కుమార్తె

15:46 - December 10, 2018

హైదరాబాద్ : అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ, నీతా దంపతుల గారాల పట్టి ఈషా అంబానీ వివాహం ఈ నెల 12న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుక దేశీయ ప్రముఖులే కాకుండా విదేశాల నుండి వ్యాపార దిగ్గజాలు కూడా వేంచేయనున్నారు. అంబానీవారి ఇంట పెండ్లి సందడికి ప్రముఖ రాజకీయ ప్రముఖులతో పాటు బాలీవుడ్ తారలు..క్రీడా ప్రముఖులు ఇలా ఒకరేంటి అన్ని వర్గాల ప్రముఖులు సందడి చేయనున్నారు.పెళ్లి వేడుకల్లో భాగంగా ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఆదివారం నిర్వహించిన సంగీత్‌లో బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. షారుక్‌ ఖాన్‌, అభిషేక్‌ బచ్చన్‌, కత్రినాకైఫ్‌, కరీనా కపూర్‌, ఐశ్వర్యరాయ్‌ వేసిన స్టెప్పులతో ఉదయ్‌పూర్‌ ప్యాలెస్‌ హోరెత్తిపోయింది. హాలీవుడ్‌ పాప్‌ గాయని బియాన్స్‌, బాలీవుడ్‌ నటీమణి రేఖతో పాటు సచిన్‌ టెండూల్కర్‌, ఆయన భార్య అంజలి కూడా పాల్గొన్నారు. 
ఐదురోజుల పాటు జరగనున్న అజయ్‌ పిరమాల్‌- స్వాతి పిరమాల్‌ల కుమారుడు ఆనంద్‌ పిరమాల్‌..అంబానీ, నీతా దంపతుల గారాలపట్టి ఇషా వివాహం ఆహ్వానం అందుకోవాలంటే కూడా ఓ రేంజ్ వుండాలి.  అంబానీ ఇంట వివాహ వేడుకల్లో బాలీవుడ్ తారలే ఎక్కువగా కనిపిస్తున్నారు. మరి టాలీవుడ్ నుంచి ఎవరెవరు వెళ్తారు? అన్న ప్రశ్న అభిమానుల్లో తలెత్తుతోంది. అయితే దీనికి సంబంధించి ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. ఈషా అంబానీ పెళ్లికి ‘బాహుబలి’ ప్రభాస్ హాజరుకానున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించి ప్రభాస్ ఒక్కడికే ఆహ్వానం అందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కాఫీ విత్ కరణ్ కార్యక్రమం షూటింగ్ పూర్తిచేసుకున్న ప్రభాస్ 12వ తేదీన ఈషా అంబానీ-ఆనంద్ పిరమాల్ వివాహానికి హాజరుకానున్నట్లు సమాచారం. 
 

 

16:20 - December 6, 2018

ముంబై  (మహారాష్ట్ర) : శ్రీమంతుల ఇంట్లో పెళ్లి అంటే అంతా హడావిడే. ఎక్కడ చూసినా రిచ్ లుక్సే. ఏది చేసినా ఘనంగా వుండాలి. అందరూ గొప్పగా చెప్పుకోవాలి. ఇటువంటి వివాహాలు ఎక్కడా జరగలేదబ్బా అనుకునేంత గొప్పగా..రిచ్ గా వుండాలి. దాని కోసం ఫుడ్, కాస్ట్యూమ్స్, ఎకామిడేషన్,  నుండి అన్ని అరేంజ్ మెంట్స్ అన్నీ అంటే అన్నీ ఘనంగా వుండాలి.అటువంటిది అంబానీవారింటో పెళ్లి అంటే మాటలా? ఎంతటి రిచ్ గా వుంటుందో ఊహించటానికి కూడా సాధ్యంకానంత రిచ్ గా వుండబోతోంది అంబానీగారి గారాల పట్టి ఇషా అంబాని వివాహం. 
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా వివాహం డిసెంబర్ 12న జరగనుంది. ముంబైలోని ‘ఆంటిల్లా’లో వీరి పెళ్లిని అంగరవైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు భారీ నుండి అతి భారీగా జరుగుతున్నాయి. అంబానీల ఇంట పెళ్లంటే.. ఎంత గ్రాండ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లికి ముందే కుటుంబ సభ్యులు, సన్నిహితులకు అంబానీ, పిరమాళ్ కుటుంబాలు ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలకు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదిక కానుంది. ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కోసం అతిథులను తీసుకెళ్లడానికి అంబానీ ఫ్యామిలీ 30 నుంచి 50 చార్టర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌లను ఉపయోగించనున్నట్టు సమాచారం. సాధారణ రోజుల్లో మహారాణా ప్రతాప్ విమానాశ్రయంలో రోజుకు 19 విమానాలు మాత్రమే రాకపోకలు సాగిస్తాయి. ఎన్నికల ఎఫెక్ట్, అంబానీ కూతురి ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కారణంగా ఆ విమానాశ్రయానికి రద్దీ భారీగా పెరగనుంది. ఉదయ్‌పూర్‌లో భారీ సంఖ్యలో ఫైవ్ స్టార్ హోటళ్లను కూడా అంబానీ కుటుంబం బుక్ చేసిసేసారు. ఇషా పెళ్లి వేడుకలను సెలబ్రిటీ వెడ్డింగ్ ఫొటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ తన కెమెరాలో బంధించనున్నారు. ప్రియాంక-నిక్, అనుష్క-విరాట్‌ల పెళ్లికి కూడా ఆయనే ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఉదయ్‌పూర్‌లో ప్రి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ తర్వాత ముంబైలో నాలుగు రోజులపాటు అంబానీ కూతురి పెళ్లి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. గతంలో కర్ణాటక మైనింగ్ మాఫియా కింగ్ గాలి జనార్థన్ రెడ్డి కుమార్తె వివాహం పెద్ద నోట్ల రద్దు సమయంలో జరిగినా ఎంత ఘనంగా చేశాడో తెలిసిన విషయమే. 

 

06:43 - November 9, 2018

హైదరాబాద్ : ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలు మారే నేతల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే జంపింగ్ జిలానీలు తమ గూడుకు చేరుకుంటున్న నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం రోజురోజుకూ రసవత్తరంగా మారుతోంది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అన్న కుమార్తె రమ్య సైకిల్ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె ఏపీ సీఎం చంద్రబాబును కలిసి టీడీపీలో చేరే అంశాన్ని ప్రతిపాదించారు.
గతంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న రమ్య ఆ పార్టీ నేతల వైఖరితో మనస్తాపం చెందినట్టు తెలుస్తోంది. దీంతోనే ఆమె సైకిల్ జర్నీకి సిద్ధమైనట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని టీటీడీపీ నేతలతో చర్చించిన చంద్రబాబు ఈ సమయంలో రమ్యను పార్టీలోకి తీసుకుంటే రెచ్చగొట్టినట్టవుతుందేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ వ్యాఖ్యలతో టీటీడీపీ నేతలు కూడా ఏకీభవించినట్టు తెలుస్తోంది.
 

12:47 - December 3, 2017

హైదరాబాద్ : అమ్మతనం మంటగలిసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని కసాయి తల్లి కుమార్తెను చిత్రహింసలు పెట్టింది. అభం శుభం తెలియని నాలుగేళ్ల చిన్నారిని కన్నతల్లే చిత్రహింసలు పెట్టిన ఘటన హైదరాబాద్ ఎస్సార్ నగర్‌లో వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తోందని ప్రియుడితో కలిసి కుమార్తెను వేడి పెనంపై కూర్చోపెట్టడంతో చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. 
మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

19:26 - November 14, 2017

హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కుమార్తె ఇవాంక పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌ పాతబస్తీలో భారీగా పోలీస్‌ భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమెరికా సీక్రెట్‌ సర్వీస్‌, కేంద్ర హోంశాఖ సూచనలు పరిగణలోకి తీసుకుని నగరంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఇవాంక రాకపోకల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామంటున్న సౌత్‌ జోన్‌ డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ సత్యనారాయణతో టెన్ టివి ముచ్చటించింది. మరిన్ని విశేషాలకు వీడియో క్లిక్ చేయండి. 

10:32 - May 11, 2017

మహబూబ్‌నగర్‌ : నవాబ్‌పేట మండల కేంద్రంలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్‌ఎంపీ వైద్యుడు లక్ష్మీనారాయణ, అతని భార్య అలివేలమ్మ కలిసి.. గురుకుంట దారిలో గుళికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. కూతురు సుప్రజ ఇంట్లోనే చనిపోయి ఉంది. మొదట కూతురికి విషమిచ్చి చంపి.. భార్యభర్తలు విషం తాగినట్లు తెలుస్తోంది. గ్రామంలో డాక్టర్‌గా మంచి పేరు ఉన్న ఆయనకు ముగ్గురు కూతుళ్లు.. ఓ కుమారుడు ఉన్నారు. వీరిలో ఇద్దరు కూతుళ్ల పెళ్లి జరిగింది. కొడుకు కూడా ఉద్యోగం చేస్తూ చక్కగా స్థిర పడ్డాడు. కానీ ఇంతటి దారుణానికి పాల్పడటం వెనక కారణం తెలియరాలేదు.

18:53 - December 23, 2016
20:06 - November 16, 2016

మైనింగ్‌ మాఫియాగా ఆరోపణలు..మూడేళ్లు జైలు జీవితం..బెయిల్‌పై విడుదల..ఇదీ గాలి జనార్దనరెడ్డి చరిత్ర..బుధవారం తన కుమార్తె బ్రహ్మణీరెడ్డి పెళ్లిని నభూతో అన్న రీతిలో జరిపారు. కుమార్తె వివాహం సందర్భంగా ఆహ్వాన పత్రిక ఓ సంచనలం అయ్యింది. ఇప్పుడు వివాహం..మరో సంచలనం వందల కోట్లు ఖర్చుపెట్టి వివాహం జరిపిస్తున్నారు. ఇది అసలు విషయం కాదు. కానీ పాతనోట్లను రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీంతో భారతదేశంలోని యావత్తు సామాన్యులు పాతనోట్లను మార్చుకునేందుకు..చిల్లర నోట్ల కోసం నానా పాట్లు పడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రాణాలు కూడా పోగొట్టుకునే పరిస్థితులు నెలకొన్నాయి. కానీ వందల కోట్లు ఖర్చుపెట్టే గాలి కుమార్తె వివాహం విషయంలో మాత్రం పాతనోట్ల ప్రభావం ఏమాత్రం పడకపోవటం విశేషం...మరోపక్క ఎస్బీఐ పాత మొండి బకాయి వసూళ్ళ విషయంలో చేతులెత్తేసింది. లిక్కర్ కింగ్, కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఎస్బీఐ వద్ద రూ.900ల కోట్లు అప్పు తీసుకుని విదేశాలకు చెక్కేసిన విషయం తెలిసిందే..ఈ మొత్తాన్ని వసూలు చేసుకుందుకు ఎస్బీఐ తీవ్రంగా యత్నించింది..కానీ ఇప్పుడు ఏమైందో తెలీదు గానీ విజయ్ మాల్యా అప్పుతో సహా రై.7,016 కోట్ల రుణాలు ఎత్తివేస్తూ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. దీనిపై సీపీఎం పార్టీతో పలు పార్టీలు విమర్శలు కురిపిస్తున్నాయి. ఈ అంశంపై టెన్ టీవీ చర్చను చేపట్టింది. ఈ చర్చలో దేవి(సామాజిక వేత్త), అద్దంకి దయాకర్ (టీ.పీసీసీ నేత), శ్రీధర్ రెడ్డి(బీజేపీ నేత) పాల్గొన్నారు. ఈ రెండు అంశాలపై చర్చలో పాల్గొన్న వక్తలు ఎటువంటి అభిప్రాయాలను తెలిపారో తెలుసుకోవాలంటే ఈ వీడియో క్లిక్ చేయండి..

 

12:44 - November 16, 2016

కర్నాటక : నోట్ల రద్దు నేపథ్యంలో.. పెద్దమొత్తాలను మార్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పెళ్లిళ్ల కోసం కూడబెట్టిన... అనేక మంది సామాన్యులు..చేసేది లేక వివాహాలను వాయిదా వేసుకున్నారు. మరికొందరైతే ఏకంగా పెళ్లిళ్లను రద్దు చేసుకున్నారు. కానీ... ఓ వీఐపీ కుమార్తె వివాహం మాత్రం కోట్ల రూపాయల ఖర్చులతో అంగరంగ వైభవంగా జరగుతోంది. నల్లధనం ఇబ్బందులు సామాన్యులకే తప్ప.. సంపన్నులకు కాదనే విషయాన్ని ఈ వివాహం మరోసారి రుజువు చేస్తోంది. ఇంతకీ.. ఎవరిదా వివాహం...?  అనే కదా మీ డౌట్‌... అయితే మీరీ స్టోరీ చూడాల్సిందే...! 
రూ. 4 వేలు విత్ డ్రా చేసుకునేందుకు సామాన్యుల తిప్పలు 
నాలుగు వేల రూపాయలు బ్యాంకు నుంచి విత్‌ డ్రా చేసుకోవాలంటే.. సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. పరిమిత మొత్తంలో నగదు డ్రా చేసుకునేందుకే బ్యాంకులు ఆంక్షలు విధించడంతో... చాలామంది పెద్ద మొత్తంలో లావాదేవీలు జరపలేక.. అన్ని పనుల్ని వాయిదా వేసుకున్నారు. కొందరైతే.. అప్పటికే నిశ్చితార్థం అయిన పెళ్లిళ్లను వాయిదా వేసుకుంటే... మరికొందరు.. వాటిని రద్దు చేసుకున్నారు. అయితే... మాజీ మంత్రి గాలి జనార్ధన్‌రెడ్డి కుమార్తె వివాహం మాత్రం అంగరంగవైభవంగా కోట్ల రూపాయల ఖర్చుతో సాఫీగా జరగబోతోంది. అందరూ ఆశ్చర్యపోయేలా ఇప్పటికే.. ఖరీదైన శుభలేఖలు పంచిన గాలి జనార్దన్‌రెడ్డి... కోట్ల రూపాయలు ఖర్చు చేసి కుమార్తె వివాహం ఘనంగా జరుపుతున్నారు. 
50 వేల మంది గెస్ట్‌లు హాజరు... 
గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె వివాహానికి దాదాపు 50 వేల మంది గెస్ట్‌లు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా..రాజకీయ నేతలు, సినీతారలు, వీవీఐపీలు ఈ వేడుకల్లో పాల్గొనబోతున్నారు.  వేడుకలకు వచ్చే అతిథులకు అన్ని ఏర్పాట్లు చేయాలంటే కోట్ల రూపాయల ఖర్చు ఉంటుంది. మరి ఎలాంటి ఆటంకాలు లేకుండా... వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న గాలి జనార్దన్‌రెడ్డికి .. నగదు ఎలా సమకూరుతోందన్న ప్రశ్నలు సామాన్యుడిని తొలచివేస్తున్నాయి. దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని బయటకు చెబుతున్నప్పటికీ.. ఆ ఖర్చు ఇంకా భారీ మొత్తంలోనే ఉంటుందనేది అంచనా. మరి.. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పెళ్లి ఖర్చులకు.. గాలికి ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎలా సమకూరుతోందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద నోట్ల ఇక్కట్లు సామాన్యులకే తప్ప.. సంపన్నులకు కాదన్న మాట అని జనం గుసగుసలు పోతున్నారు. 
పెళ్లికి హాజరు కావద్దని బీజేపీ నేతలకు అధిష్టానం ఆదేశాలు
మరోవైపు ...గాలిజనార్దన్ రెడ్డి కుమార్తె బ్రహ్మిణి వివాహ వేడుకలకు హాజరు కావద్దని రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు విశ్వసనీయంగా సమాచారం. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు యడ్యూరప్పకు ఫోన్ చేసి ఈ విషయంపై స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. గాలి కుమార్తె వివాహానికి హాజరు కావాలా..? వద్దా...? అని సతమతమవుతున్న బీజేపీ నేతలు అధిష్ఠానం ఆదేశాలతో వెనక్కు తగ్గే అవకాశముంది. కోట్ల రూపాయల నల్లధనం వెచ్చించి గాలిజనార్దన్ రెడ్డి తన కుమార్తె వివాహం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఈ వివాహానికి బీజేపీ నేతలు హాజరైతే..ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపే ప్రమాదం ఉందని అధిష్టానం పేర్కొన్నట్లు తెలుస్తోంది. అటు కాంగ్రెస్‌ నాయకత్వం కూడా పార్టీ కర్నాటక శ్రేణులకు ఇదే తరహా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. గాలి ఇంట వివాహానాకి రాజకీయ ప్రముఖులే కాదు.. గల్లీ నాయకులు కూడా హాజరయ్యే పరిస్థితి కనిపించడం లేదంటున్నారు. మరి ఈ పెళ్లికి ఎవరెవరు వస్తారో..? ఎంత గ్రాండ్‌గా జరుగుతుందో మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. 

 

15:28 - October 19, 2016

కర్ణాటక : మాజీమంత్రి గాలి జనార్థన్ రెడ్డి తన కూతురు పెళ్లిని కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించనున్నారు. కేవలం ఒక్క శుభలేఖ ఆరువేల రూపాయలతో డిజైన్ చేయించాడు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి దీన్ని రూపొందించాడు. ప్రముఖులకు, సెలబ్రిటీలకు ఈ కార్డును పంపే తీరు కూడా వెరైటీగా వుంది. ఓ బాక్సులో చిన్న ఎల్‌ సీడీ స్క్రీన్, ఆటోప్లే వీడియో, స్నికెట్‌తో కూడిన ఒక నిమిషం నిడివి‌గల వీడియో గల కార్డు ఇది. ఈ వీడియోలో గాలి ఫ్యామిలీ మొత్తం కనిపించింది. గాలి కుటుంబసభ్యులు ప్రత్యేకంగా కంపోజ్ చేయించిన ఓ కన్నడ సాంగ్‌ ఇందులో హైలైట్. 

Pages

Don't Miss

Subscribe to RSS - కుమార్తె