కాల్పులు

15:52 - December 13, 2017

జైపూర్ : రాజస్థాన్‌లోని పాళి జిల్లాలో తమిళనాడు పోలీసులపై కాల్పులు జరిగాయి. గతనెల చెన్నైలోని బంగారు దుకాణంలో కన్నం వేసి 3.5 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సీఐ మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి. 

13:01 - December 13, 2017

రాజస్థాన్ : రాజస్థాన్‌లోని పాళి జిల్లాలో తమిళనాడు పోలీసులపై కాల్పులు జరిగాయి. గతనెల చెన్నైలోని బంగారు దుకాణంలో కన్నం వేసి 3.5 కేజీల బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు పోలీసులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సీఐ మృతి చెందగా, మరికొందరికి గాయాలయ్యాయి.

22:20 - December 9, 2017

ఛత్తీస్ ఘడ్ : బీజాపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపులో దారుణం జరిగింది. సహచరులపై తోటి జవాన్ శాంత్ కుమార్ కాల్పులకు తెగబడ్డారు. రైఫిల్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.  మృతులు ఎస్సై వీకే శర్మ, ఎస్సై మేగ్ సింగ్, ఏఎస్ ఐ రాజ్బీర్, కానిస్టేబుల్ జీఎస్ రావు. మరో ఏఎస్ ఐ గజనంద్ కు గాయాలయ్యాయి. మృతదేహాలను బీజాపూర్ నుంచి బసగుదాకు తరలించారు. నిందితుడు శాంత్ కుమార్ ను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

08:18 - December 8, 2017

మెక్సిక్ : ఓ పాఠశాలలో ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. గురువారం ఉదయం జరిగినఈ ఇద్దచరు మృతి చెందారు. డజను మందికి పైగా గాయపడినట్లు తెలిసింది. న్యూ మెక్సికోలోని అల్బుకుర్కేకు సుమారు 180 మైళ్ల దూరంలో ఉన్న అజ్‌టెక్‌ హైస్కూల్‌లో ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు విద్యార్థులతో పాటు కాల్పులకు పాల్పడిన వ్యక్తి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే కాల్పులకు తెగబడిన వ్యక్తి ఎలా చనిపోయాడన్నదానిపై స్పష్టత రాలేదు. ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడా లేక యాదృచ్ఛికంగా జరిగిందా అన్నది తెలియరాలేదు. విద్యార్థులందరినీ పాఠశాల నుంచి బయటికి పంపించి ప్రత్యేక బస్సుల్లో ఇళ్లకు తరలించారు.   

11:56 - December 1, 2017

జమ్మూకాశ్మీర్ : వివాహేతర సంబంధం మూడు ప్రాణాలను బలిగొన్నది. భార్య తోటి సైనికుడితో సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తుండటంతో తట్టుకోలేక ఓ జవాన్ తుపాకీతో ఇద్దరినీ కాల్చి చంపాడు. అంతటితో ఆగక సదరు సైనికుడి భార్యనూ హతమార్చాడు. జమ్మూ కాశ్మీర్‌లో ఈ సంఘటన జరగగా.. పాల్వంచ మండలం సంగం గ్రామంలో కలకలం సృష్టించింది. సంగం గ్రామానికి చెందిన ఇంజలపు సురేందర్ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్నాడు ఇతడికి ఏడేళ్ల క్రితం లావణ్యతో వివాహం జరిగింది. మూడు సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్ లో నివాసం ఉంటుంన్నారు. ఈక్రమంలో లావణ్య వేరే జవాన్ తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. సురేందర్ రాత్రి విధులు నుంచి ఇంటికి రాగా..  భార్య సదరు జవాన్ తో సన్నిహితంగా ఉండడం చూసి...  ఆగ్రహోదగ్ధుడై సురేందర్‌.. తన చేతిలో ఉన్న తుపాకీతో లావణ్య,సదరు జవాన్‌ను కాల్చి చంపాడు. తుపాకీ శబ్దంతో పక్క ఇంట్లో ఉన్న జవాన్ భార్య సురేందర్ ఇంటికి వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న భర్తను చూసి హతాశురాలైంది.వెంటనే తేరుకుని సురేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకు నా భర్తను చంపావంటూ నిలదీసింది ఆగ్రహం చల్లారని సురేందర్ ఆమెను కూడా తుపాకీతో కాల్చి చంపాడు. తుపాకీతో నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యాడు.

 

07:26 - November 22, 2017

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ద్వారకా మెట్రో రైల్వే స్టేషన్‌ సమీపంలో పిల్లర్‌ నెంబర్‌-768 దగ్గర పోలీసులకు-క్రిమినల్స్‌ కు మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. స్టేషన్‌కు సమీపంలోని ఓ భవనంలో క్రిమినల్స్ దాగున్నారన్న సమాచారంతో పంజాబ్‌-ఢిల్లీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్‌ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా ఐదుగురు క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఈ దుండగుల కోసం పంజాబ్ పోలీసులు గాలిస్తున్నట్లు  నైరుతి ఢిల్లీ డీసీపీ శిబేష్ సింగ్  తెలిపారు. వీరిపై హత్య, హత్యాయత్నం, కార్‌జాకింగ్ వంటి ఆరోపణలు ఉన్నట్లు ఆయన వివరించారు. క్రిమినల్స్‌ నుంచి 13 తుపాకులు, 100 బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.

 

09:29 - November 15, 2017

వాషింగ్టన్ : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం నెలకొంది. ఉత్తర కాలిఫోర్నియాలోని రాంచో టెహామా ఎలిమెంటరీ స్కూల్‌లో దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ముగ్గురు విద్యార్థులతో సహా మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. పదిమందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమ్తితం ఆస్పత్రికి తరలించారు.  సమాచారం తెలుసుకుని పోలీసులు రంగంలోకి దిగారు. స్కూల్‌ను చుట్టుముట్టి... దుండగుడిని మట్టుబెట్టారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.... 

 

18:21 - November 13, 2017

ఢిల్లీ : నగరంలోని రోహిణి కోర్టు పరిధిలో కాల్పులు కలకలం సృష్టించాయి. తుపాకితో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో రక్తపు మరకలున్నాయి. రెండు గ్యాంగ్‌ వార్‌లకు సంబంధించిన గొడవగా పోలీసులు భావిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో రోహిణి కోర్టులో జరిగిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆ సమయంలో కూడా దాడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. కాల్పుల ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

 

21:47 - November 11, 2017
15:47 - November 11, 2017

హైదరాబాద్‌ : నగరంలోని మైలార్‌దేవ్‌పల్లిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. స్థానిక పీస్‌ కాలనీలో ముస్తఫా అనే వ్యక్తిపై జుబేద్‌ అనే వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. నిన్న రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటీవల జుబేద్‌ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. ఐటీ అధికారులకు ముస్తఫా సమాచారం ఇచ్చి ఉంటాడన్న అనుమానంతో జుబేద్‌ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేపట్టారు. నిందితుడు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. తీవ్రంగా గాయపడ్డ ముస్తఫా ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిందితునికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

 

Pages

Don't Miss

Subscribe to RSS - కాల్పులు