గర్భం

11:25 - December 3, 2017

కర్నూలు : జిల్లాలోని డోన్‌లో దారుణం వెలుగుచూసింది. ప్రేమ పేరుతో ప్రియురాని మోసం చేయడంతో... 8 నెలల గర్భిణి అని కూడా చూడకుండా...దారుణంగా హత్య చేశాడు. 10రోజులుగా తమ కూతురి ఆచూకీ కనిపించకపోవడంతో.. కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. ప్రియురాలు రమిజను హత్య చేసిన ప్రియుడు సిద్ధు... మృతదేహాన్ని కొండల్లో పాతిపెట్టాడు. నిందితుడు పోలీసుల ముందు లొంగిపోయాడు.

 

14:25 - September 3, 2017

బాలీవుడ్ నటుడు 'అక్షయ్ కుమార్' గర్భం దాల్చడం ఏంటీ ? అంటూ ఏవో ఊహించుకుంటున్నారా ? ఆయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. అక్షయ్ గర్భం దాల్చినట్లు...ఏకంగా కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు ఆ వీడియోలో చూపించారు. ఇదంతా ఓ టీవీ షో కార్యక్రమం కోసం నిర్వహించారు.

‘ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ -5’ అనే టీవీ షోకి 'అక్షయ్' న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా 'అక్షయ్' తన ట్విటర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశాడు. రెండు రోజుల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేసిన అక్షయ్, ‘దునియా సోచ్ రహీ హై యే అజూబా కైసే హువా?’ అని పేర్కొనడం గమనార్హం.

06:55 - August 12, 2017

హైదరాబాద్ : చావును ఎవరూ తప్పించలేరు. కానీ.. సరైన సమయంలో వైద్యం అందిస్తే కొన్ని ప్రాణాలనైనా కాపాడవచ్చు. ఆపద సమయంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చిన రోగుల విషయంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. మహిళలకు గర్భశోకమే మిగులుస్తోంది. ఎంతో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా చాలా ప్రాంతాల్లో.. సరైన వైద్యం అందక పురిట్లోనే చిన్నారులు, బాలింతలు.. రోగులు మృతి చెందుతున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగు చూస్తునే ఉన్నాయి.

నిర్మల్‌ జిల్లా బైంసా మండల కేంద్రంలో అర్ధరాత్రి ఓ గర్భిణీ ప్రసవం కోసం ఆస్పత్రికి వచ్చింది. పురిటినొప్పులతో బాధపడుతున్నా... ఆస్పత్రి సిబ్బంది పట్టించుకోలేదు. నొప్పులు ఎక్కువ కావడంతో నిద్రపోతున్న నర్సులకు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆగ్రహించిన సిబ్బంది... కుటుంబ సభ్యులపై చిందులు వేస్తూ ఏవో ఇంజక్షన్లు చేశారు. తర్వాత నొప్పులు తగ్గాయి... ఉదయం ఆపరేషన్‌ చేయగా... మృత శిశువుకు జన్మనిచ్చింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు.

ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలో మరో శిశువు మృతి చెందాడు. ప్రసవం కోసం గత మంగళవారం జ్యోతి అనే గర్బిణీ ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. సిజేరియన్‌ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే... అనస్తషీయ రాలేదని ఆపరేషన్‌ను వాయిదా వేశారు. శుక్రవారం రోజున నొప్పులతో మళ్లీ ఆస్పత్రికి రావడంతో... వైద్యులు ఆపరేషన్‌ చేశారు. అయితే.. అప్పటికే ఆలస్యం కావడంతో... ఆ తల్లి మృత శిశువుకు జన్మనిచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతి చెందాడని తల్లిదండ్రులు వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో నవోదయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతి మృతి చెందింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న యువతిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలిపారు. అయితే... వైద్యులు సరైన వైద్యం అందించకపోవడంతో... యువతి చనిపోయిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి ముందు ఆందోళన చేపట్టిన కుటుంబ సభ్యులు... యువతి మృతికి కారణమైన డాక్టర్లను అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాణాలు కాపాడుతారని ఎంతో నమ్మకంగా రోగులు ఆస్పత్రికి వస్తే... వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంతో విలువైన ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. 

11:45 - May 26, 2017

కర్నూలు : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఎమ్మిగనూరులో కూతురు వరుస అయ్యే బాలికపై బంధువే అత్యాచారానికి తెగబడ్డాడు. బాలిక గర్భవతి కావడంతో విషయం బయటికి పొక్కింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికపై అత్యారానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

 

15:03 - January 16, 2017

ఢిల్లీ : అబార్షన్ పై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువడించింది. కొన్ని కండీషన్లతో సుప్రీంకోర్టు ఒప్పుకుంది. 24 వారాల కంటే ముందు అబార్షన్ చేయించుకోవచ్చని కోర్టు పేర్కొంది. పుర్రె ఏర్పడకపోతే అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీం అనుమతినిచ్చింది. 22 ఏళ్ల యువతి వేసిన పిటిషన్ పై సుప్రీం స్పందించింది. పుణెకు చెందిన ఓ యువతి సుప్రీంను ఆశ్రయించింది. అబార్షన్ కావాలని అభ్యర్థించింది. దీనిపై సుప్రీం సోమవారం సంచలానత్మక తీర్పును వెలువడించింది. వైద్యపరమైన కారణాలతో గర్భంలో శిశువు పుర్రె ఏర్పడకపోతే అబార్షన్ తొలగించుకోవచ్చని పేర్కొంది. గర్భం తొలగించుకోవడం చట్టపరమైన నేరమనే విషయం తెలిసిందే. దీనిపట్ల మానవ హక్కుల సంఘం తీవ్రంగా స్పందిస్తోంది. ఇది సరియైన చర్య కాదని, దీనిని పునరాలోచించుకోవాలని కోరుతోంది. అనారోగ్య సమస్యలు ఉంటేనే గర్భం తొలగించుకోవచ్చని సుప్రీం తెలిపింది.

10:05 - January 9, 2017

ఇదేమి చోద్యం అనుకుంటున్నారా ? కానీ ఇది నిజం. తల్లి గర్భం నుండి పిల్లలు జన్మిస్తుంటారు. అది ప్రకృతి సిద్ధం. కానీ బ్రిటన్ లో ఓ చోద్యం జరుగుతోంది. అందర్నీ ఆకర్షిస్తోంది. ఈ వ్యవహారాన్ని అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం హెడెన్ క్రాస్...బ్రిటెన్ కు చెందిన వాడు. పుట్టుకతో స్త్రీ. అయితే స్త్రీగా మారాలని నిర్ణయం తీసుకున్నాడు. లింగమార్పిడి కోసం హార్మోన్ చికిత్స కూడా తీసుకుంటున్నాడు. మూడేళ్ల క్రితం చట్టపరంగా మగవాడిగా జీవనం సాగిస్తున్నాడు. కానీ ఓ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడు. త్వరలో ఓ బిడ్డకు తానే తండ్రి..తల్లి అవ్వాలని అనుకున్నాడు. భవిష్యత్ లో పిల్లలకు జన్మనిచ్చేందుకు వీలుగా తన అండాలను భద్రపరచాలని జాతీయ ఆరోగ్య సేవల సంస్థ (ఎన్ హెచ్ఎస్)కు విజ్ఞప్తి చేసుకున్నాడు. ప్రసవంతో బ్రిటన్‌లో బిడ్డకు జన్మనివ్వనున్న తొలి మగాడిగా రికార్డు సృష్టించనున్నాడు. పుట్టుకతో స్త్రీ అయిన హేడెన్‌ మూడేళ్ల కిందటి నుంచి చట్టబద్ధంగా మగాడిలానే జీవిస్తున్నాడు. ఇందుకు ఎన్ హెచ్ఎస్ నిరాకరించింది. తన లింగమార్పిడి చికిత్సను తాత్కాలికంగా నిలిపివేసుకున్నారు. కానీ చికిత్స ముగియడానికి ముందే బిడ్డకు జన్మనివ్వాలని హెడెన్ నిర్ణయం తీసుకున్నాడు. ఫేస్ బుక్ ద్వారా తన నిర్ణయాన్ని తెలియచేశాడు. వీర్యదానం చేసేందుకు ఓ వ్యక్తి ముందుకొచ్చాడు. అంతే గర్భం దాల్చాడు. ప్రస్తుతం ఇతడు 16 వారాల గర్భంతో ఉన్నాడు. లింగమార్పిడి పూర్తయ్యాక గర్భం సాధ్యం కాదు కనుక అంతకుముందే బిడ్డను కనాలనుకున్నాడు. మరికొన్ని నెలల్లో ప్రసవించనున్నాడు. బ్రిటన్ లో బిడ్డకు గర్భం ద్వారా జన్మనిచ్చిన తొలి తండ్రిగా హెడెన్ క్రాస్ చరిత్ర సృష్టించనున్నారు. తన బిడ్డకు గొప్ప తండ్రిని కావాలని కోరుకుంటున్నట్లు క్రాస్ పేర్కొంటున్నాడు. మరి అతని ఆశ నెరవేరుతుందా ? అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది. 

11:20 - December 25, 2015

హైదరాబాద్ : ప్రకృతి ధర్మాలు మారిపోతున్నాయి. పురుషుడిగా జన్మించి, ఆపై లింగమార్పిడి చేయించుకున్న ఓ వ్యక్తి గర్భం ధరించి చరిత్ర సృష్టించాడు. ఈ ఘటన ఈక్వెడార్ లో జరిగింది. పుట్టుకతో స్త్రీగా ఉండి లింగమార్పిడి చేయించుకున్న మహిళతో జతకట్టిన ఫెర్నాండో మచాదో తాను గర్భం దాల్చినట్టు ప్రకటించాడు. ప్రపంచంలో ఈ తరహా ఘటనల్లో ఇదే మొదటిదని తెలుస్తోంది. కాగా, వీరిద్దరూ పూర్తి స్థాయి లింగ మార్పిడి కోసం హార్మోనులు తీసుకున్నారని, డెలివరీ సమయంలో ఎటువంటి ప్రమాదం జరిగే అవకాశాలు లేవని వైద్యులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనపై ఇప్పటివరకూ చర్చి లీడర్స్ స్పందించ లేదు. ఇటీవల అమెరికాలో ట్రాన్స్ జండర్ల వివాహాలను చట్టబద్ధం చేసిన సంగతి తెలిసిందే.

Don't Miss

Subscribe to RSS - గర్భం