కౌంటర్

06:45 - April 27, 2018

విజయవాడ : పవన్‌ కల్యాణ్‌ తనపై చేసిన అవినీతి ఆరోపణలకు ఆధారాలుంటే బయట పెట్టాలని ఏపీ మంత్రి లోకేష్‌ డిమాండ్ చేశారు. తమ కుటుంబ ఆస్తులను ఎనిమిదేళ్లుగా ప్రకటిస్తున్నామన్నారు. అంతకుమించి ఎక్కడైనా ఆస్తులుంటే బయటపెట్టాలని... వాటిని వారికే రాసిస్తానన్నారు. విజయనగరంలో పర్యటించిన ఆయన.. పవన్‌ కల్యాణ్‌ అంటే తనకు వ్యక్తిగతంగా ఎప్పుడూ గౌరవమేనన్నారు. కొందరు పవన్‌ చుట్టూ చేరి తనపై ఆరోపణలు చేయిస్తున్నారని అన్నారు

07:58 - April 2, 2018

పార్లమెంటులో ప్రత్యేకహోదా పోరు మరింత హీటెక్కుతోంది. సోమవారం తిరిగి సభ ప్రారంభమవుతున్న నేపథ్యంలో విపక్షాలు అవిశ్వాస అస్త్రాన్ని మరోసారి ప్రయోగించనున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌తో సహా వామపక్షాలు, టీడీపీ, వైసీపీ ఎంపీలు అవిశ్వాసం కోసం మరోసారి పట్టుబట్టనున్నాయి. మరోవైపు జాతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లుతున్నారు. ఇప్పటికే రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన వైసీపీ ఎంపీలు టీడీపీకి సవాల్‌ విసురుతున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా చంద్రబాబుకూడా టీడీపీ ఎంపీల చేత రాజీనామా చేయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఆయా అంశాలపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో తెలకపల్లి రవి (విశ్లేషకులు), దుర్గా ప్రసాద్ (టిడిపి), రమేష్ (వైసీపీ), విష్ణు (బీజేపీ) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

14:29 - March 24, 2018
12:25 - December 26, 2017

గుంటూరు : ల్లా తెనాలి మండలం కొలకలూరు రైల్వేస్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. టికెట్‌ బుకింగ్‌ కౌంటర్‌ పాక్షింగా కాలిపోయింది. అయితే అక్కడ మద్యం బాటిళ్లు, ఎమ్మార్పిఎస్‌ జెండాలు ఉండటంతో అనుమానాలు కలుగుతున్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు. 

17:05 - November 14, 2017

హైదరాబాద్ : టీఆర్‌టీ(టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్) నోటిఫికేషన్ పై ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఇటీవలే టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. కానీ కొత్త జిల్లాల వారీగా కాకుండా పాత జిల్లాల వారీగా నోటిఫికేషన్ వేయాలని అభ్యర్థులు డిమాండ్ చేశారు. దీనితో హైకోర్టులో దీనిపై పిటిషన్ దాఖలైంది. కొత్త జిల్లాల మాదిరిగా కాకుండా పాత జిల్లాల ప్రకారమే నోటిఫికేషన్ విడుదల చేయాలని పిటిషన్ లో కోరారు. వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణనను వారం రోజులకు వాయిదా వేసింది. 

15:44 - October 10, 2017
10:21 - September 8, 2017
21:35 - July 11, 2017

హైరదాబాద్ : ప్రాజెక్టులతో తెలంగాణను ముంచిన చరిత్ర కాంగ్రెస్‌దేనంటూ మంత్రి హరీష్‌రావు చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌ రెడ్డి. పులిచింతలపై టీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు బానిసలుగా మారిన టీఆర్‌ఎస్ నేతలు... కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ముంపు బాధితులను మీడియా ముందుకు తీసుకొచ్చిన ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి... పులి చింతలతో కొంత ముంపుకు గురైనా.. తెలంగాణకు మేలు జరిగిందని వారితోనే చెప్పించారు. 

16:03 - December 27, 2016

హైదరాబాద్ : ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలైనా ఇప్పటివరకే కేవలం 1200 డబుల్‌బెడ్‌రూం ఇళ్లను మాత్రమే కట్టారని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. వచ్చే రెండున్నర సంవత్సరాల్లో లక్ష ఇండ్లు కట్టడం అసాధ్యమన్నారు. ఒకవేళ ప్రభుత్వం లక్ష ఇండ్లు కడితే వచ్చే ఎన్నికల్లో పోటీచేయమని సవాల్‌ విసిరారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5లక్షలుగా నిర్ణయించి టెండర్లు పిలవడంవల్లే ఎవరూ ముందుకు రావడంలేదని కోమటిరెడ్డి విమర్శించారు.

18:30 - December 7, 2016

హైదరాబాద్ : జనాలంతా నగదు దొరక్క ఇబ్బందులు పడుతుంటే సీఎం చంద్రబాబు ఈ పాస్‌లంటూ కాలక్షేపం చేస్తున్నారని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ ఆరోపించించారు. తమ వ్యాపార భాగస్వాములును చూసుకునేందుకే విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అటు బొత్స విమర్శలకు టిడిపి చీఫ్‌విప్‌ కాల్వ శ్రీనివాసులు ఘాటుగా సమాధానమిచ్చారు. మాట్లాడేముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని బొత్సకు కౌంటర్ ఇచ్చారు. వారు ఎలా మాట్లాడారో వీడియోలో చూడండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - కౌంటర్