గాయకులు

14:50 - March 18, 2018

హైదరాబాద్ : ఉగాది షడ్రుచుల సమ్మేళనం. తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. అలాగే అందరి జీవితాలలోను కూడా కష్టాలు సుఖాలు వచ్చి పోతుంటాయి. ఈ క్రమంలో ఉగాదికి మనిషి జీవితానికి చాలా దగ్గరు సంబంధాలున్నాయి. అలాగే ఉగాది పండుగలో శాస్త్రీయత కూడా ఇమిడి వుంది. సాధారణంగా పండుగలన్నీ ప్రకృతితో ముడిపడి వుంటాయి. వాటిలో ఉగాది పండుగ కూడా ఒకటి. కాలాలు మారుతున్న క్రమంలో శీతాకాలం తరువాత వచ్చే వేసవి కాలం ఆరంభంలో వచ్చే పండుగ ఉగాది. ఇది ముఖ్యంగా తెలుగు వారి పండుగ అని చెబుతుంటారు. కానీ ఇది అందరి పండుగ. ఎందుకంటే కాలాలు మారుతున్న క్రమంలో అంటే శీతాకాలం వెళ్లి వేసవి కాలంలో వచ్చే వ్యాధులను నుండి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఉగాది పండుగకు చేసే ఉగాది పచ్చడి చాలా ఉపయోగపడుతుంది. ఈ పచ్చడిలో వాడే పదార్ధాలన్నీ మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. బెల్లం, మామిడి కాయ, వేపపూతలోని చేదు, చెరుకులోని తీపి ఇలా అన్నింటిలోను మనిషి ఆరోగ్యానికి మేలు చేసే పదార్ధాలే కావటంతో ఉగాది మనిషితో ఆరోగ్యంతో ముడిపడిన పండుగగా చెప్పుకోవచ్చు. అలాగే మనిషికి సంగీతం, నృత్యం,ఆటలు,పాటలు వంటివి మనిషిని ఉత్సాహంగా ఉంచేందుకు, ఆరోగ్యం వుండేదుకు దోహద పడతాయి. అందుకనే ఉగాది పర్వదినాన 10టీవీ గాయకుల గానాలతో అందరి మనస్సులను ఉల్లాసపరిచేందుకు గాయకులతో ఉగాది ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు వచ్చింది. మీకోసం మీ మనస్సులను ఉల్లాసపరిచేందుకు మీ ముందుకు వచ్చారు. సంగీత దర్శకుడు భీమ్స్, గాయకులు సాహితి,రఘురామ్ లతో మీ ముందుకు వచ్చింది ఉగాది ప్రత్యేక కార్యక్రమం.. మరి వారి గానమృతంతో మనస్సుని ఉల్లాసపరుచుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయాల్సిందే...

06:46 - March 20, 2017

హైదరాబాద్ : సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు సభికులను కట్టిపడేశాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ పోడకలపై గాయకుల పాటలు అందరినీ ఆలోచింపజేశాయి. ప్రజాగాయకులు గద్దర్‌, గోరటి వెంకన్న, విమలక్క పాటలు అందరిలో ఉత్సాహాన్ని నింపాయి. గాయకుల పాటలకు సభికులు ఈలలువేస్తూ, నృత్యాలు చేస్తూ తమ మద్దతు తెలిపారు. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం గ్రౌండ్స్‌లో నిర్వహించిన సమర సమ్మేళనం సభలో కళాకారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. సభకు వచ్చిన జనాన్ని అలరించాయి. ప్రజా గాయకుడు గద్దర్‌ సభలో పాటలు పాడుతూ అందరినీ ఉత్సాహపరిచారు. అమర వీరులపై పాడిన పాట ఉర్రూతలూగించింది. ఇక పొడుస్తున్న పొద్దుమీద పాటకు సభికులు నృత్యాలు చేశారు. రచయిత, ప్రజా కవి గోరటి వెంకన్న స్టేజ్‌ను షేక్‌ చేశారు. పాటలు పాడుతూ, స్టెప్పులు వేస్తూ సభకు వచ్చిన వారిని ఉత్సాహపరిచారు. ఇక విమలక్క ప్రజా ఉద్యమాలపై జరుగుతున్న దాడిపై పాడిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ఆడుదాం డప్పుల్లా దరువేయరా అంటూ విమలక్క పాడితే సభికులు కదం కలుపుతూ స్టెప్పులేశారు. గాయకుడు ఏపూరి సోమన్న తన పాటలతో అందరిలో ఉత్తేజం నింపారు. కేసీఆర్‌ హామీలపై ఆయన పాడినపాటలు అందరినీ ఆలోచింపజేశాయి. రోజులు మారాలి, మా రోజులు రావాలంటూ సాగిన పాటకు సభికుల నుంచి విశేష స్పందన లభించింది. ప్రజానాట్య మండలి కళాకారులు నర్సింహ్మా పాడిన పాటలు సభలో ఉత్సాహాన్ని నింపాయి. తమ్మినేని పాదయాత్రపై ఆయన పాడిన పాటకు సభకు వచ్చిన వారు ఈలలువేస్తూ... నృత్యాలు చేస్తూ మద్దతు తెలిపారు. ప్రజానాట్యమండలి కళాకారుల ఆటపాటలు, భద్రాచలానికి చెందిన గోండు నృత్యాలు సమర సమ్మేళనం సభకే హైలెట్‌గా నిలిచాయి.

10:44 - July 10, 2016

అంగవైకల్యం కళల్లో రాణించటానికి అడ్డురాదని ఎందరో రుజువు చేశారు. అలా తన అంగవైకల్యాన్ని అధిగమించి గాయకుడిగా రాణిస్తున్నాడు బాలకృష్ణ. వివిధ సామాజికాంశాలపై ఆయన రాసిన పాటలు ఆకట్టుకుంటాయి. చక్కగా పాడుతూ జనం పాటల ప్రవాహమైపోతాడాయన. గేయరచయిత, గాయకులు బాలకృష్ణ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

21:00 - May 7, 2016

టెన్ టివి నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో గాయకులు జయరాజ్, ఏపూరి సోమన్న, బిచ్చునాయక్ లు పాల్గొన్నారు. పలు పాటలు పాడి అహ్లాదపరిచారు. ఉద్యమం, గ్రామాలు, లంబాడి తండాలకు సంబంధించిన పాటలు పాడారు. జయరాజ్ నాన్నపై పాట పాడారు. ఏపూరి సోమన్న జగద్గిరి గుట్టపై పాట పాడారు. బిచ్చునాయక్ బిచ్చు నాయక్ లంబాడీలపై పాటాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

Don't Miss

Subscribe to RSS - గాయకులు