కేంద్రం

18:19 - February 23, 2018

తూర్పుగోదావరి : మార్చి 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో తమ పార్టీ సభ్యులు రాజీనామ చేసే ప్రసక్తే లేదని టిడిపి కాకినాడ ఎంపీ తోట నర్సింహం కుండబద్ధలు కొట్టారు. ఇప్పటికే తాము రాజీనామా చేస్తామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రజా సమస్యలు కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు తమకు ఐదేళ్లు అధికారం ఇచ్చారని దానిని మధ్యలో విస్మరించమన్నారు. విభజన హామీలపై కేంద్రంపై వత్తిడి తీసుకొస్తామన్నారు. ఏప్రిల్ 6వ తేదీన వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేయడం ఎలాంటి ప్రయోజనం లేదని...వైసీపీ పార్టీది ఒక డ్రామా అని అభివర్ణించారు. 

08:04 - February 18, 2018

కేంద్రంలోని బీజేపీ ఏపీని అన్ని విధాల మోసం చేసిందని వక్తలు అన్నారు. బీజేపీ, టీడీపీ మైత్రి బంధం చివరిదశకు వచ్చిందా ? అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శి వర్గసభ్యులు బాబూరావు, టీడీపీ నేత గొట్టిపాటి రామకృష్ణ, వైసీపీ నేత శ్రీనివాస్ పాల్గొని, మాట్లాడారు. బీజేపీ... రాష్ట్రాల మీద పెత్తనం చెలాయిస్తూ... నిరంకుశ ధోరణి అవలంభిస్తోందని విమర్శించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రంపై టీడీపీ ఒత్తిడి తేవాలన్నారు. కేంద్రంతో సాగిలపడిపోవడం టీడీపీకి తగదన్నారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

22:09 - February 15, 2018

ఢిల్లీ : కృష్ణా రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు, గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్ బోర్డు పరిధి నిర్ణయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఢిల్లీలో జరిగిన ఏపీ, తెలంగాణ నీటిపారుదల మంత్రులు, అధికారుల సమావేశంలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీపై చర్చించారు. ఏపీ పునర్విభజన చట్టంలో ఉన్న విధంగా ఈ రెండు నదుల పరిధిని తేల్చాలని ఏపీ కోరింది. అలాగే దశాబ్దం క్రితం ప్రారంభించిన ఎనిమిది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. 
 

10:16 - February 15, 2018

విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మరో వార్త సంచలనంగా మారబోతోంది. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఏపీలో కాపు రిజర్వేషన్లకు కేంద్రం బ్రేకులు వేసింది.

కాపులకు రిజర్వేషన్ లు కల్పిస్తామని ఎన్నికల్లో టిడిపి హామీనిచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కాపు ఉద్యమ నేత ముద్రగడ పలు పోరాటాలు..ఆందోళనలు నిర్వహించారు. వివిధ ఆందోళనలు..విమర్శల నేపథ్యంలో జస్టిస్ మంజునాథ కమిషన్ ఏర్పాటు చేసింది. ఈ నివేదిక అందించిన అనంతరం అసెంబ్లీలో కాపులలను బీసీల్లో చేర్చుస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని కేంద్రానికి పంపించింది.

కాపులకు రిజర్వేషన్లను కల్పిస్తూ ఏపీ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును కేంద్రం నిలిపివేసింది. రిజర్వేషన్లపై కేంద్ర సిబ్బంది..శిక్షణ వ్యవహారాల శాఖ అభ్యంతరం తెలిపింది. కాపుల రిజర్వేషన్ కు చెందిన లేఖలో ఏపీ ప్రభుత్వం అని రాయాల్సిన చోట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అని రాయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ లేఖ అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి అధికారులు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే సుప్రీం ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం మించొద్దని డీవోపీసీటీ సూచించింది. రిజర్వేషన్లపై ఏపీ రాష్ట్రం సరైన ప్రాతిపదికగా చెప్పలేదని పేర్కొంటోంది. కేంద్రం తాజా నిర్ణయంతో టిడిపి..బిజెపి మధ్య మరింత చిచ్చు రేగడం ఖాయమని తెలుస్తోంది.

06:27 - February 15, 2018

హైదరాబాద్ : తెలంగాణా ప్రభుత్వం కూడా కేంద్రంపై ఒత్తిడి పెంచే మార్గాలపై దృష్టి సారించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన గులాబి పార్టీ....ఇప్పుడు రాష్ట్రంపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్న వాదనను తెరపైకి తెస్తోంది. ఇప్పటికే కేంద్రంపై ఏపీ విరుచుకు పడుతుండడగా.. అదేబాటలో తెలంగాణా కూడా నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సాధారణ ఎన్నికలకు ఏడాది ఉండగానే తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆంధ్రప్రదేశ్‌లో రేగిన రాజకీయ దుమారం తెలంగాణకు కూడా పాకుతోంది. ప్రత్యేక హోదా అంశం ఏపీలో హీట్ పుట్టిస్తుండగా.. నిధుల కేటాయింపు, విభజన చట్టంలోని హామీలు తెలంగాణాలోనూ ఇప్పుడు హాట్‌హాట్‌గా తెరపైకి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలకు అంశాల వారిగా సంపూర్ణ మద్దతు తెలిపిన గులాబి పార్టీ ఇప్పుడు కేంద్రం వైఖరిని ఎండగట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అదనంగా ఎలాంటి నిధులు కేటాయించలేదన్న వాదనను తెరపైకి తెచ్చిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు కేంద్ర వైఖరినే ఎండగట్టేందుకు రెడీ అవుతున్నట్లు కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కారణంగానే తెలంగాణా రాష్ట్రంలో పలు సమస్యలకు కారణమనే అభిప్రాయాన్ని మంత్రులు బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర నిధులు అందకపోవడంతో కంది రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నారు మంత్రి హరీష్‌రావు. ఇందుకనుగుణంగానే మరో మంత్రి NREGS నిధుల విడుదలలో కేంద్రం తీవ్రంగా జాప్యం చేస్తోందని, ఈ కారణంగానే ఉపాధి హామీ కూలీలకూ జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి క్రిష్ణారావు. రెండో విడత బడ్జెట్ సమావేశాలు మార్చిలో మొదలు కానున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను గుర్తించే పనిలో అధికార పార్టీ నేతలు పడ్డట్లు తెలుస్తోంది. పునర్విభజన చట్టం ప్రకారం హామీలు అమలు చేయకపోవడంపై కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్ పూర్తిస్థాయిలో విరుచుకు పడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

19:32 - February 11, 2018
18:59 - February 11, 2018

ఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు తిరిగి వచ్చిన పాత నోట్ల లెక్కలు ఇంకా తేలలేదు. పెద్ద నోట్లు రద్దైన 15 నెలల తర్వాత కూడా వీటి లెక్కింపు ఇంకా కొనసాగుతూనే ఉందని సమాచార హక్కు చట్టం కింది ఓ పిటిషనర్‌కు ఆర్‌బీఐ సమాధానం ఇచ్చింది. ఎప్పటిలోగా లెక్కింపు పూర్తి అవుతుందన్న పిటిషనర్‌ ప్రశ్నకు ఆర్‌బీఐ సమాధానం ఇవ్వలేదు. మొత్తం 59 సీవీపీఎస్‌ యంత్రాలతో లెక్కింపు కొనసాగుతున్నట్టు సమాచారం ఇచ్చింది. గత ఏడాది జూన్‌ 30 నాటికి 15.28 లక్షల కోట్ల రూపాయల రద్దయిన నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. నోట్లు రద్దు నాటికి 1716.5 కోట్ల 500 రూపాయల నోట్లు, 685.8 కోట్ల వెయ్యి రూపాయల నోట్లు చలామణిలో ఉన్నాయి. 

12:44 - February 9, 2018

ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచెయ్యి చూపిందని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. ఏపీ ప్రజలను కేంద్రం మోసం చేసిందని విమర్శించారు. ఏపీ ప్రజలు నిరాశపడ్డారని తెలిపారు. కేంద్రం రాష్ట్రాన్ని చాలా నిరాశపర్చిందన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు పర్చాలని కోరుతున్నామని చెప్పారు. ఏపీకి జరిగిన అన్యాయంపై తాము అంశాల వారిగా ఆందోళన చేశామని తెలిపారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామ్యంగా ఉందని... ఏపీ రాష్ట్రంలో బీజేపీ భాగస్వామ్యంగా ఉందన్నారు. 

 

17:33 - February 8, 2018

ఢిల్లీ : ఏపీకి విభజన హామీలు నెరవేర్చలేదని.. బడ్జెట్‌లో అన్యాయం జరిగిందని.. ఆందోళనలు జరుగుతున్న వేళ.. కేంద్రం స్పందించింది. ఏపీకి కీలకమైన పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులపై దృష్టిపెట్టింది. ప్రాజెక్టుకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 417కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు కేంద్ర జలవనరుల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది.

 

12:39 - February 7, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌లో ఇవాళ కూడా ఏపీ ఎంపీల ఆందోళనలు కొనసాగనున్నాయి. విభజన హామీల అమలుపై ఇంకా స్పష్టత వచ్చే వరకు ఆందోళన చేస్తామని ఎంపీలు స్పష్టం చేస్తున్నారు. మరోవైపు కాసేపట్లో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో వైసీపీ ఎంపీలు భేటీ కానున్నారు. అలాగే భవిష్యత్‌ వ్యూహంపై సుజనాచౌదరి నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - కేంద్రం