ఘాజీ

21:50 - February 17, 2017

రానా దగ్గుబాటి ప్రధాన పాత్రలో నటించిన సంకల్ప్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఘాజీ సినిమా ఇవాళా విడుదలైంది. ఈ చిత్రాన్ని మ్యాట్ని ఎంటర్ టైన్ మెంట్ మరియు పీవీపీ సంస్థలు నిర్మించాయి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూద్దాం....

 

09:09 - February 11, 2017

తనది నేచురల్ స్పాంటేనియస్ యాక్టింగ్ అని సొట్టబుగ్గల తాప్సీ పేర్కొంటోంది. తెలుగులో పలు సినిమాలలో నటించి ఏకంగా బాలీవుడ్ లోకి దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తోంది. గతేడాది విడుదలైన 'పింక్' చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె అద్భుతమైన నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. తాజాగా తాప్సీ 'ఘాజీ' చిత్రంలో నటిస్తోంది. ఇందులో ఆమె అనన్య అనే శరణార్థురాలిగా కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో 'తాప్సీ' మాట్లాడుతూ ఇప్పటి వరకు తాను నటనపరమైన ట్రైనింగ్ తీసుకోలేదని, చేసిన సినిమాలన్నీ కంఫర్ట్ గా ఉంటాయని పేర్కొన్నారు. కానీ తన గత చిత్రాలు 'బేబీ', ‘పింక్' చిత్రాలు అవుట్ ఆఫ్ ది బాక్స్ లా ఉంటాయని తెలిపారు. ఇందుకోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని, ఇలాంటి పాత్రలు రావడం యాక్టర్ కి గొప్పే అని అన్నారు.
ఈ చిత్రంలో 'రానా' నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇది నీటిలో జరిగే యుద్ధం. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అప్పట్లో పాక్ ఉపయోగించిన సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘాజి. ఆ యుద్ధ సమయంలో విశాఖపట్టణం దగ్గర బంగాళాఖాతంలో భారత్ తన ప్రత్యర్థి దేశానికి చెందిన ఈ జలాంతర్గామిని జలసమాధి చేసింది. ఈ చిత్రం ఈనెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

10:54 - February 3, 2017

'రానా దగ్గుబాటి' తో 'ప్రభాస్' రెండు కోట్లు బేరం..'బాహుబలి' సినిమాతో మంచి స్క్రీన్ మేట్స్ గా మారిపోయిన 'ప్రభాస్’, ‘రానా'లు మరో అడుగు ముందుకేసి తమ సినిమాల్లో తమకున్న ఫ్రెండ్షిప్ ని చాటుతున్నారు. ’ప్రభాస్' ఈ పేరు వినగానే గుర్తొచ్చే నెక్స్ట్ వర్డ్ డార్లింగ్ ...అందర్నీ ప్రేమగా చిరునవ్వుతో డార్లింగ్ అని పిలిచే 'ప్రభాస్' తనతో 'బాహుబలి'లో లాంగ్ జర్నీ చేసిన 'రానా'ని ఇంకా ఎక్కువగా ఇష్టపడతాడు అనటానికి ఇదొక ఉదహారణ. 'రానా' కొత్త సినిమా 'ఘాజి' 1971 లో భారత్- పాకిస్థాన్ మధ్య జరిగిన యుద్ధవాతావరణం నేపధ్యంలో నిర్మించిన చిత్రం. ఈ సినిమా ఇండియస్ ఫస్ట్ అండర్ వాటర్ ఫిలిం. ఇందులో హీరో పాత్రని 'రానా' చేయగా హీరోయిన్ గా 'తాప్సి' చేశారు. 'రానా' సోలో హీరో గా చేసిన సినిమాలు తక్కువే అయినా మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. 'బాహుబలి' సినిమాలో కూడా 'ప్రభాస్'తో పోటీపడి నటించి మంచి మార్కులే కొట్టేసాడు రానా.

పివిపి ప్రొడక్షన్..
పివిపి ప్రొడక్షన్ హౌస్ తో సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో వస్తున్న 'ఘాజి' సినిమా అటు యాక్షన్ ఎలెమెంట్స్ తో ఇటు దేశభక్తి తో ఉంటూ హాలీవుడ్ సినిమాకి ఏమాత్రం తక్కువ కాకుండా ఉంటుందని విశ్లేషకుల అంటున్నారు. టాలీవుడ్ లో పరిణామాలు పూర్తిగా మారుతూ వస్తున్నాయి. ప్రొడ్యూసర్స్ ఇక్కడి కలెక్షన్ల తో పాటు అబ్రాడ్ కలక్షన్ల మీద కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ మధ్య రిలీజ్ ఐన తెలుగు సినిమాలు అన్ని యు ఎస్ మార్కెట్ లో వసూళ్లు కురిపించినవేజ. 'ఖైదీ నెంబర్ 150’,’ గౌతమిపుత్ర శాతకర్ణి', 'శతమానంభవతి' ఇలా సంక్రాంతి కి రిలీజ్ ఐన సినిమా లు ఇక్కడ వసూళ్లతో పాటు అక్కడ కూడా డాలర్స్ కురిపించాయి. అంత ఇంపార్టెంట్ ఉన్న యు ఎస్ మార్కెట్ మీద హాలీవుడ్ స్టాండర్డ్ ఉన్న 'రానా' సినిమా కచ్చితంగా వసూళ్ల వర్షం కురిపిస్తుందని టాక్. యు వి క్రియేషన్స్ కి పరోక్షంగా బ్యాక్ బోన్ ఐన 'ప్రభాస్' ఈ 'ఘాజి' సినిమా యు ఎస్ రైట్స్ ని రెండు కోట్లకి కొనేశారు. అంటే ఇప్పుడు 'రానా' నటించిన 'ఘాజి' సినిమాని యు ఎస్ లో ప్రెసెంట్ చేయబోయేది యు వి క్రియేషన్స్ అన్నమాట.

10:22 - January 10, 2017

1971లో భారత్ - పాక్ మధ్య ఓ యుద్ధం జరిగింది. యుద్ధ సమయంలో సబ్ మెరైన్ నీట మునిగిపోయింది. ఈ ఘటనను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో 'ఘాజీ' చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ కండలవీరుడు 'రానా' నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నాడు. హాలీవుడ్ స్టాండర్స్ తో, భారీ గ్రాఫిక్స్ తో ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. చిత్రానికి సంబంధించిన ఇప్పటి వరకు పలు లుక్స్ విడుదలైన సంగతి తెలిసిందే. తాజాగా మరో లుక్ విడుదలైంది. ఇందులో సబ్ మెరైన్ లోపలి భాగం చూపిస్తూ 'మీకు తెలియని మరో యుద్ధం గురించి తెలియ చెప్పబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ భారీ చిత్రాన్ని మాట్నీ ఎంటర్ టైన్ మెంట్, పీవీపీ సినిమాలు కలిసి నిర్మించాయి. ఫిబ్రవరి 17న విడుదలవుతున్న సినిమా ట్రైలర్ ను త్వరలోనే రిలీజ్ చేయన్నుట్లు తెలుస్తోంది. 'ఘాజీ' చిత్రం ఇండస్ట్రీల్లో సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉందంట. 'తాప్సీ' పాక్ శరణార్థి పాత్ర పోషించింది.

15:09 - December 13, 2016

టాలీవుడ్ కండలవీరుడు 'రానా' యుద్ధ నేపథ్యంలో సాగే చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే 'ఘాజీ' చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'రానా' నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఇది నీటిలో జరిగే యుద్ధం. అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో ఈ చిత్రాన్ని పీవీపీ సినిమా పతాకంపై ప్రసాద్ వి. పొట్లూరి నిర్మిస్తున్నారు. 1971లో జరిగిన భారత్ - పాక్ యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుంది. అప్పట్లో పాక్ ఉపయోగించిన సబ్ మెరైన్ పీఎన్ఎస్ ఘాజి. ఆ యుద్ధ సమయంలో విశాఖపట్టణం దగ్గర బంగాళాఖాతంలో భారత్ తన ప్రత్యర్థి దేశానికి చెందిన ఈ జలాంతర్గామిని జలసమాధి చేసింది. ఈ నేపథ్యంలో నడిచే కథలో 'రానా' నేవీ ఆఫీసర్ గా నటిస్తున్నారు. హిందీ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. నూతన దర్శకుడు సంకల్ప్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో 'రానా' నేవీ డ్రెస్ ధరించి ఉన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో ఈ చిత్రం విడుదలకు చిత్ర యూనిట్ ప్రయత్నాలు చేస్తోంది. 

Don't Miss

Subscribe to RSS - ఘాజీ