కేంద్ర ప్రభుత్వం

11:34 - August 11, 2018

హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు టీఆర్‌ఎస్‌ చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. కేంద్రం తీసుకునే నిర్ణయాలకు మద్దతు తెలుపుతున్నా.... అక్కడి నుంచి ఎలాంటి సపోర్ట్‌ లభించడం లేదు. బీజేపీ, టీఆర్‌ఎస్‌ బంధం బలపడుతుందని అందరూ భావిస్తున్నా..... కేంద్రం మాత్రం ఏమీ తేల్చడం లేదు. చివరికి బైసన్‌పోలో గ్రౌండ్‌ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణే అవలంభిస్తోంది. 
రూటు మార్చిన టీఆర్‌ఎస్‌  
విభజన హామీల అమలుకు కేంద్రం ప్రభుత్వంపై విరుచుకుపడ్డ టీఆర్‌ఎస్‌ రూటు మార్చింది. కేంద్ర ప్రభుత్వంతో దగ్గరయ్యేందుకు ప్రయత్నించింది.  కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అయినా జాతీయ స్థాయి రాజకీయాలపై ఆసక్తితో సీఎం కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కాంగ్రెస్‌, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా వేదిక ఏర్పాటు చేసే ప్రయత్నాలను కూడా చేశారు.  కానీ ఇటీవల కేసీఆర్‌ అనుసరిస్తున్న విధానాలు మాత్రం బీజేపీకి సన్నిహితంగా టీఆర్‌ఎస్‌ ఉంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మొన్న జరిగిన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో... ఏన్డీఏ మద్దతు ఇచ్చిన అభ్యర్థికే టీఆర్‌ఎస్‌ కూడా సపోర్ట్‌ చేసింది.  దీంతో బీజేపీకి గులాబీ పార్టీ మరింత దగ్గరయ్యిందన్న విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చిది.
తెలంగాణ సర్కార్‌ ప్రతిపాదనలకు నో గ్రీన్‌సిగ్నల్‌
టీఆర్‌ఎస్‌ కేద్ర ప్రభుత్వానికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి గులాబీ పార్టీ ప్రతిపాదనలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వకపోవడాన్ని  గులాబీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.  కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చేది లేదని తేల్చిచెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. గులాబీ పార్టీ అధికారంలోకి వచ్చి నాటి నుంచి రక్షణశాఖ భూములను , రా ష్ట్రప్రభుత్వానికి కేటాయించాలని కోరుతోంది.  ఆ భూములలో సచివాలయంతోపాటు మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుంది. నాలుగేళ్లుగా ఈ వ్యవహారాన్ని కేంద్రం తేల్చలేకపోతోంది. బెంగళూరులో రక్షణ శాఖ భూములను కర్నాటక ప్రభుత్వానికి కేటాయించడం, తెలంగాణలో కేటాయించకపోవడం దేనికి సంకేతాలన్న ప్రశ్నలు అధికారపార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి. కేంద్రంతో సయోధ్యగా వ్యవహరించినా... అనుకున్న స్థాయిలో సహకారం అందడంలేదన్న అభిప్రాయాన్ని గులాబీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా విభజన హామీలు కూడా పూర్తిస్థాయిలో అమలుకాకపోవడానికి కేంద్ర ప్రభుత్వమే కారణమన్న వాదనను వారు తెరపైకి తీసుకొస్తున్నారు.

 

08:13 - August 10, 2018

హైదరాబాద్ : ఇన్నాళ్లూ బీజేపీకి దూరంగా ఉన్నామని కలరింగ్‌ ఇచ్చిన గులాబీ పార్టీ.... ఇప్పుడు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగానే ఉన్నామన్న సంకేతాలు ఇస్తోంది. గతంలో జరిగిన విషయాలు ఎలా ఉన్నా.... తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు.. కేంద్రంతో తమకు సన్నిహిత సంబంధాలే ఉన్నాయని గులాబీపార్టీ చెప్పకనే చెబుతోంది. రాజకీయంగా కూడా బీజేపీతో ఇబ్బంది ఉండదన్న అభిప్రాయం గులాబీ నేతల్లో వ్యక్తమవుతోంది.
బీజేపీకి అనుకూలంగా టీఆర్ ఎస్ 
కేంద్ర ప్రభుత్వంతో తెలంగాణ సర్కార్‌ దోస్తీ కడుతుందా అంటే... అవుననే సమాధానమే వినిపిస్తోంది. రాష్ట్రప్రయోజనాల కోసమంటూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలను ఇప్పటికే కేసీఆర్‌ పలు సందర్భాల్లో సమర్ధించారు.  ఇప్పుడు రాజకీయంగా కూడా బీజేపీకి అనుకూలంగానే వ్యవహరిస్తున్నారన్న విమర్శలు తెరపైకి వస్తున్నాయి. ఫెడరల్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించినా... ఫ్రంట్‌ కార్యకలాపాలు పెద్దగా కనిపించలేదు. కానీ అదే స్థాయిలో కేంద్ర ప్రభుత్వానికి  కేసీఆర్‌ పరోక్షంగా మద్దతిస్తూ .. తమకు ప్రత్యర్థిగా భావిస్తున్న కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో మరింత ఇరకాటంలో పెట్టేందుకు పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి మద్దతు
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలో ఉన్న నేతకు టీఆర్‌ఎస్‌ సంపూర్ణ మద్దతునిచ్చింది. ఎన్నికల్లో పాల్గొని ఆయనకు టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఓటేశారు.  అయితే ఇందుకు కొత్త కథ చెబుతోంది. బీజేపీ అభ్యర్థి బరిలో లేకపోవడంతోనే తాము మద్దతు ఇచ్చామన్న వాదనను అధికారపార్టీ నేతలు ముందుకు తీసుకొస్తున్నారు. ఎన్డీయే తరపున అభ్యర్థియే కదాని ప్రశ్నిస్తే మాత్రం వారి దగ్గర సమాధానం లేదు.
కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసిన టీఆర్‌ఎస్‌
ఒకవైపు బీజేపీకి పరోక్షంగా మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్‌.. కాంగ్రెస్‌ను టార్గెట్‌ చేసింది.  అంతేకాదు... తెలంగాణలో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ టూర్‌ను అడ్డుకునేందుకు గులాబీపార్టీ అనుబంధ విభాగాలు సిద్ధమవుతున్నాయి. రాహుల్‌ తెలంగాణ పర్యటనలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ సందర్శించనున్నారు. అక్కడి విద్యార్థుల సమస్యలను తెలుసుకోనున్నారు. అయితే ఓయూలో రాహుల్‌ గాంధీని అడ్డుకుంటామని టీఆర్‌ఎస్‌వీ నేతలు హెచ్చరిస్తున్నారు. రాజకీయాలు చేసేందుకు యూనివర్సిటీలు వేదికలు కాబోవని టీఆర్‌ఎస్‌వి నేతలు అంటున్నారు.  శనివారం ఓయూలోని కొన్ని విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని టీఆర్‌ఎస్‌వీ నిర్ణయించింది. మొత్తానికి  జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీతో  టీఆర్‌ఎస్‌ విభేదిస్తూనే... బీజేపీకి దగ్గరవుతుందన్న సంకేతాలు ఇస్తోంది. రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌కు ఎక్కడా ఎలాంటి అవకాశం ఇవ్వరాదన్న యోచనలో ఉంది.

 

08:23 - August 8, 2018

 ప్రకాశం : రాష్ట్రాన్ని మోసం చేసిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై పోరాటం ఆగదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం  చేశారు. రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చే వరకు రాజీలేని పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. కేసుల మాఫీ కోసం బీజేపీకి కొమ్ము కాస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న వైసీపీని ప్రజలు ఎక్కడికక్కడ ఎండగట్టాలని ప్రకాశం జిల్లా చీరాలలో చంద్రబాబు పిలుపు ఇచ్చారు. 
ప్రకాశం జిల్లాలో చంద్రబాబు పర్యటన
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకాశం జిల్లాలో పర్యటించారు. చీరాలలో జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో పాల్గొన్నారు. చేనేత ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించారు. మగ్గంపై కూర్చుని వస్త్రాలు నేశారు. చేనేత కార్మికుల కోసం ఆధునిక వర్క్‌ షెడ్లను ప్రారంభించారు. ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. చేనేత  వస్త్రాల తయారీలో నైపుణ్యం ప్రదర్శించిన కార్మికులను చంద్రబాబు అవార్డులు అందచేశారు. 
కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డ చంద్రబాబు 
చీరాలలో నిర్వహించిన జాతీయ చేనేత దినోత్సవ సభలో ప్రసంగించిన చంద్రబాబు... కేంద్ర ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాల ఆదుకుంటారన్న నమ్మకంతో గత ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తే... చివరికి మొండిచేయి చూపించారని విమర్శించారు. ప్రజల కోసం కేంద్రంతో చేస్తున్న ధర్మ పోరాటంలో అంతిమ విజయం తమదేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. 
దూబగంటలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన 
అంతకు ముందుకు కనిగిరి నియోజకవర్గ పరిధిలోని పామూరు మండలం దూబగంటలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. కడప కేంద్రంగా పనిచేస్తున్న రాజీవ్‌గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయానికి అనుంబంధంగా ఈ ట్రిపుల్‌ ఐటీ పని చేస్తుంది. పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో ప్రతిభ కనపరిచిన గ్రామీణ విద్యార్థులకు ట్రిపుల్‌ ఐటీల్లో సీట్లు కేటాయిస్తారు. 
రాష్ట్రాన్ని విజ్ఞాన ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతాం : చంద్రబాబు 
దూబగంట ట్రిపుల్‌ ఐటీకి శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగిస్తూ... రాష్ట్రాన్ని విజ్ఞాన ఆర్థికవ్యవస్థగా తీర్చిదిద్దుతామని చెప్పారు. చంద్రబాబు ప్రకాశం జిల్లా పర్యటనకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 

19:33 - August 1, 2018

ఢిల్లీ : విభజన హామీలు.. ముఖ్యంగా కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం.. తెలుగుదేశం నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు. పార్లమెంటు లోపలా, బయటా ఆందోళనలు సాగిస్తూనే.. రాష్ట్రపతి దృష్టికీ ఈ అంశాన్ని తీసుకు వెళ్లారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ టీడీపీ నేతలు భేటీ అయి.. తమ డిమాండ్‌కు మద్దతును సమీకరించారు. 

విభజన హామీల సాధన దిశగా.. తెలుగుదేశం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటివరకు పార్లమెంటు ప్రాంగణంతో పాటు ఉభయసభల్లో ఆందోళన కొనసాగిస్తున్న ఆ పార్టీ ఎంపీలు తాజాగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిశారు. సుజనాచౌదరి నేతృత్వంలోని బృందం.. రాష్ట్రపతిని కలిసి.. కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు కేంద్రం చర్యలు తీసుకునేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఉక్కు కర్మాగారం ఆంధ్రుల మనోభావాలకు చెందిన అంశం కాబట్టి ఆ హామీ నెరవేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

మధ్యాహ్నం రెండున్నర గంటల ప్రాంతంలో.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర ఉక్కు శాఖమంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌నూ కలిశారు. కడప జిల్లా నాయకులతో కలిసి.. టీడీపీ ఎంపీలు.. కేంద్ర మంత్రిని కలిశౄరు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

అటు పార్లమెంటు ప్రాంగణంలో.. బుధవారం కూడా టీడీపీ ఎంపీలు ఆందోళనను కొనసాగించారు. పార్లమెంటు గాంధీ విగ్రహం దగ్గర ఏపీకి న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మరోవైపు.. చిత్తూరు ఎంపీ శివప్రసాద్‌ ప్రజాకవి వేషధారణలో మోదీ వైఖరిపై మండిపడ్డారు. మాటలగారడీ.. వినయం పేరడీతో మోదీ ప్రజలను మోసగిస్తున్నారని విమర్శించారు. ఇంకోవైపు.. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతాబెనర్జీతోనూ.. టీడపీ ఎంపీలు సుజనాచౌదరి, కేశినేని నాని భేటీ అయ్యారు. పార్లమెంటులో ఆమెను కలిసి.. తమ ఆందోళనకు మద్దతును కోరారు. 

18:32 - July 30, 2018

ఢిల్లీ : సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. పొంగులేటి సుధాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై కేంద్రం మరో అఫిడవిట్ దాఖలు చేసింది. విభజన చట్టం హామీల మేరకు ఇరు రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాల్సిన జాతీయ విద్యా సంస్థలపై అఫిడవిట్ దాఖలు చేసింది. చాలా విద్యా సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేశామని మానవ వనరుల శాఖ తెలిపింది. ఐఐటీ తిరుపతి, ఐఐఎం విశాఖలో ఇప్పటికే తరగతులు జరుగుతున్నాయని స్పష్టం చేసింది.

 

15:12 - July 30, 2018

ఢిల్లీ : శనివారం సుప్రీంకోర్టు లో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్ కు వ్యతిరేకంగా పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం దగ్గర టీడీపీ ఎంపీలు ధర్నా నిర్వహించనున్నారు. రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో కేంద్రం తీరును నిరసిస్తూ పార్లమెంట్ ఉభయసభల్లో ఆందోళన చేపట్టనున్నారు. 

19:39 - July 29, 2018

ఢిల్లీ : భారత వైద్య మండలి స్థానంలో జాతీయ వైద్య కమిషన్‌ను తీసుకురావటానికి ప్రయత్నిస్తుంది కేంద్రం. ఇందుకోసం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. అయితే జాతీయ కమిషన్‌ను తీసుకురావాటాన్ని వైద్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎన్‌ఎంసీని తీసురావటం వల్ల పేదలకు వైద్య విద్య మరింత దూరం అవుతోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్‌ఎంసీ బిల్లు వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాలు చేపడతామని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలాన్ని ఉన్నత విద్యలో చొప్పించేందుకు కుట్ర పన్నుతున్నారని.. అందుకే ఎన్‌ఎంసీ బిల్లు తీసుకొస్తున్నారని డాక్టర్లు ఆరోపిస్తున్నారు. 

దేశంలో ప్రస్తుతం అమల్లో ఉన్నమెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్‌ (ఎన్‌ఎంసీ)ని తీసుకోచ్చేందుకు కేంద్ర ప్రభుత్వ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టనుంది. అయితే బిల్లు తీసుకురావటం పట్ల డాక్టర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని వైద్య విద్యకు సంబంధించి అన్ని వ్యవహారాలు ఎన్‌ఎంసీనే చూసుకోవాటాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. అలాగే ఆయుష్‌ కోర్సులను అల్లోపతి కోర్సులతో సమానంగా చూడాటాన్ని తప్పుబడుతున్నారు. ఆయుష్‌ వైద్యులను బ్రిడ్జి కోర్స్‌ ద్వారా ఎంబీబీఎస్‌ డాక్టర్లుగా గుర్తించటాన్ని వైద్యులు, వైద్య విద్యార్ధులు మోసపూరిత చర్యగా అభివర్ణిస్తున్నారు. ఆయుష్‌ వైద్యులను ఎంబీబీఎస్‌ డాక్టర్లుగా గుర్తించటంపై మండిపడుతున్నారు. 

హోమియోపతి, ఆయుర్వేదం వంటి ఆయుష్ వైద్యుల కోసం ప్రభుత్వం ఒక బ్రిడ్జ్ కోర్సును తీసుకొచ్చింది. దీంతో ఆయుష్ వైద్యులు అల్లోపతి వైద్యాన్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. అయితే ఐఎంసీ యాక్ట్‌లోని క్లాజ్ 15 ప్రకారం ఎంబీబీఎస్ డాక్టర్లు మాత్రమే ఔషధాలను సిఫారసు చేయాలి. కానీ కొత్తగా తీసుకొస్తున్న బిల్లులో ఈ క్లాజ్‌ను తీసి వేయనున్నారు. దీంతో ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం వుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఆయుష్ వైద్యులకు అల్లోపతి అవకాశం ఇవ్వడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అల్లోపతి చదవని వారికి అల్లోపతి వైద్యం ప్రాక్టీస్ చేసేలా అనుమతి ఎలా ఇస్తారని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. 

ఇక ఇప్పటి వరకు ఎంసీ‌ఐ సభ్యులను డాక్టర్లు ఎన్నికల ద్వారా ఎన్నుకుంటున్నారు. కానీ కొత్తగా ఏర్పాటు చేయనున్న ఎన్‌ఎంసీకి సభ్యులను కేంద్రమే నామినేట్‌ చేయనుంది. 25 మంది సభ్యులతో ఎన్‌ఎంసీ పాలక మండలిని ఏర్పాటు చేస్తుంది. దీనికి ఒక చైర్మన్, 12 మంది ఎక్స్ అఫీసియో సభ్యులు, 11 మంది తాత్కాలిక సభ్యులు, ఒకరు ఎక్స్ అఫిసియో సభ్య కార్యదర్శి ఉంటారు. వివిధ రాష్ట్రాలకు చెందిన డాక్టర్లకు ఇందులో స్థానం కల్పిస్తారు. ఇది వరకు లాగా ప్రతి యూనివర్శిటీ నుంచి సభ్యులు ఉండే అవకాశం లేదు. అంటే అన్నీ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కూడా రావకపోవచ్చనమాట. దీన్ని కూడా డాక్టర్లు తప్పుబడుతున్నారు. ఇది నిరంకుశత్వానికి దారి తీస్తుందని.. ఇలాంటి సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించలేరనీ.. ప్రభుత్వానికి విధేయంగా ఉంటారనీ ఐఎంఏ చెబుతోంది. అంతేకాదు నామినేటెడ్ పోస్టుల్లో హిందూత్వ భావజాలాన్ని కూడా చొప్పించే కుట్ర జరుతోందని ఐఎంఏ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

ఇక ఈ బిల్లును తీసుకురావటానికి కేంద్రం కూడా కారణాలు చెబుతుంది. ఎంసీఐలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోతుందని అందుకే ఎన్‌ఎంసీని తీసుకువస్తున్నామని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు ఎంసీఐలోని ఒక డిపార్ట్‌మెంట్‌లో జరుగుతున్న అవినీతినే.. భూతద్దంలో చూపించి మొత్తం ఎంసీఐనే తీసేయడం సరైంది కాదని డాక్టర్లు వాదిస్తున్నారు. వ్యవస్థను సరిదిద్దేందుకు తగిన చర్యలు తీసుకోవాలే తప్ప.. దానిని నాశనం చేయడం సమస్యకు పరిష్కారం కాదని చెబుతున్నారు. వెంటనే ఎన్‌ఎంసీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డాక్టర్లు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలను చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. 

19:05 - July 28, 2018

విశాఖపట్టణం : దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న విశాఖ రైల్వేను రైల్వే జోన్‌గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం పై ఆనందాన్ని వ్యక్తం చేశారు బీజేపీ శాసనసభపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు. ఈ సందర్భంగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌లో తొమ్మిది మంది బీజేపీనేతల బృందం ఢిల్లీ బయలు దేరింది. వెళ్లిన బృందానికి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు జండా ఊపి ప్రయాణాన్ని ప్రారంభించారు. తొమ్మిది మందితో కలిసిన బృందం పీయూష్‌ గోయల్‌ను కలిసి తిరిగి విశాఖ నగరానికి ఆగస్టు 2న చేరుకుంటుదని విష్ణుకుమార్‌ తెలిపారు.

08:27 - July 22, 2018

ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వక్తలు అన్నారు. ఇదే అంశంపై నిర్వహించిన న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో టీడీపీ నేత నాగుల్ మీరా, కాంగ్రెస్ నేత మీసాల రాజేశ్వరరావు, బీజేపీ నేత షేక్ బాజీ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

18:58 - July 21, 2018

ఢిల్లీ : అవిశ్వాస తీర్మానంపై మోదీ సమాధానాన్ని నిరసిస్తూ టీడీపీ పోరాటానికి సిద్ధమైంది. టీడీపీ ఎంపీలతో సీఎం చంద్రబాబు భేటీ ముగిసింది. ఢిల్లీలో ఎంపీలతో సమావేశమైన చంద్రబాబు.. భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించారు. ఎంపీలకు దిశానిర్ధేశం చేశారు. పార్లమెంట్‌ లోపల, వెలుపల పోరాటం చేయాలని నిర్ణయించారు. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని.. కేంద్రాన్ని ప్రశ్నించాలని ఎంపీలకు చంద్రబాబు సూచించారు. 

 

Pages

Don't Miss

Subscribe to RSS - కేంద్ర ప్రభుత్వం