చర్చ

20:49 - May 25, 2018

రేపటికి మోడీ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతుంది. ఈ నాలుగేళ్ల పాలనలో మోడీ సాధించిందేంటీ ?  ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో సీపీఎం తెలంగాణ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు వెంకట్, బీజేపీ నేత రాకేష్ రెడ్డి, ఏపీ కాంగ్రెస్ నేత సుందర్ రామశర్మ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

20:47 - May 24, 2018

బీజేపీ వ్యతిరేకపార్టీలు ఏకతాటిపైకి రానున్నాయా..? 2019 ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారనున్నాయా..? కూటములు..రాజకీయ పార్టీలు..అనే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు తెలకపల్లి రవి, టీఆర్ ఎస్ నేత వేణుగోపాలాచారి, ఏపీ బీజేపీ నేత రఘునాథ్, టీడీపీ నేత రాజేంద్రప్రసాద్ పాల్గొని, మాట్లాడారు. 
దేశ, రాష్ట్ర రాజకీయాలపై మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

09:45 - May 21, 2018

శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రజలకు అండగా వుంటుందనే ఉద్శ్యేంతోనే టీడీపీకి తాను మద్ధతునిచ్చాననీ..అటు కేంద్రంలో కూడా ఏపీకి ప్రజలకు మంచి చేస్తుందనే ఆలోచనతో మోదీ ప్రభుత్వానికి తాను సపోర్ట్ చేశాననీ కానీ ఇద్దరు ప్రజలను మోసం చేసారనీ..ఏపీకి ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజి విషయంలో కేంద్రం దగా చేసిందనీ..ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమీ చేయకుండా ప్రజలను దగా చేసిందని విమర్శలు గుప్పించారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిందని... అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంతోనే ఏపీకి ప్రత్యేక హోదా రాలేదని ఇచ్ఛాపురం బహిరంగ సభలో పవన్‌ మండిపడ్డారు. ఈ అంశాలపై చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో బీజేపీ నేత విష్ణు, టీడీపీ నేత మన్నెవ సుబ్బారావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామశర్మ,సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షలు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నర్శింగరావు పాల్గొన్నారు. 

09:43 - May 21, 2018

ప్రతిరోజు పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ప్రజలను భయపెడుతున్నాయి. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర 80 రూపాలయలు దాటేసింది. డీజిల్ సైతం 73రూపాయలకు చేరుకుంది. పెట్రోరేట్ల పెరుగుదలతో .. నిత్యావసరాల ధరలు ఎక్కడ పెరుగుతాయోనని సామాన్యుడు ఆందోళన పడుతున్నాడు. ఎన్నో వస్తువులను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చిన కేంద్రం పోట్రోల్, డీజిల్ ధరలను ఎందుకు తీసుకురాలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోపక్క చూసుకుంటే భారత్ పొరుగు దేశాలైన పాకిస్థాన్ లో లీటర్ పెట్రోలు 41.15,నేపాల్ 61.35, చైనా64.42,బంగ్లాదేశ్ 69.46 గా వుంటే ఆఫ్గానిస్థాన్ లో 41.15,శ్రీలంక 53.72, భారత్ లో మాత్రం రై.80లుగా ఎందుకుంది? దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాల మతలబేమిటి? అటు కేంద్రం, ఇటు రాఊ ప్రభుత్వాల విధానాలతో సామాన్యుడు అల్లాడిపోతున్నాడు. ఈ అంశంపై చర్చను చేపట్టింది 10టీవీ..ఈ చర్చలో బీజేపీ నేత విష్ణు, టీడీపీ నేత మన్నెవ సుబ్బారావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి రామశర్మ,సీఐటీయూ ఏపీ రాష్ట్ర అధ్యక్షలు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు నర్శింగరావు పాల్గొన్నారు. 

08:46 - May 18, 2018

రోజు రోజుకి మైనర్లపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి... ఒక గుంటూరు జిల్లాలోనే నెల రోజుల్లో వెలుగు చూసిన అనేక సంఘటనలు పరిశీలిస్తే పరిస్థితి ఎలా ఉందో చెప్పకనే చెబుతున్నాయి. ఒక పక్క కేంద్ర ప్రభత్వం కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్నా .. ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఆడపిల్లలపై చేయి వేస్తే ఉరుకోమని హెచ్చరిస్తున్నా... అఘాయిత్యాలు అగడం లేదు. చిన్న పిల్లలపై జరుగుతున్న అత్యాచారాలు ప్రస్తుతం తెలుగు రాష్ట్ర ప్రజలను కలిచివేస్తున్నాయి. ఇవి పెరగటానికి గల కారణాలు ఏంటి ? ఇవి అగాలంటే తీసుకోవలసిన చర్యలపై ఇవాళ్టి జనపథం కార్యక్రమంలో ఐద్వా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం.. 

20:08 - May 9, 2018

కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై వక్తలు వాడీవేడి చర్చ చేశారు. కర్నాటక ఎన్నికల ఫలితాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో విశ్లేషకులు నగేష్ కుమార్, బీజేపీ నేత ప్రకాశ్ రెడ్డి, సీపీఎం ఏపీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్.బాబురావు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం... 

07:56 - May 8, 2018

2015లో తెలుగు రాష్ట్రాల్లో సంచనం సృష్టించిన ఓటుకు నోటు కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ కేసు దర్యాప్తు పురోగతిపై నిన్న సమీక్షించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీని వీడి కాంగ్రెస్‌లో చేరిన రేవంత్‌రెడ్డి ఈ కేసులో నిందారోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ అంశంపై టెన్ టివిలో జరిగిన చర్చా వేదికలో మల్లయ్య యాదవ్ (టిడిపి), లక్ష్మీ పార్వతి (వైసిపి), రాజమోహన్ (టీఆర్ఎస్) పాల్గొని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

11:19 - April 24, 2018

ఏపీ రాజకీయాలపై వక్తలు మాట్లాడారు. ఏపీకి ప్రత్యేకహోదా.. టీడీపీ, వైసీపీ పోరాటంపై చర్చించారు. ఇదే అంశంపై నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైఎస్ ఆర్ సీపీ నేత కొండా రాఘవరెడ్డి, టీడీపీ నేత సూర్యప్రకాశ్, జనసేన అధినేత శ్రీధర్ 
పాల్గొని, మాట్లాడారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

08:24 - April 20, 2018

హైదరాబాద్ : బీజేపీని ఓడించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి. పొత్తులపై మీడియాలో ఊహాజనిత వార్తలు వస్తున్నాయన్న ఏచూరీ.. పాలకవర్గ పార్టీలకు కొమ్ము కాసే పొత్తులకు తమ పార్టీ ఎన్నడూ వెళ్లదని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోని బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలను విముక్తం చేయడమే తమ ప్రధాన కర్తవ్యమని... దానిపైనే దృష్టి సారించామన్నారు. 
రాజకీయ ముసాయిదా తీర్మానంపై విస్తృత చర్చ 
హైదరాబాద్‌లో సీపీఎం 22వ జాతీయ మహాసభలు రెండోరోజూ కొనసాగాయి. ఇందులో పార్టీ రాజకీయ ముసాయిదా తీర్మానంపై విస్తృతంగా చర్చించారు. చర్చల వివరాలను పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, గురువారం మీడియాకు వివరించారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం నుండి ప్రజలను విముక్తం చేయడం ప్రగతిశీల, ప్రజాస్వామిక శక్తుల లక్ష్యమన్న ఏచూరి.. తమ చర్చలు ఆదిశగానే సాగుతున్నాయన్నారు. ఇక ఎన్నికల పొత్తుల అంశంపై మీడియా ప్రశ్నలకు స్పందించిన ఏచూరి... మీడియాలో అనేక రకాలైన ఊహాజనిత వార్తలొస్తున్నాయన్నారు. పాలకవర్గ పార్టీలకు కొమ్ము కాసేలా..  ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం సీపీఎం చరిత్రలోనే లేదన్నారు. తాము ఎన్నికల బరిలో ఉన్నచోట తమకు ఓటేయాల్సిందిగా కోరతామని, తాము బరిలో లేనిచోట, బీజేపీని ఓడించమంటూ ప్రజలను కోరతామనీ ఏచూరి చెప్పారు.  
ఏపీకి ప్రత్యేక హోదాపై మహాసభల్లో తీర్మానం ! 
ఇక ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపైనా మహాసభల్లో తీర్మానం ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన సమయంలోనే తమ పార్టీ  వైఖరిని స్పష్టం చేశామని... రాష్ట్రానికి పదేళ్లు హోదా ఇస్తామన్న వెంకయ్యనాయుడు.. అనంతరం కాలంలో ఎందుకు మాట నిలుపుకోలేదని ప్రశ్నించారు. 
జస్టిస్‌ లోయా మృతిపై సుప్రీంకోర్టు తీర్పు దురదృష్టకరం : ఏచూరి
మరోవైపు.. జస్టిస్‌ లోయా మృతిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని ఏచూరి వ్యాఖ్యానించారు. లోయా మృతిపై దాఖలైన అన్ని పిటిషన్లనూ రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేమని, ఉన్నత ధర్మాసనం దీన్ని మరోసారి సమీక్షించాలని డిమాండ్‌ చేశారు. ఇక కేసీఆర్‌ ఫ్రంట్‌పై కూడా స్పందించిన ఏచూరి... ఇప్పటినుంచే వాటిపై చర్చలు అనవసరమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ కనుసన్నల్లోని బీజేపీ ప్రభుత్వం నుంచి ప్రజలను రక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 

 

10:52 - April 19, 2018

హైదరాబాద్ : నగరంలో నేడు రెండో రోజు సీపీఎం జాతీయ మహాసభలు జరుగున్నాయి. రాజకీయ తీర్మానంపై చర్చ జరుగనుంది. ప్రకాశ్ కరత్ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టారు. మొదటిరోజు మహాసభలో రాజకీయ అంశాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఎత్తుగడలు, విధానాలను పేర్కొన్నారని తెలిపారు. నేడు వాటిపై చర్చ ఉంటుందన్నారు. మహాసభల కంటే ముందే తమ పార్టీ రాజకీయ నివేదిక విడుదల చేసిందని...ప్రజల ముందు ఉంచామని..8 వేలకు పైగా సలహాలు, సూచనలు వచ్చాయని... మహాసభల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - చర్చ