కృష్ణార్జున యుద్ధం

19:27 - April 14, 2018

సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా సినిమాలతో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న మేర్లపాక గాంధీ కృష్ణార్జున యుద్ధం సినిమాలో రియల్ స్టార్ నానితో డ్యుయల్ రోల్ చేయించి మరో బిగ్గెస్ట్ సక్సెస్ ను అందుకున్నాడు. ఈ సినిమాలో మాస్ క్యారెక్టర్ లో చిత్తూరు జిల్లా యాసతో నాని చితక్కొట్డాడు. ఆ యాసతో ఇప్పటివరకూ పెద్దగా సినిమాలు రాలేదు. దాన్ని గమనించిన గాంధీ తన స్థానిక యాసతో మరో హిట్ ను కాదు కాదు బిగ్గెస్ట్ హిట్ ను అందుకున్నాడు. ప్రముఖ సినీ రచయిత మేర్లపాక మురళికి గాంధీ కుమారుడు కూడా. చిత్తూరు జిల్లా, రేణిగుంట మండలం, వెదుళ్ళచెరువు గ్రామంలో జన్మించిన గాంధీ..సినిమాలపై వున్ ఆసక్తితో చెన్నైలోని ఎల్. వి. ప్రసాద్ సంస్థలో సినిమా రంగానికి చెందిన మెలకువలు నేర్చుకున్నాడు. ఆ తర్వాత హైదరాబాదుకు వచ్చి 2013 లో వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమాతో దర్శకుడిగా ప్రయానం ప్రారంభించి తన ప్రతిభతో వరుస హిట్స్ ను అందుకుంటున్నాడు. తండ్రి మేర్లపాక మురళి ప్రముఖ రచయిత మరియు విలేఖరి. ప్రముఖ వార్తా పత్రిలకు పనిచేశాడు. ఆయన రాసిన 24 నవలలు స్వాతి వారపత్రికలో ప్రచురించబడ్డాయి. ఈయనకు చే గువేరా అంటే అభిమానం ఉండటంతో కుమారుడికి అదే పేరు పెట్టాడు, కానీ ఊర్లోని వాళ్ళకి ఆ పేరు పలకడం చేతకాకపోవడంతో అతని ఐదో యేట గాంధీ అని పేరు మార్చాడు. 

19:28 - April 12, 2018

వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని ఈసారి ఏకంగా డ్యూయల్ రోల్ లో కృష్ణార్జున యుద్ధం అనే సినిమా చేశాడు.. నాని హీరోగా, రెండు హిట్లు ఇచ్చిన.. మెర్లపాక గాంధి డైరక్టర్ గా మంచి రైజింగ్ లో ఉన్న దిల్ రాజు.. రిలీజ్ అనగానే ఈ సినిమా గ్యారంటీగా సక్సెస్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్.. మరి ఆ రేంజ్ అంచనాలతో థియేటర్స్ లోకి వచ్చిన కృష్ణార్జునుడు ఏ రేంజ్ సక్సెస్ అందుకున్నాడు.. వాళ్ల యుద్ధం లో ఎలాంటి సక్సెస్ సాధించాడు ఇప్పుడు చూద్దాం..

 

కథ విషయానికి వస్తే.. ఒక మారుమూల పల్లెటూరిలో ఆడుతూ పాడుతూ జీవితాన్ని గడివేసే కృష్ణను అతని బిహేవియర్ వల్ల ఏ అమ్మాయి ప్రేమించదు..కాని హైదరాబాద్ నుండి వచ్చిన రియా కృష్ణను ప్రేమిస్తుంది... అలాగే యూరప్ లో రాక్ స్టార్ గా ఉన్న అర్జున్ ప్లే భాయ్.. కాని ఇండియా నుండి వచ్చిన సుబ్బలక్ష్మీని చూసి సిన్సియర్ గా లవ్ చేస్తాడు.. కాని ఆమె అర్జున్ ను రిజక్ట్ చేసి హైదరాబాద్ కి వస్తుంది... ఇక రియాతో కూడా కృష్ట నీకు కరెక్ట్ కాదు అని, ఆమెను బలవంతంగా హైదరాబాద్ కు పంపిస్తాడు వాళ్ళ తాత.. అలా హైదరాబాద్ వచ్చిన రియా, సుబ్బలక్ష్మీ ఇద్దరూ కనపడకుండా పోతారు.. అసలు వాళ్ళు ఏమైయ్యారు... కృష్ణ, అర్జున్ ఇద్దరూ ఎలాంటి పరిస్థితుల్లో కలుసుకున్నారు.. చివరికి రియా,సుబ్బలక్ష్మీలను ఎలా కాపాడుకున్నారు.. లాంటి విషయాలు సినిమా చూసి తెలుసుకోవలసిందే..

 

నటీనటుల విషయానికి వస్తే.. మినిమమ్ కంటెంట్ ఉన్న సినిమాను కూడా తన నాచ్యూరల్ ఫర్ఫామెన్స్ తో నిలబెట్టేస్తాడు అనే పేరున్న నాని,... ఈ సినిమాలో కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు.. కెరీర్ లో రెండో సారి డ్యూయల్ రోల్ చేసిన నాని రెండు పాత్రల మధ్య వేరియేషన్స్ చూపిస్తూ.. ఆ రెండు పాత్రలను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి చాలా హర్డ్ వర్క్ చేశాడు.. అయితే... కృష్ట పాత్రలో కల్లకపటం లేని పల్లెటూరి.. అబ్బాయిగా ఒదిగిపోయి.. ఫుల్ ఫన్ ను జనరేట్ చేసిన నాని.. ప్లేబయ్ తరహా రాక్ స్టార్ గా మాత్రం అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు.,. అతనికి ఉన్న నాచ్యూరల్ స్టార్ అనే టాగ్ వల్ల.. రాక్ స్టార్ క్యారక్టర్ లో ఉన్న నెగెటీవ్ టచ్.. అంతగా ఎలివేట్ కాలేదు.. ఇక స్టైలింగ్ కూడా చాలా సాధాసీదాగా అనిపిస్తుంది.. కృష్ట పాత్ర మాత్రం సినిమాను కాపాడే ఎలిమెంట్ గా నిలిచింది.. ఇక ఇప్పటి వరకు పర్ఫామెన్స్, క్యారక్టర్ లో అలరించిన అనుపమా పరమేశ్వరన్ లిమిటెడ్ ప్రజన్స్ ఉన్న రోల్ లో కనిపించింది... మరో హీరోయిన్ రుక్సార్ మీర్ కూడా స్క్రీన్ ప్రజన్స్ పరంగా, పర్ఫామెన్స్ పరంగా.. జస్ట్ ఓకే అనిపిస్తుంది.. ఇక గాంధీ సినిమాలకు కామెడీ బ్యాక్ బోన్ గా మంచి సపోర్ట్ ఇస్తున్న బ్రహ్మాజీ ఈ సినిమాలో కూడా హిల్లేరియస్ కామెడీని జనరేట్ చేసే క్యారక్టర్ పడటంతో, ఆ పాత్రకు అతను పూర్తి న్యాయం చేశాడు.. అతను చేసిన కామెడీ ఫస్ట్ ఆఫ్ కి హైలెట్ అని చెప్పవచ్చు.. ఇక యూట్యూబ్ స్టార్స్ కాస్త ఇంపార్టెట్స్ ఉన్న క్యారక్టర్స్ లో కనిపించి.. పర్వాలేదు అనేలా నవ్వించారు.. ఇక మిగతా నటీనటులు అంతా, పాత్రల పరిది మేరా డీసెంట్ పర్ఫామెన్స్ ఇచ్చారు...

 

ఇక టెక్నీషియన్స్ విషయానికి వస్తే.. రైటర్ గా డైరక్టర్ గా మొదటి రెండు సినిమాలతో గ్రాండ్ హిట్స్ అందుకున్న గాంధీ ఈ సినిమాకు కూడా మంచి స్పానూ ఉన్న స్టాండెడ్స్ సెంట్రల్ పాయింట్ ను కథగా ఎంచుకున్నాడు.. కాని మొదటి రెండు సినిమాలలా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడం కాని, టెంపోను మెంటేయిన్ చేయడంలో కాని బాగా తడబడ్డాడు. ఫస్ట్ ఆఫ్ సినిమాను నాని నిలబెట్టలేసినా... రెండో ఆఫ్ వచ్చేసరికి.. ఊహాజనితమైన కథ. సో సో గా సాగే స్క్రీన్ ప్లేతో సినిమా సైడ్ ట్రాక్ అయిపోయింది.. రచయితగా అక్కడక్కడా మెరిసిన గాంధీ..డైరక్టన్ పరంగా ఓకే అనిపించుకున్నాడు... స్క్రీన్ ప్లే పంరంగా మరింత కసరత్తు చేసి ఉంటే బెటర్ రిజల్ట్ వచ్చి ఉండేది,.. ఇక డైరక్టర్స్ కి ఫుల్ సపోర్డ్ ఇచ్చే. వ్యూ ఉన్న కెమేరా మెన్ కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమా విజ్యూవల్స్ పరంగా ఫుల్ క్రెడిట్ ఇవ్వచ్చు.. రెండు క్యారక్టర్స్ మధ్య వేరియేషన్స్ చూపించడంలో, యూరప్ అందాలను కెమేరాలో బంధించడంలో, క్యారక్టర్స్ లోని ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ చేయడంలో.. అతను పెట్టిన ఎఫర్ట్ స్క్రీన్ పై కనిపించింది.. ఇక మ్యూజిక్ డైరక్టర్ హిప్ హాప్ తమిళ్ ఈ సినిమాకు కాస్త తమిళ్ టచ్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు.. దృవ సినిమాకు తన మ్యూజిక్ తో మంచి హైప్ తెచ్చిన హిప్ హాప్ తమిళ్ ఈ సినిమా వరకు మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయాడు.. పాటలలో తమిళ వాసన, ఆర్ ఆర్ లో రొటీన్ నెస్ కనిపించాయి.. ఆర్ట్స్ డైరక్టర్ సాయి సురేష్.. ఎడిటర్ సత్య తమ క్రాఫ్ట్స్ లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు.. నిర్మాణ విలువలు బాగున్నాయి..

ఓవర్ ఆల్ గా చెప్పాలి అంటే.. ఒక క్యారక్టర్ తోనే సినిమాను నిలబెట్టేసే నాని.. ఈ సినిమాలో రెండు క్యారక్టర్స్ చేసినప్పట్టికీ.. పెద్దగా ఇంపాక్ట్ లేని కథ. ఊహాజనితమైన స్క్రీన్ ప్లే ఉండటంలో అక్కడక్కడ చూస్తూ ఉండిపోవలసి వచ్చింది.. తనకు స్కోప్ ఉన్నంతలో బెస్ట్ప్ పర్ఫమెన్స్ ఇచ్చిన నాని ప్రయత్నం.. ఎంత వరకు మైలేజ్ ఇస్తుందో, బాక్సీఫీస్ దగ్గర ఎలాంటి ఫలితం వస్తుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే..

 

 

ప్లస్ పాయింట్స్

కృష్ట క్యారక్టరైజేషన్

కెమెర వర్క్

బ్రహ్మాజీ కామెడి

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్

రొటీన్ కథ

అర్జున్ క్యారక్టర్

మెరుపులు లేని స్క్రీన్ ప్లే

పేలని విలేజ్ కామెడి

 

11:45 - April 1, 2018

చిత్తూరు : తిరుమలకు రాజకీయ, సినీ ప్రముఖులు విచ్చేశారు. ఆదివారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకున్నారు. ఏపీ రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుటుంబసభ్యులు..వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, యాంకర్ సుమ, ‘కృష్ణార్జున యుద్ధం' చిత్ర టీమ్ శ్రీవారిని దర్శించుకున్నారు. ‘కృష్ణార్జున యుద్ధం' సినిమా రిలీజ్ నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, మొదటి టికెట్ శ్రీవారికి ఇచ్చినట్లు హీరో నాని పేర్కొన్నారు. సినీ ప్రముఖులతో ఫొటోలు దిగడానికి..కరచాలనం చేయడానికి అభిమానులు ఆసక్తి కనబర్చారు.

12:00 - December 31, 2017

'నాని'...టాలీవుడ్ దర్శక..నిర్మాతలకు వరంగా మారిపోయాడు. ఆయన నటించిన సినిమాలన్నీ వరుసగా విజయవంతమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన నటించిన 'ఎంసిఏ' మిడిల్ క్లాస్ అబ్బాయి చిత్రం డివైడ్ టాక్ పొందినా భారీగా కలెక్షన్లు సాధిస్తూ ముందుకెళుతోంది. ఈ సినిమా షూటింగ్ కొనసాగుతుండగానే 'మేర్లపాక గాంధీ' చిత్రంలో కూడా నాని నటిస్తున్నాడు. ఇందులో నాని డబుల్ రోల్ పాత్ర పోషిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ సినిమాకు 'కృష్ణార్జున యుద్ధం' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. బోయనపల్లి సమర్పణలో షైన్‌ స్క్రీన్న్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మిస్తున్నారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌', 'ఎక్స్‌ప్రెస్‌ రాజా' చిత్రాల దర్శకుడు మేర్లపాక దర్శకత్వంలో సినిమా తెరకెక్కుతోంది. వెంకట్‌ అనుపమ పరమేశ్వరన్‌, రుఖ్సార్‌ మీర్‌ నాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకొంటోంది. ఈ షెడ్యూల్ లో కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో చిత్ర షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్‌ 12న గ్రాండ్‌ రిలీజ్‌ చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. 

10:54 - December 28, 2017

నాని డ్యూయల్ రోల్ లో నటిస్తున్న చిత్రం 'కృష్ణార్జున యుద్ధం' ఈ మూవీ ఏప్రిల్ 18, 2018లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాని మేర్లపాక గాంధీ తెరకెక్కిస్తున్నారు. సంగీత దర్శకుడిగా హిప్ హాప్ తమిజా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాని వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. ఇందులో నాని సరసన అనుమప పరమేశ్వరన్ నటిస్తున్నారు. 

12:45 - August 10, 2017

టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరైన 'నాని'తో చిత్రం చేయాలని దర్శక..నిర్మాతలు ఆలోచిస్తుంటారు. ఎందుకంటే 'నాని' బంగారు బాతుగా పోలుస్తుంటారు. ఆయన నటించిన సినిమాలు వరుసగా విజయవంతమౌతున్న సంగతి తెలిసిందే. నేచురల్ స్టార్ గా పేరొందిన ఈ నటుడు మళ్లీ బిజీ బిజీ అయిపోతున్నాడు.

'నేను లోకల్'తో బ్లాక్ బస్టర్ కొట్టిన 'నాని'..'నిన్ను కోరితే' మరో సూపర్ హిట్ కొట్టేశాడు.  'నిన్ను కోరి' సెట్స్ పై ఉండగానే 'ఎంసీఏ' కథ విని షూటింగ్ కూడా మొదలెట్టేశాడు. ఈ షూటింగ్ చివరి దశకు వచ్చిందని తెలుస్తోంది. 'దిల్' రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో 'సాయి పల్లవి' హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మేర్లపాక గాంధీతో ఓ చిత్రానికి 'నాని' సైన్ చేశాడు. ఈ సినిమాకు 'కృష్ణార్జున యుద్ధం' టైటిల్ ను ఫిక్స్ చేశారు. సైలెంట్ గా షూటింగ్ ను మొదలు పెట్టారు. ప్రస్తుతం పొలాచ్చీలో షూటింగ్ కొనసాగుతోంది. చిత్రంలో 'నాని' కృష్ణా..అర్జున్ గా ద్విపాత్రాభినయం చేస్ఉతన్నాడని సమాచారం. ఈ సినిమా అనంతరం హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాలో 'నాని' నటించబోతున్నాడు..మొత్తానికి వరుస చిత్రాలతో 'నాని' ఫుల్ బిజీగా మారిపోతున్నాడు. 

Don't Miss

Subscribe to RSS - కృష్ణార్జున యుద్ధం