కేసీఆర్‌

16:03 - April 11, 2018

హైదరాబాద్ : తెలంగాణ జన సమితి అంటే కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. అందుకే తమ సభకు ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తోందని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరామ్‌ అన్నారు. సభలకు అనుమతివ్వకుండా ప్రభుత్వం నిరంకుశ పోకడలు పోతోందని విమర్శించారు.  పొల్యూషన్‌ సాకు చూపుతూ సభను అనుమతి నిరాకరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఎల్‌బీ స్టేడియంలో ఓ సినిమా వేడుక నిర్వహించినప్పుడు పొల్యూషన్‌ ఏర్పడలేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తమకు ఇష్టంలేనివారి పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం సరికాదన్నారు. సభలు, మీటింగ్‌లు పెట్టుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కని... ఆ హక్కునే కేసీఆర్‌ కాళరాస్తున్నారని మండిపడ్డారు. 

 

22:01 - March 1, 2018

నిజామాబాద్ : కేసీఆర్‌ కుటుంబ పాలనను మండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ తీవ్రంగా విమర్శించారు. మీ తండ్రి గతాన్ని దృష్టిలో పెట్టుకునిమాట్లాడాలని... నిజామాబాద్‌లో ఆయన కేటీఆర్‌ ను హెచ్చరించారు. ఆకాశంమీద ఉమ్మేయాలని చూస్తే... అది మీమీదే పడుతుందన్నారు. వందేళ్ళకు పైగా చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీ ఏనుగులాంటిదని... కుక్కలెన్ని మొరిగినా దానికేమీ కాదన్నారు. 'కేటీఆర్..నీ పేరులోనే సగం ఆంధ్ర ఉంది' అని ఎద్దేవా చేశారు. 

07:30 - December 8, 2017

ప్రాజెక్టుల పర్యటనలో భాగంగా కేసీఆర్‌ తుపాకుల గూడెం బ్యారేజ్, మేడిగడ్డ బ్యారేజీ, కన్నెపల్లి పంప్ హౌజ్, అన్నారం బ్యారేజ్, సిరిపురం పంప్ హౌజ్ లను సందర్శించారు. పనులు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యారేజీలు, పంప్ హౌజ్ లు, కాలువల నిర్మాణ పనులు మూడు షిప్టుల్లో జరగాలని అధికారులను, వర్క్ ఏజెన్సీలను కేసీఆర్‌ ఆదేశించారు. కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులు అడ్డుకుంటారని భావించి వారిని గృహ నిర్భందం చేశారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో వీరయ్య (విశ్లేషకులు), సమ్మారావు (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

22:15 - August 3, 2017

హైదరాబాద్ : మీరాకుమార్‌ పై కేసీఆర్‌ అనుచితవ్యాఖ్యలను పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఖండించారు. మీరాకుమార్‌ గురించి అనుచితంగా మాట్లాడిన కేసీఆర్‌ను దేశం మొత్తం అసహించుకుంటోందని అన్నారు. నేరెళ్ల ఘటనలో బాధితులను పరామర్శించిన లోక్‌సభా మాజీ స్పీకర్‌కు కనీస మర్యాద కూడా ఇవ్వడం ముఖ్యమంత్రికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు.

 

21:26 - May 19, 2017

హైదరాబాద్: మోదీ, కేసీఆర్‌ ప్రభుత్వాలపై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకరత్‌ ఫైర్‌ అయ్యారు. కేంద్రం రైతువ్యతిరేక విధానాలు అవవలంబిస్తోందన్నారు. రైతుల సమస్యలపై కేంద్రం నిర్లక్ష్యపూరింతంగా వ్యవహరించడం వల్లే .. దేశవ్యాప్తంగా అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణలో మిర్చిరైతులు, ఉపాధిహామీ కూలీల సమస్యలపై బృందాకరత్‌ గళమెత్తారు. ఉపాధి హామీకూలీల పట్ల కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు నిర్దయగా ప్రవర్తిస్తున్నాయని ఆమె మండిపడ్డారు. జనవరి నుంచి ఏప్రిల్‌ వరకు తెలంగాణలో 36శాతం మంది ఉపాధి హామీ కూలీలకు డబ్బులివ్వలేదని బృందాకరత్‌ అన్నారు. ఓవైపు తమ రాష్ట్రంలో 98శాతం ఆధార్‌కార్డులు ఇచ్చేశామని కేసీఆర్‌ ప్రభుత్వం చెప్పుకుంటోంది. కాని.. కేవలం ఆధార్‌కార్డు లేదన్న సాకుతో నిరుపేదల కడుపులు కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

14:49 - April 27, 2017

హైదరాబాద్ : సీఎం కేసీఆర్‌పై టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి నిప్పులు చెరిగారు. ఓయూ విద్యార్థులకు భయపడే కేసీఆర్‌ శతాబ్ది ఉత్సవాల్లో మాట్లాడకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. ఓయూ శతాబ్ది ఉత్సవాలకు పూర్వవిద్యార్థులను కానీ, ప్రతిపక్ష నేతలను గానీ ఆహ్వానించకపోవడం శోచనీయమన్నారు. వరంగల్‌లో ప్రగతినివేదన సభ అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారని, అసలు మూడేళ్లలో కేసీఆర్‌ సాధించిన ప్రగతి ఏమిటో చెప్పాలన్నారు. 

06:57 - April 27, 2017

హైదరాబాద్: కేసీఆర్‌ ప్రభుత్వానికి కేంద్రం వద్ద చేదు అనుభవం ఎదురైంది. 2013 భూ సేకరణ చట్టాన్ని బైపాస్‌ చేస్తూ.. కేసీఆర్‌ సర్కారు ప్రతిపాదించిన సరికొత్త చట్టాన్ని కేంద్రం వెనక్కి తిప్పిపంపింది. బిల్లుకు మార్పులు చేసి పంపాలని సూచించడంతో.. తెలంగాణ ప్రభుత్వం అయోమయంలో పడింది. ఈనెల 30 ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సవరణలు ఆమోదించాలని భావిస్తోంది టీఆర్‌ఎస్‌ సర్కార్‌.

కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టాన్ని తోసిరాజంటూ..

కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టాన్ని తోసిరాజంటూ.. సరికొత్త చట్టాన్ని ప్రతిపాదించిన కేసీఆర్‌ ప్రభుత్వానికి హస్తినలో ఎదురుదెబ్బ తగిలింది. ప్రత్యేక తెలంగాణ భూ సేకరణ బిల్లు యథాతథ ఆమోదానికి కేంద్రం నో చెప్పింది. 2013 భూ సేకరణ చట్టానికి లోబడి ప్రత్యేక చట్టం ఉండాలని..విపక్షాలు, నిపుణులు, ప్రజా సంఘాలు నెత్తీనోరు బాదుకుని చెప్పినా వినకుండా, అంసెబ్లీలో సంఖ్యాబలం అండగా, కేసీఆర్‌ సర్కారు భూసేకరణ కొత్త బిల్లును పాస్‌ చేయించి, రాష్ట్రపతి అమోదానికి పంపింది. ఈ బిల్లు గుజరాత్ ప్రభుత్వం అమలు చేస్తున్న భూసేకరణ బిల్లు తరహాలో ఉంటుందని.. మోదీ ప్రభుత్వం ఈజీగా ఆమోద ముద్ర వేస్తుందని ఆశించింది. కానీ హస్తినలో సీన్ రివర్స్ కావడంతో టీఆర్ఎస్‌ కంగుతింది.

కేసీఆర్‌ ప్రభుత్వానికి హస్తినలో చుక్కెదురు....

తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త భూ సేక‌ర‌ణ చట్టం బిల్లు డ్రాప్ట్‌పై కేంద్ర న్యాయశాఖ అనేక అభ్యంతరాలు వ్యక్తం చేసింది. కలెక్టర్లకు ఫెయిర్ compensation ఇస్తామని అనే పదం.. ascertain బదులు revisit అనే పదం పెట్టమని.. అలాగే క్లాస్ 3,10లనూ తొలగించమని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందలేదు. దీంతో గుజ‌రాత్ త‌ర‌హా భూ సేక‌ర‌ణ విధానాన్ని తెలంగాణ‌లోనూ అమ‌లు చేసేందుకు కేబినెట్‌లో చర్చించింది. రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నేతృత్వంలో అధ్యయన కమీటిని ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో ప్రత్యేక అవసరాల పేరుతో కొత్త భూ సేకరణ చట్టాన్ని మంత్రివర్గం ఆమోదించింది. దీని ద్వారా పరిహారం త్వరగా చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పింది.

బిల్లుపై కేంద్ర న్యాయశాఖ అభ్యంతరాలు ....

ప్రాజెక్టుల నిర్మాణానికి భూసేకరణ అడ్డంకిగా మారిందని గుర్తించిన ప్రభుత్వం గతంలో 123 జీవో తెచ్చింది. మల్లన్నసాగర్ రిజర్వాయర్ కింద భూములు కోల్పోయే బాధితులు 2013 భూసేకరణ చట్టం ప్రకారమే తమకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనబాట పట్టారు. మరోవైపు మెదక్ జిల్లాలో నిమ్జ్ భూసేకరణ విషయంలో కొందరు రైతు కూలీలు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో భూ నిర్వాసితులకు,రైతు కూలీలకు మెరుగైన ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. 2013 భూసేకరణ చట్టం ద్వారా భూసేకరణకు ఇబ్బందులు తప్పవని గ్రహించిన సర్కార్.. హడావుడిగా కొత్త బిల్లును రూపొందించింది.

భూసేకరణ అడ్డంకులను అధిగమించేందుకు 123 జీవో ...

ఇటీవల ఢిల్లీ వెళ్ళిన సీఎం కేసిఆర్ కేంద్ర న్యాయశాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌ను కలిసి.. ప్రత్యేక తెలంగాణ భూసేకరణ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని కోరారు. మార్పులు అనివార్యమని కేంద్ర మంత్రి స్పష్టం చేయడంతో చేసేది లేక సీఎం కేసీఆర్ తిరిగి రాష్ట్రానికి చేరుకున్నారు. వచ్చీరాగానే రెవిన్యూ,నీటి పారుదల శాఖ అధికారులు, సిఎస్‌తో ప్రత్యేకంగా భేటి అయ్యారు. కేంద్రం ఎత్తి చూపిన లోపాలను అధిగమించే విషయంపై న్యాయనిపుణులతో చర్చించారు.

బిల్లును ఆమోదించాలని కేంద్ర న్యాయశాఖ మంత్రిని కోరిన కేసీఆర్‌ .....

కేంద్రం చెప్పినట్లు మార్పులు చేర్పులు చేసినా.. బిల్లును తిరిగి అసెంబ్లీలో ఆమోదం పొందాల్సి ఉంటుంది. సంఖ్యా బలంతో బిల్లు మరోసారి ఆమోదం పొందినా.. ప్రతిపక్షాల నుంచి సర్కార్‌కు ఇక్కట్లు తప్పేలా లేవు. ఈనెల 30న ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి సవరణలు ఆమోదించాలని సర్కార్‌ ప్లాన్‌ చేస్తోంది. 

08:56 - February 19, 2017

ఖమ్మం : ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీల కోసం సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్‌ ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని కరత్‌ ఆరోపించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మంలో బోసుబొమ్మ సెంటర్‌ వద్ద సీపీఎం మహాజన పాదయాత్రలో పాల్గొన్న ప్రకాశ్‌కరత్‌.. వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో తమ్మినేని సుబ్బయ్య భవనాన్ని ప్రారంభించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎంబీసీల కోసం సబ్‌ప్లాన్‌ చట్టం చేయాలని సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ డిమాండ్‌ చేశారు. కేంద్రంలోని మోదీ ప్లానింగ్‌ కమిషన్‌ను రద్దు చేసి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అన్యాయం చేశారని కరత్‌ ఆరోపించారు. తెలంగాణలో అసమానతలను రూపుమాపాలన్న లక్ష్యంతోనే తమ్మినేని పాదయాత్ర కొనసాగుతోందని ప్రకాశ్‌ కరత్‌ అన్నారు.

కేసీఆర్‌ కూడా మొండి వైఖరి..
ప్రధాని మోదీలాగానే తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా మొండి వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బోసుబొమ్మ సెంటర్‌ వద్ద సీపీఎం మహాజన పాదయాత్రలో ఆయన పాల్గొన్న ప్రకాశ్‌కరత్‌.. అనంతరం వరంగల్‌ క్రాస్‌ రోడ్డులో తమ్మినేని సుబ్బయ్య భవనాన్ని ప్రారంభించారు. సీపీఎం చేపట్టిన మహాజన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని తమ్మినేని వీరభద్రం అన్నారు. సామాజిక న్యాయం సాధించేవరకు సీపీఎం పార్టీ పోరాడుతూనే ఉంటుందని ఆయన తెలిపారు. తెలంగాణ అభివృద్ధిలో నంబర్‌వన్‌ అని చెబుతున్న కేసీఆర్‌.. బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలను పట్టించుకోవడం లేదని తమ్మినేని విమర్శించారు. జనం బతుకులు మార్చడానికి ప్రభుత్వం పనిచేయాలని తమ్మినేని సూచించారు. 125వ రోజు సీపీఎం మహాజన పాదయాత్ర ఖమ్మం టౌన్‌లో పర్యటించింది. 125వ రోజు తమ్మినేని పాదయాత్రకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మద్దతు తెలిపారు.

19:42 - February 16, 2017

హైదరాబాద్ : అన్నా డీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళలాగానే... సీఎం కేసీఆర్‌, మంత్రి హరీశ్‌ రావులకు శిక్ష తప్పదని బీజేపీ నేత నాగం జనార్దన్‌ రెడ్డి అన్నారు.. కేసీఆర్ ప్రభుత్వ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఆధారాలు అందజేశానని స్పష్టం చేశారు.. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును తాగునీటి ప్రాజెక్టంటూ కోర్టులో అఫిడవిట్‌ వేశారని ఆరోపించారు.. ఈ అఫిడవిట్‌ వల్లే కేవలం తాగునీటికి సంబంధించిన పనులే చేయాలని కోర్టు ఆదేశించిందని గుర్తుచేశారు.. తాను అవినీతికి వ్యతిరేకమని... ప్రాజెక్టులకు కాదని తేల్చిచెప్పారు..

 

07:23 - October 29, 2016

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ గవర్నర్‌ నరసింహన్‌ను రాజ్‌భవన్‌లో కలిశారు. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ తీర్పు వల్ల జరగనున్న నష్టాన్ని వివరించారు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే సచివాలయం తరలింపుపై కూడా గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. ఏపీ సచివాలయానికి కేటాయించిన భవనాలు అప్పగించే నేపథ్యంలో తాత్కాలిక వసతికి ఏపీ అడిగిన భవనాన్ని ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. నవంబర్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కూడా ఈ భేటీలో చర్చించినట్లు సమాచారం. 

Pages

Don't Miss

Subscribe to RSS - కేసీఆర్‌