గింజలు

15:14 - June 2, 2018

మనం రోజు తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడటంలోను..మన శరీరానికి శక్తినివ్వటంలోను ఎంతవరకూ ఉపయోగపడుతుందనే విషయంపై చాలామందికి పెద్దగా అవగాహన వుండదు. శ్రద్ధ కూడా వుండదు. ఒక రకంగా చెప్పాలంటే అసలు ఆసక్తి కూడా వుండదు. ఆరోగ్యం వుంటేనే ఆనందం వుంటుంది. శరీరం ఆరోగ్యంగా వుంటేనే ఏదైనా చేయగలం. కాబట్టి ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. కొద్దిపాటి శ్రద్ధ..మరికొంత సమయం కేటాయింపుతో మనం ఆరోగ్యంగా వుండటమేకాక..భావి తరాలకు కూడా ఆరోగ్యాన్ని వారసత్వంగా ఇవ్వవచ్చు. ఆరోగ్యకరమైన వారసత్వం సమాజానికి చాలా అవసరం. దేశప్రగతిలో ముందుకు సాగాలంటే ఆరోగ్యకరమైన మనుషులు దేశానికి వెన్నెముకలాంటివారు అనటంలో ఎటువంటి సందేహం లేదు..

బరువు బ్యాలెన్స్ కోసం మొలకలు..
బరువు తగ్గాలను కొన్న లేదా బరువు పెరగ కుండా బాలెన్స్‌ చేసుకోవాలన్న క్యాలరీలతో సంబంధం లేకుండా పనికొచ్చే ఆహారం మెలకలు . అందుకే మొలకల్లి సూపర్‌ ఫుడ్‌ అంటారు . క్రమం తప్పకుండా మొలకలు తింటే జీవన శైలిలో ఎటువంటి అనారోగ్యాలు దరిచేరవు. ఆరోగ్యంతోపాటు చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తాయి.

మొలకల్లో వుండే విటమిన్స్, మినరల్స్..
విటమిన్ సి, కె , లు వుండే ఈ పెసలు శిరోజాల ఎదుగుదలకు సహకరిస్తాయి. బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకోవచ్చు. కాబూలీ శెనగలు స్త్రీ పురుషులు ఇద్దరికి మంచి ఆహారం కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది . పుష్కలంగా పీచు పదార్ధం ఉంటుంది . డైటింగ్‌ చేసేవాళ్లు కూడా తినవచ్చు. నల్ల శనగలు కూడా బరువును తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్‌ ఉండదు. చర్మసమస్యలకు,డయాబెటీస్‌ నియంత్రణకు ఉపకరిస్తాయి. బీన్స్‌ మొలకల్లో ఎమినోయాసిడ్స్‌, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ప్రోటీన్లు,విటమిన్లు జింక్‌ ఉంటాయి కనుక మంచి పోషకాహారం.

మొలకలు ప్రత్యామ్నాయం..
ఇవి తిన లేమనుకొంటే రుబ్బేసి ఏ దోసల్లాగో లేదా పరోటాల్లోనో కలుపుకుని గానీ కూరల్లో వేసి గాని ఎలాగోలా తినవలసిన అవసరం ఎంతోవుంది. మెలకలకు మించిన ఆహారం ఇంకోటి లేదంటే అతిశయోక్తి కాదు. మనం రోజు వారి తినే ఆహారంలో మెులకలను చేర్చుకోవటం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఇవి వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసులవారు తినవచ్చు. వీటిలో విటమిన్లు, ఖనిజలవణాలు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని శుధ్ది చేస్తాయి. వీటిని ప్రతిరోజు తీసుకోవటం వల్ల శరీరం చైతన్యమై నిత్యయవ్వనంగా కనిపిస్తారు. దీని ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

గింజలుగా వున్నప్పుడు కంటే మొలకెత్తిన తరువాత పెరిగే శక్తి..
గింజలను మెులకెత్తించినుపుడు వాటిలో పోషక స్థాయి పెరుగుతుంది. ముఖ్యంగా పెసలు, మినుములు, శనగలు, బొబ్బర్లు, గోధుమలు, వేరుశనగ, బఠానీలు వంటివి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

జీర్ణక్రియను పెంచే మొలకలు..
పోషకాల నిధి మెులకెత్తిన గింజలలో జీర్ణక్రియకు తోడ్పడే ఎంజైములు ఉంటాయి. మెులకెత్తిన గింజలు త్వరగా జీర్ణమవుతాయి. ఆరోగ్యానికి హానికరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ వంటివి మొలకల్లో అస్సలు ఉండవు.

ఆరోగ్యవంతమైన బిడ్డలు..
మెులక ధాన్యాలలో ఎ, బి కాంప్లెక్స్, సి విటమిన్లు అత్యధికంగా కనిపిస్తాయి. మెులకలలో క్షార గుణం ఉంటుంది. మెులకలను గర్భిణీ స్త్రీలు తింటే పుట్టబోయే బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. మెులకలలో పీచు పదార్ధం ఎక్కువుగా ఉంటుంది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది. మెులకెత్తేటప్పుడు విటమిన్ ఎ రెండు రెట్లు, విటమిన్ బి,సిలు ఐదు రెట్లు అధికంగా లభ్యమవుతాయి. ఖనిజ లవణాలు అయిన ఇనుము, ఐరన్, ఫాస్పరస్, జింక్ శరీరానికి సులభంగా అందుబాటులో ఉండేలా తయారవుతాయి. పళ్లు, ఎముకలు కూడా దృఢంగా తయారవుతాయి. రక్తహీనత కూడా దరిచేరదు.

07:05 - November 25, 2016

రోజురోజుకి క్షీణించిపోతున్న రూపాయి విలువ మన వంటిళ్లను షేక్ చేస్తోంది. మనం నిత్యం వాడే వంట నూనెల ధరలు పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. విదేశాల నుంచి భారీగా దిగుమతులు చేసుకోవడమే ఇందుకు కారణం. ఒకవైపు కరవు. మరో వైపు పెద్ద నోట్ల రద్దు. ఇంకో వైపు అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ విజయం. అమెరికన్ డాలర్ బలపడుతోంది. మన రూపాయి బక్కచిక్కిపోతోంది. ఇప్పటికే రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోయింది. ఈ పతనం ఎక్కడ ఆగుతుందో తెలియదు. రూపాయి విలువ పడిపోతే, నేరుగా మన వంటింటి మీదే దాని ప్రభావం పడుతుంది. మన వంట నూనెల ధరలు సలసలకాగిపోతాయి. పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటాయి. ఎందుకంటే వీటి కోసం మనం విదేశాల మీద ఆధారపడుతున్నాం. మనం వాడే వంట నూనెల్లో 70శాతం విదేశాల నుంచి కొనుక్కోవాల్సిన దుస్థితిలో చిక్కుకున్నాం.

పడిపోయిన ఉత్పత్తి..
గత దశాబ్దకాలంలో వంట నూనెల వినియోగం గ్రామీణ ప్రాంతాల్లో 40శాతం, పట్టణ ప్రాంతాల్లో 29శాతం చొప్పున పెరిగితే, నూనె గింజల ఉత్పత్తి మాత్రం 7శాతం పడిపోయింది. 2013-14లో అంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాక పూర్వం మన దేశంలో నూనె గింజల ఉత్పత్తి 33 మిలియన్ టన్నులు వుండగా, అది గత సంవత్సరం 26 మిలియన్ టన్నులకు పడిపోయింది. ఈ ఏడాది కూడా కరవు కోరలు చాచడంతో నూనె గింజల ఉత్పత్తి మరింత పడిపోతోంది. వేరు సెనగ పంటను కాపాడుకోవడానికి అనంతపురం రైతులు పడుతున్న కష్టాలు కళ్లల్లో మెదులుతూనే వున్నాయి. ఓ వైపు కరవు పరిస్థితులు, మరో వైపు ప్రభుత్వ ప్రోత్సాహం కొరవడిన నేపథ్యంలో నూనె గింజల ఉత్పత్తి తగ్గిపోతోంది. వేరుసెనగ, పొద్దుతిరుగుడు, సోయా, రేప్ సీడ్, ఆముదం, నువ్వులు ఇలా 9రకాల నూనెగింజల ఉత్పత్తి తగ్గిపోతోంది. వీటిని పండించాలంటేనే రైతులు భయపడుతున్నారు.

పెరుగుతున్న వంటనూనెల వినియోగం..
మరోవైపు వంటనూనెల వినియోగం పెరుగుతోంది. ఉత్పత్తికీ, వినియోగానికి మధ్య వున్న కొరతను తీర్చేందుకు విదేశాల నుంచి ఇబ్బడిముబ్బడిగా దిగుమతులు పెంచుతోంది ప్రభుత్వం. గత సంవత్సరం 14.8 మిలియన్ టన్నుల క్రూడ్, రిఫైండ్ ఆయిల్ ను దిగుమతి చేసుకున్నాం. మన దేశంలో 7 మిలియన్ టన్నుల వంట నూనె ఉత్పత్తి అవుతుంటే, అంతకు రెట్టింపు పరిమాణంలో దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. ఇందుకు 60 వేల కోట్ల రూపాయలకు పైగానే వెచ్చిస్తున్నాం. ఇప్పుడు దిగుమతుల బిల్లు 70వేల కోట్ల రూపాయలు దాటుతుందన్న భయాలున్నాయి.

ప్రభుత్వాల వైఫల్యాలు..
ఒక వైపు దిగుమతి చేసుకోవాల్సిన పరిమాణం పెరుగుతోంది. ఇంకో వైపు రూపాయి విలువ పడిపోతోంది. దీంతో వంట నూనెల ధరలు పెరగడం ఖాయమన్నది ఇండస్ట్రీ టాక్. మన దేశం ప్రధానంగా మలేషియా, ఇండోనేషియా దేశాల నుంచి వంట నూనెల దిగుమతి చేసుకుంటోంది. ఆయా దేశాల్లో రిఫైన్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసుకునే లక్ష్యంలో ముడి వంట నూనెలపై ఎగుమతి సుంకాలు భారీగా పెంచాయి. మనదేశంలో 15 నుంచి 20శాతం దిగుమతి సుంకాలు పెంచారు. దీంతో వంట నూనెల ధరలకు రెక్కలొచ్చాయి. రూపాయి విలువ పడిపోవడంతో సలసలకాగి, మనల్ని మలమలకాల్చేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వాలు నూనె గింజల ఉత్పత్తి సాగును పెంచే చర్యలు చేపట్టకపోవడం, మద్దతు ధరలిచ్చి రైతులను ప్రోత్సహించకపోవడం, ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారడం లాంటి చర్యల వల్ల మనం వంటనూనెలు కొనుక్కోవడానికి నానా తిప్పలు పడాల్సి వస్తోంది. 

13:49 - August 14, 2016

అవిసెలు...శక్తివంతమైన ఆహారాలలో ఇది ఒకటి. వీటిని తినడం వల్ల గుండె వ్యాధి..క్యాన్సర్..స్ట్రోక్..మధుమేహం..వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. అంతేగాకుండా జీర్ణవ్యవస్థ పని తీరును మెరుగుపరుస్తుంది. ప్రత్యేక పోషకాలు కీలంగా పనిచేస్తాయి. మేలు చేసే అవిసెగింజలను ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని తినడం వల్ల ఇంకా ఎలాంటి ప్రయోజనాలు దాగుతున్నాయో చూద్దాం..
అవిసెల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటాక్సిడెంట్లు, పీచు ఎక్కువ. షుగ‌ర్‌, క్యాన్సర్‌, గుండె జబ్బులను నివారించటంలో అవిసె నూనె సమర్థమైనదని పరిశోధనల్లో కూడా రుజువైంది. అవిసె గింజల ద్వ‌రా పూర్తి ప్రయోజనం దక్కాలంటే వాటిని దంచి, పొడి చేసి లేదా నూనె రూపంలో తీసుకోవాలి.
ఎముకలు దృఢంగా ఉండేందుకు అవిసెగింజలు తోడ్పడతాయి. రుతుక్రమం సవ్యంగా కొనసాగడంలో సాయపడతాయి.
ఇందులో ఉండే పోషకాలకు రొమ్ము, అండాశయ క్యాన్సర్‌ కారకాలతో పోరాడే శక్తి ఉంది.
అవిసె నూనె వాడడం వల్ల ప్రొస్టేట్‌, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్ల నుంచి రక్షణ పొందవచ్చు. రేడియేషన్‌ ప్రభావానికి గురికాకుండా చర్మానికి రక్షణ అందిస్తుంది.
మెదడుకు శక్తిని పెంచుతుంది. అంతేగాకుండా వీటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్లు ఎమర్జెన్సీగా పనిచేసి డిప్రెష‌న్‌ను కూడా తగ్గిస్తాయి.
జుట్టు, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిలోని బి విటమిన్‌, కీలక కొవ్వులు చర్మం పొడిబారే తత్వాన్ని తగ్గించి, మృదువుగా తయారు చేస్తాయి.
చుండ్రు సమస్య ఉన్న వారికి..పేలు నశించేట్లు చేయడంలో అవిసె నూనె బాగా పనిచేస్తుంది. వెంటుకలు కూడా మళ్ళీ పెరిగి జుత్తు చిక్కగా తయారవుతుంది.
వీటిని నేరుగా తినడానికి ఇష్టం లేఇ వారు సూప్ లు...సలాడ్ లలో వేసుకుని తింటే మంచిది. 

12:30 - July 18, 2016

సీజన్ వారిగా దొరికే పండ్లు..అన్ని రకాల సీజన్ లో దొరికే పండ్లు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. కొన్ని పండ్లలో విత్తులు ఉంటాయనే విషయం తెలిసిందే కదా. కొంతమంది ఈ విత్తనాలను పారేస్తుంటారు. కానీ కొన్ని రకాల పండ్ల విత్తనాలు ఆరోగ్యానికి చాలా మంచిదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవేంటో చూద్దామా..
గుమ్మడి విత్తనాలు తినడం వల్ల డిప్రెషన్ తో పాటు శరీరంలో వాపును కూడా తగ్గిస్తాయి.
నిమ్మకాయ గింజలు, కివి సీడ్స్ కూడా మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుస్తాయి.
పుచ్చకాయ విత్తనాలు పారేయకుండా తినడం వల్ల జట్టు, చర్మం, గోళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. కడుపులో ఉండే నులిపురుగులు కూడా నశిస్తాయంట.
వైద్యుల సలహాతో చిన్నపిల్లలకు ఈ గింజలు ఇవ్వడం మంచిది.
బొప్పాయి పండులోని విత్తనాలను కూడా తినవచ్చని వారు సూచించారు. ఈ విత్తనాల్లో ఉండే పొట్రియోలిక్‌ ఎంజైమ్‌ ల వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయని పరిశోధకులు వెల్లడించారు.

13:44 - March 30, 2016

మనకు లభిస్తున్న అన్ని రకాల ఆహార పదార్థాలలోకెల్లా మొలకెత్తిన గింజలు పూర్తిస్థాయి పోషకాలను అందిస్తాయి. శరీరం చురుకుగా ఉండాలంటే వారంలో కనీసం ఒకసారైనా మొలకెత్తిన గింజలను తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. మొలకెత్తిన గింజలు అధిక బరువును తగ్గించేందుకు కూడా చక్కగా ఉపయోగపడతాయి. మొలకెత్తిన గింజలను పచ్చిగానే తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలు కూడా లభిస్తాయి. అలాకాకుండా ఉడకబెట్టినా, వేడి చేసినా వాటిలోని పోషకాలు తొలగిపోతాయి. ఈ గింజలతో పచ్చి క్యారెట్లను కలిపి తింటే శరీరానికి కావాల్సిన బీటా కెరోటిన్‌ సమృద్ధిగా అందుతుంది.
మొలకెత్తిన గింజలను నిత్యం మన ఆహారంలో భాగం చేసుకుంటే వాటితో ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను పొందొచ్చు. ముఖ్యంగా వీటివల్ల గ్యాస్‌, ఎసిడిటీ తదితర సమస్యలు దూరమవుతాయి. మొలకెత్తిన గింజలలో క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడే ఔషధ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. అలాగే విటమిన్‌ బి, సిలు వీటిలో ఎక్కువగా ఉంటాయి.
మొలకెత్తిన గింజలు జీర్ణ ప్రక్రియను వేగవంతం చేస్తాయి. మధ్యాహ్న సమయంలో మాంసాహారం తింటే సాయంత్రం స్నాక్స్‌లో మొలకెత్తిన గింజలు తినడం బెటర్‌. ఎందుకంటే మాంసాహారం నుంచి వచ్చే అధిక కొవ్వు బారి నుండి గింజలు మనల్ని రక్షిస్తాయి. మాంసంలోని కొవ్వును పీల్చుకోవడం ద్వారా దాన్ని శరీరంలోని ఇతర వ్యర్థపదార్థాలతో కలిపి బయటికి పంపిస్తాయి. వీటిలో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆకలి వేయదు. ఇది బరువు తగ్గించుకునేందుకు ఉపయోగపడుతుంది.

09:54 - January 18, 2016

మధుమేహ వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా చెప్పవచ్చు, ఇది రెండు రకాలు అవి మొదటిది-ఇన్సులున్ ఉత్పత్తి స్థాయిలో లోపం మరియు రెండవది-శరీరంలో ఇన్సులిన్ సరైన స్థాయిలో ఉత్పత్తి చెందినా, వినియోగంలో లోపం అని చెప్పవచ్చు. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్ మరియు శరీర రక్తంలోని చక్కెరలను (గ్లూకోస్ రూపంలో ఉన్న), కాలేయంలో నిల్వ చేస్తుంది, ఈ నిల్వలో కొవ్వు కాణాలు మరియు కండర కణాలు సహాయపడతాయి. మధుమేహ వ్యాధి వలన చాలా రకాల సమస్యలు కలుగుతాయి ముఖ్యంగా నరాలు ప్రమాదానికి గురవటం, రక్త ప్రసరణ లోపాలు ముఖ్యంగా కలిగే ప్రమాదకర అంశాలు అని చెప్పవచ్చు. వీటిని నివారించాలంటే ఈ క్రింది వాటిని తీసుకుంటే సరి.… మరి అవి ఏంటో చూద్దామా....

గింజలు మరియు విత్తనాలు మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. విత్తనాలు మరియు గింజలు మధుమేహ వ్యాధిని తగ్గిస్తాయి. నిజం, గింజలు మరియు విత్తనాల వలన అన్ని రకాల వ్యాధులను తగ్గుతాయట.

బాదం గింజలు.....

బాదంలు అధిక మొత్తంలో ప్రోటీన్'లు, విటమిన్ మరియు మినరల్'లను కలిగి ఉంటాయి; ఆరోగ్యాన్ని ఏలా పెంపొందిస్తాయి అనే దానిపై 'అమెరికన్ యూనివర్సిటీ అఫ్ మెడిసిన్' వారు జరిపిన పరిశోధనల ప్రకారం, రోజు ఒక జత బాదం విత్తనాలను తినటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ హార్మోన్'ను ఉత్తేజ పరుస్థాయి మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి అని తెలిపారు

బట్టర్ నట్స్.....

వీటినే వైట్ నట్స్ అని కూడా అంటారు. ఇవి మోనోసాచురేతేడ్ ఫాటీ ఆసిడ్'లను మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉండి, టైప్-2 డయాబెటిస్ వలన వచ్చే క్లిష్ట సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా, ఈ గింజలను రోజు తినటం వలన చర్మం కాంతివంతంగా అవటమే కాకుండా, కంటి చూపును కూడా మెరుగుపడుతుంది

ఆక్రోటుకాయ లేదా వాల్నట్స్....

ఆక్రోటుకాయలు ఎక్కువ స్థాయిలో మోనో మరియు పాలీ అన్ సాచురేటేడ్ ఫాట్'లను కలిగి ఉండి శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఎవరైతే రోజు ఈ గినజలను తింటారో, వారి శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు ఆరోగ్యకరంగా మరియు సాధారణ స్థితిలో నిర్వహించబడతాయి.

పిస్తా....

శరీర రక్తంలోని చక్కర స్థాయిలు పెరుగుటకు గల కారణం, శరీరంలో కార్బోహైడ్రేట్'ల స్థాయిలు పెరగటం వలన అని చెప్పవచ్చు. కానీ రోజు పిస్తాలను తినటం వలన శరీరంలో పెరిగే కార్బోహైడ్రేట్'ల స్థాయిలు సాధారణ స్థితిలో లేదా వాటి పెరుగుదలను ఇవి తగ్గిస్తాయి.

జీడిపప్పు.....

ఇతర గింజలతో పోలిస్తే, జీడిపప్పులో తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. జీడిపప్పులో, గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే మోనో-సాచురేటేడ్ ఫాట్ లేదా 'ఒలేయిక్ ఆసిడ్'లను 75 శాతం వరకు కలిగి ఉంటాయి. జీడిపప్పులో ఉండే ఫాట్'లు, ఆలివ్ ఆయిల్'లో ఉండే ఫాట్'లు ఒకేరకం అని చెప్పవచ్చు. మోనోసాచురేటేడ్ ఫాట్'లు శరీరంలో ట్రై-గ్లిసరైడ్ లేదా రక్తంలో ఉండే ఫాట్'లను తగ్గించి, మధుమేహ వ్యాధి గ్రస్తులలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి అని చెప్పవచ్చు

గుమ్మడి విత్తనాలు....

గుమ్మడి వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నాయి, వీటి విత్తనాల వలన కూడా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి, గుమ్మడి విత్తనాలు విటమిన్ 'సి', 'ఇ' ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ప్రోటీన్ మరియు ఫైబర్ వంటి చాలా రకాల మూలకాలను అందిస్తుంది. గుమ్మడి విత్తనాలు మధుమేహ వ్యాధి అభివృద్ధి, వాటి వలన కలిగే సమస్యలు, ఇన్సులిన్ ఉత్పత్తి మరియు ఒత్తిడిని తగ్గించటంలో ఈ విత్తనాలు సహాయం చేస్తాయి

నేరేడు విత్తనాలు

మధుమేహ వ్యాధి గ్రస్తులకు నేరేడు పండ్లు అద్బుతమైన ఆహరం అని అందరికి తెలిసిందే, అంతేకాకుండా, వీటి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఉపయోగాన్ని కలిగిస్తాయి. ఎండబెట్టిన వీటి విత్తనాలను, దంచి, పోడిలా చేసి రోజు వాడటం వలన శరీర రక్తంలోని చక్కరలను సాధారణ స్థితిలో ఉంచబడతాయి. ఈ విత్తనాలు ఔషద గుణాలను కలిగి ఉన్న 'జామ్బిలిన్' అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది, ఇది శరీర రక్తంలోని చక్కెరలను స్థిరంగా ఉంచుతుంది.

మెంతులు....

మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి పరిస్థితిని సాధారణ స్థితిలో ఉంచుకోటానికి ఈ విత్తనాలు సహాయపడతాయి. మెంతి విత్తనాలు ఫోలిక్ ఆసిడ్, సోడియం, జింక్, మెగ్నీషియం, కాపర్, థయామిన్, నియాసిన్, కేరోటీన్ వంటి మూలకాలను కలిగి ఉండి, మధుమేహ వ్యాధి మరియు కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. రోజు ఒక చెంచా మెంతి విత్తనాల పొడిని నీటిలో కలుపుకొని తాగటం వలన ఆరోగ్యం పెంపొందించబడుతుంది

నువ్వులు......

నువ్వు విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్'లు, పాలీ మరియు మోనో అన్ సాచురేటేడ్ ఫాట్'లను పుష్కలంగా కలిగి ఉంటాయి. రోజు మీరు తినే ఆహరంలో నువ్వు విత్తనాలను కలుపుకోవటం వలన అధిక రక్త పీడనం, రక్తంలో గ్లూకోస్, చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా, క్యాన్సర్ వ్యాధిని కూడా నివారిస్తుంది.

Don't Miss

Subscribe to RSS - గింజలు