గ్రామస్థులు

13:54 - August 27, 2018

అనంతపురం : పరిగి మండలంలో ఉద్రిక్తత నెలకొంది. పెట్రోల్‌ బాటిల్స్‌ పట్టుకొని ఊటకూరు గ్రామస్థులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేయవద్దని డిమాండ్‌ చేస్తున్నారు. అధికారులకు వ్యతిరేకంగా గ్రామస్తులు నినాదాలు చేస్తున్నారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని గ్రామస్తులంటున్నారు. 

 

22:08 - July 29, 2018

పెద్దపల్లి : జిల్లా రాఘవపూర్‌లోని గోదాంపై గ్రామస్థులు దాడికి దిగారు. గోదాంలోని ఫర్నీచర్‌ను ధ్వసం చేశారు. నిల్వ ఉంచిన ధాన్యంతో ఇళ్లలోకి లక్క పురుగులు వస్తున్నాయని.. లక్క పురుగులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోకపోవటంతోనే గోడౌన్‌పై దాడి చేశారు. 

 

16:30 - July 21, 2018

రాజస్థాన్ : గోరక్షణ పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని సుప్రీంకోర్టు పలుమార్లు హెచ్చరించినా దాడులు మాత్రం ఆగడం లేదు. రాజస్థాన్‌లోని అల్వార్‌ జిల్లాలోని రామ్‌గఢ్‌లో ఆవులను స్మగ్లింగ్‌ చేస్తున్నారనే నెపంతో గ్రామస్తులు ఓ యువకుడిని కొట్టి చంపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడిని హర్యానాకు చెందిన అక్బర్‌ ఖాన్‌గా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శుక్రవారం రాత్రి అక్బర్‌, అస్లామ్‌ ఆవులను తీసుకెళ్తుండగా.. అల్వార్‌ గ్రామస్తులు అడ్డుకున్నారు. భయాందోళనలకు గురైన ఆ యువకులు ఆవులను వదిలి పారిపోయే ప్రయత్నం చేశారు. గ్రామస్థులు వారిని వెంబడించి అక్బర్‌ను పట్టుకుని చితకబాదారు. అస్లామ్‌ వారి నుంచి తప్పించుకున్నాడు. నిందితులను త్వరలోనే అరెస్ట్‌ చేస్తామని అల్వాల్‌ ఎఎస్‌పి అనిల్‌ బైజల్‌ తెలిపారు. వారు ఆవుల అక్రమ రవాణకు పాల్పడ్డారా... అన్నది ఇంకా స్పష్టత లేదన్నారు.  ఈ ఘటనను రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధరా రాజే ఖండించారు. నిందితులపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

 

19:38 - April 25, 2018

సూర్యాపేట : జిల్లా మునగాల మండలం కలుకోవ సర్పంచ్‌ చిర్రా శ్రీనివాస్‌ అవినీతికి వ్యతిరేకంగా గ్రామస్థులు తిరుగుబాటు చేశారు. లక్షల రూపాయల అవినీతికి పాల్పడ్డ సర్పంచ్‌ని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో  కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. సర్పంచ్‌పై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. కలుకోవలో పుచ్చలపల్లి సుందరయ్య పేరుతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి సరఫరా పథకానికి నీటి సరఫరా నిలిపివేసిన సర్పంచ్‌ శ్రీనివాస్‌ చర్యను ప్రజలు తప్పు పట్టారు. ఈ విషయాలను ప్రశ్నించిన సీపీఎం నాయకులపై సర్పంచ్‌ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్మును సర్పంచ్‌ నుంచి రికవరీ చేసి, పుచ్చలపల్లి సుందరయ్య వాటర్‌ ప్లాంట్‌కు వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. 

 

19:50 - April 16, 2018

నిర్మల్‌ : ఖానాపూర్‌ మండలంలోని నడింపల్లి గ్రామాన్ని గ్రామ పంచాయితీగా ఏర్పాటు చేయాలని గ్రామస్థులు నిర్మల్‌ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అనంతరం ఖానాపూర్‌ ఎంపీడీవోకు వినతి పత్రం ఇచ్చారు. ఇప్పటికైన ప్రభుత్వం మాకు న్యాయం చేయకపోతే కోర్టు ద్వారానైనా గ్రామ పంచాయితీని సాధించుకుంటామని గ్రామస్థులు స్పష్టం చేశారు. చిన్న చిన్న తండాలను గ్రామ పంచాయితీలుగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం తమ గ్రామాన్ని చిన్న చూపు చూస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

 

19:03 - April 16, 2018

పెద్దపల్లి : శ్రీరాంపూర్‌ మండలం కునారంలో నిజాం కాలం నాటి భూములను కబ్జా కోరల్లో నుంచి కాపాడి పేదలకు పంచాలంటూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. రెండు వేల ఎకరాల భూమిని రాజకీయ నాయకులు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. కబ్జాకు గురైన భూమి నిరుపేదలకు చెందుతుందని.. గ్రామస్థులు పారా, గొడ్డళ్లు చేత పట్టి భూములను చదును చేసి ఆక్రమించుకునే కార్యక్రమం చేపట్టారు.

21:56 - October 27, 2017

చెన్నై : తమ గ్రామస్తుడిని కొట్టి చంపారన్న కారణంతో స్థానికులు ఓ అటవిశాఖ అధికారిని చితకబాదిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా చెంగం గ్రామానికి చెందిన తిరుమలై ఇసుక కోసం ఎడ్లబండిపై వాగుకు వెళ్లాడు. అటవీ ప్రాంతంలో ఉన్న ఆ వాగులో ఇసుక తోడుతుండగా అటవీశాఖ సిబ్బంది తిరుమలైని అడ్డుకుని దాడి చేసింది. ఈ దాడిలో తిరుమలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఘటనాస్థలానికి వెళ్లి అటవీశాఖ సిబ్బందిపై విరుచుకుపడ్డారు. అటవీశాఖ సిబ్బంది కాలికి బుద్ధి చెప్పగా... ఓ అధికారి గ్రామస్తుల చేతికి చిక్కి చావుదెబ్బలు తిన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకోగా వారిపై కూడా ప్రజలు దాడి చేశారు. పోలీసులు గ్రామస్థుల నుంచి ఆ అధికారిని కాపాడి చెంగం పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.

16:33 - August 19, 2017

అదిలాబాద్‌ : జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న అవినీతి అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. టికెట్ల గోల్‌ మాల్‌లో ఆలయ ఉద్యోగుల హస్తం ఉన్నప్పటికీ రోజువారి కూళీని సస్పెండ్‌ చేసి అధికారులు చేతులెత్తేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఉత్సవ విగ్రహం తరలింపు విషయంలో పూజారులతో పాటు అధికారుల హస్తం ఉందని, వారందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దేవదాయ శాఖ వైఫల్యం అవినీతి ఉద్యోగులకు వరంగా మారిందని వారిపై చర్యలు తీసుకొని బాసర పవిత్రతను కాపాడాలని గ్రామస్థులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం వీడియోలో చూడండి. 

16:36 - January 9, 2017

నెల్లూరు : జిల్లా వెంకటగిరి రూరల్‌ మండలం పాళెంకోటలో జన్మభూమి కార్యక్రమాన్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. అధికారులు గ్రామంలోకి రాకుండా రోడ్డుకు అడ్డంగా రాళ్లు, చెట్లు నరికి వేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత జన్మభూమి కార్యక్రమంలో పెట్టుకున్న దరఖాస్తులకు ఇప్పటికీ అతీగతీ లేదన్నారు. అప్పటి చెప్పిన సమస్యలు ఇప్పటికీ పరిష్కరించని అధికారులు మళ్లీ జన్మభూమి పేరుతో వచ్చి ఏం ఉద్దరిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుకు చెట్లు నరికి అడ్డంగా వేయడంతో అధికారులు మూడు గంటలపాటు గ్రామంలోకి వెళ్లలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామస్తులకు సర్దిచెప్పి.. జన్మభూమి కార్యక్రమం జరిగేలా చూశారు.

09:58 - December 25, 2016

కరీంనగర్ : గోదావరిఖనిలో సింగరేణి సంస్థ జీఎం కార్యాలయాన్ని గ్రామస్తులు ముట్టడించారు. గోదావరిఖని సమీపంలోని జనగామ గ్రామ పరిసరాల్లో బొగ్గు తవ్వకాల కోసం ఇటీవల సంస్థ తవ్వకాలు చేపట్టింది. ఈ క్రమంలో గ్రామాన్ని తరలించి ఉపాధి కల్పించాలని వేడుకున్నప్పటికి సంస్థ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు ఊరుకునేదిలేదని అధికారులతో గొడవకు దిగారు. అధికారులు పోలీసులకు ఫిర్యాదుచేయడంతో పోలీసులు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - గ్రామస్థులు