కింగ్ నాగార్జున

18:59 - June 1, 2018

కింగ్ నాగార్జున - ఆర్జీవీ క్రేజీ కాంబినేషన్‌లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'ఆఫీసర్' సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శుక్రవారం నాడు విడుదలైన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. దాదాపు 'శివ' చిత్రం అనంతరం నాగ్..రాంగోపాల్ వర్మ కాంబినేషన్ లో ఈ చిత్రం రావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక వరుస ఫ్లాప్‌లలో ఉన్న రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని చాలా శ్రద్దగా, జాగ్రత్తగా తెరకెక్కించారని ప్రచారం జరిగింది. ఈ మూవీలో 'నాగార్జున' సరసన ముంబై మోడల్ 'మైరా సరీన్' జోడీ కట్టింది. తెలుగులో ఆమెకు తొలి చిత్రం ఇదే కావడం విశేషం. మరి చిత్రం ఎలా ఉంది ? టెన్ టివి ఇచ్చే రేటింగ్ కోసం వీడియో క్లిక్ చేయండి. 

12:01 - December 24, 2016

అక్కినేని అఖిల్ రెండవ చిత్రంపై కొంత కాలంగా ఉన్న సందిగ్దత తొలగిపోయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ యువ హీరో నటించనున్న కొత్త చిత్రం ఎట్టకేలకు జనవరి 4న పట్టాలెక్కబోతుంది. ఈ సినిమాకి నాగార్జున ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. దాదాపు 40 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మనం ఫేమ్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియో లోనే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నటి టబు కీలక పాత్రలో నటించనుండగా కాగా ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. రొమాంటిక్ లవ్‌స్టోరీగా రూపొందనున్న ఈ చిత్రంలో అఖిల్‌కు జోడీగా తమిళ నటి మేఘా ఆకాష్ నటించనుంది. ఈమె పస్తుతం తమిళంలో రూపొందుతున్న ఎనై నోకి పాయుమ్ తోట, ఒరు పక్కా కథై చిత్రాల్లో నటిస్తోంది.

12:13 - January 21, 2016

‘సోగ్గాడే చిన్నినాయన’గా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టేశాడు. హీరోగానే కాక నిర్మాతగానూ నాగార్జునకు ఈ మూవీ బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి... దీంతో ఈ యువదర్శకుడికి అఖిల్ రెండో సినిమా బాధ్యతలు అప్పగించాలని ఆలోచిస్తున్నారట కింగ్ నాగార్జున. అయితే ఈ సినిమాకు నాగార్జునే నిర్మాతగా వ్యవహరించనున్నాడని సమాచారం. అఖిల్ మొదటి సినిమా ఆశించినంత స్థాయిలో లేకపోవడంతో... రెండో సినిమా విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు నాగార్జున. ప్రపంచాన్ని కాపాడే రక్షకుడు తరహా పాత్రలు కాకుండా.. ప్రస్తుతానికి హీరోయిన్‌ను కాపాడగలిగే పాత్రలైతే అఖిల్‌కు చాలంటున్నాడట నాగ్. ఈ నేపథ్యంలో అఖిల్ కోసం రెండు ప్రేమకథలు సిద్ధమయ్యాయట. ప్రస్తుతం వీటి బాధ్యత సోగ్గాడే చిన్నినాయన దర్శకుడు కళ్యాణకృష్ణపై ఉంచారట నాగార్జున. దీంతో ఈ రెండింటికి స్క్రీప్ట్ వర్క్ చేస్తున్నాడట ఈ యువ దర్శకుడు. ఈ రెండింటి స్క్రీప్ట్ వర్క్ పూర్తయ్యాక వీటిలో నాగ్ ఏది అంగీకరిస్తాడో.. ఆ సినిమాలో అఖిల్ నటిస్తాడట. ఈ రెండు సినిమాలూ రొమాంటిక్ ఎంటర్ టైనర్స్ కావటం విశేషం..

Don't Miss

Subscribe to RSS - కింగ్ నాగార్జున