చర్మం

12:45 - March 7, 2018

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. దీనితో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాల్సినవసరం ఏర్పడుతుంది. ప్రధానంగా చర్మం పట్ల జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోవడం..డీ హైడ్రైట్ అవడం జరుగుతుంటాయి. ముఖం నల్లగా మారిపోతుండడంతో పలువురు ఎన్నో క్రీములు..ఇతర సౌందర్య సాధనాలను వాడుతుంటారు. కానీ ముఖాని కోమలంగా తయారు చేసుకోవాలంటే..కాంతివంతంగా ఉండాలంటే కొన్ని చిట్కాలు..

 • ఒక చెంచా టమాట గుజ్జు తీసుకోవాలి. అందులో ఒక చెంచా నిమ్మరసం కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఒక 20 నిమిషాల అనంతరం చల్లటి నీటితో కడుక్కోవాలి.
 • కలబంద గుజ్జును రాత్రి పడుకొనే ముందు పెట్టుకోవాలి. పెట్టుకోకముందే అందులో గులాబీ నీళ్లను కొద్దిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని పడుకోవాలి. ఉదయం లేచిన తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి.
 • పచ్చిపాలల్లో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పది నిమిషాల అనంతరం శుభ్రమైన చేతులతో కొద్దిసేపు రుద్ది ఆ తరువాత చల్లటి నీటితో కడుక్కోవాలి.
 • ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న మురికి తొలగిపోతుంది. దాంతో పాటు చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది.
14:52 - November 3, 2017

అన్ వాంటెడ్ హేర్..ఈ సమస్యతో మహిళలు బాధ పడుతుంటారు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు బయటకు వెళ్లాలంటేనే వెనుకంజ వేస్తుంటారు. దీనిని తొలగించుకోవడానికి పలు దారులు వెతుకుతుంటారు. ఈ సమస్య నుండి బయటపడాలంటే ఎలాంటి పరిష్కారాలున్నాయనే దానిపై చర్మవ్యాధి నిపుణులు శంకుతల తెలిపారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

12:06 - May 10, 2017

ముల్తాని మట్టీ..సౌందర్యానికి వాడుతుంటారు. చర్మం పలు రకాలుగా ఉంటుంది. ఒకరికి పొడి చర్మ..మరొకరికి ఆయిల్ చర్మం ఇలా ఉంటుంది. ఈ ముల్తాని మట్టిని ఉపయోగించి వారు మరింత అందంగా తయారు కావచ్చు. ముల్తానీ మట్టి..తేనే..పసుపు..అన్నీ ఒక దగ్గర కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ గా వేసుకోవాలి. అనంతరం 20 నిమిషాల తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి.
మూడు స్పూన్ల ముల్తాని మట్టీ..ఒక టేబుల్ స్పూన్ పెరుగు..దోసకాయ గుజ్జు..కొద్దిగా శనగపిండిని తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ గా వేసుకుని 20 నిమిషాల తరువాత చల్లని లేదా గోరువెచ్చని నీటితో కడగాలి.
రెండు టేబుల్‌ స్పూన్ల ముల్తానీ మట్టి, టేబుల్‌ స్పూన్‌ గంధం పొడి, చిటికెడు పసుపు తీసుకుని అన్నింటినీ బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తరువాత నీటితో శుభ్ర పరచాలి. ఇది ఆయిలీ, పొడి చర్మాలకు మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

13:24 - April 18, 2017

రోజు వారి పనుల్లో భాగంగా మన గురించి మనమే పట్టించుకోవడం మానేశాం. ప్రస్తుతం అలాంటి రోజులున్నాయి. కానీ అలా పట్టించుకోకుండబా ఉండడం వల్ల ఆరోగ్యంతో పాటు అందం కూడా కోల్పోతుంటాం. రాత్రి పడుకొనే సమయంలో కొన్ని చిట్కాలను పాటిస్తే అందం మెరుగయ్యే అవకాశం ఉంది.
రాత్రి పడుకొనే ముందు తాజా కొబ్బరినూనెతో ముఖానికి మెల్లిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కోమలంగా ఉండడమే కాకుండా ముఖంపై వచ్చే ముడతలు రావు.
కనురెప్పలు ఎంత మృదువగా ఉంటే అంత అందంగా ఉంటుంది. రాత్రి పడుకొనే ముందు కనురెప్పలకు ఆముదం నూనె రాస్తే చాలా ఉపయోగకరం.
కలబంద జెల్ గాని, జ్యూస్ కానీ ముఖానికి రాసుకుని గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ముఖంపై మీద ఉన్న మొటిమలు, మచ్చలు తగ్గుముఖం పడుతాయి.
ఆల్మండ్ నూనెలో కాస్త నిమ్మరసం కలుపుకుని ముఖానికి..కళ్ల క్రింది భాగంలో రాసుకొంటే చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఉదయం లేచే సమయానికి ముఖం కాంతివంతంగా మారుతుంది.

08:24 - March 3, 2017

అందం..ఒక్క సౌందర్య సాధనాలతోనే కాకుండా కొన్ని పద్ధతులను ఉపయోగిస్తూ అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. వాతావరణంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటుంటాయి. సహజ పద్దతులతో చేసుకొనేది ఏదైనా సరే సహజ ఫలితాలనే అందిస్తుంది. అందులో ప్రధానమైంది 'ఆవిరి'..ఆవిరి పట్టడం వల్ల చర్మంలోని రంధ్రాలు తెరుచుకుని చర్మం లోపలి నుండి శుభ్ర పడుతుంది. ఆవిరి పట్టించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

 • నీళ్లు మరీ వేడిగా మసులుతున్నప్పుడు ఎక్కువ సమయం ఆవిరి పట్టకూడదు. అలా చేస్తే చర్మం ఎర్రగా కందిపోతుంది.
 • ముఖం మీద విపరీతంగా మొటిమలున్నవారు ఆవిరికి దూరంగా ఉండటం మంచిది.
 • ముఖ చర్మంలో రక్తకణాలు ఉత్తేజితమవుతాయి. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
 • చర్మ కణజాలానికి సరిపడా ప్రాణవాయువు అందుతుంది.
 • ఎండలో తిరగడం వల్ల చర్మం కమిలిపోతుంది. దీనివల్ల చర్మం నిర్జీవంగా మారతుంది. ఈ సమయంలో ఏదైనా క్రీమ్‌తో మృదువుగా మర్దన చేసుకుని ఆవిరి పట్టాలి.
 • ఆవిరి పట్టడానికి ముందు తప్పనిసరిగా ముఖం శుభ్రంగా కడుక్కోవాలి. ముఖానికి మేకప్‌ ఉన్నా దానిని తొలగించుకున్నాకే ఆవిరిపట్టాలి.
 • శరీరంలోని వ్యర్థాలను తొలగించుకోవాలంటే ఆవిరి స్నానానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుబాటులో లేనప్పుడు కనీసం ముఖానికైనా ఆవిరి పడితే మేలు.
11:19 - February 10, 2017

నిమ్మరసం..పరిగడుపన తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగున్నాయి. కానీ చాలా మంది సేవించడానికి వెనుకాడుతుంటారు. ఇందులో విటమిన్ సితో పాటు శరీరానికి అవసరమయ్యే కీలక పోషకాలు కూడా నిమ్మ వల్ల మనకు లభిస్తాయి. సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడే నిమ్మ ఆరోగ్యకరపరంగా ఉపయోగపడుతుంది. మరి నిమ్మకాయ రసం తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు దాగున్నాయో చూద్దాం...

 • జీర్ణ సమస్యలను తగ్గించడంలో నిమ్మకు మించినది మరొకటి లేదు.
 • శరీరంలోని లవణ శాతాన్ని పెంచి, వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
 • గోరువెచ్చని నీటిలో కూడా సేవించవచ్చు. ఇందులో కొన్ని అల్లం ముక్కలు, ఒక నిమ్మకాయ రసం, టీ స్పూన్ తేనె కలుపుకుని తాగడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
 • చర్మానికి మేలు చేసే విటమిన్ సి సమృద్ధిగా లభిస్తుంది. దీనివల్ల వ్యాధికారక క్రీముల తాకిడికి చర్మం తట్టుకుంటుంది.
 • చర్మంపై ఏర్పడే ముడతల సమస్యలు దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా నిమ్మరసం పనిచేస్తుంది.
 • క్యాన్సర్ కణాల వృద్ధి ఆగుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల క్యాన్సర్ కణాలు నాశనం అవుతాయి.
 • కిడ్నీల్లో ఉండే రాళ్లు కరిగిపోతాయి. రాళ్లు ఏర్పడేందుకు అవకాశం తక్కువగా ఉంటుంది.
 • బరువు తగ్గాలనుకునే వారికి మెరుగైన ఫలితాలను ఇస్తుంది. కొవ్వును కరిగించే గుణాలు నిమ్మలో ఉన్నాయి.
 • అల్కాహాల్ తీసుకోవడం ద్వారా లివర్ పై ప్రభావం పడుతుంది. ఒక గ్లాస్ నిమ్మరసం తీసుకోవడం ద్వారా లివర్ ను ఆ ప్రభావం నుండి తప్పించి లివర్ ఫంక్షన్ ను వేగవంతం చేస్తుంది.
16:01 - December 16, 2016

చలికాలం..చర్మం పాడవుతూ ఉంటుంది. చర్మ సంరక్షణకు ఏవో క్రీములు, మందులు ఇతరత్రా వాడుతుంటారు. లేనిరోగాలు తెచ్చుకుంటుంటారు. వండే పదార్థాల్లోనే కాకుండా పండ్లతో కూడా చర్మం పాడు కాకుండా ఉంచుకోవచ్చు. అలాంటి పండ్లలో కొన్ని..మీ కోసం..

దానిమ్మ : ఈ పండు చర్మ కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో పోషక విలువలు మెండుగా ఉంటాయి. ముఖంపై మడతలు, మొటిమలను తొలగించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. దానిమ్మ పండులను తినడం వల్ల చర్మ కణాలను బిగుతుగా ఉంచుతుంది.

స్టాబెర్రీ : ఈ పండులో కూడా ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఈ పండు తినడం వల్ల నీరసం దరి చేరదు. రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు చర్మాన్ని కాంతి వంతంగా తయారు చేస్తుంది. ఈ పండును క్రీములు..పదార్థాలు తయారు చేయడంలో వాడుతుంటారు.

బొప్పాయి : ఈ పండులో విటమిన్ ఎ ఉంటుందనేది అందరికీ తెలిసిందే. చర్మ సంరక్షణకు యాంటీ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఇందులో పైపైన్ ఎంజెమ్ మృత కణాలను తొలగించడానికి సహాయ పడుతుంది. చర్మ కణాలకు అవసరమైన ఎంజెమ్ లను ఉత్పత్తి చేస్తుంది.

అరటి : అరటి పండులో పోటాషియం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇందులో విటమిన్ ఇ, సి ఉంటాయి. చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయి.

ఆపిల్ : విటమిన్ సి ఉండడం వల్ల మొటిమలు, ముతలు రాకుండా కాపాడుతుంది. నల్లమచ్చల సమస్య కూడా దూరం అవుతుంది. పొడిబారిన చర్మం గల వారు ఆపిల్ పండు తినాలి.

సీతాఫలం : విటమిన్ ఎ, సి ఈ పండులో ఉంటాయి. కొత్త కణాల ఉత్పత్తి చేయడానికి ఈ పండు ఉపయోగపడుతుంది. చర్మానికి మంచి స్ర్కబ్ లా పనిచేస్తుంది. ప్రీ రాడికల్స్ ను ఉత్పత్తి చేస్తాయి.

12:48 - November 14, 2016

చర్మం ముడతలుగా మారుతోందా ? నివారించడానికి ఎన్నో మందులు..క్రీములు వాడారా ? అయితే ఈ చిట్కాలు పాటించి చూడండి.
పచ్చిపాలు చర్మానికి తేమనందిస్తాయనే విషయం తెలిసిందే. ఇది నల్లమచ్చలున్నా తగ్గుతాయి. బాగా మగ్గిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. అందులో ఓ చెంచా పెరుగూ, కొద్దిగా తేనె వేసుకుని బాగా కలపాలి. దీన్ని కొద్దిగా వేడిచేసి ఆ తరవాత ముఖం, మెడకూ పూతలా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరవాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి.
ఎనిమిది బాదం గింజలు తీసుకుని ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. మర్నాడు పచ్చిపాలు పోసుకుంటూ మెత్తని ముద్దలా చేసుకోవాలి. దీన్ని ముఖానికి పూతలా వేసి అరగంట తరవాత చల్లని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారంలో రెండుమూడుసార్లు చేస్తుంటే ముడతలు పెరగకుండా ఉంటాయి. బాదంలో ‘విటమిన్‌ ఈ’ తోపాటూ యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి.
గుడ్డు తెల్లసొనలో కొద్దిగా నిమ్మరసం, చెంచా తేనె కలుపుకోవాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖం, మెడకు రాసుకోవాలి. కొద్దిసేపటి అనంతరం గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. 

16:21 - October 21, 2016

చలికాలం వచ్చేస్తోంది. ఇప్పటికే చలిగాలులు మొదలయ్యాయి. దీనితో చర్య సమస్యలు ఏర్పడుతుంటాయి. చర్మం పొడిగా, జిడ్డుగా మారడం, జుట్టు పొడిబారడం, పెదాలు తడి ఆరడం లాంటి ఎన్నో సమస్యలు చలికాలంలో వస్తాయి. పొడి చర్మం ఉన్న వారు మాయశ్చరైజర్‌ కోల్డ్ క్రీమ్‌ను రెగ్యులర్‌గా వాడాలి. అంతేకాక, చర్మం పొడిబారకుండా ఉండేందుకు తరచూ మంచినీళ్లు తాగుతుండాలి.
వేడి నీళ్లతో స్నానం చర్మం మరింత పొడిబారేలా చేస్తుంది. కాబట్టి గోరువెచ్చని నీటిని మాత్రమే ఉపయోగించాలి.
చలి తక్కువగా ఉండే సమయంలో అంటే ఉదయం 7-8 గంటలకు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. నడకను ఎంచుకోవడం ఉత్తమం.
బాదం నూనె, బాదంపొడి, అరటి ముక్కలు, గ్లిజరిన్ లేదా తేనే లు ప్రతొక్కటి రెండు చెంచాల మోతాదు తీసుకోవాలి. నాలుగు టీ స్పూన్లు పాలు ఆ మిశ్రమానికి కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపుంచి కడిగేయాలి. ఇది పొడి చర్మానికి ఉపయోగపడుతుంది.
​ జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్‌ మీల్‌పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధంపొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది.

12:11 - October 8, 2016

పొడిచర్మం కలిగిన వారు చర్మాన్ని శుభ్రపరచుకునేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. ఎన్నో సౌందర్య సాధనాలను వాడుతుంటారు. కానీ కొన్ని టెక్నిక్స్ పాటిస్తే పొడిచర్మం నుండి కాపాడుకోవచ్చు.

 • పొడిచర్మం వారు తేనె, రోజ్‌వాటర్‌, పాలపొడి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ఈ చర్మం గలవారు గుడ్డు సొనను కూడా ముఖానికి అప్లై చేయవచ్చు.
 • మృదువైన చర్మం కలిగినవారైతే, ఆరెంజ్‌ జ్యూస్‌లో తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి ఆ తరువాత చల్లటి నీటితో కడగాలి.
 • పెరుగు, పసుపు, తేనె కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మర్ధనా చేసి, పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
 • మసాజ్‌ ఆయిల్‌, గంధం పొడి, రోజ్‌ వాటర్‌, తేనె కలిపిన మిశ్రమంతో బాడీ మసాజ్‌ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మం పొడిబారకుండా, మృదువుగా ఉంటుంది.
 • అరటిపండు, యాపిల్‌, బొప్పాయి వంటి పండ్ల గుజ్జును ముఖానికి పట్టించి ఇరవై నిమిషాలు ఆరనిచ్చి నీటితో కడిగినా ఫలితం ఉంటుంది.
 • కొంతమందికి చర్మం పగిలినట్టుగా ఉంటుంది. ఇలాంటివారు సబ్బుతో స్నానం చేయడం పూర్తిగా మానాలి. సున్నిపిండి ఉపయోగిస్తే మంచిది.
 • కాళ్లూ, చేతులకు గ్లిజరిన్‌లో రోజ్‌వాటర్‌, తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం చేతులకు, కాళ్ళకు అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడగాలి.
 • ప్రతి రోజూ స్నానం చేసిన తర్వాత వెనిగర్‌ కలిపిన నీళ్ళను శరీరంపై పోసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

Pages

Don't Miss

Subscribe to RSS - చర్మం