చలికాలం

12:52 - March 9, 2018

ఫ్రిజ్...ప్రస్తుతం అందరి ఇంట్లో కామన్ అయిపోయింది. ఎండాకాలం వచ్చేసరికి దీనికి యమ డిమాండ్ ఉంటుంది. ఫ్రిజ్ లో ఆహార పదార్థాలు..ఇతరత్రా పెడితే ఎక్కువ రోజులు వస్తాయని భావిస్తుంటారు. అదే ఎండాకాలం బయటపెట్టడం వల్ల కొద్ది రోజుల్లోనే పాడైపోతుంటాయని అనుకొంటూ ఫ్రిజలలో పలు వస్తువులను భద్రపరుస్తుంటారు. కానీ ఎక్కువ రోజులు పెట్టడం మంచిదేనా ?

ఫ్రిజ్ లో నుండి తీసుకున్న ఆహారం..తినడం అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ సేపు ఆహారం అందులో ఉండడం వల్ల దానిపై బ్యాక్టీరియా చేరుతుందని..దీనిని తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ఫ్రిజ్ లో పండ్లు..కూరగాయాలు ఎక్కువ సమయం ఉండకుండా చూసుకోండి. ఫ్రిజ్ నుండి బయటకు తీసే వస్తువులను కనీసం 30 నిమిషాల వరకు ముట్టుకోకండి. అనంతరం వాటిని బాగా కడుక్కొని అప్పుడు వండుకోవడం..తినడం మంచిందని పేర్కొంటునాన్రఉ. 

07:04 - November 17, 2017

శ్రీకాకుళం : భారీ వర్షాలు ఉత్తరాంధ్రను అతలాకుతలం చేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో వంశధారనది ఉధృతంగా ప్రవహిస్తోంది. వేల ఎకరాల్లో పంటలు నీటిపాలయ్యాయి. వందలాది మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతూనే ఉంది. దీనిప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖజిల్లాలు వణికిపోతున్నాయి. నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. విశాఖపట్నం, భీమునిపట్నం, కళింగపట్నం ఓడరేవుల్లో మూడోనంబర్‌ ప్రమాదహెచ్చకలు జారీ చేశారు.

భారీవర్షాలతో శ్రీకాకుళంజిల్లా అతలాకుతలం అవుతోంది. ఎడతెరిపిలేని వర్షంతో పలు గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. గ్రామాల చుట్టూ నీరుచేరడంతో జనం భయం గుప్పిట్లో బతుకుతున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. మంగళవారం రాత్రి నుంచి పలాస, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో కుండపోతగా వర్షం నమోదైంది. ఎడతెరిపిలేని వర్షాలతో పలు గ్రామాల్లో మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. జీవనాధారం అయిన జీవాలు చనిపోవడంతో తాము తీవ్రంగా నష్టపోయామని గొర్రెల కాపరులు వాపోతున్నారు. మరోవైపు శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో వరిపంట గంగపాలైంది. నిండామునిగిన పంటపొలాన్ని చూసి అన్నదాతలు కన్నీరు పెట్టుకుంటున్నారు. భారీ వర్షాల్లో సైతం పంటను కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. పొలం నుంచి నీటిని బయటికి పంపించేందుకు తిప్పలు పడుతున్నారు. తమ పంటలన్నీ తుడిచిపెట్టుకు పోయాయని వజ్రపుకొత్తూరు మండల రైతులు ఆవేదన చెందుతున్నారు.

మరోవైపు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. విశాఖకు తూర్పు ఆగ్నేయ దిశగా 80 కిలోమీటర్లు, గోపాల్‌పూర్‌కు దక్షిణ నైరుతి దిశగా 210 కిలోమీటర్ల దూరంలోనూ వాయుగుండం కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది స్థిరంగా కొనసాగుతున్న వాయుగుండం ఉత్తర ఈశాన్య దిశగా కదులుతోందని, ఆ తర్వాత ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలకు చేరువగా వచ్చి క్రమంగా బలహీన పడుతుందని అధికారులు బెబుతున్నారు. దీని ప్రభావంతో ఉత్తరకోస్తాలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 50-55 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. 

11:04 - November 10, 2017

చలికాలంలో గాలిలో తేమ బాగా తగ్గుతుంది. దీని వల్ల ప్రధానంగా ఎదురయ్యే సమస్యలు చర్మం పొడిబారటం,పగలటం,మంటపెట్టడం, చిటపటలాడటం, దురద పెట్టడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. డ్రై స్కిన్ ఉన్న వారికి ఇబ్బందులు మరీ ఎక్కువవుతుంటాయి. ఆయిల్ స్కిన్ ఉన్న వారికీ సమస్యలు తప్పవు. అందుకే.. కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చర్మాన్ని చలికాలంలో కాపాడుకోవచ్చు. గోరువెచ్చని నీటితో పనులు ముగించుకోవాలి. ముఖంపై, శరీరంపై ఏవేవో క్రీములు రాసుకుంటే మొదటికే ప్రమాదం వస్తుంది. చర్మతత్వాన్ని బట్టి క్రీమ్స్ ఎంచుకోవాలి. సాధ్యమైనంత వరకూ చలిలో చర్మాన్ని బయటి వాతావరణంతో కనెక్ట్ కాకుండా చూసుకోవాలి. దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. పౌడర్ల జోలికి వెళ్లకుండా ఉండడం మేలు.

చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి వేసవిలోలా నీరు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అంటే నీరు తాగుతూ పోవడమే.. దీనికి అదనంగా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. చలికాలం రోజుకు కనీసం అరగంట పాటయినా వ్యాయామం చేస్తే రక్తప్రసరణ ప్రక్రియ చక్కగా సాగుతుంది. కండరాలు ఉత్తేజితం అవుతాయి కూడా.

గులాబీనీరూ, తేనె సమానంగా తీసుకుని బాగా కలిపి ముఖం, మెడకు రాసుకోవాలి. పదినిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. తేనె చర్మానికి తేమనందిస్తుంది. పొడిచర్మతత్వం ఉన్నవారు ఈ చిట్కాను రోజూ ప్రయత్నిస్తే చర్మం తాజాగా, ఆరోగ్యంగా కనిపిస్తుంది.

పెదవులు పొడిబారి పగిలినట్లు అవుతున్నాయా.. తేనెలో కాస్త గ్లిజరిన్‌ కలిపి రాసుకోవాలి. ఇలా రోజులో రెండుమూడుసార్లు చేస్తుంటే పగుళ్ల సమస్య తగ్గి పెదవులు తాజాగా కనిపిస్తాయి.

చర్మం పొడిబారినప్పుడు పాదాలు కూడా పగలడం కొందరిలో కనిపిస్తుంది. ఇలాంటివారు టేబుల్‌స్పూను ఆలివ్‌నూనెకు అరచెంచా నిమ్మరసాన్ని కలిపి రాత్రుళ్లు పాదాలకు రాసుకుని సాక్సులు వేసుకోవాలి. ఇలా రోజూ చేస్తుంటే ఆ సమస్యలు తగ్గి కోమలంగా కనిపిస్తాయి.

పెద్ద చెంచా వంతున నిమ్మరసం, తేనె కలిపి ముఖానికీ, చేతులకూ రాసుకోవాలి. కాసేపయ్యాక కడిగేయాలి. దీనివల్ల చర్మం బిగుతుగా మారడమే కాదు, దురదా, ఎలర్జీల్లాంటి సమస్యలూ దరిచేరవు.

స్నానానికి ముందు కొబ్బరి లేదా ఆలివ్‌ నూనెను ఒంటికి పట్టించి గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం పొడిబారదు. అలాగే చెంచా సెనగపిండికి చిటికెడు పసుపూ, అరచెంచా పాలు లేదా పెరుగు కలిపి ముఖం, మెడకు రాసుకుని బాగా మర్దన చేయాలి. ఆ తరవాత స్నానం చేస్తే ముఖానికి తేమ అందుతుంది.

16:02 - September 21, 2017

వర్షాకాలం ముగుస్తోంది..చలికాలం ప్రవేశించబోతోంది..ఈ సమయంలోనే రోగాలు కూడా ప్రవేశిస్తాయి..జలుబు..జ్వరం..దగ్గు..ఇతర వ్యాధులు ప్రబలుతుంటాయి. వైరస్..బ్యాక్టీరియాలు సోకితే శరీరంలోని రోగనిరోధక శక్తి బలహీన పడుతుంది. అందువల్ల బొంగురు గొంతు, తరచూ తుమ్ముల్లు, దగ్గు, కండరాలు పట్టుకోవడం తదితర సమస్యలు ఏర్పడుతాయి. మలేరియా, డెంగీ, టైఫాయిడ్, హెపటైటిస్ ఎ ఇతరత్రా వ్యాధులు వస్తాయి.

దొమలు వృద్ధి చెందకుండా చూసుకోవాలి. నీరు నిల్వ ఉండకుండా, దోమలను నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలి. శరీరం పొడిబారకుండా చూడాలి. ఇమ్యూన్ వ్యాక్సిన్ ఇవ్వాలి. కాచి వడబోసిన నీరు తాగడం బెటర్. శుభ్రమైన..తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. వాటర్ ట్యాంక్ లను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం మరిచిపోకండి. అపరిశుభ్రమైన నీటిని సేవించడం వల్ల పలు అంటు వ్యాధులు వ్యాపిస్తాయి. డీహైడ్రేషన్, డయేరియా, వాంతులు, శరీరం పొడిబారడం, విరోచనాలు ఉంటే అది కలరా లక్షణాలని గుర్తించాలి. శుభ్రత కొరవడిన ఆహారం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. శుభ్రమైన ఆహారం..నూనె, కారం ఎక్కువగా లేని ఆహారం తీసుకోవాలి. తేలికగా అరిగే ఇడ్లీ..బ్రెడ్..ఆపిల్..కొబ్బరి నీళ్లు వంటివి తీసుకోవడం ఉత్తమం.

15:56 - July 20, 2017
 • ‘సైనస్'.. తలనొప్పి విపరీతంగా ఉండడం..కళ్ల దగ్గర దురదగా ఉండడం..ముక్కు ఇరువైపులా ముట్టుకొంటే నొప్పిగా ఉండడం..దీని లక్షణాలు. కళ్ల దగ్గర..ముక్కు పక్క భాగంలోని ఎముకలలో ఉండే సన్నని గాలితో నిండే ప్రదేశాన్ని సైనస్ అంటారు. వాతావరణం మారినప్పుడల్లా సైనస్ అధికమౌతుంటుంది. ముఖ్యంగా వర్షాకాలం..శీతాకలంలో తీవ్రత హెచ్చుగా ఉంటుంది. వైరస్, బ్యాక్టీరియా కారణంగా ఈ సైనస్‌లు ఉబ్బడంతో ఒక్కోసారి శ్వాస తీసుకోవడం కష్టంగా మారుతుంది. ఇందుకు కొన్ని చిట్కాలు పాటిస్తే కొంత సమస్యకు చెక్ పడనుంది.
 • నీళ్లను కాచి వడబోసి తీసుకుంటే ఎంతో బెటర్. ముక్కు చుట్టుపక్కలి భాగాల్లో ఇన్ ఫెక్షన్ చేరే అవకాశం ఉండదు.
 • సైనస్‌తో బాధపడేవారు పొగాకు ఉత్పత్తులకి ఎంత దూరంగా వుంటే అంత మంచిది.
 • మామిడి పండ్లు లభించే కాలంలో వాటిని బాగా తినాలి. వీటిలోని ‘ఎ’ విటమిన్‌తో మిగతా ఔషధ గుణాలు సైనసైటిస్ వంటి ఇన్‌ఫెక్షన్లను నివారిస్తాయి.
 • టీ స్పూన్ జీలకర్రను వేయించి పొడిచేసి, అందులో రెండు స్పూన్ల తేనె కలిపి రోజుకు రెండు సార్లు తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. జీలకర్రను పల్చని కాటన్ వస్త్రంలో కట్టి వాసన పీల్చాలి.
 • ఉల్లి, వెల్లుల్ని రేకులను తింటే సైనసైటిస్ బాధ తగ్గుతుంది. వంటకాల్లో ఉల్లి, వెల్లుల్లిపాయలను విరివిగా వాడితే మంచిది.
 • 300 మిల్లీ లీటర్ల క్యారట్ రసంలో 200 మిల్లీ లీటర్ల పాలకూర రసం కలిపి రోజుకు ఒక సారి తాగాలి.
 • 250 మిల్లీ లీటర్ల నీటిలో టీ స్పూన్ మెంతులను వేసి బాగా మరిగించి కషాయం కాయాలి. ఈ కషాయాన్ని రోజుకు నాలుగు సార్లు తీసుకోవాలి.
 • ఎక్కువ సమయం ఈత కొట్టడం చేయకూడదు. చల్లని నీటితో స్నానం చేయకూడదు. చల్లటి పదార్ధాలకు దూరంగా ఉండటం, చెవిలో దూదిపెట్టుకోవడం, ఆవిరిపట్టడం చేయడం వల్ల సైనసైటిస్‌ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు.
09:48 - February 10, 2017

సన్ అప్పుడే మొదలెట్టేశాడు..ఫిబ్రవరి మొదటి వారం నుండే భానుడు ప్రతాపం మొదలైనట్లు వాతావరణ మార్పులు స్పష్టం చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా చలి తీవ్రత బాగా తగ్గిపోయి అదే క్రమంలో ఎండ వేడిమి పెరుగుతోంది. కానీ శివరాత్రికి చలి వెళ్లిపోతుందని ప్రజల నమ్మకం. ఈ నెలాఖరుకు శివరాత్రి ఉండగా ఫిబ్రవరి నెల మొదట్లోనే చలి తీవ్రత తగ్గిపోయింది. గత సంవత్సరం కంటే భానుడు భగభగలు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. సాయంత్రం వేళలు..తెల్లవారు సమయాల్లో కూడా చలి తగ్గుముఖం పట్టింది. గతేడాది మార్చి మొదటి వారంలో తీవ్రత పెరిగిన ఎండలు ఈసారి ఫిబ్రవరిలోనే ప్రతాపం చూపుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఏప్రిల్‌, మే నెలల్లో ఎండ తీవ్రతపై సర్వత్రా ఆందోళన నెలకొంది. గత కొన్ని రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలుస్తోంది. చలికాలం ఫోబియా నుంచి బయటికొచ్చేసి వేసవి కాలం ఉపశమన చర్యలకు ఉపక్రమించాల్సిన తరుణం రానే వచ్చిందని గమనించాలన్న మాట.

10:14 - December 30, 2016

చలికాలం రాగానే వివిధ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. .జలుబు, శ్వాసకోశ సంబంధ సమస్యలు సర్వసాధారణంగా మారుతుంటాయి. ఇంట్లో ఆహారం కాకుండా బయట ఫుడ్స్ తీసుకుంటే అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. చలికాలంలో మరింతగా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కొన్ని టిప్స్..

 • పౌష్టికాహారం ఎక్కువగా తీసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సిట్రస్ జాతికి చెందిన పండ్లు కూడా తీసుకోవాలి.
 • చలికాలంలో వ్యాయామాలు చేయాలి. శరీరంలోని ఉష్ణోగ్రతలు పెరిగి వెచ్చగా ఉంటుంది. అంతేగాకుండా రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది.
 • చలికాలంలో ఎక్కువగా వేడి ఆహార పదార్థాలు భుజించాలి. పండ్లు..కూరగాయాలను ఎక్కువగా తీసుకోవాలి. శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.
 • చలికాలంలో పరిశుభ్రంగా ఉండాలి. తినే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవడం..తీసుకొనే ఆహారాన్ని శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి.
 • చలికాలంలో చాలా మంది నీటిని ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడరు. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. చర్మం పొడిగా కూడా మారుతుంది. దాహం కాకున్నా ఆరు నుండి ఎనిమిది గ్లాసుల నీరు తాగడం మంచిది.
16:56 - December 23, 2016
08:36 - December 18, 2016

ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ సహా, ఉత్తరాదిలోని పలు రాష్ట్రాలను పొగమంచు దుప్పటి కప్పేసింది. పంజాబ్‌, హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లో పొగమంచు కప్పేసింది. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఢిల్లీ రావాల్సిన 26 రైళ్లను ఆలస్యంగా నడుస్తున్నాయి. మరో తొమ్మిది రైళ్ల సమయం మార్చారు. దాదాపు మూడు వారాలుగా ఉత్తరాదిలో ఇదే పరిస్థితి నెలకొంది. అతిసమీపంలోని దృశ్యాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది.

 

13:38 - November 30, 2016

చలికాలం..ఎన్నో అలర్జీలు వస్తుంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. చలికాలంలో చిన్నపిల్లల చర్మం పొడిబారడం..ఇతరత్రా సమస్యలు ఏర్పడుతుంటాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే శిశువులు చలికాలంలో ఆరోగ్యంగానే ఉంటారు.

 • శిశువుకు సాధ్యమైనంత వరకు తల్లిపాలే పట్టాల్సి ఉంటుంది.
 • చిన్నారులకు ఆహారం అలవాటు చేసే విషయంలో వైద్యుల సలహాలు పాటించడం ఉత్తమం.
 • చిన్నారులకు దుమ్ము..ధూళి సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటి మైదానాల్లో చిన్నారులను ఆడించకూడదు.
 • చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండేందుకు క్రీములు రాయాలి.
 • తలకు..చెవులకు చలిగాలి సోకుండా ఉండేందుకు క్యాప్ లు పెట్టాలి.
 • చలిగాలి తట్టుకొనే దుస్తులను..స్వెట్టర్స్ వేయాలి.
 • చలికాలంలో ఉదయం ఎండ వచ్చేవరకు చిన్న పిల్లలు, వృద్ధులు, అస్తమ వ్యాధిగ్రస్తులు బయటకు రాకుండా ఉండడం ఉత్తమం. 

Pages

Don't Miss

Subscribe to RSS - చలికాలం