గలీజు

08:00 - August 12, 2017

ట్రాఫిక్ పోలీసాయిన పని ఏందయ్యా..? ఏడ ట్రాఫిక్ జాంగాకుంట జూస్కోవాలె.. ఎవ్వలన్న వీఐపీలొస్తె ట్రాఫిక్ క్లీయర్ జెయ్యాలే..? రోజు సక్కగ డ్యూటీ జేశి ఇంటికి వోవాలె అంతేనా..? మరి తొవ్వొంట వొయ్యెటోళ్లను అమ్మని అక్కని అని తిడ్తె ఎన్కటి కాలమేనా ఇది..? జనం అంత ఒక్కటై.. ట్రాఫిక్ కానిస్టేబుల్ గాని తోలు దీశిండ్రు వీడియోలో సూడుండ్రి..

14:17 - June 21, 2016

ముంబై : ఆయనో ప్రముఖ నటుడు..ఏది మాట్లాడినా..ఏ పని చేసిన జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. కానీ బాలీవుడ్ కండల వీరుడు మరోసారి చిక్కుల్లో పడ్డారు. మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. వివరాల్లోకి వెళితే..సల్మాన్ ఖాన్ 'సుల్తాన్' చిత్రంలో నటిస్తున్నాడు. త‌న తాజా చిత్రం 'సుల్తాన్‌' ప్రమోష‌న్‌లో భాగంగా స్పాట్‌బోయ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. సినిమాలో రెజ్లర్‌గా న‌టించిన‌ అనుభ‌వం ఎలా ఉంద‌ని అడిగితే.. రింగ్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప్రతీసారీ తాను అత్యాచారానికి గురైన మ‌హిళ‌లాగా ఫీల‌య్యేవాడిన‌ని, అడుగులు స‌రిగా ప‌డేవి కావ‌ని స‌ల్మాన్ అసభ్యకరంగా వ్యాఖ్యానించాడు. షూటింగ్‌ సందర్భంగా వివిధ కోణాల్లో ఒకే షాట్‌ను చిత్రీక‌రించేందు కోసం 120 కిలోల మ‌నిషిని ప‌దేప‌దే పైకి ఎత్తి కింద ప‌డేయాల్సి వ‌చ్చేద‌ని స‌ల్మాన్ చెప్పుకొచ్చాడు. దీనిపై సోషల్‌ మీడియాలో సల్మాన్‌పై దుమ్మెత్తి పోస్తున్నారు. సల్మాన్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. ఒక సెలబ్రిటీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని..బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు సల్మాన్ కు ఓ లేఖ కూడా రాసింది. ఎందుకు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో వివరణ చెప్పాలని లేఖలో పేర్కొంది. వ్యక్తిగతంగా దురుద్ధేశ్యంతో వ్యాఖ్యలు చేయలేదని, సరదాగానే చేశానని..వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడానికి సల్మాన్ సిద్ధంగా ఉన్నారని ఆయన తరపు వర్గీయులు పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. కానీ సల్మాన్ మాత్రం ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదని తెలుస్తోంది. 

Don't Miss

Subscribe to RSS - గలీజు