చండీగఢ్

11:44 - April 16, 2018

ఢిల్లీ : జమ్ము కశ్మీర్‌ లోని కథువాలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను చంపిన వారిని ఉరి తీయాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు.

మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని బాధిత కుటుంబం పేర్కొంటోంది. ఆసిఫా అత్యాచారం, హత్య కేసును కథువా కిందిస్థాయి కోర్టు స్వీకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ నుండి చండీగడ్ కు ఈ కేసును తరలించాలంటూ బాలిక తండ్రి సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసుపై మధ్యాహ్నం సుప్రీం విచారించనుంది. కేసును తరలిస్తారా ? లేదా ? అనేది చూడాలి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

15:31 - May 11, 2017

చండీగఢ్ : పంజాబ్‌ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ టీవీ షోలో పాల్గొంటున్న మాజీ క్రికెటర్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సిద్దూ కామెడి షోలో పాల్గొనడంపై కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చట్టాన్ని గౌరవించాల్సిన మీకు నైతిక బాధ్యత లేదా అంటూ హైకోర్టు సిద్ధూను ప్రశ్నించింది. మంత్రిగా ఉంటూ సిద్ధూ టీవీ షోలా ఎలా పాల్గొంటారని హైకోర్టులో ప్రజావ్యాజ్యం దాఖలైంది. ప్రజలకు బాధ్యతగా ఉండాల్సిన మంత్రి కామెడి షోలో పాల్గొనడంపై విపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి. టీవీ షోలో పాల్గొనడం చట్టాన్ని అతిక్రమించినట్లు కాదని సిద్ధూ వాదిస్తున్నారు. పగలంతా మంత్రిగా విధులు నిర్వహిస్తానని... సాయంత్రం ఆరు తర్వాత తాను టీవీలో షో షూటింగ్‌లో పాల్గొంటే అభ్యంతరమెందుకని ప్రశ్నిస్తున్నారు. బిజెపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిన సిద్ధూ పంజాబ్‌ ఎన్నిక్లలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన విషయం తెలిసిందే.

11:28 - July 29, 2016

హర్యానా  : అవును మీరు వింటున్నది నిజమే. గ్యాంగ్ రేప్ కు గురైన బాధితురాలిని ఓ రైతు వివాహం చేసుకున్నాడు. అంతేగాక ఆమెకు న్యాయం కలిగించేందుకు పోరాటం చేస్తున్నాడు. ఈ ఘటన హర్యానాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే...జింద్ జిల్లాలో ఛాతర్ అనే గ్రామం ఉంది. అక్కడ నివాసం ఉండే జితేందర్ అనే యువ రైతు సామూహిక అత్యాచార బాధితురాలిని వివాహం చేసుకున్నాడు. ఆమెకు అండగా ఉండాలని న్యాయపోరాటం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన భార్యపై అత్యాచారానికి ఒడిగట్టిన నిందితుల్లో తప్పించుకుని తిరుగుతున్న ఓ వ్యక్తి అరెస్టు కోసం సీఎం మనోహర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నాడు. న్యాయవిద్యపై ఆసక్తి ఉన్న భార్య కోరికను కూడా నెరవేరుస్తున్నాడు. లాయర్ కావాలన్నది తన లక్ష్యమని..అత్యాచార బాధితులకు అండగా నిలవాలని అనుకొంటోందని జితేందర్ పేర్కొన్నాడు. బాధితుల తరపున పోరాడేందుకు యూత్ ఎగనెస్ట్ రేప్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నాడు. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమె లక్ష్యాలకు సైతం తోడ్పాటు అందిస్తున్న జితేందర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

20:58 - April 20, 2016

చండీగఢ్ : మహిళల కురచ దుస్తుల ధారణపై చండీగఢ్ అధికారులు కొరడా ఝుళిపించనున్నారు. అమ్మాయిలు మినీ స్కర్ట్ లు, అసభ్యకరంగా ఉన్న దుస్తులు ధరించి బార్లు, డిస్కోతెక్ లకు వెళ్లడంపై నిషేధం విధించనున్నారు.  'కంట్రోలింగ్ ఆఫ్ ప్లేసెస్ ఆఫ్ పబ్లిక్ అమూజ్ మెంట్ 2016' కింద పోలీసులు ఈ చర్యలు చేపట్టనున్నారు. అంతేకాదు.. బార్లు, డిస్కోథెక్‌లలో రెండు గంటల సమయాన్ని కూడా తగ్గించనున్నారు. ప్రస్తుతం డిస్కోథెక్‌లలో రాత్రి 2 గంటల వరకు అనుమతిస్తున్నారు. ఇకపై 12 గంటలకే పరిమితం చేయనున్నారు. దీనిపై బార్ యజమానులు, మానవ హక్కుల కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేరాల అదుపుచేసేందుకు వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించడం సరికాదని వాదిస్తున్నారు. రాత్రి వేళల్లో బార్లు, పబ్బుల్లో పెరిగిపోతున్న అసాంఘిక, జాతివ్యతిరేక కార్యకలాపాలకు నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.

 

Don't Miss

Subscribe to RSS - చండీగఢ్