క్లారిటీ

12:09 - August 29, 2017

హైదరాబాద్: అక్టోబర్ 6 పెళ్లి తో నాగచైతన్య, సమంత ఒకటి కానున్నారు. తాజాగా తన కొడుకు చైతు పెళ్లి విషయం పై బర్త్ డే బాయ్ నాగార్జున ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. అక్టోబర్ 6 న చైతు, సామ్ ల పెళ్లి .. గోవాలో అని ఖరారు చేశాడు. ఒకే రోజు హిందూ, క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం పెళ్లి జరగనున్నదని చెప్పాడు.. పెళ్లి అనంతరం హైదరాబాద్ రిసెష్పన్ ఘనంగా ఉంటుంది అని చెప్పాడు.. పెళ్లి సింపుల్ గా చేసుకోవడం అనేది మాత్రం వారిద్దరి నిర్ణయం అని నాగ్ చెప్పారు..

14:16 - August 14, 2017

గుంటూరు : ఏపీ సీఎం చంద్రబాబుతో కాపు నేతల సమావేశమయ్యారు. రిజర్వేషన్లపై క్లారిటీ ఇవ్వాలని సీఎంకు నేతలు విన్నవించారు. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేసన్ ఇస్తే మాకు చాలని మంత్రి జ్యోతుల నెహ్రూ అన్నారు. కాపులు ఆర్థికంగా ఎదగడమే మాకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రిజర్వేషన్ అంశంపై చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకుంటారని నెహ్రూ ఆశభావం వ్యక్తం చేశారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

07:26 - August 1, 2017

పవన్ కల్యాణ్ ఇప్పటివరకు క్లారిటీ లేదని, పవన్ పార్టీ ప్రశ్నించడానికా, పాలించడానికా అనేది నిర్ణయించుకోవాలని, ప్రశ్నించడాని అయితే ట్వీట్టర్, ఫేస్ బుక్ ద్వారా ప్రశ్నించవచ్చు లేక పాలించడానికి అయితే జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తారా లేదా అని వారు నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసి రెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయిన వారి పార్టీ బలోపేతం చేయడానికి ప్రయిత్నిస్తోందని, వైసీపీ ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం తమ బాద్యత అని, ప్రజ సమస్యల పరిష్కరానికి అన్ని పార్టీలతో కలసి పోరాడతామని వైసీపీ అధికార ప్రతినిధి గౌతము రెడ్డి అన్నారు. పవన్ కల్యాణ్ మానవీయ కోణంలో స్పదిస్తున్నారని, ఇవాళ వైసీపీ కూడా రాజకీయం చేయకుండా ప్రభుత్వం దృష్టి సమస్యలు తీసుకొస్తే వాటిని పరిష్కరిస్తామని, అంతేగాని పవన్ ఏజెంట్ కాదని టీడీపీ నేత దుర్గాప్రసాద్ అన్నారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:44 - May 19, 2017
09:55 - November 6, 2016

నితిన్ కొత్త సినిమాపై క్లారిటి వచ్చేసింది. వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ కొత్త మూవీలో స్టార్ హీరోయిన్ నితిన్ కి జోడిగా నటించనుంది. రెండు సినిమాలతో ఒకే అనిపించుకున్న ఓ యంగ్ డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇంతకీ నితిన్ కొత్త మూవీ విశేషాలేంటో చూద్దాం...
అ ఆ సినిమాతో భారీ హిట్టు 
అ ఆ సినిమాతో నితిన్ భారీ హిట్టు అందుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ రిలీజై 10 నెలలు గడుస్తుంది. అయిన కూడా సక్సెస్ కంటిన్యూ చేయాలనే ఆలోచనతో నితిన్ మంచి కథ కోసం ఇంతకాలం వెయిట్ చేశాడు. ఇప్పుడు స్టోరీ సెట్ కావడంతో వచ్చే నెలలో నితిన్ అఫిషియల్ గా న్యూ మూవీ స్టార్ట్ చేయబోతున్నాడు. 
హను రాఘవపూడి దర్శకత్వంలో కొత్త మూవీ
హను రాఘవపూడి దర్శకత్వంలో నితిన్ కొత్త మూవీ చేయనున్నట్లు సమాచారం. ఫిబ్రవరిలో రిలీజైన కృష్ణగాడి వీరప్రేమగాథతో ఈ దర్శకుడు మంచి సక్సెస్ అందుకున్నాడు. రిసెంట్ గా ఈ దర్శకుడు చెప్పిన స్టోరీ విన్న నితిన్ వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్.
వచ్చే నెలలో సెట్స్ పైకి
వచ్చే నెలలో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాలో నితిన్ పక్కన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు వినికిడి. అవుట్ అండ్ అవుట్ క్లీన్ ఎంటర్ టైనర్ గా ఈ మూవీ తెరకెక్కబోతుందట. క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే ట్రేడ్ వర్గాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేసేలా ప్లాన్స్ వేస్తున్నారు.

10:55 - October 2, 2016

'నాగచైతన్య' కూడా ఒపెన్ అయ్యాడు. 'సమంత'తో లవ్ ఎఫైర్ పై ఈ అక్కినేని హీరో క్లారిటి ఇచ్చేశాడు. రెండు వారాల కిందట అవును మేం లవ్ లో ఉన్నాం అంతేకాదు డేటింగ్ కూడా చేస్తున్నామంటూ 'సమంత' ఒపెన్ అయింది. ఇప్పుడు 'చైతూ' కూడా కన్ ఫర్మ్ చేస్తూ తమ లవ్ సీక్రెట్స్ ని బయటపెట్టాడు. మరి 'సమంత'తో లవ్ గురించి చైతూ ఏం చెప్పాడు ? మొత్తానికి 'నాగచైతన్య' 'సమంత'తో ప్రేమాయణం గురించి పూర్తిగా ఓపెన్ అయిపోయాడు. దాగుడు మూతలు లేకుండా అన్ని విషయాల గురించి ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ గా మాట్లాడేశాడు. తమ ఇద్దరి ప్రేమాయణం ఎలా మొదలైంది. పెళ్లి వైపు ఎలా నిర్ణయం తీసుకున్నది ఆ ఇంటర్వ్యూలో వివరించాడు 'చైతూ'. అంతేకాదు 'సమంత'తో పెళ్లి ప్రస్తావన తెచ్చింది మొదట తనేనని కూడా ఈ అక్కినేని హీరో చెప్పేశాడు. 'ఏమాయ చేసావే' సమయంలో ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. కష్టసుఖాలు మాట్లాడుకునేవాళ్లమని 'నాగచైతన్య' చెప్పుతున్నాడు సినిమాలు హిట్ అయినప్పుడు, ఫ్లాప్ అయినప్పుడు ఫీలింగ్స్ ఒకరితో ఒకరం పంచుకునేవాళ్లట. అలా వీరికి తెలియకుండానే క్లోజ్ అయ్యారట. క్లోజ్ అయ్యాక ప్రేమలో ఎలా పడ్డమనేది తెలియకుండానే జరిగిందని 'చైతూ' చెప్పుతున్నాడు. ఐతే ఈ జంట ఇప్పటిదాకా ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోలేదట. ఇది ఎవరూ నమ్మలేని విషయని ఈ యంగ్ హీరో నవ్వుతూ చెప్పుతున్నాడు.

పెళ్లిపై క్లారిటీ..
పెళ్లి గురించి కూడా 'నాగచైతన్య' క్లారిటి ఇచ్చాడు. 'సమంత' దగ్గరికెళ్లి ఎన్ని రోజులు ఇలా బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ లాగా ఉంటాం. నాకు నువ్వు కరెక్ట్ అనిపిస్తోంది. పెళ్లిచేసుకుందాం. మనిద్దరం ఒక రిలేషన్షిప్ లో కంటిన్యూ అవ్వాలంటే పెళ్లి చేసుకుందాం.. అలా కాకుండా ఇలాంటి బంధంలో ఎన్నిరోజులున్నా ప్రయోజనం ఉండదని చైతూ, సమంతతో చెప్పాడట. అంతేకాదు పెళ్లి వద్దనుకుంటే ఇంతటితో ఆపేద్దాం అని కూడా అన్నాడట. దీంతో 'సమంత' కూడా వెంటనే ఒకే అంటూ నవ్వేసిందట. అయితే ఇదంతా ఈ ఎడాదిలోనే జరిగిందట. అన్నట్లు పెళ్లి వచ్చే ఎడాదిలో ఉంటుందని చెప్పుతున్నాడు.

14:22 - September 7, 2016

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని తేలిపోయింది. మెరుగైన ప్యాకేజీ ఇస్తామని కేంద్రం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. కానీ దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నుండి సరియైన స్పందన రాకపోయేసరికి 'ఏపీ ప్యాకేజీ'పై ప్రతిష్టంభన నెలకొంది. గత కొన్ని రోజులుగా ఏపీకి ఆర్థిక సాయంపై కేంద్రం తర్జనభర్జనలు పడుతున్న సంగతి తెలిసిందే. ఎలాగైనా బుధవారం ఓ ప్రకటన విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రాన్ని కోరారు. కానీ కేంద్రం వ్యూహాత్మక అడుగులు వేసింది ప్రత్యేక హోదా లేదని..ఏపీకి భారీ ప్యాకేజీ ఇస్తామని తేల్చిచెప్పింది. దీనిపై మధ్యాహ్నం 2.30గంటలకు కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, అరుణ్ జైట్లీ సమక్షంలో ప్యాకేజీ వివరాలు ప్రకటిస్తారని తొలుత ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో వెంటనే ఢిల్లీకి రావాలని బాబుకు ఆహ్వానిస్తూ కేంద్రం ఎత్తుగడ వేసింది. కానీ దీనిని బాబు సున్నితంగా తిరస్కరించారు. కేంద్రం ఎదుట 9 ప్రతిపాదనలు పెడుతున్నట్లు దీనికి అంగీకరిస్తేనే ఢిల్లీకి వస్తానని బాబు ఖరాఖండిగా చెప్పినట్లు తెలుస్తోంది. ప్రత్యేక హోదా ఎన్డీసీకి పంపిస్తారని మరో ప్రచారం జరుగుతోంది. రాష్ట్రం ప్రభుత్వం నుండి స్పందన రాకపోవడంతో 'ఏపీ ప్యాకేజీ ప్రకటన'పై ఎలాంటి సమావేశం జరగలేదు. పారిశ్రామిక పన్నుల్లో రాయితీ, ఆర్థిక లోటు, రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి..తదితర అంశాలపై కేంద్రం క్లారిటీ ఇవ్వడం లేదని తెలుస్తోంది. 

12:33 - August 6, 2016

హైదరాబాద్ : ఉమ్మడి సంస్థల విభజనాంశం కొలిక్కి వస్తోంది. ఇరు రాష్ట్రాల సమన్వయంతో ఏర్పాటు చేసిన ఉన్నతాధికారుల కమిటీ విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఇంతవరకూ 61 సంస్థల ఆస్తుల్లో దాదాపు 30 వేల కోట్ల రూపాయలను ఇరురాష్ట్రాలు పంచుకోగా మరికొన్న సంస్థల ఆస్త్తులపై క్లారిటీ రానుంది. ఈ మేరకు విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు కమిటీ వచ్చేవారం కీలక సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

తుది దశకు ఉమ్మడి సంస్థల విభజనాంశం..
తెలుగు రాష్ట్రల మధ్య సమస్యగా ఉన్న షెడ్యూల్ సంస్థల విభజనాంశం తుది దశకు చేరుకుంటోంది. దీనిపై ఏర్పాటైన షీలా బేడీ కమిటీ కాలపరిమితి ముగిసిపోగా, కొత్తగా ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటైంది. సుమారు 60 వేల కోట్ల ఆస్తుల పంపకాలను తేల్చేందుకు రెడీ అవుతోంది.

విభనచట్టంలో పేర్కొన్న ఉమ్మడి సంస్థల సంఖ్య 89..
ఉమ్మడి సంస్థలకు సంబంధించి విభజన చట్టం షెడ్యూల్-9 విభాగంలో 89 సంస్థలున్నాయి. వాటిలో 61 సంస్థల ఆస్తుల అప్పులను రెండు రాష్ట్రాలకు షీలాబేడీ కమిటీ బదలాయించింది. జనాభా ప్రాతిపదికన పంపకాలు చేసింది. తరువాత ఈ కమిటీ కాలపరిమితి ముగియడంతో మిగతా ప్రక్రియకు బ్రేక్ పడింది.

30 సంస్థల ఆస్తుల పంపకాలపై ఏర్పడిన కొత్తకమిటీ
ఉమ్మడి సంస్థలపై ఏర్పడిన షీలా బేడీ కమిటీ కాలపరిమితి ముగియడంతో ఇప్పడు ఇరురాష్ట్రలకు చెందిన ఐఏఎస్ అధికారులతో కొత్త కమిటీ ఏర్పడింది. దీంతో మళ్లీ ఆయా సంస్థలపై కదలిక వచ్చింది. మిగిలిన 30 సంస్థల ఆస్తులు, అప్పులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల బదలాయింపులను పూర్తి చేయాలని ఈ కమిటీ నిర్ణయించింది. వీలైనంత త్వరగా విభజన ప్రక్రియను పూర్తిచేసేందుకు సిద్ధమవుతోంది ఉన్నాతాధికారుల కమిటీ.

09:51 - October 26, 2015

ఎపికి ప్రత్యేకహోదాపై క్లారిటీ రావాలని అందరం కోరుకుంటున్నామని వక్తలు పేర్కొన్నారు. న్యూస్ మార్నింగ్ చర్చా కార్యక్రమంలో రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి, ఆధ్రమేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి, టిడిపి నేత చందు సాంబశివరావు పాల్గొని, మాట్లాడారు. ప్రత్యేకహోదా నిరసన భావన ప్రజల్లో ఉన్నప్పుడు దానిని అనగదొక్కడం కష్టమన్నారు. ప్రత్యేకహోదా... చంద్రబాబు, మోడీ సొంత విషయం కాదని.. ప్రజలందరి విషయమని తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

06:49 - August 12, 2015

హైదరాబాద్ : వామపక్షాల బంద్‌తో ఒత్తిడి పెరిగింది. ప్రజాసంఘాల ఆందోళనతో మొద్దునిద్ర వీడింది. మేల్కొన్నారో..లేక...యాక్టింగ్ చేశారో....గానీ కేంద్రంతో చర్చలు జరిపారు. అయితే స్పష్టమైన హామీ ఇవ్వకుండా...మళ్లీ సస్పెన్స్‌లోకి నెట్టారు. ప్రత్యేక హోదానో...ప్యాకేజీనో తేల్చకుండానే ఏపీ బాటపట్టారు. ఒకవిధంగా చూస్తే...ప్రత్యేక హోదాకు మంగళం పాడినట్లేనన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
కలిరింగ్ ఇస్తోన్న ఏపీ సర్కార్....
ప్రత్యేక హోదాపై సీరియస్‌గా దృష్టిపెట్టినట్లు ఏపీ ప్రభుత్వం కలరింగ్ ఇస్తోంది. ఈ విషయంలో కేంద్రంతో చర్చిస్తామని చెప్పిన నేతలు... చెప్పినట్లుగానే ఏపీ టీడీపీ ఎంపీలు, బీజేపీ నేతలు... కట్టకట్టుకొని ఢిల్లీకి వెళ్లారు. కేంద్రంతో సమాలోచనలు చేసినట్లు కలరింగ్ ఇచ్చారు.
ఏపీకి ప్రత్యేక హోదా, సెక్షన్ 8, 9, 10పై చర్చ....
కేంద్రమంత్రులు అరుణ్‌జైట్లీ, రాజనాథ్‌సింగ్‌ను ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. ఏపీకి ప్రత్యేక హోదా, సెక్షన్8, 9,10 అమలుపై చర్చించారు. ఈ సమావేశానికి కేంద్రమంత్రి సుజనాచౌదరి, టీడీపీ ఎంపీలు జేసీ దివాకర్‌రెడ్డి, మురళీమోహన్, సీఎం రమేష్, బీజేపీ ఎంపీ హరిబాబు హాజరయ్యారు. ఐతే ఈ సమావేశంలో నేతలు ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీపైనే ఎక్కువ దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది. కేంద్రం కూడా ప్రత్యేక హోదా తప్ప...ఇంకేమైనా కోరండనే విధంగా వ్యవహరించింది. ఏపీకి ప్రత్యేక హోదాకు మించి ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చుతామన్న విషయం కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ మాటల్లో స్పష్టమవుతోంది.
ఏపీకి భారీ ప్యాకేజీ వస్తుంది-సుజనా.....
అటు ఏపీ టీడీపీ, బీజేపీ నేతలు కూడా...ఇచ్చిందే వరప్రసాదమనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రకటనతో చాలా ఖుషీగా ఉన్నట్లు వారే స్పష్టం చేశారు. ఏపీకి భారీ ప్యాకేజీ వస్తుందని సుజనా చౌదరి అన్నారు.
ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియదు - జేసీ
ప్రత్యేక హోదా అంటే ఏమిటో తెలియదని...కాని కేంద్రం మాత్రం అంతకన్నా ఎక్కువే రాష్ట్రానికి మేలు చేస్తుందని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు అనవసర రాద్దాతం చేస్తున్నాయని బీజేపీ ఎంపీ హరిబాబు అన్నారు. ప్రత్యేక హోదా పదం కాకుండా....కేంద్రం అంతకు మించి ఎక్కువ ప్యాకేజీని ఇస్తుందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఐతే రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల తీరుపై ప్రతిపక్షాలు మండిపడుత్నాయి. ఇరువురూ కలిసి డ్రామాలాడుతున్నారని విమర్శిస్తున్నాయి.

Pages

Don't Miss

Subscribe to RSS - క్లారిటీ