కాళేశ్వరం

14:48 - October 20, 2018

నిర్మల్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. కేసీఆర్‌కు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేదర్కర్ పేరు నచ్చదని రాహుల్ గాంధీ అన్నారు. దేశం మొత్తం అంబేద్కర్ నామస్మరణ చేస్తుంటే.. కేసీఆర్‌కు మాత్రం నచ్చడం లేదన్నారు. అందుకే ఏ పథకానికి కూడా అంబేద్కర్ పేరు పెట్టలేదని రాహుల్ విమర్శించారు. అంబేద్కర్ ప్రాజెక్టును సైతం కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారని రాహుల్ మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భైంసాలో రాహుల్ గర్జన పేరిట బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన రాహుల్ గాంధీ.. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.

కాంగ్రెస్ ప్రాజెక్టులను రీడిజైన్ చేసి వేల కోట్ల రూపాయలను టీఆర్ఎస్ దండుకుందని రాహుల్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులను భారీగా పెంచారని మండిపడ్డారు. రీ డిజైన్ పేరుతో ప్రజాధనం వృథా చేస్తున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వంపై రాహుల్ ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల పేరుతో ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెడుతున్నారని విరుచుకుపడ్డారు.

రైతులకు లాభం కలిగించేలా కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ చట్టాన్ని ప్రధాని మోదీ సూచనలలో కేసీఆర్ ఇక్కడ అమలు చేయడం లేదని రాహుల్ మండిపడ్డారు. ఫలితంగా ప్రభుత్వం భూములను లాక్కునే పరిస్థితి ఉందన్నారు. కేసీఆర్, మోదీ ఎక్కడికి వెళ్లినా అబద్దాలు చెబుతున్నారని రాహుల్ అన్నారు.

21:17 - July 13, 2018

సిద్ధిపేట : ఎల్లంపల్లి ప్రాజెక్టులో కాంగ్రెస్‌ చుక్కనీటిని నిలపలేదన్నారు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం ప్రాజెక్టు పురోగతిపై రెండు రోజులుగా క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షిస్తున్న హరీష్‌రావు.. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కాంగ్రెస్‌ పాలనలో ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తి మరిచిపోయిందని.. ప్రాజెక్టులు నిర్మిస్తున్న తమపై లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు హరీష్‌రావు.

 

06:59 - June 23, 2018

జగిత్యాల : ఏపీలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతున్నారని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును నిలివేయాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాయడాన్ని హరీశ్‌ తప్పుపట్టారు. జగిత్యాల జిల్లా హలికోటలో సూరమ్మ చెరువు, నాగారం చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేసిన మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్‌... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు. నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జగిత్యాల జిల్లాలో పర్యటించారు. హలికోటలో 202 కోట్ల రూపాయల అంచనావ్యయంతో చేపడుతున్న సూరమ్మ చెరువు, నాగారం చెరువు ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కరీంనగర్‌ ఎంపీ వినోద్‌కుమార్‌తోపాటు మేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హలికోటలో జరిగిన సభలో.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని హరీశ్‌ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాయడాన్ని హరీశ్‌తప్పుపట్టారు. తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు.

కథలాపూర్‌, మేడిపల్లి మండలాల్లో 43 వేల ఎకరాలకు సాగునీరు అందించే సూరమ్మ చెరువు, నాగారం చెరువు జలాశయాన్ని వచ్చే దసరా పండుగ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నవిషయాన్ని హరీశ్‌ ప్రస్తావించారు. అయితే హలికోట ప్రజలు 300 ఎకరాల భూమి ఇస్తేనే ఇది సాధ్యమని లింకుపెట్టారు.

ప్రపంచంలో వేగవంతంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నది తెలంగాణలోనేనని కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. మహిళలకు వడ్డిలేని రుణాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రులు హరీశ్‌, ఈటల చెప్పారు. గోదావరి నదిలో తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వరకు ప్రాజెక్టులు చేపడతామన్నారు. 

16:00 - June 13, 2018

రాజన్న సిరిసిల్ల : రైతన్న, నేతన్నలతోపాటు ప్రతి ఒక్కరూ సంతోషించే విధంగా కేసీఆర్‌ పాలన సాగుతోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాజన్న సిరిసిల్లలో వ్యవసాయ కళాశాల శంకు స్థాపన కార్యక్రమంలో పాల్గొని, ప్రసంగించారు మంత్రి కేటీఆర్. కరవుకు కేరాఫ్‌గా ఉన్న ప్రాంతంలో కాలువల నిర్మాణం అద్భుతంగా సాగుతోందని చెప్పారు మంత్రి. కేసీఆర్‌ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు కాలంతో పోటీ పడుతూ ముందుకు సాగిందన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిచేసి 38 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని కేటీఆర్‌ అన్నారు.

11:12 - April 26, 2018

ఢిల్లీ : టీఆర్ఎస్ ప్రభుత్వం..కేసీఆర్ పై టి.కాంగ్రెస్ నేత పొన్నం పలు విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ...హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ లో రూపాయి బిల్ల వేస్తే కనబడాలని..ట్యాంక్ బండ్ వద్ద ఆకాశ హార్మ్యాలు కడుతామని...ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని..125 అడుగుల డా.అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు..చేస్తామని ఇలా ఎన్నో చెప్పారని గుర్తు చేశారు. అంతేగాకుండా యాదాద్రి, వేములవాడ...దేవాలయాలకు శఠగోపాలు పెట్టారని, కేసీఆర్ మాటల గారడి అంటూ ఎద్దేవా చేశారర. విభజన సమయంలో రూ. 60 వేల కోట్ల అప్పు ఉంటే ప్రస్తుతం రూ. 1.70 కోట్ల అప్పు దాటిపోయిందని ఆరోపించారు.

తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడుతుంటే..భూగర్భ జలాలు తక్కువ అవుతున్నా ఆయన ఫెడరల్ ఫ్రంట్ అంటూ రాష్ట్రాలకు వెళుతున్నారని విమర్శించారు. ఒక్కమాటలో చెప్పాలంటే శిఖండి పాత్ర పోషిస్తున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు ఒక టూరిజం ప్రాజెక్టుగా తయారై పోయిందని విమర్శించారు. 

09:34 - April 11, 2018

నిజామాబాద్ : జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. మార్కెట్ యార్డులో సద్ధిమూట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. మార్కెట్ యార్డుల్లో మార్కెట్ కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేయడం జరుగుతోందని, వచ్చే వానంకాలం నాటికి పంటలకు నీళ్లు ఇచ్చేందుకు కాళేశ్వరంలో మూడు షిప్టుల్లో పనులు వేగంగా జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్లు కుట్రలు పన్నుతున్నారని తెలిపారు. 

12:56 - April 4, 2018
18:43 - March 30, 2018

సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయని అని అన్నారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ఆయన ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి.. మహదేవపూర్ మండలం మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు సోరెన్‌కు వివరించారు. అనంతరం అక్కడి నుంచి అన్నారం బరాజ్ పనులను కూడా సోరెన్ పరిశీలించారు. 

 

13:25 - March 30, 2018

పెద్దపల్లి : కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పర్యటనలో హరీశ్ రావు బిజీ బిజీగా గడిపారు. ఈ పర్యటనలో జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. అనంతరం మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం పనులను కూడా పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు సోరెన్‌కు వివరించారు.

21:24 - February 23, 2018

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగిపోయాయి. ముంపు నివారణ చర్యలు చేపట్టకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనులను నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు నిలిపివేయాలంటూ హయత్‌ఉద్దీన్‌ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు చెన్నైలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ కు వెళ్లకుండా సుప్రీంకోర్టుకు రావడంలోని ఆంతర్యం గురించిన పిటిషనర్‌ను ప్రశ్నిచింది.

తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన ప్రాజెక్టుపై ఇప్పుడు పిటషిన్‌ వేసిన హయత్‌ఉద్దీన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫోరం హంటింగ్‌ చేస్తున్నారా అంటూ మందలించింది. ఈ కేసు విచారణార్హంకాదంటూ తిరస్కరించింది. పిటిషన్‌ ఆలోచనా విధంగా సరిగాలేదని మండిపడింది. కేసు వేయడంలో జాప్యం చేశారని పిటిషనర్‌ దృష్టికి తెచ్చింది. ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత పనులు ఆపాలంటూ పిటిషన్‌ వేయడం సరికాదరన్న తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. సుప్రీంకోర్టులో జరిగిన వాదనలను స్వయంగా పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు.. పిటిషన్‌ను కొట్టివేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఫోన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వివరించారు.

ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డుకునే దురుద్దేశంతోనే హయత్‌ఉద్దీన్‌ పిటిషన్‌ వేశారని, పిటిషనర్‌ ఆంతర్యాన్ని సుప్రీంకోర్టు గ్రహించి కేసు కొట్టివేసిందని న్యాయవాది చెప్పారు. కాళేశ్వరం ఎత్తిపోత పథకం నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసు తొలగిపోయిన నేపథ్యంలో ప్రాజెక్టు పనుల్లో వేగాన్ని పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది చివరినాటికి సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుంది. ఇందుకు అనుగుణంగా పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - కాళేశ్వరం