. కస్టమర్‌తో పాటు గైడ్‌ను కూడానే వుంటాడు. తరువాత త్రీ ట్విన్స్ యజమాని గోటిబ్ వచ్చి పర్వతంపై గడ్డకట్టుకుని ఉన్న హిమనీ నదాల నుంచి మంచును సేకరించి కిందకు తీసుకువచ్చి ఐస్‌క్రీమ్ ను తయారు చేసి మీచేతికి అందిస్తారు.
దీని తయారీలో  కూడా ఓ ప్రత్యేక వుంది. అదే ఈ ఐస్‌క్రీమ్ స్పెషల్. ఎవరైనా వచ్చి ఈ ఖరీదైన ఐస్‌క్రీమ్ తిని వెళితే.. అందులో రూ.7 లక్షలను ఆఫ్రికా పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే సంస్థకు ఇస్తామని కూడా గోటిబ్ చెబుతున్నారు. ఒకరికి అయితే, రూ. 42 లక్షల వరకూ ఖర్చయ్యే ఈ కాస్ట్ లీ ఐస్‌క్రీమ్, ఇద్దరికయితే, రూ. 60 లక్షలకే లభిస్తుందట.

21:19 - July 22, 2018

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు అమెరికా నుంచి మరో ప్రఖ్యాత ఆహ్వానం లభించింది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 12 నుంచి 14 వరకు అమెరికా శాన్‌ఫ్రాన్సిస్‌కోలో జరిగే ప్రపంచ వాతావరణ సదస్సులో ప్రసంగించాల్సిందిగా పిలుపు వచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ ఎడ్మండ్ జి బ్రౌన్ లేఖ రాశారు. "భవిష్యత్తులో విద్యుత్, రవాణ విధానం" అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగించనున్నారు. వాతావరణ మార్పులకు ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలపై చేసే ప్రసంగాలు.. ప్రతినిధులకు ఉపయుక్తంగా ఉంటాయని గవర్నర్‌ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంతోపాటు భవిష్యత్‌లో చేపట్టబోయే వాతావరణ అనుకూల కార్యక్రమాలను వివరించాల్సిందిగా ఎడ్మండ్‌ బ్రౌన్‌ కోరారు.

11:23 - May 21, 2018

హైదరాబాద్ : ప్రముఖ నవలా రచయిత్రి యుద్దనపూడి సులోచనారాణి కన్నుమూశారు. కాలిఫోర్నియాలోని తన కుమార్తె ఇంట్లో గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. యుద్దనపూడి సులోచనారాణి అనేక నవలలు రాశారు. మౌనపోరాటం, ఆగమనం, ఆరాధన, ప్రేమ పీఠం, వెన్నెల్లో మల్లిక లాంటి అనేక నవలలను ఆమె రచించారు. ఆమె రాసిన అనేక నవలలు సినిమాలుగా తెరకెక్కాయి. యుద్దనపూడి నవలల ఆధారంగా గిరిజా కల్యాణం, ఆత్మీయులు, మీన, జీవన తరంగాలు, అగ్నిపూలతోపాటు మరికొన్ని చిత్రాలు తెరకెక్కాయి. కుటుంబ కథనాలు రాయడంలో తనకు తానే సాటిగా యుద్దనపూడి నిలిచారు. నవలా దేశపు రాణిగానూ అమె ప్రసిద్ధి చెందారు. కృష్ణా జిల్లా మొవ్వ మండలంలోని కాజ గ్రామంలో 1940లో ఆమె జన్మించారు. సులోచనారాణి మృతితో సాహిత్యలోకంలో విషాదం నెలకొంది.

ఆమె కలం నుండి జాలువారిని పలు రచనలు.. 
ఆగమనం, ఆరాధన,ఆత్మీయులు,అభిజాత,అభిశాపం,అగ్నిపూలు,ఆహుతి,అమర హృదయం,అమృతధార,అనురాగ గంగ,అనురాగ తోరణం,అర్థస్థిత,ఆశల శిఖరాలు,అవ్యక్తం,ఋతువులు నవ్వాయి,కలలకౌగిలి,కీర్తికిరీటాలు,కృష్ణలోహిత,గిరిజా కళ్యాణం,చీకటిలో చిరుదీపం,జీవన సౌరభం,జాహ్నవి,దాంపత్యవనం,నిశాంత,ప్రేమ,ప్రేమదీపిక,ప్రేమపీఠం,బహుమతి, బందీ,బంగారు కలలు,మనోభిరామం,మౌనతరంగాలు,మౌన పోరాటం,మౌనభాష్యం,మోహిత,వెన్నెల్లో మల్లిక,విజేత,శ్వేత గులాబి,సెక్రటరీ,సౌగంధి,సుకుమారి వంటి మరెన్నో నవలలు ఆమె కలం నుండి జాలువారాయి. 

21:26 - January 15, 2018

అమెరికా : కాలిఫోర్నియాలో కారు అదుపుతప్పి గాల్లోకి ఎగిరి ఏకంగా భవనం రెండో అంతస్థులోకి దూసుకెళ్లింది. స్థానిక శాంతా అనా ప్రాంతంలో మితిమీరిన వేగంతో వెళ్తున్న ఓ సెడాన్‌ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో ఒక్కసారిగా కారు గాల్లోకి లేచి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనే ఉన్న ఓ కార్యాలయం రెండో అంతస్తులోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో కారులో ఇద్దరు ప్రయాణిస్తున్నారు. ఒకరు గాయాలతో బయటపడగా.. మరో వ్యక్తి కారులోనే ఇరుక్కుపోయాడు. సమాచారమందుకున్న అగ్నిమాపక సిబ్బంది కారులో ఉన్నవారిని రక్షించి.. వాహనాన్ని క్రేన్‌ సహాయంతో కిందికి దించారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ డ్రగ్స్‌ తీసుకొని కారు నడిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆ భవంతి పాక్షికంగా దెబ్బతింది. 

21:58 - September 12, 2017

ఢిల్లీ : కాలిఫోర్నియాలోని బర్క్‌లీ యూనివర్సిటీలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రసంగంపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు.  భారత్‌లో వారసత్వ రాజకీయాలు సర్వసాధారణమేనని చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్నవారికి ఎలాంటి వారసత్వ రాజకీయాలు లేవన్నారు. గుజరాత్‌కు చెందిన ప్రధాని మోది పేద కుటుంబం నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారని, రాష్ట్రపతి కోవింద్‌ దళిత కుటుంబం నుంచి వచ్చారని గుర్తు చేశారు. ఉపరాష్ట్రపతి కూడా రైతు కుటుంబం నుంచి వచ్చినవారేనని మంత్రి తెలిపారు. వీరంతా జీవితంలో ఎన్నో పోరాటాలు చేసిన ఈ స్థాయికి ఎదిగారని స్మృతీ అన్నారు. ప్రజాస్వామ్యంలో వారసత్వానికి తావులేదని ప్రతిభే కొలమానమని చెప్పుకొచ్చారు. 

10:48 - June 13, 2017

గిదే లక్ అంటే. లాటరీలో ఏకంగా రూ. 2,888 కోట్లు చేజిక్కించుకున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తికి ఈ జాక్ పాట్ తగిలింది. ఇక్కడ లాటరీ నిర్వహించడం అధికారమనే సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకమైన పవర్ బాల్ కంపెనీ నిర్వహించే లాటరీని కాలిఫోర్నియాకు చెందిన ఓ వ్యక్తి కొనుగోలు చేశాడు. ఈ లాటరీలో ఏకంగా 448 మిలియన్‌ డాలర్లు (2,888 కోట్ల రూపాయలు) గెలుచుకున్నారని సంస్థ ప్రకటించింది. భద్రతా కారణాల రీత్యా అతని గురించి పూర్తి వివరాలు వెల్లడించలేమని సంస్థ పేర్కొంది. ఈ మొత్తంలోంచి స్థానిక పన్నులు, ఇతర చార్జీలు మినహాయించి మిగిలిన మొత్తాన్ని విజేతకు అందజేస్తామని పేర్కొంది. కాలిఫోర్నియాలోని రివర్‌ సైడ్‌ కౌంటీ అనే ప్రాంతంలోని దుకాణం నుంచి విజేత కొనుగోలు చేశారని, ఆ దుకాణ దారులకు కోటిన్నర రూపాయలు అందచేయనున్నట్లు తెలుస్తోంది.

16:57 - April 22, 2017

హైదరాబాద్: కాలిఫోర్నియా హైవేపై జరిగిన ఓ రోడ్డు ప్రమాదం అందరిని దిగ్భ్రాంతికి గురిచేసింది. వేగంగా వెళుతున్న ఓ ట్రక్కు.. కారును ఢీకొట్టడమే కాకుండా లోపల డ్రైవర్‌ ఉండగానే ఏకంగా నాలుగు మైళ్లు ఈడ్చుకెళ్లింది. హైవేపై నిస్సాన్‌ కారులో వెళుతున్న ఓ వ్యక్తిని పక్క నుంచి వెళుతున్న ట్రక్కు ఢీకొట్టింది. దాంతో కారు డోర్ ట్రక్కు వెనక ఇరుక్కుపోయింది. ఈ విషయం ట్రక్కు నడుపుతున్న డ్రైవర్‌కి తెలియలేదు. అదే సమయంలో హైవేపై వెళుతున్న బ్రైన్‌ స్టీమ్కే అనే వ్యక్తి.. ట్రక్‌ డ్రైవర్‌ను అప్రమత్తం చేశాడు. ఇంత జరిగినా కారులో ఉన్న డ్రైవర్‌కి ఏ ప్రమాదం జరగలేదు. ఈ వీడియోని స్టీమ్కే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

10:14 - April 14, 2017

హైదరాబాద్ : మంత్రి కేటీఆర్‌కు అరుదైన గౌరవం లభించింది. రెండు అంతర్జాతీయ సదస్సులకు హాజరుకావాలని ఆహ్వానం అందింది. కాలిఫోర్నియాలో జరిగే ప్రపంచ పర్యావరణ, నీటి సదస్సుకు రావాలని కేటీఆర్‌ని అమెరికా ఇంజినీర్ల సంఘం ఆహ్వానించింది. ప్రపంచ పర్యావరణ, నీటి సదస్సులో మిషన్ భగీరథపై మాట్లాడాల్సిందిగా కేటీఆర్‌ను అమెరికా ఇంజినీర్ల సంఘం కోరింది. మే 21 నుంచి 25 వరకు ఈ సదస్సు జరుగనుంది. వాటర్ కాంగ్రెస్‌లో ప్రారంభోపన్యాసం చేసే తొలి విదేశీ వ్యక్తి మంత్రి కేటీఆర్ కానున్నారు. అదేవిధంగా మే 18, 19 వ తేదీల్లో జరుగనున్న వార్షిక సదస్సులో ప్రసంగించాలని స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కేటీఆర్‌ను ఆహ్వానించింది. రెండు అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొనాల్సిందిగా తనకు ఆహ్వానం రావడం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. మిషన్‌కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు గుర్తింపుగా అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానాలు అందినట్లు ఆయన అభిప్రాయపడ్డారు.

Pages

Don't Miss

Subscribe to RSS - కాలిఫోర్నియా