కేసు

11:15 - June 22, 2017

హైదరాబాద్ : శిరీష కేసులో కొత్త ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. శిరీషను కుకునూరుపల్లి పోలీస్ క్వార్టర్స్‌కు కాకుండా వేరే చోటకు తీసుకెళ్లారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భర్తకు ఫోన్ నుంచి రెండు లోకేషన్లు శిరీష షేర్‌ చేయగా.. ఒకటి కుకునూరు పల్లి హైవే, మరొకటి దగ్గర్లోని ఫామ్‌హౌస్‌ను చూపిస్తోంది. ఫామ్‌హౌస్‌లో శిరీషను హత్య చేశారని ఆమె బాబాయి శ్రీనివాస్‌రావు ఆరోపిస్తున్నారు. రాజీవ్‌,శ్రవణ్‌, ఎస్సై ప్రభాకర్‌ రెడ్డి ముగ్గురు కలిసి ఆమెను మట్టుబెట్టారని అంటున్నాడు. హత్యను ఆత్మహత్యగా చిత్రికరించారని ఆరోపిస్తున్నాడు. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

12:17 - June 16, 2017

ముంబై : కాసేపట్లో 1993 బాంబు పేలుళ్ల కేసులో ముంబైలోని టాడా కోర్టు తీర్పును వెల్లడించనుంది. 24 ఏళ్ల తర్వాత కోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. ఈ పేలుళ్లలో 257మందికి పైగా మృతి చెందారు. 700మందికి గాయాలయ్యాయి. 2003 నుంచి 2010 మధ్య ఈ కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేలుళ్లలో ప్రధాన నిందితుడు అండర్ వల్డ్ డాన్ అబూసలేం ఉన్నాడు. నిందితులపై కుట్ర, హత్య నేరాల కింద కేసులు నమోదు చేశారు. బాదితులు మాత్రం 24 ఏళ్లు గడిచిన నిందితులకు శిక్ష వేయకపోవడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.

11:37 - June 16, 2017

హైదరాబాద్ : శిరీష మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతోంది. నిన్న ఆర్జే స్టూడియోలో రాజీవ్, శ్రవణ్ లను పోలీసులు 7గంటల పాటు విచారించారు. గత మూడు రోజుల నుంచి పోలీసులు విచారణలో నిమగ్నమయ్యారు. శిరీష మృతదేహనికి గాయాలైనట్లు తెలుస్తోంది. ఒకవేళ శిరీషది హత్య అయితే ఆ హత్య ఎవరు చేశారు. హత్యకు ప్రభాకర్ రెడ్డి సంబంధం ఉందా లేక రాజీవ్ శిరీష హత్య చేశాడా..అసలు ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవలసిన అవసమేమిటి..? అన్నిటికి సమాధానం మధ్యాహ్నం తెలియనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి కేసు సంబంధించి వివరాలు వెల్లడిస్తారు. 

10:46 - June 16, 2017

చిత్తూరు : తిరుమలో బుధవారం కిడ్నాప్ గురైన ఏడాది బాలుడి కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. పోలీసులు కిడ్నాపర్ల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. కిడ్నాపర్లు ప్రైవేట్ బస్సులో తిరుపతి నుంచి చిత్తూరు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును పోలీసుల ప్రతిష్టాత్మంగా తీసుకున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాపర్లను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. చిత్తూరు కిడ్నాపర్ల కదలిలను పోలీసులు గుర్తించారు. బాలుడు కిడ్నాప్ జరిగి 36 గంటలు గడిచిన బాలుడి ఆచూకీ లభించకపోవడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. 

21:22 - June 14, 2017

సిద్ధిపేట : కుకునూరుపల్లి పీఎస్‌కు వచ్చిన ఎస్సై ప్రభాకర్‌రెడ్డి భార్య రచన..కేసును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. శిరీషతో తన భర్తకు సంబంధం లేదన్నారు. పూర్తిగా నిర్ధారణ అయ్యే వరకు తన భర్త మృతదేహాన్ని తీసుకెళ్లనని రచన తేల్చిచెప్పారు.

19:28 - June 9, 2017

కరీంనగర్ : యువతిపై గ్యాంగ్ రేపు కేసులో దోషులకు శిక్ష పడింది. నిందితులకు కరీంనగర్ కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరొకరికి జువైనల్ హోంకు తరలించారు. వీణవంక మండలం చల్లూరులో యువతి పోలీసు ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతోంది. ఈనేపథ్యంలో 2016 ఫిబ్రవరి 11న శ్రీనివాస్, అంజయ్యలు యువతికి మాయమాటలు చెప్పి సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి... ఆమెపై అతికిరాతకంగా అత్యాచారం చేశారు. వారితోపాటు వెళ్లిన మరో మైనర్ బాలుడు దృశ్యాలను సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ఈ ఘటనపై 15 నెలలపాటు విచారణ కొనసాగింది. 

17:05 - May 31, 2017

వికారాబాద్‌ : జిల్లాలో కన్నారెడ్డి అనే యువకునిపై పోలీసులు తీవ్రంగా కొట్టిన ఘటనలో ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. కన్నారెడ్డిపై స్థానిక ఏవో ఫిర్యాదు చేయడంతో.. మోమిన్‌పేట పోలీసులు అతడ్ని దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో చిన్నారెడ్డి రెండు కిడ్నీలు ఫెయిలయి.. ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం కావడంతో... ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు పాటించారు. ఎలాంటి విచారణ జరపకుండా... బాధితునిని తీవ్రంగా కొట్టినందుకు... మోమిన్‌పేట ఎస్‌ఐ రాజు, ఏఎస్‌ఐ వీరస్వామి, హెడ్ కానిస్టేబుళ్లు వెంకటేశ్, శంకరయ్య, కానిస్టేబుళ్లు శివయ్య, రాఘవేందర్‌ను అటాచ్ చేస్తూ ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.

16:42 - May 30, 2017

లక్నో : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట కలిగింది. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి సహా 12 మందికి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేసింది. 20 వేల వ్యక్తిగత పూచి కింద వీరికి బెయిలు మంజూరు అయింది. ఈ కేసులో అభియోగాల నమోదుకు నిందితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వాని సహా బిజెపి అగ్రనేతలపై కేసును పునరుద్ధరించాలన్న సిబిఐ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో పాటు లక్నో కోర్టులోనూ రోజువారీ విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా సిబిఐ ప్రత్యేక కోర్టు అద్వాని సహా సీనియర్‌ నేతలపై విచారణ జరిపింది. 

21:46 - May 29, 2017

సిమ్లా : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హిమాచల్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్‌కు పటియాల హౌస్‌ కోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో వీరభద్రసింగ్‌తో పాటు ఆయన భార్యకు బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత పూచీకత్తుతో పాటు, అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని వీరభద్రసింగ్‌ను కోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణ జూలై 27వ తేదీకి వాయిదా పడింది. సిబిఐ దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగడం లేదని, రాజకీయ ప్రోద్బలంతో సిబిఐ పనిచేస్తోందని విచారణ సందర్భంగా వీరభద్రసింగ్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వీరభద్రసింగ్‌ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో10 కోట్ల రూపాయల ఆస్తులను అక్రమంగా కూడబెట్టినట్లు ఆరోపణలున్నాయి. అక్రమాస్తుల కేసులో బెయిల్‌ కోరుతూ వీరభద్రసింగ్‌ ఈనెల 22న కోర్టును ఆశ్రయించారు.

 

18:13 - May 27, 2017

యాదాద్రి : జిల్లాలో సంచలనం రేపిన నరేష్ అదృశ్యం కేసు మిస్టరీ విడింది. మే 2న స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి నరేష్ ను రాడ్ తో మోది హత్య చేశాడని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. నరేష్ అదృశ్యమైన రాత్రే హత్య చేసిన శ్రీనివాసరెడ్డి మహేష్ ను హత్య చేసినట్లు ఆయన చెప్పారు. శ్రీనివాసరెడ్డికి సోదరుడు, లారీ డ్రైవర్ సత్తిరెడ్డి సహిరించారని సీపీ వెల్లడించారు. హత్య అనంతరం నరేష్ మృతదేహన్ని ట్రాక్టర్ లోడ్ కంది కట్టెల్లో వేసి నిప్పు అంటించారు. కంది కట్టెలు మండకపోవడంతో వారు అత్మకూరు వెళ్లి పెట్రోల్ బంక్ లో 5 లీటర్ల పెట్రోల్ తీసుకొచ్చి టైర్లు వేసి మృతదేహన్ని కాల్చేశారు. మరుసటి రోజు ఉదయం నరేష్ అస్థిలకను మూసీలో శ్రీనివాసరెడ్డి కలిపేశారు. మే 16న స్వాతి ఆత్మహత్య చేసుకుందని, స్వాతి ఆత్మహత్యపై విచారణ జరుపుతున్నామని, స్వాతి వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ పంపామని సీపీ తెలిపారు. పూర్తి విచారణ కోసం నిందితుల రిమాండ్ తీసుకుంటామని ప్రటించారు. పూర్తి వివరాలకు వీడియో చూడండి.  

Pages

Don't Miss

Subscribe to RSS - కేసు