కేంద్ర మంత్రులు

11:49 - May 10, 2018

విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులకు వేర్వేరుగా లేఖలు రాశారు. చమురు ధరల తగ్గింపు, ఉపాధి హామీ వేతనాల చెల్లింపు వ్యత్యాసాలపై లేఖలు రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు రాసిన లేఖలో కోరారు. క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా చమురు ధరలు తగ్గడం లేదని తెలిపారు. ఉపాధి హామీ వేతనాల చెల్లింపులో ఏపీకి జరుగుతున్న అన్యాయంపై కేంద్ర మంత్రి తోమర్ కు లేఖ రాశారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో తక్కువ వేతనం చెల్లిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలకు ఒకే విధంగా వేతనం చెల్లించాలని కోరారు. పూర్తి సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:04 - February 17, 2017

ఖమ్మం: కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సీపీఎం రాష్ట్రకార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీ టూ పీజీ ఉచిత విద్య అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని తమ్మినేని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని ఎత్తేయాలని కేసీఆర్‌ ప్రభుత్వం పూనుకుంటోందని, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకులు, డబ్బున్న అధికారులే రాష్ట్రాన్ని మేసేస్తున్నారని తమ్మినేని విమర్శించారు. అందరికి సమాన అవకాశాలు కావాలన్నదే సీపీఎం మహాజన పాదయాత్ర ఉద్దేశమని తమ్మినేని అన్నారు. కులవివక్షకు గురైన రోహిత్‌ వేముల కుటుంబానికి న్యాయం చేయకుండా...కేంద్ర మంత్రులను కాపాడేందుకే.. అతని కులాన్ని వివాదస్పదం చేస్తున్నారని తమ్మినేని అన్నారు. రోహిత్‌ వేముల కులాన్ని మార్చేందుకు ప్రభుత్వం నిస్సిగ్గుగా ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. ..

ప్రతి ఇంటిలో పిల్లలందరిని చదివించినప్పుడే.. అభివృద్ధి సాధ్యమవుతోందని, కానీ..కేసీఆర్‌ సర్కార్‌ విద్యావ్యవస్థను పూర్తిగా నాశనం చేసేందుకు పూనుకుందని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలో విద్యా రంగాన్ని కాపాడేందుకు సీపీఎం పోరాటం చేస్తోందని తమ్మినేని తెలిపారు. సంస్కరణల్లో భాగంగానే మిషన్‌ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిందని, ఈ పథకం కోసం అప్పులు చేసి ప్రజలపై మోయలేని భారం వేస్తోందని పాదయాత్ర కోఆర్డినేటర్‌ వెంకట్‌ ఆరోపించారు. ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్న కోదండరామ్‌పై కేసీఆర్‌ ప్రభుత్వం ఎందుకు అక్కసు వెళ్లగక్కుతోందని ఆయన ప్రశ్నించారు.

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన...

సీపీఎం మహాజన పాదయాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 123వ రోజుకు చేరుకున్న పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఖమ్మం జిల్లాలోని రాయనపేట, ఆళ్లపాడు, బోనకల్లు, ముష్టికుంట్ల, నాగులవంచలో పాదయాత్ర బృందం పర్యటించింది. ముష్టికుంట్ల గ్రామంలో రెండు కిలోమీటర్ల పొడవునా తమ్మినేని బృందానికి పూలవర్షంతో స్వాగతం పలికారు. అడుగడుగునా ప్రజలు పాదయాత్ర బృంద సభ్యులకు సాదరంగా ఆహ్వానిస్తూ.. యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు తమ సమస్యలను తమ్మినేని బృందానికి విన్నవిస్తున్నారు. ఇప్పటికే 3వేల 300 కిలోమీటర్ల మేర యాత్రను పూర్తిచేశారు.

21:24 - September 7, 2016

ఢిల్లీ : ఏపీకి ప్యాకేజీపై కేంద్ర మంత్రులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. కేంద్రమంద్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడుతో టీడీపీ ఎంపీ సుజనా చౌదరిపాటు ఎంపీలు సీఎం రమేష్, కొనకళ్ల నారాయణ సమావేశం అయ్యారు. కేంద్రం ఏపీకి రూ.లక్షా 50 వేల కోట్ల ప్యాకేజీ ప్రకటించే అవకాశం ఉంది. పోలవరానికి రూ.28 వేల కోట్లు, పోర్టు నిర్మాణానికి రూ.20 వేల కోట్లు, రహదారుల నిర్మాణానికి రూ.25 వేల కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.15 వేల కోట్లు వెనుకబడిన జిల్లాలకు రూ.50 వేల కోట్ల చొప్పున 6 ఏళ్లు, యూనివర్సీటీలకు రూ.30 వేల కోట్లు, ఆర్థికలోటు భర్తీకి రూ.10 వేల కోట్లు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. విశాఖలోనే రైల్వే జోన్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. డూప్లికేట్ డ్రాఫ్ట్ పీఎంవో కార్యాలయానికి వెళ్లింది. కాసేపట్లో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ మీడియా సమావేశం నిర్వహించి.. ఏపీకి ప్యాకేజీ వివరాలను తెలపనున్నారు.  

11:11 - August 1, 2016

ఢిల్లీ : ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని..విభజన హామీలు అమలు చేయాలంటూ ఎన్డీయే మిత్రపక్షమైన టిడిపి పోరుబాట పట్టింది. ఆ పార్టీకి చెందిన లోక్ సభ, రాజ్యసభ సభ్యులు గాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులు చేపట్టి నిరసన చేపట్టారు. ఈ నిరసనలో కేంద్ర మంత్రులు అశోక్ గజపతి రాజు, సుజనా చౌదరిలు గైర్హాజర్ కావడం చర్చనీయాంశమైంది.
ఇటీవలే కేవీపీ ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ సమాధానం ఇచ్చారు. జైట్లీ సమాధానంపై టిడిపి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ పార్టీకి చెందిన ఎంపీలతో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే ఒత్తిడి చేయాలని బాబు నిర్దేశించారు. ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ తీసుకుని ఆయనతో సమస్యలు చర్చించాలని సూచించారు. బాబు ఆదేశాల ప్రకారం ఆపార్టీ ఎంపీలు నిరసన చేపట్టారు. ప్రధాన మంత్రి అపాయింట్ మెంట్ పై క్లారిటీ రాలేదు. విభజన సమయంలో కేంద్ర మంత్రులు జైట్లీ, వెంకయ్య నాయుడు కీలక పాత్ర పోషించారని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదా, విభజన హామీలపై చర్చ చేపట్టాలంటూ వైసీపీ లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. టిడిపి ఎంపీలు చేపట్టిన నిరసనపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

12:04 - July 5, 2016

ఢిల్లీ : ఉత్కంఠకు తెరపడింది. కేంద్ర పునర్ వ్యవస్థీకరించారు. మంత్రివర్గంలోకి కొత్తగా 19 మందిని తీసుకున్నారు. స్వతంత్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు కేబినెట్ హోదాతో పదోన్నతి కల్పించారు. మంగళవారం ఉదయం 11గంటలకు రాష్ట్రపతి భవన్ లో కొత్తమంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు పెద్దపీఠ వేశారు. దళిత ఎంపీలకు స్థానం కల్పించారు. ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఉప రాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా, కేంద్ర మంత్రులు పాల్గొన్నారు.

పేరు రాష్ట్రం
ఫాగ్గన్ సింగ్ మధ్యప్రదేశ్
ఆహ్లువాలియా బెంగాల్
రమేష్ చంద్రప్ప జిగనగి కర్ణాటక
విజయ్ గోయల్ రాజస్థాన్
రామ్ దాస్ అథవాలే, రాజ్యసభ, మహరాష్ట్ర
రాజేన్ గొహైన్ అస్సాం
అనిల్ మాధవ్ దవే మధ్యప్రదేశ్
పురుషోత్తం రూపాల, రాజ్యసభ గుజరాత్
ఎంజే అక్బర్   రాజ్యసభ మధ్యప్రదేశ్
అర్జున్ రాం మేఘ్ వాల్ రాజస్థాన్
జశ్వంత్ సిన్హ్ గుజరాత్
మహేంద్ర నాథ్ పాండే ఉత్తర్ ప్రదేశ్
అజయ్ టమ్ ట ఉత్తరాఖండ్
కృష్ణారాజ్ షాజహాన్, ఉత్తర్ ప్రదేశ్
మన్సుఖ్ మాండవీయ రాజ్యసభ గుజరాత్
అనుప్రియ పటేల్ అప్నా దళ్ ఎంపీ మిర్జాపూర్, ఉత్తర్ ప్రదేశ్
సీఆర్ చౌదరి నాగౌర్, రాజస్థాన్
పీపీ చౌదరి పాలి, రాజస్థాన్
శుభాష్ రామ్ రావ్ భామ్రే ధూలే, మహారాష్ట్ర
11:21 - May 5, 2016

విజయవాడ : ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వలేని తేల్చి చెప్పినా కేంద్ర మంత్రులుగా టిడిపి వారు కొనసాగడం దురదృష్టకరమని.. వెంటనే కేంద్ర మంత్రులు మంత్రివర్గం నుండి బయటు రావాలని డిమాండ్ చేశారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు విజయనగరం పర్యటన సందర్భంగా వామపక్ష కార్యకర్తల అక్రమ అరెస్టు చేసి తన నిజస్వరూపం చూపించారని మండి పడ్డారు. ఇప్పటికైన చంద్రబాబు వైఖరి మార్చుకుని... రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలంటే కేంద్ర మంత్రి వర్గం నుండి ఉపసంహరించుకోవాలి. లేదా హోదా రాదని చంద్రబాబు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బిజెపి నమ్మక ద్రోహిగా పురంధ్రేశ్వరిని ముందు పెట్టి బిజెపి ఆడే డ్రామా ఆడుతోందని... ఏపీలో బిజెపికి సమాధి కట్టబోతున్నారని పేర్కొన్నారు.

06:47 - August 27, 2015

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీలే ప్రధాన అజెండాగా ఢిల్లీ వెళ్లిన చంద్రబాబు క్షణం తీరికలేకుండా వరుసభేటీలు జరిపారు. ప్రత్యేక హోదాపై తప్ప మిగిలిన అంశాల్లో ఢిల్లీ పెద్దలనుంచి ఆయనకు కాస్త సానుకూల స్పందనే లభించింది. ఆర్ధికశాఖ అధికారుల నుంచి ప్రధానమంత్రి వరకు పలువురితో చర్చలు జరిపిన సీఎం చంద్రబాబు పర్యటన ఫలితం ఏంటో వేచిచూడాల్సిందే ?

ప్రధాని సహా కేంద్రమంత్రులతో ఏపీ సీఎం బాబు భేటీ.....

ఏపీ ఆశల చిట్టాతో హస్తినలో అడుగుపెట్టిన సీఎం చంద్రబాబునాయుడు.. ప్రధాని సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. విభజనతో నష్టపోయిన ఏపీకి సాయం అందించాలని మంత్రులందర్నీ కోరారు సీఎం. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా, ప్యాకేజీ, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు.

కేంద్ర మంత్రి వెంకయ్యతో భేటీ......

ఢిల్లీ టూర్ ఆద్యంతం ఏపీ సీఎం చంద్రబాబు బిజీబిజీగా గడిపారు. కేంద్రమంత్రులతో వరుసగా మీట్ అయ్యారు. మొదట కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడ్ని ఆయన నివాసంలో కలిశారు. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ తో కూడా అక్కడే భేటీ అయ్యారు. విభజన చట్టాన్ని అమలు చేయాలని రాజ్ నాథ్ ను కోరారు బాబు.

ప్రత్యేక హోదా, పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టుపై మోడీతో చర్చ.....

ఇక ప్రధాని మోడీతో సమావేశమైన బాబు టీమ్, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్యాకేజీ, కేంద్రం సాయం, పారిశ్రామికాభివృద్ధి, పోలవరం ప్రాజెక్టు తదతర అంశాలపై ప్రధానితో చర్చించారు. రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకునే వరకు సాయం చేయాలని మోడీని కోరారు సీఎం. ప్రధానితో భేటీలో అరుణ్ జైట్లీ, నీతి అయోగ్ సీఈవో కూడా పాల్గొన్నారు. వివిధ డిపార్ట్ మెంట్లకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు, రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు కూడా వివిధ అంశాలపై చర్చించారు. ఫైనల్ గా విభజన చట్టంలోని హామీలు అమలు చేయడానికి రోడ్ మ్యాప్ రెడీ చేయాలని కేంద్రం నిర్ణయించినట్టు చెప్పారు అరుణ్ జైట్లీ.

రాష్ట్రపతి ప్రణబ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చంద్రబాబు

రెండో రోజు సీఎం చంద్రబాబు రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రధానితో బాబు సమావేశం జరిగిన తీరు పట్ల .. ఎంపీలు సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం తప్పనిసరిగా రాష్ట్రానికి ఆర్థికసాయం చేస్తుందన్న భరోసాతో .. టీడీపీ ఎంపీలు ఉన్నారు. ప్రధాని ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటారని .. ఎంపీలు విశ్వాసం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

కేంద్రం నుంచి వచ్చే సాయంపై క్లారిటీ లేదు....

ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ లాగా.. హస్తినలో భేటీలు బాగానే జరిగినా.. కేంద్రం నుంచి వచ్చే సాయంపై క్లారిటీ లేదు. ఆర్థికసాయం ఏ విధంగా ఉంటుందనే విషయంపై స్పష్టత రాలేదు. అయితే.. బీహార్ ఎన్నికల తర్వాత మోడీ ప్రకటన ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

09:53 - July 31, 2015

రైతులంటే నేతలకు అలుసా? లవ్‌ ఫెయిల్యూర్‌ వల్లే అన్నదాతల ఆత్మహత్యలని ఒకరు.. రైతులు పిరికి వాళ్లంటూ మరొకరు ఎగతాళి చేస్తున్నారు. అడిగే దిక్కులేదని చిన్నచూపు చూస్తున్నారు. రైతుల ఆత్మహత్యలకు కొత్త కారణాలు వెతికిన కేంద్ర వ్యవసాయమంత్రి రాధామోహన్ సింగ్.. వారి మరణాలకు అసలు కారణం రుణపాశమే అని ఎందుకు ఒప్పుకోరు.
రైతులను బాధపెట్టేలా కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ వ్యాఖ్యలు.....
రైతే రాజు.. ఇది పాత మాట.. రైతే భగ్నప్రేమికుడు, అటు ఇటూ కానివాడు ఇది మోడీ సర్కార్ మాట.. చేతనైతే సాయం చేయండి సారు అంటూ వేడుకుంటున్న రైతన్నకు కేంద్రం ఇచ్చిన తాజా నిర్వచనం ఇది. రైతు ఆత్మహత్యలకు ఇవి కూడా కారణాలంటూ నిసిగ్గుగా సమాధానం చెప్పడానికి సిద్ధమైపోయారు కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్. మోడీ సర్కార్ వచ్చినప్పటి నుంచి రైతుకు ఊరట కల్గించే మాటలేమో గానీ.. ఊట బావిలో వారిని దూకేలా బాధ పెడుతోంది. రైతుల పట్ల పిచ్చి ప్రేలాపనలు చేస్తూ.. క్షోభపెడుతోంది.
ఆత్మహత్యలకు పాల్పడే వారు నేరస్తులు, పిరికివాళ్లు - హర్యానా మంత్రి ధనకర్.....
ఆత్మహత్యలకు పాల్పడే వారు నేరస్తులు, పిరికివాళ్లు.. ఇది బిజెపి అధికారంలో ఉన్న హర్యానా మంత్రి ధనకర్ వ్యాఖ్య. మరో బిజెపి సీనియర్‌ నేత మహారాష్ట్ర రెవెన్యూ మంత్రి ఏక్‌నాథ్‌ కాద్సే 2014 నవంబర్‌ 25న ముంబాయిలో మాట్లాడుతూ మొబైల్‌ ఫోన్‌ బిల్లు ఛార్జీలను చెల్లించే రైతులు విద్యుత్‌ బిల్లులను ఎందుకు చెల్లించలేరని ఎద్దేవా చేశారు. భారత్‌ వంటి దేశాలలో రైతుల ఆత్మహత్యలు సాధారణ విషయమే అని యూపీఏ హయాంలో వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌ పవార్‌ 2006 ఆగస్టు 5న ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. శరద్‌ పవార్‌ అల్లుడు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ ఆ రాష్ట్రంలో కరువుకు సంబంధించి 2013 ఏప్రిల్‌ 7న పూణేలో మాట్లాడుతూ డ్యాంలలో నీళ్లు లేకపోతే మేము మూత్రం పోయాలా అంటూ అత్యంత హీనంగా మాట్లాడారు.
నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో ఇచ్చిన రిపోర్టు చూసిన తర్వాత నోరు మూసుకోవాల్సిందే.....
రాధామోహన్ సింగ్ తో పాటు రైతుల ఆత్మహత్యలకు పిచ్చి కారణాలు చూపుతున్న నేతలు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో ఇచ్చిన రిపోర్టు చూసిన తర్వాత నోరు మూసుకోవాల్సిందే. రుణపాశమే రైతుల పాలిట యమపాశమవుతోందని ఆ నివేదిక స్పష్టం చేసింది. గిట్టుబాటు ధర లేక, అప్పులు తీర్చే మార్గం దొరకక, రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని స్పష్టం చేసింది. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ఆత్మహత్యలు 26 శాతం పెరిగాయన్న కఠోర వాస్తవాన్ని ఎన్ సి ఆర్ బి రిపోర్టు బహిర్గతం చేసింది. నమ్ముకున్న విత్తనం మొలకెత్తక, ప్రకృతి వైపరీత్యాలు, పెట్టిన పెట్టుబడిపై లాభం రాకపోవడంతో రైతు కుంగిపోతున్నాడని స్పష్టం చేసింది.
కేంద్ర మంత్రి చెప్పిన పిచ్చి కారణాలతో ఏ ఒక్క రైతూ చనిపోలేదు....
కానీ ఇదే రిపోర్టును చదువుతూ కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్ బాధ్యతా రాహిత్యంగా మాట్లాడటాన్ని ఏమనాలి. కేంద్ర మంత్రి చెప్పిన పిచ్చి కారణాలతో ఏ ఒక్క రైతూ చనిపోలేదన్న వాస్తవం నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక చూస్తే అర్ధమవుతోంది. ఎన్ సిఆర్ బి రిపోర్ట్‌ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 1647 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇందుకు పంటలు పండకపోవడం, దివాలా తీయడం, అప్పులు పెరిగిపోవడమే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 2014లో రైతుల ఆత్మహత్యలకు గల కారణాలను ఓసారి పరిశీలిద్దాం.....
పంట పండకపోవడంతో తెలంగాణలో 295 మంది, ఏపీలో 42 మంది ఆత్మహత్య చేసుకున్నారు. పేదరికం వల్ల తెలంగాణలో 112 మంది, ఏపీలో ఒక్కరు. కుటుంబ సమస్యలతో తెలంగాణలో 67 మంది, ఏపీలో 11 మంది. దివాలా తీయడంతో తెలంగాణలో 208 మంది, ఏపీలో 36 మంది సూసైడ్‌ చేసుకున్నారు. పంట రుణం వల్ల నష్టపోయి తెలంగాణలో 146 మంది, ఏపీలో 25 మంది. వివాహ సంబంధిత సమస్యలతో తెలంగాణలో 21 మంది, ఏపీలో ఇద్దరు. ప్రకృతి వైపరీత్యాలతో తెలంగాణలో 90 మంది, ఏపీలో 30 మంది చనిపోయారు. అనారోగ్యంతో తెలంగాణలో 101 మంది రైతులు, ఏపీలో 8 మంది, పరికరాలు, యంత్రాల కొనుగోలు వల్ల అప్పుల పాలవ్వడంతో ఏపీలో ఒక్కరు ఆత్మహత్య చేసుకున్నారు. వ్యవసాయేతర రుణం వల్ల తెలంగాణలో 62 మంది, ఏపీలో 10 మంది, ఇతర కారణాల వల్ల తెలంగాణలో 93 మంది, ఏపీలో 50 మంది, అంతుబట్టని కారణాలతో తెలంగాణలో ఒక్కరు, ఏపీలో 10 మంది చనిపోయారు.
రెండో స్థానంలో ఉన్న తెలంగాణలోనూ, ఆరో స్థానంలో ఉన్న ఏపీలోనూ....
రైతుల ఆత్మహత్యలు నమోదవుతున్న రాష్ట్రాల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణలోనూ, ఆరో స్థానంలో ఉన్న ఏపీలోనూ ఇవే ఖచ్చితమైన కారణాలు. మెజార్టీ బలవన్మరణాలకు కారణం వివిధ రూపాల్లో తీసుకున్న రుణమే.... మొదటి స్థానంలో ఉన్న మహారాష్ట్రతో పాటు దేశం మొత్తం ఇదే పరిస్థితి. ఇది చూసిన తర్వాతైనా మన నేతలు రైతు సమస్యల పట్ల చూసే కోణం మారుతుందా.. లేదు మేం నేతలం మాకే చెబుతారా అంటారా.? రైతు కూడా ఓటరే.. సమాధానానికి అతనికీ ఓ ఛాన్స్ వస్తుందని గ్రహించాలి.
2014లో రైతుల ఆత్మహత్యలు - కారణాలు

కారణం తెలంగాణ ఆంధ్రప్రదేశ్

పంట పండకపోవడం 295 మంది 42

పేదరికం 112 1

కుటుంబ సమస్యలు 67 మంది 11 మంది

దివాలా తీయడం 208 36

పంట రుణం వల్ల నష్టపోయి 146 25

వివాహ సంబంధిత సమస్యలు 21 02

ప్రకృతి వైపరీత్యాలు 90 30

అనారోగ్యం 101 08

పరికరాలు, యంత్రాల కొనుగోలు

వల్ల అప్పులు పాలవ్వడంతో 00 01

వ్యవసాయేతర రుణం వల్ల 62 మంది 10 మంది

ఇతర కారణాలు 93 మంది 50 మంది

అంతుబట్టని కారణాలు 01 10 మంది

15:55 - July 23, 2015

ఢిల్లీ:ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామా చేయాల్సిందేనని... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పునరుద్ఘాటించారు. వారు రిజైన్‌ చేయకపోతే... పార్లమెంట్‌లో చర్చల ప్రసక్తే వుండదని స్పష్టం చేశారు. లలిత్ గేట్‌, వ్యాపం కుంభకోణాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైతే... ప్రధాని నరేంద్రమోదీ స్పందించకపోవటం శోచనీయమన్నారు. ఆయన బీజేపీ ప్రధాని కాదని... భారతదేశానికి ప్రధాని అన్న విషయం గుర్తుంచుకొని... ప్రజలకు సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Don't Miss

Subscribe to RSS - కేంద్ర మంత్రులు