గూగుల్

18:16 - December 6, 2018

ప్రఖ్యాత సెర్చింజన్ గూగుల్ సంస్థ ఒక్కో సర్వీస్‌ని క్లోజ్ చేసుకుంటూ వస్తోంది. ఇప్పటికే గూగుల్ ప్లస్, హ్యాంగౌట్స్ మేసేజింగ్ యాప్‌లను మూసివేన గూగుల్ తాజాగా మరో మేసేజింగ్ యాప్ ''అల్లో''ను మూసివేయాలని నిర్ణయించింది. 2019 మార్చి నుంచి ‘అల్లో’ పూర్తిగా కనిపించకుండా పోతుంది. 2016 సెప్టెంబర్‌లో గూగుల్ సంస్థ ఈ చాట్ యాప్‌ను తీసుకొచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో దీనికి ఆదరణ లభించలేదు. దీంతో ఈ యాప్‌ను క్లోజ్ చేసేందుకు మొగ్గుచూపింది. ఏప్రిల్ నుంచి పెట్టుబడులు నిలిపివేసిన గూగుల్.. వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తిగా యాప్ కార్యక్రమాలను నిలిపివేయనున్నట్టు అధికారిక బ్లాగ్‌లో తెలిపింది. అదే సమయంలో ఎస్ఎంఎస్‌ పంపిణీ నిర్వహణ తీరును మరింత మెరుగుపరిచేందుకు ప్రణాళికలు రూపొందించే పనిలో పడింది. అల్లో స్థానంలో ఆర్‌సీఎస్ తీసుకొని వస్తోంది. ఆండ్రాయిడ్ డివైజస్‌లో ఐమేసేజ్‌లకు ఇది ఉపయోగపడుతుంది.

 

10:48 - December 1, 2018

హైదరాబాద్ :  తెలంగాణ ఎన్నికలు గూగుల్ ట్రెండింగ్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. అసెంబ్లీని రద్దు చేసిన ముందస్తు ఎన్నికలకు వెళ్లిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. మరోవైపు జాతీయ పార్టీ అయిన బీజేపీ, మహాకూటమిగా ఏర్పడిన పార్టీలు ఎన్నికల్లో ప్రచారాన్ని ఉదృతం చేశాయి. ఈ క్రమంలో గత 3 నెలల నుండి గూగుల్ లో తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది? అనే ప్రశ్న వెల్లువెత్తుతోంది. 
2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారా అనే విషయం తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు. ఎన్నికలు జరిగేదాక కూడా ఆగలేక..గూగుల్ తల్లిని ప్రశ్నించేస్తున్నారు. తీవ్రంగా వెదికేస్తున్నారు. ‘‘తెలంగాణాలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు?’’ అనే ప్రశ్న గత 3 నెలల నుండి గూగుల్ లో  నెటిజన్లు వెతుకుతున్న ప్రశ్న ఇదే. తెలంగాణాలో టీఆర్ఎస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలు గూగుల్ ట్రెండ్స్ లో నిలిచాయి. 
కేసీఆర్ అసెంబ్లీ రద్దు,కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన గూగుల్స్ ట్రెండ్స్..
కాగా సెప్టెంబరు 6వ తేదీన సీఎం కేసీఆర్ శాసనసభను రద్దు..అనతరం అసెంబ్లీని రద్దు  చేస్తూ తీర్మానించినపుడు నెటిజన్లు టీఆర్ఎస్ పేరిట ఎక్కువగా పరిశోధించారు. మొదట టీఆర్ఎస్ గురించి ఎక్కువగా శోధించిన నెటిజన్లు నవంబరు 1వతేదీకల్లా టీఆర్ఎస్ కు హిట్స్ తగ్గాయి. గత 20 రోజుల్లో గూగుల్ లో కాంగ్రెస్ గురించి ఎక్కువమంది నెటిజన్లు శోధించారని గూగుల్ ట్రెండ్స్ లో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన తర్వాత టీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ గురించి శోధించిన నెటిజన్ల సంఖ్య ఎక్కువగా ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల గురించి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీఅరేబియా, అమెరికా, సింగపూర్ దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలలో ఎక్కువమంది నెటిజన్లు తెలంగాణా ఎన్నికల గురించి గూగులమ్మను శోధించారని తేలింది.  తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు ఏ రేవంత్ రెడ్డి గురించి ఎక్కువమంది నెటిజన్లు శోధించారని వెల్లడైంది. రేవంత్ రెడ్డి నియోజకవర్గం, ఆయన కుటుంబసభ్యుల గురించి కూడా ఎక్కువ నెటిజన్లు వెతకడం విశేషం. 

10:20 - November 17, 2018

హైదరాబాద్ : ఓట్ల పండుగ వచ్చేస్తోంది. తెలంగాన రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో డిసెంబర్ 7వ తేదీన పోలింగ్ జరుగనుంది. ప్రతొక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఇప్పటికే విపరీతమైన ప్రచారం చేసింది. కానీ అందరి దృష్టి ‘సాఫ్ట్ వేర్’ వారిపైనే నెలకొంది. ఎందుకంటే వీరు ఓటు వేస్తారా ? లేదా ? అనే అందరి మదిలో నెలకొంది.
ఓటు వేయడానికి అనాసక్తి...
టైమ్ దొరకలేదని..ఏదో ఒక కారణం చెబుతూ కొందరు ఓటు ఎగ్గొడుతున్నారు. గత శాసనసభకు జరిగిన ఎన్నికల్లో పోలింగ్ 32 శాతం అంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ రాగానే వీరంతా షికార్లకు..ఇతర ప్రాంతాలకు కుటుంబసమేతంగా వెళ్లడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రధానంగా నగరంలో వివిధ కంపెనీలలో పనిచేస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు అధికారంగా ఉంటున్నారు. బాగా చదువుకున్న వారు సైతం ఓటు వేయడానికి ఆసక్తి చూపకపోవడం కరెక్టు కాదని పలువురు పేర్కొంటున్నారు. 
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మొత్తం 27 నియోజకవర్గాలున్నాయి. 
ఈ మూడు జిల్లాల్లో 88 లక్షల మంది ఓటర్లున్నారు. 
2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ 53 శాతం మాత్రమే. 

రెండు రోజులు సెలవులు...
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7వ తేదీ (శుక్రవారం) ఎన్నికలు జరుగున్నాయి. అంటే శని, ఆదివారాల్లో ఈ ఉద్యోగులకు వీకెండ్ సెలవు ఉంటుంది. ఈ సెలవుల్లో వీరు విహార యాత్రలకు..ఇతర ప్రదేశాలకు వెళ్లే ప్రయత్నం చేస్తుంటారు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన అధికారులు పోలింగ్ జరిగే రోజు అంటే శుక్రవారం ఉద్యోగులంతా ఏదో ఒక సమయంలో కార్యాయాలకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలని కమిషనర్ కోరారు. ఈసారి ఓటు శాతం పెంచాలనీ, కనీసం 80 శాతం మంది ఓటు వేసేలా చెయ్యాలని  అధికారులు భావిస్తున్నారు. మరి ఓటు శాతం పెరుగుతుందా ? సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఓటు వేసేందుకు ఆసక్తి కనబరుస్తారా ? లేదా ? అనేది చూడాలి. 

 

09:13 - October 26, 2018

ఢిల్లీ :  ప్రముఖ అంతర్జాల సంస్థ గూగుల్ కు ‘మీటూ’ సెగ పాకింది. ‘మీ టూ’ ఉద్యమం యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. ఆ రంగం ఈ రంగం అనే తేడా ఈ ఉద్యమానికి లేదు. అన్ని రంగాలలోను వుండేది మనుషులే కాబట్టి ‘మీటూ’ అన్ని రంగాలలను కుదిపేస్తోంది. కాకుంటే సెలబ్రిటీల ముసుగులో కొందరు చేస్తు వెర్రి మెర్రి వెకిలి చేష్టలు ఇకపై భరించబోమంటు ‘మీటూ’ అంటున్నారు నుటి అతివలు. ఇప్పటి వరకూ సిని పరిశ్రమ, బిజినెస్, రాజకీయాలు వంటి పలు కీలక రంగాలలో వుండే వేధింపులు వెలుగులోకి వచ్చాయి. కానీ వెలుగులోకి రానివి ఎన్నో ఎన్నెన్నో. ఈ నేపథ్యంలో ఏ రంగమైనా, ఎటువంటి వ్యక్తులైన వేధింపులను మాత్రం భరించబోమంటు గళమెత్తుతున్నారు అతివలు.  ఈ నేపథ్యంలో మీటూ ఉద్యమ సెగ ఇప్పుడు గూగుల్‌కు పాకింది.

Image result for googleప్రపంచంలోనే అతి ప్రశాంతమైన పని ప్రదేశం అని పేరొందిన గూగుల్ లో కూడా ఈ సెగ తప్పలేదు. 48 మంది ఉద్యోగులపై లైంగివ వేధింపుల ఆరోపణల వేటు పడింది. వీరిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. తమ సంస్థలో మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉందని పేర్కొన్న ఆయన.. వారి రక్షణకు గూగుల్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.  వేధింపులు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే సంస్థ వారికి అండగా ఉంటుందని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. తాము తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. విధుల నుంచి తొలగింపునకు గురైన వారికి ఎటువంటి ఎగ్జిట్ ప్యాకేజీ ఉండదని పేర్కొన్నారు.

12:10 - September 5, 2018

సెప్టెంబర్ 5...సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. ఆయన జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీచర్లకు శుభాకాంక్షలు తెలియచేస్తూ ప్రముఖ అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ రూపొందించింది. ప్రముఖుల దినోత్సవాలు..ఇతర ముఖ్యమైన రోజుల్లో గూగుల్ డూడుల్స్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. కళ్లజోడు ధరించిన ఉపాధ్యాయుడిని గ్లోబ్‌గా చూపిస్తూ.. మ్యూజిక్, ఆస్ట్రానమీ, మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఇతర పాఠ్యాంశాలను ప్రస్తావిస్తూ.. గురువు ప్రాధ్యాన్యతను ప్రతిబింబించేలా..డూడుల్ ను రూపొందించింది.

ఇక ఈ డూడుల్‌ను ఎంపిక చేయడం కోసం పోటీలను కూడా నిర్వహిస్తుంటారు. ఆకర్షితంగా ఉండేలా ఈ డూడుల్ ఉంటుంది. 1998లో తొలి గూగుల్‌ డూడుల్‌ పుట్టుకొచ్చింది. అప్పటి నుంచి ఇప్పటివరకు వస్తున్న..వచ్చే డూడుల్స్ నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తుంటాయి. టీచర్స్ డే సందర్భంగా దేశ వ్యాపితంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేస్తుంటుంది. భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అవార్డులను అందిస్తుంటారు. మరొక్కసారి ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు....

20:32 - May 3, 2018
08:30 - December 15, 2017

విజయవాడ : సాన్ ప్రాన్సిస్కోలోని గూగుల్ ఎక్స్ కార్యాయంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఎక్స్ కంపెనీ మధ్య ఒప్పందం కుదిరింది. ఏపీ ప్రభుత్వం తరపున మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా ఏపీలో డెవలప్ మెంట్ సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయనుంది. మొదటిసారిగా గూగుల్ ఎక్స్ ఇండియాలో అడుగుపెట్టనుంది. త్వరలో విశాఖ జిల్లాలో సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఆధునాతన టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలోని 13జిల్లాలో 2 వేల ఫ్రీ స్పేస్ ఆప్టికల్ కమ్యూనికేషన్ లింక్స్ గూగుల్ ఎక్స్ ఏర్పాటు చేయనుందని, అందులో భాగంగా ఫైబర్ కేబుల్ అవసరం లేకుండానే మొబైల్ డేటా, వైఫై సేవలు అందుబాటులోకి రానున్నాయి. సర్టిఫికేట్ లెస్ గవర్నెన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు, రియల్ టైం గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకొంటున్నట్లు పేర్కొన్నారు. 

12:38 - May 22, 2017

హైదరాబాద్: భారతీయులు భోజన ప్రియులు. భారతీయ వంటకాలు మంచి పేరు ప్రఖ్యాతలు పొందాయి. దేశంలోని వంటకాలకు ఒక్కో ప్రాంతానికి ఒక్కో రుచి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అలాగే తను చేసే వంటలకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంది వందేళ్ల పై బడిన బామ్మ. తన వంటలతో నెట్టింట్లో ఘుమఘుమలాడించేస్తున్న గూగుల్ బామ్మ కథనంతో మీ ముందుకు వచ్చింది ఈ నాటి మానవి. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి..

14:40 - August 15, 2016

ఢిల్లీ : భారతదేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురష్కరించుకుని గూగుల్‌ డూడుల్‌లో సరికొత్త ఫొటోను పెట్టారు. పార్లమెంట్‌లో జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రసంగిస్తున్న ఫొటోను గూగుల్‌ డూడుల్‌లో పెట్టారు. గత స్వాతంత్ర్య దినోత్సవాలకు ఎర్రకోట, మూడు రంగుల జాతీయ జెండా, జాతీయ స్టాంపులు, జాతీయ పక్షి నెమలితో కూడుకున్న ఇమేజ్‌లను ఉంచిన గూగుల్‌ ఈసారి.. స్వాతంత్ర్యం వచ్చిన రోజు నె‌హ్రూ ప్రసంగిస్తున్న చిత్రాన్ని ఉంచారు. ఇది నెటిజన్‌లను విశేషంగా ఆకట్టుకుంటుంది.

15:00 - September 28, 2015

హైదరాబాద్ : మొబైల్ మార్కెట్‌లో గూగుల్‌ మరో రెండు కొత్త ఫోన్లను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. అదిరిపోయే ఫీచర్లతో నెక్సస్ ఫైవ్ ఎక్స్ పేరుతో వీటిని తీసుకురానుంది. రెండు రోజుల్లో మార్కెట్‌లోకి రిలీజవుతున్న నెక్సస్ ఫైవ్ ఎక్స్ విశేషాలేంటో చూద్దాం....

ఐదేళ్ల క్రితం మొబైల్‌ ఫోన్లలో నెక్సస్ సిరీస్‌.....

ఐదేళ్ల క్రితం మొబైల్‌ ఫోన్లలో నెక్సస్ సిరీస్‌ ను ప్రారంభించింది గూగుల్. ఇప్పుడు ఇదే సిరీస్‌లో నెక్సస్ ఫైవ్ ఎక్స్ ను విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. సెప్టెంబర్ 29న అఫీషియల్‌గా వీటిని లాంఛ్‌ చేస్తోంది.

ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ మార్షమల్లో.....

యాపిల్, శామ్‌సంగ్, సోని, మోటరోలా కంపెనీలు గడచిన రెండు నెలల్లో కొత్త ఫోన్లను రిలీజ్ చేశాయి. ఇప్పుడు గూగుల్ వంతు. లేటెస్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ "ఆండ్రాయిడ్ మార్షమల్లోతో'' నెక్సస్ ఫైవ్‌ ఎక్స్‌ ను లాంచ్‌ చేయాలని భావిస్తోంది.న్యూ క్రోమ్ కాస్ట్ న్యూస్‌ కూడా ఇందులో ఉంటుందట. అంతేకాదు స్ఫూటితో భాగస్వామ్యం, అప్‌డేటెడ్ యాప్‌ నెక్సస్‌ కొత్త వెర్షన్‌లో ఉంటుందని గూగుల్ తెలిపింది. దీంతో నెక్సస్‌ ఫైవ్‌ ఎక్స్‌పై అందరిలోనూ అంచనాలు పెరుగుతున్నాయి. దీని షేప్‌ ఎలా ఉంటుందో స్పష్టంగా బయటపడక పోయినా.. కొన్ని ఇమేజెస్‌ నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి.

డిస్‌ ప్లే 5.2 అంగులాలు......

దీని ఫీచర్ల విషయానికి వస్తే...నెక్సస్ ఫైవ్ ఎక్స్ డిస్‌ ప్లే భారీగా ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 5.2 ఇంచెస్ డిస్‌ప్లే, 1080p రెజల్యూషన్‌ లు ఆకర్షణగా చెబుతున్నారు.

ఫింగర్ ప్రింట్ సెన్సర్....

ఫింగర్ ప్రింట్ సెన్సర్. గూగుల్ నెక్సస్‌ ఫైవ్ ఎక్స్ లో హైలెట్‌. ఈ ఫీచర్‌ తప్పకుండా మార్కెట్లో తమ ఫోన్లకు క్రేజ్ పెంచుతుందని గూగుల్ భావిస్తోంది. ఇక ఫోన్ వెనుక భాగం.. సిల్వర్‌ కలర్‌లో‌ ఉంటుందని తెలుస్తోంది. కెమెరా ఫీచర్ల విషయానికి వస్తే... వెఉక భాగాన థర్టీన్ మెగాపిక్సల్‌ .. ముందు భాగాన 5 మెగా పిక్సల్‌ రిజల్యూషన్‌ ఉన్నట్లు చెబుతున్నారు. 2జీబీ లేదా 3జీబీ ర్యామ్‌తో ఫోన్‌ స్పీడ్ దూసుకుపోతుందని తెలుస్తోంది. 16 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉండొచ్చని నెటిజన్ల అంచనా. మొత్తానికి ఎన్నో అంచనాలతో మార్కెట్లోకి ఎంటరవుతున్న గూగుల్ నెక్సస్ ఫైవ్ ఎక్స్...ధర కూడా ఆ రేంజ్‌లో ఉంటుందని ఎక్స్ పర్ట్స్ భావిస్తున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - గూగుల్