చత్తీస్ గఢ్

13:33 - April 16, 2018

జలం ప్రాణాధారం, జలం జీవాధానం, జలమే జీవం, జలమే ప్రాణం. జలం లేకుంటే ప్రాణికోటి సమస్తం అంతం!! ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ నీటితోనే పని. అది లేకుంటే అన్ని పనులు బంద్! అసలు మానవ మనుగడే బంద్!! మనిషి బతకాలన్నా, పంట పండాలన్నా, జీవకోటి మనుగడ సాగించాలన్నా నీరే ఆధారం! అది లేకుంటే ? అసలు ఆ మాట తలచుకునేందుకే ధైర్యం చాలదు కదూ? నీటి కోసం గ్రామాలకు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కొట్టుకుంటున్నాయంటే కారణం మనుగడ, బ్రతికేందుకు ఆధారం? జీవాధానం. నీటి యుద్ధాలతో దేశాలకు దేశాలకు కొట్టుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. సాధారణంగా నీటికొరత అనేది చాలా ప్రాంతాలలో వుంది. అదీ వేసవి వచ్చిందంటే ఇక చెప్పేదేముంది. స్నేహితులుగా వుండే ఇరుగు పొరుగు వారు కూడా శతృవుల్లా మారిపోతారు. కారణం నీరు.

ప్రాణి మనుగడకు నీరు..
భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, ద్రవ రూపం వాయు రూపంలో అటే మేఘాలు, ఆవిరి రూపాలలో అన్నమాట. మరి నీరు ప్రాణి మనుగడను సాసిస్తోంది. 

నీటికోసం మైళ్ల దూరం కాలినడక..
నీటికోసం మైళ్లకొద్దీ దూరాలు వెళ్లి తెచ్చుకునే దుస్థితి నేటి కంప్యూటర్ యుగంలో కూడా వుంది అంటే పరిస్థితులు ఎంతటి దారుణంగా వున్నాయో ఊహించుకోవచ్చు..హలో అంటే పొలో మంటు ఇంటి ముంగిట్లో వచ్చి పడిపోయే పదార్ధాలు, వస్తువులు. కానీ వేసవి వచ్చిందంటే మాత్రం లీటరు నీరు రూ.100లు పెట్టి కొనుకునే పరిస్థితులు. బీటలు వారిని నేలమ్మ తల్లి. గంగమ్మ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పంటే వేసిన రైతన్న వరుణుడి కోసం ఎదురు చూస్తున్నట్లు..దాహార్తితో కటకటలాడిపోతున్న నేలమ్మను అభిషేకించేందుకు వానమ్మ కానరాని దుర్భర పరిస్థితులు.

వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు..
నడి వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మంచి నీటి కోసం అలమటించే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం... 404 జిల్లాల్లో గతేడాది అక్టోబర్ తర్వాత వర్షాల్లేకపోవడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో 140 జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మరో 109 జిల్లాల్లో ఓ మోస్తరు కరువు ఉంది.

156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు..
156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు ఉంది. నిజానికి ఏటా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితులు వేసవిలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ ఏడాది శీతా కాలంలో అసలు వర్షాలే లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా 63 శాతం వర్షాభావం ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజర్వాయర్లలో తక్కువ నీటి లభ్యత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.

14:50 - December 29, 2017

రాయ్ పూర్ : చత్తీస్ గఢ్ లోని సుక్మాజిల్లా అటవీ ప్రాంతంలో 12 మంది మావోయిస్టు మిలీషయా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలి కాలంలో పోలీసు వాహనాలు కాల్చివేయండతో పాటు దాడుల నిర్వహించిన వారిలో వీరు ఉన్నారు. మరింత సమాచారం వీడియో క్లిక్ చేయండి. 

13:20 - August 26, 2017

చత్తీస్ గఢ్ : మగధీర సినిమాలో ఎత్తైన కొండపై ... మహా శివుడు కొలువుదీరినట్టు చూపిన సన్నివేశం గ్రాఫిక్స్‌ ప్రస్తుతం ఇక్కడ వేల అడుగుల ఎత్తులో ప్రకృతి రహస్యంగా ఉన్న ఈ గణేష్‌ విగ్రహం మాత్రం పచ్చి నిజం.చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా... ప్రకృతి రహస్యాలకు నిలయం. అటువంటి బైలడిల్లా అడవుల్లోని ధోల్‌కాల్‌ గుట్టలపై ఉన్న వినాయకుడి విగ్రహం... అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాదాపు వేయి సంవత్సరాల క్రితం నాగవంశస్తులు ఈ ప్రాంతంలో వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారని ఇక్కడి ప్రజల విశ్వాసం. అయితే ఈ ప్రాంతానికి చేరుకోవడం చాలాకష్టం. నిటారుగా ఉండే కొండలు... వాటిని దాటాక వచ్చే జలపాతాలు... వాటిని దాటి ముందుకు వెళ్తే... వచ్చే మరో పెద్దకొండ.. ఆ కొండ చిట్టచివరి ప్రాంతంలోనే ఈ గణేష్‌ విగ్రహం కొలువై ఉంది. రోడ్డు మార్గం నుంచి 16 కిలో మీటర్లు గుట్టలపై ప్రయాణిస్తే కానీ... దీనికి దగ్గరకు చేరుకోలేం.

విగ్రహ ప్రతిష్టాపన ఆద్యంతం రహస్యంగానే
ఇంద్రావతి నది పక్కన ఉన్న ఈ థోల్‌కాల్‌ కొండలపై ఉన్న ఈ విగ్రహం.. ప్రపంచంలోనే ఎత్తైన ప్రదేశంలో ఉందని చత్తీస్‌గఢ్‌ వాసుల నమ్మకం. మునులు, రుషులు ఈ వినాయకుడిని పూజించారని ఇక్కడి ఆదివాసీల నమ్మకం. నారద మునీంద్రుడు.. కూడా ఈ గణపతిని దర్శించేవాడని స్థానికుల విశ్వాసం. ఇప్పటి వరకూ కేవలం వందల సంఖ్యలో మాత్రమే భక్తులు ఈ ప్రాంతానికి చేరుకున్నారు. భక్తుల విశ్వాసం ఎదైనప్పటికీ ఈ గణేశుడు విగ్రహ ప్రతిష్టాపన ఆద్యంతం ఒక రహస్యంగానే ఉంది. ఈ గణేష్‌ ఇక్కడ ఎలా వెలిశాడు? ఎవరైనా చెక్కారా? తీసుకొచ్చి ప్రతిష్టించారా? కొన్ని వందల కిలోల బరువు ఉండే ఈ విగ్రహం అక్కడికి ఎలా చేరిందనేది మాత్రం మిష్టరీగానే ఉంది. 

17:54 - August 17, 2016

చత్తీస్ గఢ్ : దంతెవాడలో ఎన్ కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరో 8 మంది మావోయిస్టులకు గాయాలయ్యాయి. పలువురు పోలీసులకు గాయపడ్డారు. ఎన్ కౌంటర్ ఘటనతో అక్కడ ఉద్రిక్త వాతారణం నెలకొంది. 

 

Don't Miss

Subscribe to RSS - చత్తీస్ గఢ్