ఖుష్బూ

12:11 - January 22, 2018

తమిళ హీరో సూర్య ఎత్తును గేలిచేస్తూ సన్ మ్యూజిక్ లో ప్రసారమైనా కార్యక్రమం పై నటి, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ స్పందించారు. సూర్య వ్యాఖ్యలు సరైనవి కావని వెంటనే ఆ చానల్ క్షమాపణలు చెప్పాలని, ఆ యాంకర్లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. నటనకు ఆహార్యంతో సంబంధంలేదని ఆమె ట్వీట్ చేశారు. ఇదే విషయంపై విశాల్ కూడా స్పందించారు. నటులను కించపరిచే విధంగా కార్యక్రమాలు చేయకూడదని ఆయన అన్నారు. సన్ మ్యూజిక్ చానల్ ఓ కార్యక్రమంలో ఇద్దరు వ్యాఖ్యతలు సూర్యను కించపరిచే వ్యాఖ్యలు చేశారు. అందులో ఓ యాంకర్ త్వరలో సూర్య, అమితాబ్ తో సినిమా చేయబోతున్నారని తెలిపింది. దీంతో వెంటనే రెండో యాంకర్ అమితాబ్ హైట్ ఎక్కడ సూర్య హైట్ ఎక్కడ అని వ్యాఖ్యానించ్చింది. మరో యాంకర్ సూర్య అనుష్కతో చేసినప్పుడే హై హిల్స్ షూ వేసుకున్నాడని, ఇప్పుడు అమితాబ్ చేయాలంటే కుర్చీ వేసుకోని నటించాలని అంది. ఈ వ్యాఖ్యలతో దూమరం రేగింది.

19:06 - January 10, 2018

టుడే అవర్ రీసెంట్ రిలీజ్ లో ఉన్న సినిమా 'అజ్ఞాతవాసి'. 'పవన్ కళ్యాణ్' హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నుండి కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్ గా తెరకెక్కిన సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ ఫిలిం 'అజ్ఞాతవాసి' సినిమా. ఈ సినిమా ఇవాళ్టి 'నేడే విడుదల' రివ్యూ టైం లో ఉంది. రైటర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని డైరెక్షన్ లో కూడా సూపర్ హిట్ సినిమాలతో హిట్ ట్రాక్ లో ఉన్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ఫామిలీ ఎంటర్టైనర్ ఈ 'అజ్ఞాతవాసి' సినిమా. పంచ్ డైలాగ్స్ తో సినిమాని కామెడీ టచ్ తో నడిపించే త్రివిక్రమ్ 'అజ్ఞాతవాసి' సినిమాని కూడా ఎంటెర్టైనేమేంట్ అండ్ యాక్షన్ తో పాటు గ్లామర్ లవ్ ఫీల్ ఉన్న కధగా రెడీ చేసాడు. మెగా ఫామిలీ నుండి వచ్చిన స్టార్ హీరో పవన్ కళ్యాణ్. సెలెక్టివ్ గా స్టోరీలను ఒకే చేస్తూ సినిమాల విషయంలో జాగర్త పడుతూ ఆడియన్స్ కి దగ్గరౌతున్నాడు. కానీ తన ప్రీవియస్ ఫిలిమ్స్ ప్రేక్షకులను కొంచం నిరాశకు గురిచేయడంతో 'అజ్ఞాతవాసి' సినిమాని కేర్ ఫుల్ గా హేండిల్ చేసాడు అని టాక్. 'అజ్ఞాతవాసి' సినిమాలో ఒక ఉన్నత కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా అలరించాడా లేదా అనేది ఆన్ స్క్రీన్ మీద చూడాల్సిందే.

'అజ్ఞాతవాసి' సినిమాలో గ్లామర్ కి ఏమి తక్కువ లేదు. త్రివిక్రమ్ రెగ్యులర్ ఫార్ములా ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమాలో కూడా కనిపిస్తారు. ఈ మధ్య కాలంలో హిట్ సినిమాలతో సందడి చేస్తూ తన అందంతో అభినయంతో తెలుగు ఆడియన్స్ కి బాగా రీచ్ అయిన హీరోయిన్ కీర్తి సురేష్, గ్లామర్ రోల్స్ లో అస్సలు తగ్గని అను ఇమ్మాన్యుయేల్ ఇద్దరూ పవన్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

సినీ ఇండస్ట్రీనీ తెలుగు పండగలని వేరు చేసి చూడలేము. పండగ వచ్చింది అంటే కచ్చితంగా ఒక స్టార్ హీరో బొమ్మ థియేటర్ లో పడాల్సిందే. అందులోనూ సంక్రాంతి బరిలో సినిమా రిలీజ్ కి ఉంది అంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. సంక్రాంతి లాంటి పెద్ద పండుగకు సినిమా రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేసిన త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి' సినిమా అనుకున్న విధంగానే బెనిఫిట్ షో లతో హడావుడి చేసింది.

పండగ బరిలో హీరోగా నిలవాలని ప్రతి స్టార్ హీరో కి ఉంటుంది. ఆ అవకాశాన్ని ఇప్పుడు పవన్ కళ్యాణ్ దక్కించుకున్నాడు. కామన్ ఆడియన్స్ కూడా ఒక పెద్ద సినిమా వస్తే బాగుండు అనుకునే టైం లో మోస్ట్ వెయిటింగ్ మెగా ప్రాజెక్ట్ " అజ్ఞాతవాసి " రిలీజ్ అయింది. ఈ "అజ్ఞాత వాసి" సినిమాపై టెన్ టివి సినీ డెస్క్ తమ రివ్యూ ఇవ్వడానికి ఉన్నారు ఆ రివ్యూ ఇప్పుడు చూద్దాం. ప్రేక్షకుల స్పందనతో పాటు టెన్ టివి సినీ డెస్క్ రివ్యూ కూడా తీసుకున్న తర్వాత "అజ్ఞాతవాసి" సినిమాకి 10టీవీ ఇచ్చే రేటింగ్ తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

14:08 - November 4, 2017

 

చెన్నై : నగరంలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో సినీ నటి, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బూకు శుక్రవారం ఆపరేషన్ అయింది. ఆమె గత కొంత కాలంగా కడుపులో కణతిదో బాధపడుతున్నారు. శుక్రవారం ఆసుపత్రిలో ఖుష్బూకు జరిగిన శస్త్రచికిత్సలో ఆమె కడుపులో ఉన్న కణతిని తొలగించినట్టు డాక్టర్లు తెలిపారు. ఇది సాధారణ అందరి ఉండే సమస్య అని కణతి తొలగించిన తర్వాత ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాదని. ఆమె త్వరలోనే కోలుకుంటారని డాక్టర్లు ప్రకటించారు.   

12:18 - September 3, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' సినిమా కోసం అభిమానులు ఎంతగానే వెయిట్ చేస్తున్నారు. ఆయన నటించిన 'కాటమరాయుడు' డిజాస్టర్ అనంతరం వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్ శ్రీనివాస్' కాంబినేషన్ లో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. శరవేగంగా షూటింగ్ కొనసాగుతోంది. 'పవన్' సరసన 'కీర్తి సురేష్‌’, 'అను ఇమ్మానుయేల్‌' హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఎలాంటి కథతో రూపొందుతోంది ? పవన్ పాత్ర ఎలా ఉండబోతోంది ? తదితర విషయాలకు బయటకు పొక్కడం లేదు. సినిమాకు సంబంధించిన ఫొటోలు కూడా రావడం లేదు. తాజాగా 'పవన్’ బర్త్ డే సందర్భంగా చిత్ర బృందం ఓ టీజర్ ను విడుదల చేశారు.

ఇక్కడ పూర్తిగా 'పవన్' ను టైటిల్ ను మాత్రం చూపించలేదు. కొద్ది కణాల పాటు 'పవన్' ను నీడలా చూపించారు. సినిమాలోని ఓ పాటను అనిరుధ్‌ హమ్‌ చేస్తుండగా పక్కనే దర్శకుడు త్రివిక్రమ్‌ ఎంజాయ్ చేసున్న దృశ్యాలు ఈ వీడియోలో చూపించారు. 'బయటికొచ్చి చూస్తే టైమెమో త్రీ ఒ క్లాక్‌... 'అంటూ ఈ పాట ట్రెండీగా ఉందనిపిస్తుంది. చివరిలో 'పవన్‌' కుర్చీ తిప్పి.. నిశ్శబ్ధంగా నిల్చొని ఉన్న సన్నివేశాన్ని చూపించారు. ఇక టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫామ్ చేశారు. జనవరి 10, 2018న సినిమా రిలీజ్ ఉంటుందని ప్రకటించింది. మరి టైటిల్ ఏంటో త్వరలోనే తెలియనుంది. ‘ఇంజినీర్ బాబు' పేరు ఖరారు చేస్తారని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. 

11:23 - June 8, 2017

'పవన్ కళ్యాణ్'...'త్రివిక్రమ్' కాంబినేషన్ లో రూపుదిద్దుకొంటున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న 'త్రివిక్రమ్' సినిమా అంటే పాత్రలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందనే సంగతి తెలిసిందే. ఇటీవలే వచ్చిన 'అత్తారింటికి దారేది' సినిమాలో అత్త..మామ..ఇలా కొన్ని పాత్రలు అలరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టైటిల్ నిర్ణయించని ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. ఇందులో 'పవన్' ఇంజినీర్ గా నటిస్తున్నాడని టాక్. ఇక ప్రధాన పాత్రలో 'ఖుష్బూ' నటిస్తున్నారు. ఇందులో ఆమె పాత్ర అత్త అని తెలుస్తోంది. ఇక మామ పాత్రకు ఎవరు నటిస్తే బాగుంటుందనే విషయంలో చిత్ర యూనిట్ తర్జనభర్జనలు పడుతోందని తెలుస్తోంది. కోలీవుడ్..బాలీవుడ్..ఇతర వుడ్ లకు సంబంధించిన ప్రముఖ హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. మమ్ముటి..మోహన్ లాల్ తారల పేర్లు వినిపిస్తున్నాయి. మరి 'పవన్' కు మామగా ఎవరు నటిస్తారనే విషయం త్వరలో తెలియనుంది.

11:39 - April 12, 2017

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్' తన తాజా చిత్రం కోసం బిజీ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ మాటల మాంత్రికుడు 'త్రివిక్రమ్' దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ‘పవన్' హీరోగా నటిస్తున్న ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరుపుకుంది. అంతేగాకుండా షూటింగ్ ను కూడా మొదలు పెట్టేశారు. ఈ సినిమాలో 'పవన్' సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపించనున్నాడని టాక్. ఇదిలా ఉంటే ఈ చిత్రంలో కీలక పాత్రను 'ఖుష్బూ' నటిస్తోంది. చాలా రోజుల తరువాత టాలీవుడ్ లో ఆమె రీ ఎంట్రీ ఇస్తుందని చెప్పవచ్చు. ‘అత్తారింటికి దారేది' చిత్రంలో 'నదియా' పాత్ర ఎంత బలమైందో తెలిసిందే. అలాంటి బలమైన పాత్ర కోసం 'ఖుష్బూ'ని ఎంపిక చేశారని తెలుస్తోంది. తొలి రోజున షూటింగ్ కు వెళ్లినప్పుడు స్కూల్ కి వెళ్లినట్లుగా అనిపించిందని, తన పాత్ర కీలకం కావడంతోనే తాను ఒప్పుకోవడం జరిగిందని 'ఖుష్బూ' వెల్లడించింది. పవన్' సరసన 'ఇమ్మాన్యూయెల్', 'కీర్తి సురేష్'లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో 'ఖుష్బూ’ పాత్ర ఏమిటో తెలియాలంటే చిత్రం విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.

 

13:13 - March 22, 2017

సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ 'రజనీకాంత్' తో నటించాలని చాలా మంది హీరోయిన్లు కోరుకుంటుంటారు. అలాంటి ఛాన్స్ కొంతమందికి మాత్రమే వస్తుంది. తాజాగా 25 ఏళ్ల తరువాత అలనాటి హీరోయిన్ నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఆమె ఎవరో కాదు 'ఖుష్బూ'....’కబాలి' లాంటి డిజాస్టర్ ఇచ్చిన పా.రంజిత్ తోనే 'రజనీ' మరో సినిమా చేయనున్నాడని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఖుష్బూ కీలక పాత్ర పోషించనుందని సోషల్ మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. 1988లో 'ధర్మాతినై తలైవన్' సినిమాలో 'రజనీ'తో 'ఖుష్బూ' నటించారు. ముంబై బ్యాక్ డ్రాప్ అంటే మళ్లీ మాఫియా రిలేటెడ్ స్టోరీనే అయి ఉంటుందని అంచనాలు వేస్తున్నారు. గతంలో పలు హిట్ చిత్రాలలో నటించిన వీరిద్దరూ ఇప్పుడు పా రంజిత్ దర్శకత్వంలో రూపొందే చిత్రంలో నటించనున్నారు. అధికారికంగా మాత్రం ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించలేదు. రానున్న రోజుల్లో దీనిపై మరింత క్లారిటీ రానుంది. ప్రస్తుతం 'రజనీకాంత్' శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 'రోబో 2.0'లో నటిస్తున్నారు.

15:06 - December 28, 2016

'ఖుష్బూ'..సీనియర్ హీరోయిన్. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. తన నటనతో అలరించింది. తెలుగు సినిమాలో నటించి చాలా కాలమైంది. మురుగదాస్ - చిరంజీవి కలయికలో వచ్చిన 'స్టాలిన్' సినిమాలో 'ఖుష్బూ' 'చిరు'కు సోదరిగా నటించింది. అనంతరం తెలుగు సినిమాలకు సైన్ చేయలేదు. 9 ఏళ్ల అనంతరం మళ్లీ ఇప్పుడు కనిపించబోతోంది. తాను తెలుగు ప్రేక్షకులకు కనిపించబోతున్నట్లు స్వయంగా 'ఖుష్బూ' ట్విట్టర్ ద్వారా తెలియచేసింది. అప్పుడు అన్నయ్యతో నటించగా ఇప్పుడు సోదరుడితో నటించబోతున్నట్లు తెలిపింది. పవర్‌ స్టార్ 'పవన్‌ కళ్యాణ్', 'త్రివిక్రమ్' కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో తాను ప్రధాన పాత్ర పోషించనున్నట్లు 'ఖుష్బూ' తెలిపింది. సుమారు తొమ్మిదేళ్ల తర్వాత తెలుగు సినిమాలో నటిస్తున్నానని, త్రివిక్రమ్‌-పవన్‌ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకుంటున్నానంటూ ట్వీట్ చేసింది. స్ర్కిప్ట్ బ్రిలియంట్ గా ఉందని, చాలా పవర్ పుల్ క్యారెక్టర్ అని తెలిపింది. మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు తనకు ఎంతో సంతోషంగా ఉందని 'ఖుష్బూ' పేర్కొంది. మరి 'పవన్' చిత్రంలో 'ఖుష్బూ' పాత్ర ఏమిటో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Don't Miss

Subscribe to RSS - ఖుష్బూ