గ్రీన్ సిగ్నల్

13:21 - December 11, 2017

బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో 2001లో విడుదలైన చిత్రం నరసింహనాయుడు... బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలకృష్ణ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయిందీ చిత్రం. తాజాగా ఈ సినిమాకు సీక్వెల్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయట. ఇందుకోసం రైటర్‌ చిన్నికృష్ణ ఓ కథను సిద్ధం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టుగా మలిచిన ఈ కథ విని బాలకృష్ణ వెంటనే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం ఆయన కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో 'జై సింహా'లో నటిస్తున్నారు. 102వ సినిమాగా రూపొందుతున్న ఇది సంక్రాంతికి విడుదల కానుంది. 

 

09:58 - December 2, 2017

గుంటూరు : కాపులను బీసీలో చేర్చే ముసాయిదా బిల్లుకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నేరుగా కాపు రిజర్వేషన్ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీ కమిషన్ నివేదికకు ఏపీ మంత్రివర్గం ఆమోదం తెలిపారు. కాపులను బీసీ...ఎఫ్ కేటగిరిగా 5శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేబినెట్ లో ఆమోదం తెలిపారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

14:51 - September 21, 2017

హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ 1 ఫలితాలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మెయిన్ రిజల్ట్స్ ఇవ్వాలన్న అభ్యుర్థుల వాదనను పరిగణలోకి తీసుకున్న గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలు ఇవ్వాలని తెలంగాణ పబ్లిక్ కమిషనర్ కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో తెలంగాణలో 128 గ్రూప్ 1 పోస్టులకు లైన్ క్లియర్ అయింది. పూర్తి వివరాలకు వీడియో చూడండి. 

22:54 - September 14, 2017
22:03 - June 28, 2017

ఢిల్లీ : విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. న‌ష్టాల‌ను పూడ్చేందుకు ఎయిర్ ఇండియాలో వాటాలు అమ్మేయ‌ాలని నిర్ణయించారు. ఎయిర్ ఇండియా ప్రైవేటీక‌ర‌ణ‌కు క్యాబినెట్ ఓకే చెప్పిన‌ట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు... ఎయిర్ ఇండియా సంస్థలో చేర‌డం వ‌ల్ల సంస్థ మ‌రింత నాణ్యంగా, వేగంగా ప‌నిచేస్తుంద‌ని కేంద్ర మంత్రి జైట్లీ అభిప్రాయ‌పడ్డారు. ప్రస్తుతం ఎయిర్ ఇండియాకు సుమారు 50 వేల కోట్ల అప్పులున్నాయి. నీతి ఆయోగ్ చేసిన ప్రతిపాద‌న‌ల ఆధారంగానే ఎయిర్ ఇండియా ప్రైవేటీక‌ర‌ణ‌కు కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. 

 

06:59 - April 22, 2017

గుంటూరు : అమరావతిలో జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ఉద్యోగులకు తీపి కబురు పంపింది. మే 1వ తేదీ నుంచి ఉద్యోగుల బదిలీలకు పచ్చజెండా ఊపింది. ప్రస్తుతం ఐదేళ్ల సర్వీస్‌ పూర్తి చేసుకున్న ఉద్యోగుల జాబితా తయారు చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. మే 18 నుంచి బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే మే 31లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని నిశ్చయించింది. ఇక ఆస్తుల విభజనపై కేంద్ర హోం శాఖ నిర్ణయాన్ని ఏపీ కేబినెట్‌ వ్యతిరేకించింది.. ఈ అంశంపై ప్రధాని, కేంద్ర హోంమంత్రితో చర్చించాలని నిర్ణయం తీసుకుంది.. ఒకవేళ కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఇచ్చిన నోటు ప్రకారం 9, 10 షెడ్యూల్ ఆస్తుల పంపిణీ జరిగితే ఏపీకి తీరని నష్టం జరుగుతుందని, కొత్తగా ఉద్యోగులను నియమించుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం అభిప్రాయపడుతోంది.
భూసేకరణ వేగవంతం...
అనంతపురం-అమరావతి రహదారి నిర్మాణానికి 24వేల కోట్లు ఖర్చవుతుందని ఏపీ కేబినెట్ అంచనా వేసింది. ఈ రహదారి నిర్మాణానికి 20 వేల ఎకరాలు భూసేకరణ జరపాల్సి ఉంటుందని అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతపురం, కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూసేకరణను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. అలాగే జాతీయ రహదారికి ఇరు వైపులా సర్వీస్‌ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. అంతేగాక రహదారికి ఇరువైపులా పారిశ్రామిక క్లస్టర్లను ఏర్పాటు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.
నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గింపు..
నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గింపునకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతం 50శాతం పెంచే తీర్మానానికి కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. పెంచిన జీతం మే 1నుంచి అమల్లోకి రానుంది. అలాగే క్వింటాల్‌ మిర్చీ పంటకు 1500 రూపాయలు మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని నిర్ణయించారు.. హౌసింగ్‌ కార్పొరేషన్‌కు హడ్కో నుంచి 2003 కోట్లు రుణంగా తీసుకోవడానికి ప్రభుత్వ గ్యారంటీ ఇచ్చేందుకు కేబినెట్‌ అనుమతించింది. 

09:41 - April 21, 2017

ఢిల్లీ : దేశ రాజధానిలో ప్రఖ్యాత ఐదు నక్షత్రాల హోటల్ లో అది ఒకటి. ఆ హోటల్ ను ఇప్పుడు వేలం వేయబోతున్నారు. అదే..’తాజ్ హోటల్'....వేలం వేసేందుకు న్యూఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎన్‌డీఎంసీ)కి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. వేలం ఎందుకు నిర్వాహించాల్సి వస్తుందో కారణాలు విశ్లేషిస్తే..ఈ హోటల్ ను ప్రభుత్వ స్థలంలో నిర్మించారు. 33 ఏండ్ల లీజు ఒప్పందంతో ఈ హోటల్ ను టాటా గ్రూప్ నిర్వహించింది. ఈ ఒప్పందం 2011లో ముగిసిపోయింది. కానీ అప్పటి నుండి 9సార్లు లీజు గడువును టాటా గ్రూప్ కు ఎన్ డీఎంసీ పొడిగిస్తూ వచ్చింది. అద్దె విషయంలో గిట్టుబాటు కావడం లేదంటూ ఎన్ డీఎంసీ భవనాన్ని వేలం వేసేందుకు నిర్ణయించింది. వేలాన్ని టాటా గ్రూప్‌ వ్యతిరేకించడంతో ఎన్‌డీఎంసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దాంతో వేలానికి అనుమతిచ్చిన సుప్రీంకోర్టు..వేలంలో టాటా గ్రూప్‌ దాన్ని దక్కించుకోకపోతే ఖాళీ చేసేందుకు ఆరు నెలల గడువు ఇవ్వాలని ఎన్‌డీఎంసీకి సూచించింది.

21:18 - April 19, 2017

ఢిల్లీ: ఈవీఎంల టాంపరింగ్‌పై దుమారం రేగడంతో కొత్త ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్లను వినియోగించేందుకు కేంద్ర కాబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల్లో పేపర్‌ రసీదులతో కూడిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మిషన్‌లను కొనుగోలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. 16 లక్షల 15 వేల మిషన్లు అవసరమని ఈసీ సూచించిందని.... ఇందుకోసం 3 వేల 173 కోట్లను విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో టాంపరింగ్‌ వివాదం తెరపైకి రావడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త ఈవీఎంల్లో ఓటు వేసిన తర్వాత ఓటరుకు పేపర్‌ రసీదు వస్తుంది. 2019 ఎన్నికలకు ఈ అప్‌గ్రేడెడ్‌ మిషన్లు వివిపిఏటిలను ఉపయోగించాలని కేంద్రం భావిస్తోంది.

21:51 - April 15, 2017

హైదరాబాద్ : ముస్లిం మైనార్టీలకు, గిరిజనులకు రిజర్వేషన్లు పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అయ్యింది. మైనార్టీలకు 12, గిరిజనులకు 10శాతం చొప్పున రిజర్వేషన్‌ పెంచాలని కేబినెట్‌ నిర్ణయించింది.  రేపు ప్రత్యేకంగా సమావేశంకానున్న అసెంబ్లీ..  రిజర్వేషన్ల పెంపు ముసాయిదా బిల్లులను ఆమోదించనుంది. 
టీ.కేబినెట్‌ లో కీలక నిర్ణయాలు 
తెలంగాణ మంత్రివర్గం.. శనివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  రెండుగంటలకు పైగా సాగిన సమావేశంలో మొత్తం 31 అంశాలపై చర్చించారు. ప్రధానంగా ముస్లింలు, గిరిజనులకు రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్‌లో చర్చ జరిగింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లులకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని కేబినెట్‌ నిర్ణయించింది. రిజర్వేషన్ల పెంపుపై విపక్షాలు అనవసర రాద్దాంతం చేస్తున్నాయని సీఎం సహచర మంత్రులతో వ్యాఖ్యానించారు.  న్యాయపరమైన చిక్కులు లేకుండా రిజర్వేషన్లు పక్కాగా ఉండేలా చూడాలన్నారు.
ముస్లిం మైనార్టీలకు 12, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్‌ 
ఉమ్మడి రాష్ట్రంలో బిసి -ఈ కింద ముస్లింలకు నాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన రిజర్వేషన్లు ఎందుకు నిలిచిపోయాయో ఒకసారి చూసుకుని.. మళ్లీ అలాంటి ఆటంకాలు కలుగకుండా అమలు చేయాలని మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అమలైంది 4శాతమేనని.. అందులోనూ దూదేకుల కులం బీసీ -బి కింద ఉందని గుర్తు చేశారు. ఇప్పుడు దీన్ని కూడా బీసీ -ఈ కిందకు తీసుకొచ్చి మొత్తంగా 12శాతాన్ని యధాతథంగా అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఇక గిరిజనుల విషయంలో మాత్రం ఎటువంటి ఆటంకం లేదని... 2011 నుంచి గిరిజన జనాభా పెరిగిందని... వీరికి 10శాతం రిజర్వేషన్‌ అమలు చేయాల్సిందేనని నిర్ణయించారు.
1300 మంది ఫారెస్ట్‌ అధికారుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌
రెవెన్యూ శాఖలోని శాఖాపరమైన 10అంశాలు, నీటి పారుదలశాఖలోని వివిధ అంశాలను కేబినెట్‌ ర్యాటిఫికేషన్‌ చేసినట్టు తెలుస్తోంది.  వీటితోపాటు ఆదిలాబాద్‌లోని పోలీస్‌ బెటాలియన్‌కు 111 ఎకరాలు, కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు 10ఎకరాలు, 1300 మంది ఫారెస్ట్‌ డిఫార్ట్‌మెంట్‌ అధికారుల పోస్టు భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మత్స్యకారుల ఎక్స్‌గ్రేషియాను  6 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.  మొత్తానికి ఆదివారం జరిగే ప్రత్యేక అసెంబ్లీ సమావేశంలో రెండు రిజర్వేషన్ల బిల్లులతోపాటు జీఎస్టీకి కూడా సభ ఆమోదముద్ర వేయనుంది.

 

07:33 - April 13, 2017

హైదరాబాద్: రాష్ట్రంలో తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్టీ, బీసీఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ లో సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పారు. రిజర్వేషన్లు 50 శాతం దాటకుండా ఉండాలని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. ఈ రిజర్వేషన్లు మతపరమైన రిజర్వేష్లనా? ముస్లిం లకు రిజర్వేషన్లు కల్పించడం న్యాయసమ్మతమేనా? ఈ రిజర్వేషన్లను బిజెపి ఎందుకు వ్యతిరేకిస్తోంది? ఇదే అంశం పై న్యూస్ మార్నింగ్ లో చర్చను చేపట్టింది. ఈ చర్చలో ప్రజా శక్తి మాజీ ఎడిటర్ వినయ్ కుమార్, టిఆర్ ఎస్ నేత నందికొండ శ్రీనివాస్, బిజెపి నేత శ్రీధర్ రెడ్డి, బిజెపి నేత ఎస్ కుమార్ పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

Pages

Don't Miss

Subscribe to RSS - గ్రీన్ సిగ్నల్