క్యాలెండర్

19:41 - January 11, 2017

విజయవాడ : 2017 టెన్‌టీవీ నూతన క్యాలెండర్‌ను విజయవాడలోని ఆటోనగర్ స్టోర్స్ దగ్గర వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల ఆవిష్కరించారు. అన్నివర్గాల ప్రజల ఆశయాలను నెరవేర్చేలా 10టీవీ కృషి చేస్తుందని పలువురు ప్రముఖులు కొనియాడారు. 2016లో వివిధ వర్గాల ప్రజలకు 10టీవీ అండగా నిలబడిందని హర్షం వ్యక్తం చేశారు. 2017లోనూ 10టీవీ మరిన్ని ప్రజా ఉపయోగ కార్యక్రమాలతో ముందుకెళ్లాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో బి.సత్యనారాయణ, క్రాంతి ఆజాద్, గుడివాడ రామారావు, యార్లగడ్డ సుబ్బారావు, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

18:26 - January 9, 2017

మహబూబ్‌నగర్‌ : 10 టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 10 టీవీ ప్రతినిత్యం ప్రజలపక్షాన పోరాడుతున్న ఛానల్‌ అని శ్రీనివాస్‌గౌడ్‌ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

14:57 - January 9, 2017

పెద్దపల్లి : జిల్లా మంథనిలో 10 టీవీ క్యాలెండర్‌ను మంథని ఎమ్మెల్యే పుట్టమధు ఆష్కరించారు. 10 టీవీ సిబ్బందికి, యాజమాన్యానికి ఆయన అభినందనలు తెలియజేశారు. ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభించిన 10 టీవీ... అనేక సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిందని ప్రశంసించారు.. 

13:31 - January 8, 2017
18:25 - January 2, 2017

పెద్దపెల్లి : జిల్లా ధర్మారం మండలం కేంద్రంలో 10టీవీ 2017 సంవత్సర నూతన కాలెండర్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ ఆవిష్కరించారు. సమాజంలో 10టీవీ నిర్వహిస్తున్న పాత్ర ఎప్పటికీ మరిచిపోలేనిదని ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్‌ కొనియాడారు. మూడేళ్లు పూర్తి చేసుకొని నాలుగో సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా 10టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మూడు సంవత్సరాల్లో ప్రజల సమస్యలను ఎత్తి చూపడంలో, ప్రజల పక్షాన నిలబడటంలో 10టీవీ ముందంజలో ఉందన్నారు కొప్పుల ఈశ్వర్‌. 

13:43 - January 2, 2017
13:13 - January 2, 2017

హైదరాబాద్ : న్యూస్ ఈజ్ పీపుల్ అంటూ ప్రజల సమస్యల కోసం 10టీవీ చానల్ పాటుపడడం అభినందీయమని టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 10టీవీ 2017 క్యాలెండర్‌ను ఆయన ఆవిష్కరించారు. ప్రజల సమస్యలను నిష్పాక్షితంగా వెలుగులోకి తెస్తోందని కొనియాడారు. ఇలాగే ప్రజల తరపున 10టీవీ నిరంతరం పోరాడాలని సూచించారు.

14:36 - January 14, 2016

నెల్లూరు : జిల్లా వెంకటగిరిలో 10 టీవీ క్యాలెండర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. వెంకటగిరి సంస్థానాధీశులు డాక్టర్ విబి సాయికృష్ణ యాచేంద్ర రాజా ప్యాలెస్‌లో క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్‌ వైస్‌ ఛైర్మన్‌ భీరం రాజేశ్వరరావుతో పాటు కౌన్సిలర్లు, టీడీపీ నేతలు, పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో టిడిపి ప్రజాహిత కార్యక్రమాలు చురుగ్గా చేస్తోందని భీరం రాజేశ్వరరావు పేర్కొన్నారు. 

06:33 - January 6, 2016

హైదరాబాద్ : టైమ్ టేబుల్ ఖరారైంది. ఎగ్జామ్ డేట్ ఫిక్స్‌అయింది. తెలంగాణలో విద్యాక్యాలెండర్ విడుదలైంది. అర్హతా పరీక్షలకు సంబంధించిన తేదీలు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఎంసెట్‌ నుంచి పీసెట్‌ వరకూ అన్ని ఎంట్రెన్స్‌ టెస్టుల తేదీలు సర్కార్‌ నిర్ణయించింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి సెట్ల తేదీలను ప్రకటించారు. ఇంజినీరింగ్, మెడిసిన్ కోర్సుల్లో ప్రవేశం కోసం మే 2న ఎంసెట్ జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటల వరకు ఇంజినీరింగ్ రాతపరీక్ష, మధ్యాహ్నం రెండున్నర నుంచి సాయంత్రం ఐదున్నర వరకు అగ్రికల్చర్‌ అండ్ మెడిసిన్‌ రాతపరీక్ష నిర్వహించనున్నారు. అలాగే మే 12న ఈ సెట్ పరీక్ష జరగనుంది. ఈ రెండింటీ పరీక్షల నిర్వహణ బాధ్యత జేఎన్టీయూ హైదరాబాద్‌కు దక్కింది.

నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కొరడా...
ఇక మేనేజ్‌మెంట్‌, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ కోర్సుల్లో చేసే విద్యార్థుల కోసం నిర్వహించే ఐసెట్‌ను కేయూ నిర్వహించనుంది. మే 19న ఐసెట్ పరీక్ష జరగనుంది. ఈసారి మే 27న ఎడ్‌సెట్‌, మే 29న పీజీఈసెట్‌లను ఉస్మానియా విశ్వవిద్యాలయం కండక్ట్ చేయనుంది. మే 24న లాసెట్‌ను కాకతీయ విశ్వవిద్యాలయం, మే 11న పీజీసెట్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించనున్నట్లు పాపిరెడ్డి తెలిపారు. అలాగే నాణ్యత ప్రమాణాలు పాటించని కాలేజీలపై కొరడా తప్పదని ఆయన హెచ్చరించారు. కాలేజీల్లో తనిఖీలు చేస్తామన్నారు. మరోవైపు ఓపెన్ కేటాగిరీలో పదిహేను శాతం సీట్లు ఉంటాయని పాపిరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు కూడా ఎంసెట్, ఐసెట్ లాంటి పరీక్షలు రాసేందుకు అర్హులేనన్నారు. అయితే ఏపీలో పరీక్ష కేంద్రాలు ఉండవని, తెలంగాణకు వచ్చే పరీక్ష రాయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు తెలంగాణలోని పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకోవాలన్నారు. 

20:36 - December 28, 2015

కాల చక్రం గిర్రున తిరిగింది. క్యాలెండర్ చివరి పేజీలో ఉన్నాం. గత సంవత్సర కాలంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిణామాలు..ప్రమాదాలు..ప్రమోదాలు చూశాం. కుట్రలతో ప్రపంచాన్ని మభ్య పెట్టి తన ప్రయోజనాలను కాపాడే దౌర్భాగ్యం ఒకరిది. కాళ్ల కింద నేలను నిలబెట్టుకోవాలనే బతుకు పోరాటం మరొకరిది. ఎగిసిన నినాదాలు..బిగిసిన పిడికిళ్లు..రాజాకీయ చదరంగంలో ఎత్తుకు పైఎత్తులు..ప్రకృతి శాపానికి విలయతాండవానికి పట్టు తప్పిన కూలిన లోహ విహాంగాలకు బలైన వేలాది మంది..ఇలా అనేక ఘటనలను దాటుకుని 2015 ముగింపుకు వచ్చింది.  ఇప్పుడు సిరియా నెత్తురోడుతున్న గాయం.. కొన్ని స్వార్ధపర శక్తుల కుయుక్తులకు గాయపడిన దేశం.. స్వదేశంలో ఉండలేక, పరాయి దేశంలో నానా ఇబ్బందులు పడుతున్న సిరియన్లు ఇప్పుడు అంతర్జాతీయ సమాజానికి ప్రశ్నగా నిలిచారు. 2015 సంవత్సరం సిరియాకు చేదు గుర్తులను మిగిల్చింది.

నేపాల్ భూకంపం..
ఊహించని ఉత్పాతమది.. కాళ్లకింద భూమి కదిలింది. గూడు చెదిరింది. బతుకు కకావికలమైంది. ప్రకృతి బీభత్సానికి బలైన వేలాదిమంది, ఆప్తులను కోల్పోయి, గాయాలపాలై, నిలువ నీడలేక.... విలవిల్లాడిపోయారు ఒకదాని తర్వాత మరొకటిగా వస్తున్నవరుస ఉత్పాతాలు మానవాళిని వణికిస్తున్నాయి. 2015లో వచ్చిన నేపాల్ భూకంపం సరికొత్త హెచ్చరికలను చేస్తోంది. ప్యారిస్ నుదుటిన నెత్తుటి మరక..గత నవంబర్ లో ప్యారిస్ నగరంలో విధ్వంస దృశ్యం ప్రపంచాన్ని వణికించింది. తుపాకులు గర్జించాయి.. నిమిషాల వ్యవధిలో ప్యారిస్ రక్తసిక్తమయింది. 8మంది ఐఎస్ ఐఎస్ జిహాదీలు.... 127మంది అమాయక పౌరులు మృతి చెందారు. 200మంది క్షతగాత్రులయ్యారు. చెప్పేదొకటి.., చేసేదొకటి. అంతిమంగా తన ప్రయోజనాలే ముఖ్యం. ఇదే అంకుల్ శామ్ ధోరణి. తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం ఎలాంటి పనికిమాలిన పనికైనా తెగబడటానికి వెనుకాడని నైజం. ఇదే ప్రపంచం ముందుకు ఉగ్రభూతాన్ని ఉసిగొల్పిందా? 2015ను రక్తసిక్తం చేయటంలో పెద్దన్నదే కీలకపాత్రగా భావించవచ్చా..? అది తన చిన్నారికోసం ప్రపంచానికి ప్రేమతో అందించిన కానుక.. అందమైన భవిష్యత్తు పట్ల ప్రగాఢమైన కోరిక.... మహోదయం కోసం ఓ సుందర స్వప్నం .. ఓ నిర్మాణాత్మక లక్ష్యం .. ఈ ప్రపంచాన్ని సమూలంగా మార్చి... అభద్రత లేని, అనారోగ్యం, ఆకలి లేని, అత్యంత నివాసయోగ్యమైనదిగా మార్చి భావితరాలకు అందించాలనే తపన ఉంది.. జుకర్ బర్గ్ స్వప్నం నెరవేరుతుందా.. ? జుకర్ బర్గ్ ప్రపంచానికి ఇచ్చిన కానుక 2015లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం కలిగించిన ఘటన..

ఆహార భద్రతకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు పెను ప్రమాదం ?
ఆహార భద్రతకు, ప్రజాపంపిణీ వ్యవస్థకు పెను ప్రమాదం పొంచి ఉందా?  ఇప్పటికే రైతాంగాన్ని విస్మరిస్తున్న సర్కారు ఇకముందు పూర్తిగా విస్మరించబోతోందా?  మొన్నటి నైరోబీ సమావేశం ఏ సంకేతాలిస్తోంది?  ఏ కుట్రలకు వర్ధమాన దేశాలు బలికాబోతున్నాయి? మయన్మార్‌లో 25 ఏళ్ల తర్వాత తొలిసారి జరిగిన స్వేచ్ఛాయుత ఎన్నికల్లో ప్రతిపక్ష నేత అంగ్ సాన్ సూకీ సారథ్యంలోని నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ చేతిలో పరాజయాన్ని అధికార పార్టీ అంగీకరించింది. ఈ ఎన్నికలతో మయన్మార్ కల్లోల గతం నుంచి గట్టెక్కిందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇరాక్, లిబియా, సిరియా, యెమెన్. అసలు అరబ్ దేశాల భవిష్యత్తేంటి? ఏ దాహానికి ఈ దేశాలు బలవుతున్నాయి? ఏ యుద్ధోన్మాదం లక్షలాది సామాన్యుల ఉసురు తీస్తోంది? యెమెన్ లో ఏం జరుగుతోంది? గల్ఫ్ కూటమిపై దాడులు చల్లారేదెపుడు? అప్పులిచ్చారు.. గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నాలు చేశారు. అప్పు మీద అప్పు, అప్పు తీర్చటానికి కొత్త అప్పు, కొండలా పెరిగే వడ్డీ... అన్నీ కలిసి గ్రీసు దేశాన్ని పతనం అంచున నిలిపాయి. విమానం కూలిపోయింది. ప్రపంచం దిగ్భ్రమకు గురయింది. కొద్ది సేపట్లో గమ్యం చేరుతామనుకున్న ప్రయాణికులు తిరిగిరాని లోకాలకు పయనమయ్యారు. ఆప్తులు కన్నీరుమున్నీరయ్యారు. ఏమై ఉంటుంది. ఏ కుట్రలకు 150 మంది బలయ్యారు? ఏ దారుణానికి ఆ లోహవిహంగం నేలకూలింది? ఇదీ వాల్డ్ రౌండప్.... మరిన్ని విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి..

 

 

వరల్డ్ రౌండప్ పై విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Don't Miss

Subscribe to RSS - క్యాలెండర్