కేవీపీ

18:33 - November 21, 2017

హైదరాబాద్ : పోలవరం నిర్మాణంపై కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్మించేలా ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్ లో కోరారు. కేవీపీ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని ఉన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. పోలవరంపై ఎలాంటి వైఖరి ఏంటో తెలియచేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే పూర్తిగా భరించాలని కోరారు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేశారని పేర్కొన్నారు. 

20:20 - November 5, 2017

విజయవాడ : ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థుల దీక్షలు ఇంకా కొనసాగుతున్నాయి. ఎంసీఐ అనుమతి లేకపోవడంతో కడప ఫాతిమా 2015-16 విద్యార్థుల బ్యాచ్ రోడ్డున పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి. తమకు న్యాయం చేయాలని విద్యార్థులు..వారి తల్లిదండ్రులు దీక్ష చేపడుతున్నారు. వీరి దీక్షకు ఏపీ కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రారావు సంఘీభావం ప్రకటించారు. సోమవారం దీక్షా స్థలికి చేరుకుని వారిని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన ప్రభుత్వంపై పలు విమర్శలు గుప్పించారు. సీఎం చంద్రబాబు నాయుడికి అసెంబ్లీ సీట్ల పెంపుదలపై ఉన్న శ్రద్ధ ఫాతిమా మెడికల్ కాలేజీ విద్యార్థులపై లేదని విమర్శించారు. 

20:07 - August 13, 2017

ఢిల్లీ : పోలవరం ప్రాజెక్టును తాను అడ్డుకుంటున్నట్లు వస్తున్న వార్తలను రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ఖండించారు. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబుకు తొమ్మిది పేజీల లేఖ రాశారు. పోలవరం అడ్డుకుంటున్నట్లు నిరూపిస్తే రాజ్యసభ పదవిని వదులుకోవడంతో పాటు రాజకీయాలనుంచి శాశ్వతంగా వైదొలగతానంటూ సవాల్ విసిరారు. తనపై ప్రత్యేక కమిటీ వేసినా విచారణకు సిద్ధమని స్పష్టం చేశారు. లేని పక్షంలో తనపై వచ్చిన వార్తలను తప్పుడు ఆరోపణలుగా ఒప్పుకోవాలని కోరారు. 

 

21:16 - July 16, 2017

వీహెచ్..వి.హనుమంతరావు..కాంగ్రెస్ లో సీనియర్ నేత. తెలంగాణ కాంగ్రెస్ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేత. రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాల నుండి కొనసాగుతున్నారు. నేతలపై ఆయన తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పిస్తుంటారు. వీహెచ్ తో టెన్ టివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు సంచలనాత్మక విషయాలు వెల్లడించారు. ఆయన వెల్లడించిన విషయాలు తెలియాలంటే వీడియో క్లిక్ చేయండి.

17:22 - July 16, 2017

హైదరాబాద్ : కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి సన్నిహితుడు కేవీపై ఈ వ్యాఖ్యలు చేశారు. టెన్ టివి నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమంలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. జగన్ తో పాటు కేసీఆర్ తో కేవీపీ అంటకాగుతూ...కాంగ్రెస్ నేతలను ఆయా పార్టీల్లోకి పంపిస్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. తనలాటి ఎంతో మంది నేతలను వైఎస్ కు దూరం చేశాడని..తనకు కూడా మంత్రి పదవి రాకుండా కేవీపీ అడ్డుకున్నాడంటూ విమర్శలు గుప్పించారు. తాజాగా కేవీపీ సూచన మేరకు వైసీలో చేరిన మల్లాది విష్ణు కూడా వైసీపీలో చేరారని వీహెచ్ పేర్కొన్నారు. ఇంకా ఆయన ఎలాంటి విషయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే ఆదివారం రాత్రి ప్రసారమయ్యే కార్యక్రమంలో చూడండి..

17:07 - April 29, 2017

గుంటూరు : రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు లేఖ రాశారు. ఏపీలో డ్రగ్స్ వ్యాపారం శృతిమించుతోందని..తక్షణమే చర్యలు తీసుకుని యువత భవిష్యత్తును కాపాడాలని లేఖలో తెలిపారు. చిత్తూరు, విశాఖ జిల్లాల్లో మాదకద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. దేశంలో డ్రగ్స్ ఉత్పత్తి, అక్రమ రవాణాను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంత్రించి..మత్తుపదార్థాలకు వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. విశాఖపట్టణం, తుని,తీర ప్రాంత గోదావరి జిల్లాల నుండి దక్షిణ భారతదేశవ్యాప్తంగా గంజాయి సరఫరా జరుగుతుందని..నార్కొటిక్స్ విభాగం ద్వారా గంజాయి స్మగ్లర్లపై చర్యలు తీసుకోవాలని హోంమంత్రిని కోరారు. 

 

16:40 - April 11, 2017

ఢిల్లీ : ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు డిమాండ్‌ చేశారు. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ జరుగుతున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నిండు సభలో ప్రకటించారని గుర్తు చేశారు. అప్పుడు ప్రత్యేక హోదా అడిగిన పార్టీ ఇప్పుడు అధికారంలో ఉందని... ఏపీకి ప్రత్యేక హోదా మాత్రం ఇవ్వడం లేదన్నారు. వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్ధిక సంఘం చెప్పలేదన్నారు.

 

 

15:45 - April 11, 2017

ఢిల్లీ : ఏపీ ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో వాడీవేడీ చర్చ జరిగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఎంపీ కేవీపీ సభలో లెవనెత్తారు. ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని 14వ ఆర్థిక సంఘం చెప్పలేదన్నారు. రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి పార్లమెంట్ లో హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. అనంతరం సీపీఐ ఎంపీ డి. రాజా మాట్లాడతూ 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా ఇచ్చారని, అవి కొనసాగుతాయా లేదా అన్నది స్పష్టం చేయాలని అన్నారు. హోదా కోసం ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయని టీ.కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఏపీకి హోదా పదేళ్లు ఇవ్వాలని వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారని కాంగ్రెస్ మాజీ మంత్రి జైరాం రమేష్ గుర్తుచేశారు. రాష్ట్రాలకు హోదాపై చర్చ జరగాలని టీఆర్ఎస్ ఎంపీ కె.కేశవరావు అన్నారు.

 

14:04 - January 27, 2017

ఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేకహోదా హామీని అమలు చేయాలని కేవీపీ రామచంద్రరావు కోరారు. ప్రత్యేహోదాపై రాష్ట్రపతికి ప్రణబ్ ముఖర్జీకి ఆయన లేఖ రాశారు. విభజన హామీలు నెరవేర్చేందుకు కృషి చేయాలన్నారు. రాష్ట్రపతి బడ్జెట్ ప్రసంగంలో హోదా అంశం చేర్చాలని విన్నవించారు. విభజన చట్టం అమలుపై కేంద్రం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు చర్చకు రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. జల్లికట్టును స్ఫూర్తిగా తీసుకుంటే వక్ర భాష్యాలు చెప్పారన్నారు. 

 

13:22 - January 8, 2017

హైదరాబాద్ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు కేవీపీ ఘాటు లేఖ రాశారు. పోలవరంపై కేవీపీ పలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవీపీపై తెలుగు తమ్ముళ్లు పలు విమర్శలు..ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనితో ఆదివారం బాబుకు లేఖ రాశారు. పోలవరంపై ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి కేవీపీ డిమాండ్ చేశారు. ప్రాజెక్టును అడ్డుకుంటున్నానని తనపై ఆరోపణలు చేస్తున్నారని..ఆ ఆరోపణలన్నీ నిరూపించాలని డిమాండ్ చేశారు. పోలవరం ప్రాజెక్టుపై బహిరంగ చర్చకు సిద్ధమా అని కేవీపీ ప్రశ్నించారు.

Pages

Don't Miss

Subscribe to RSS - కేవీపీ