కేసులు

21:42 - December 6, 2018

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేసింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలపై సెక్షన్ 171(ఈ) కింద కేసులు నమోదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఇప్పటివరకు 7వేల 852 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.

 

12:21 - December 5, 2018

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల విషయంలో ఎలక్షన్ కమిషన్ వినూత్నమైన ఏర్పాట్లకు శ్రీకారం చుట్టింది. పోలింగ్ ప్రశాంతంగా జరిపేందుకు..ఓటర్లు సౌకర్యవంతంగా ఓట్లు వేసేందుకు ఈసీ చక్కటి ఏర్పాట్లను చేస్తోంది.  వినూత్నంగా ఆలోచించింది. ఓట్లు వేసేందుకు వచ్చే ఓటర్లు బ్రీతింగ్ ఎనరైజర్  టెస్ట్ (డ్రంక్ అండ్ డ్రై) చేయాల్సి నిర్వహించాలని నిర్ణయించింది. ఏంటి డ్రంక్ అండ్ డ్రైవ్ లలో ఉపయోగించే బ్రీత్ ఎనరైజర్స్ ను పోలింగ్ బూత్ లలో వినియోగించటం ఏంటా అనుకుంటున్నారా? అదే తెలంగాణ ఎన్నికల కమిషన్ సరికొత్త ఐడియా.
తాగుబోతులకు ఈసీ చెక్..
పోలింగ్ జరిగే సమయంలో తాగుబోతుల హల్ చల్ చేయటం సాధారణం. తాగుబోతులకు చెక్ పెట్టేందుకు..వారిని పోలింగ్ బూత్ నుంచి దూరంగా ఉంచేందుకు బ్రీతింగ్ ఎనరైజర్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఓటర్లు మద్యం తాగి ఓటు వేయకుండా చేసేందుకు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం ఇది. ఎన్నికల బూత్ లోను దీనికి సంబంధించిన పోలీసు అధికారులను నియమించనుంది ఈసీ. దీనికి సంబంధించి పూర్తిస్థాయి అధికారాలు లేనందున కేంద్ర ఎన్నికల కమిషన్ కు తెలంగాణ ఎన్కికల కమిషన్ ఈ మేరకు ఓ ప్రతిపాదన పంపించింది. దీనికి సంబంధించిన అధికారిక ఆమోదం వచ్చినట్లుగా ఉన్నతాధికారులు వెల్లడించారు. మద్యం తాగి ఓటు వేయటానికి వచ్చి పట్టుబడినా.. ఓటు వేసేందుకు వచ్చి ఘర్షణలకు పాల్పడినా కేసులు నమోదు చేస్తారు. ఈ ఎన్నికల సీజన్ లో పోలీసులు ఇప్పటికే రూ. 9.62 కోట్లు విలువైన 4 కోట్ల 79వేల 868 లీటర్ల మద్యం, 94.17 కోట్ల రూపాయలు, బంగారం, వెండి, గంజ, గుట్కా, పొగాకు వంటి ఇతర పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. బాటిల్ తీసుకుని ఓటు వేస్తాం అంటే ఇక కుదరదు. కిక్కులో మీట నొక్కటం కూడా వీలుకాదు. బీ కేర్ ఫుల్ ఓటర్లు...

14:54 - November 29, 2018

హైదరాబాద్ : వ్యభిచారంపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం చేయటాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించలేమనీ..అటువంటి కేసులపై పీడీ యాక్ట్‌ ప్రయోగం అర్థరహితమని హైకోర్టు స్పష్టం చేసింది. యాదాద్రిలో వ్యభిచార గృహాలు నిర్వహిస్తున్న వారిని పట్టుకుని వారిపై పీడీ యాక్ట్‌ ప్రయోగించడమేకాక, మహిళలను నిర్బంధించి జైలులో ఉంచడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. చట్టం అమలు చేసేటప్పుడు సహేతుకత పాటించాలని, చట్టం పేరుతో మహిళల జీవించే స్వేచ్ఛను అడ్డుకునే ప్రయత్నం చేయొద్దని కోర్టు హెచ్చరించింది.
చిన్నారుల్ని వ్యభిచార కూపంలోకి దింపుతున్నారని ఆరోపిస్తూ యాదాద్రికి చెందిన నలుగురు మహిళలపై పోలీసులు పీడీ యాక్ట్‌ ప్రయోగించి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ మహిళ తరపున బంధువులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం పోలీసుల తీరును తప్పుపట్టింది. అలజడులు, అశాంతికి కారణమయ్యే తీవ్రమైన నేరాలు జరిగిన సందర్భాల్లోనే నిందితులపై ఈ చట్టాన్ని ప్రయోగించాలని గుర్తు చేసింది.
 

21:35 - November 7, 2018

చెన్నై: సుప్రీంకోర్టు ఆదేశాలను తమిళనాడు పోలీసులు తు.చ తప్పకుండా పాటించినట్టున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలను కేసులతో భయపెట్టారు. మంగళవారం నుంచి బుధవారం మధ్యాహ్నం వరకు అందిన సమాచారం ప్రకారం..దీపావళి బాణాసంచా కాల్చే సమయాన్ని పాటించని, సుప్రీం కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 2100 కేసులు నమోదు చేసి... 650 మందిని అరెస్ట్ చేశారు. వీటిలో చెన్నైలో అత్యధికంగా 344, కోయంబత్తూరులో 184 కేసులు, విల్లిపురంలో 160 కేసులు నమోదయ్యాయి. సెక్షన్ 291, 188, 268 కింద ఈ కేసులు నమోదు చేశారు.  సుప్రీం ఆదేశాల మేరకు ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు బాణాసంచా కాల్చాలని తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధలను పాటించని వారిపై న్యూసెన్స్ కేసులు నమోదు చేశారు. 

12:18 - October 25, 2018

ఢిల్లీ : వివాదాస్పద, సంచలన వ్యాఖ్యలకు కేంద్ర బిందువుగా నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమ్మణ్యస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వపార్టీపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటానికి కూడా ఆయన వెనుకడరనే మాట మరోసారి నిరూపించబడింది. సీబీఐలో జరుగుతున్న అవినీతిని దృష్టిలో పెట్టుకున్న ఆయన తమ ప్రభుత్వమే నిందితులను కాపాడుతోందని, అటువంటప్పుడు తాను అవినీతిపై పోరాడడం వల్ల వచ్చే ఉపయోగం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు..సీబీఐ తదుపరి లక్ష్యం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారి రాజేశ్వర్ సింగ్ అని జోస్యం చెప్పిన ఆయన.. రాజేశ్వర్ సింగ్‌పై వేటేయాలని ‘పాత్రధారులు’ భావిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ తాను చెప్పినట్టుగా జరిగితే కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరంపై తాను పెట్టిన కేసులన్నింటినీ ఉపసంహరించుకుంటానని సుబ్రహ్మణ్యస్వామి పేర్కొనటం మరో విశేషంగా చెప్పుకోవచ్చు.
 

09:21 - October 25, 2018

ఉత్తరప్రదేశ్ : అత్తాకోడళ్ల మధ్య రొట్టె మాడింది అనే చందంగా మారింది కాన్పూర్ లోని ఓ అన్నదమ్ముల పరిస్థితి. ఓ బంగారం షాపులో జరిగిన భారీ దోపిడీల్లో కూడా రికార్డ్ సృష్టించింది. వందలు కాదు వేలు కాదు లక్షలు కాదు కోట్ల రూపాల విలువైన పసిడి దోపిడీకి గురైంది. అంతేకాదు ఈ దోపిడీయే ఈ శతాబ్ధంలోకెల్ల ఇండియాలో నమోదైన అతిపెద్ద దోపిడీల్లో ఇది కూడా ఒకటిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, బిర్హానా రోడ్డులో ఉన్న ఓ ఆభరణాల దుకాణంలోకి చొరబడిన దుండగులు రూ. 140 కోట్ల విలువైన ఆభరణాలను దొంగిలించుకు వెళ్లారు. 10 వేల క్యారెట్ల విలువైన డైమండ్స్, 100 కిలోల బంగారం, 500 కిలోల వెండి, ఐదు వేల క్యారెట్ల విలువైన ఆభరణాలను దొంగలు దోచుకెళ్లినట్టు సమాచారం. ఈ షాప్ ను యజమానుల మధ్య ఉన్న గొడవల కారణంగా ఐదేళ్ల క్రితం మూసివేయగా, ఇంత భారీ దొంగతనం జరగడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
షాపు యజమానుల మధ్య నెలకొన్న వివాదంతో కోర్టుకు ఎక్కారు. దీంతో 2013లో జ్యూయెలరీ షాపును కోర్టు ఆదేశాలతో షాపును సీజ్ చేశారు. కొద్ది రోజుల క్రితం కేసు పరిష్కారం కాగా, తిరిగి షాపును తెరచుకోవచ్చంటూ ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. మరికొన్ని రోజుల్లో మంచిరోజు చూసి షాపును తెరవాలని భావిస్తున్న తరుణంలో ఈ ఘటన జరిగింది. ఆభరణాలతో పాటు షాపుకు చెందిన కొన్ని కీలక డాక్యుమెంట్స్ కూడా దొంగలు తీసుకెళ్లినట్టు పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశారు. కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు, దొంగలను గుర్తించేందుకు అన్ని మార్గాల్లో అన్వేషణ సాగిస్తున్నామని తెలిపారు.

 

07:22 - October 9, 2018

హైదరాబాద్‌ : నగరంలో ఈడీ దాడులు కలకలం రేపాయి. సీబీఐ మాజీ డైరక్టర్ విజయరామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణరావు డైరక్టర్‌గా ఉన్న సంస్థల్లో ఈడీ సోదాలు చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకుల నుంచి 304కోట్ల రూపాయల నిధుల మళ్లింపు, ఎగవేత ఆరోపణలతో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు, హార్డ్‌డిస్కులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వ్యాపారం నిమిత్తం బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను దారి మళ్లించి సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలపై ఈ సోదాలు జరిగాయని సమాచారం. ఇదే సంస్థకు చెందిన చెన్నై, బెంగళూరు కార్యాలయాల్లోనూ ఈడీ బృందాలు సోదాలు చేశాయి. 

సీబీఐ మాజీ డైరక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు శ్రీనివాస కల్యాణరావుపై గతంలో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన స్థాపించిన బెస్ట్‌ క్రామ్టన్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ తరఫున వివిధ బ్యాంకుల నుంచి రూ.304 కోట్ల రుణం తీసుకొని చెల్లించలేదన్న ఆరోపణలపై సీబీఐ 2016లో కేసు నమోదు చేసింది. చెన్నైలోని సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఫిర్యాదు ఆధారంగానే ఈ కేసు నమోదయ్యింది. మోసపూరితంగా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగవేశారన్న ఆరోపణలపై కేసు నమోదు చేసిన సీబీఐ దర్యాప్తు పూర్తిచేసి అభియోగపత్రాలు దాఖలు చేసింది. ఈడీ సోదాల కారణంగా మరోమారు శ్రీనివాస కల్యాణరావు పేరు వెలుగులోకి వచ్చింది.
 

17:43 - October 3, 2018

నిజామాబాద్ : టీఆర్ఎస్ ప్రజాశీర్వాద భారీ బహిరంగసభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతు..నిజామాబాద్ పౌరుషానికి ప్రతీకగా నిలిచిందని..గత ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించారనీ.. తెలంగాణ ఉద్యమంలోను జిల్లా పాత్ర ప్రాధాన్యత కలిగిందన్నారు. ఈరోజు కాంగ్రెస్ నేతలు రూ.2వేల పెన్షన్ ఇస్తామంటు ఓట్లు అడిగేందుకు వస్తున్నారనీ..వారి నోట రూ.2వేలు పలికించింది గులాబీ జెండాయేనని కేసీఆర్ కండువా ఎత్తి చూపెడుతు తెలిపారు. 452 పథకాలను మేనిఫెస్టో లేనివి కూడా అమలు చేస్తున్నామన్నారు. 
టీఆర్ఎస్ పార్టీ అధికారం చేపట్టేనాటికి అన్నీ సంక్షోభాలనే వున్నాయనీ..శిథిలమైపోయిన చెరువులు, తాగు,సాగునీరు వంటి కరవు పరిస్థితుల నుండి ఈనాడు జిల్లాలో పచ్చటి పొలాలు కనిపిస్తున్నాయంటే కనువిందు చేస్తున్నాయంటే మన స్వపరిపాలనే కారణమన్నారు. స్వపరిపాలనలో కలల్ని సాకారం చేసుకునే దిశగా పయనిస్తున్నామని కేసీఆర్ అన్నారు. 24గంటలు విద్యుత్ సాధించిన ఘనత టీఆర్ఎస్ పార్టీదేనన్నారు.  ప్రతీ ఇంటికి తాగునీరే లక్ష్యంగా కొనసాగుతున్నామన్నారు. తెలంగాణలో మిషన్ భగీరథ విజయపథంలో కొనసాగుతోందని తెలిపారు. రూ.42వేల కోట్లతో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని..త్వరలో పెన్షన్స్ కూడా పెంచబోతున్నామని తెలిపారు. ఆడపిల్ల పుట్టిననాటి నుండి ప్రతీ అంశంలోను టీఆర్ఎస్ బాధ్యత తీసుకుని ఆడబిడ్డలకు ఆసరాగా నిలిచామని కేసీఆర్ పేర్కొన్నారు. 
తెలంగాణ, నిజామాబాద్, టీఆర్ఎస్, ప్రజాశీర్వాద సభ, కేసీఆర్, కాంగ్రెస్, కేసులు, పెన్షన్, మిషన్ భగీరథ, 

 

06:39 - September 25, 2018

ఢిల్లీ : భారత్‌లో దోచుకున్నవాడికి దోచుకున్నంతగా అన్న చందంగా మారిపోయింది. స్కామ్ లు, ప్రజాధనాన్ని దోచుకునే తెలివితేటలు వుంటే చాలు లక్షలాది కోట్లు దోచేసుకోవచ్చు. దానికి కావాల్సిందల్లా నేతల అండదండులంటే చాలు. మరే పెట్టుబడి అవరమేలేదు. వేలాది, లక్షలాది కోట్లు దోచేసుకుని బడా వ్యాపారస్తులా చలామణి అవుతు విదేశాలకు చెక్కేస్తున్నారు. దీని ప్రభుత్వం కూడా తమ వంతుగా సహకరిస్తున బడాబాబులు కొమ్ముకాస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ లో మరో విజయ్ మాల్యా ఉదంతం వెలుగులోకి వచ్చింది. 
వ్యాపారవేత్త విజయ్ మాల్యా, వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ తరహాలోనే మరో వ్యాపారవేత్త ప్రభుత్వ రంగ బ్యాంకులకు షాకిచ్చాడు. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలోని కన్సార్టియం నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న స్టెర్లింగ్ బయోటెక్ అధినేత నితిన్ సందేశర భారత్ నుంచి నైజీరియాకు చెక్కేశాడు. ఇప్పటికే సీబీఐతో పాటు ఈడీ కేసులు ఉన్నప్పటికీ నితిన్ భారత్ నుంచి చల్లగా జారుకోవడం పట్ల సర్వత్ర విస్మయం వ్యక్తమవుతోంది.
గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంకులు సీబీఐకి ఫిర్యాదు చేశాయి. ఈ నేపథ్యంలో నితిన్‌తో పాటు కంపెనీలో భాగస్వాములుగా ఉన్న అతని కుటుంబ సభ్యులపై సీబీఐ, ఈడీలు కేసును నమోదుచేశాయి. దీంతో విచారణను తప్పించుకునేందుకు నితిన్ విదేశాలకు పారిపోయినట్లు తెలుస్తోంది. తొలుత నితిన్‌ను దుబాయ్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే అది నిజం కాదనీ, ఇప్పటికే నితిన్ కుటుంబం నైజీరియాకు వెళ్లిపోయిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి తెలిపారు. బ్యాంకుల నుంచి రూ.5,383 కోట్ల రుణం తీసుకున్న నితిన్ ఈ మొత్తాన్ని 300 డొల్ల కంపెనీల ద్వారా దేశవిదేశాల్లోని అకౌంట్లలోకి అక్రమంగా మళ్లించాడని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటికే రూ.4,700 కోట్ల విలువైన స్టెర్లింగ్ బయోటెక్ ఆస్తులను జప్తు చేసింది. కాగా, ప్రస్తుతం నైజీరియాలో తలదాచుకున్నారని భావిస్తున్న నితిన్ కుటుంబాన్ని భారత్ కు రప్పించేందుకు ఇంటర్ పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులను జారీచేసే అవకాశముందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 

 

11:27 - September 17, 2018

విజయవాడ :  బాబ్లీ ప్రాజెక్టు వారంట్లను తెలుగు రాష్ట్రాల ప్రజలను నిరసించారని, ఒకవైపు పాత కేసులు తవ్వితోడుతున్నారని సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. మరోవైపు తప్పుడు సర్వేలు చేయిస్తున్నారని, ఇంకోవైపు శాంతిభద్రతలను దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. కొందరిని రెచ్చగొట్టి అశాంతి సృష్టించాలని చూస్తున్నారని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 
అసెంబ్లీ వ్యూహ కమిటీ బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్్స నిర్వహించారు. ఇంకా మూడు రోజులు మాత్రమే సమావేశాలున్నాయని, అర్థవంతమైన చర్చతో ప్రజలను ఆకట్టుకోవాలని ఈ విరామంలో ‘జలసిరికి హారతి’ నిర్వహించడం జరిగిందన్నారు. రైతుల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. జలసంరక్షణపై ప్రజలను చైతన్యపరచడం జరిగిందని పేర్కొన్నారు. ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ వెబ్ సైట్ కు స్పందన బాగుందని చెప్పుకొచ్చారు.

Pages

Don't Miss

Subscribe to RSS - కేసులు