చిట్కాలు

16:21 - April 22, 2017

ఆకుకూరలు..ఆరోగ్యానికి ఎంతో మంచిది..నిత్య ఆహారంలో ఆకు కూరలను భాగం చేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగుంటాయి. ఆకుకూరల్లో పాలకూర ఒకటి. మహిళలకు పాలకూర వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. మహిళలు తప్పనిసరిగా పాలకూరను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్లోరిన్, ప్రోటీన్లు, విటమిన్ ఏ, సిలు, ఖనిజ లవణాలు, కాల్షియంలు లభిస్తాయి.
దీనిని తినడం వల్ల రక్తహీనతకు చెక్ పడుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
దాంతో పాటు అధిక రక్తపోటును తగ్గించి, శ్వాస సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది.
పాలకూర రసాన్ని తాగడం వల్ల జుట్టు అందంగా ఉంటుంది. జుట్టు ధృడంగా, పొడవుగా పెరుగుతుంది. వెంట్రుకలకు అవసరమైన పోషకాలు ఇందులో లభిస్తాయి.
శరీరానికి అవసరమైన ఐరన్‌ను పుష్కలంగా అందిస్తుంది. కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది.

11:22 - April 21, 2017

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..

 • ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.
 • రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.
 • టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.
 • ఒక టేబుల్ స్పూన్ ఉప్పు..నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.
12:53 - April 14, 2017
14:05 - April 13, 2017

ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులు..ఉక్కపోతతో జనాలు అల్లాడుతున్నారు. మరి ఎండాకలం నుండి ఉపశమనం పొందాలంటే..కొన్ని చిట్కాలు..
ఉసిరి కాయను ఆహారంలో భాగంగా చేసుకోండి. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో వ్యర్థాలు పేరుకపోకుండా చూస్తుంది. అంతేగాకుండా విటమిన్ సి అందుతుంది.
ప్రతి రోజు పుదీనా ఆకులను ఆహారంలో ఉపయోగించండి. పుదీనాను ఎలాగైనా వాడుకోవచ్చు. చట్నీ..సలాడ్..డికాషన్ లో వేసుకోవచ్చు. తలనొప్పి..వికారాలు..ఒత్తిడి..నీరసం వంటి సమస్యల నుండి బయటపడవచ్చు.
గుప్పెడు తులసీ ఆకుల రసాన్ని తీసుకోండి. ఇందులో ఏ విటమిన్ పుష్కలంగా అందుతుంది. రక్తహీనత రాకుండా చేసే ఇనుము దీని నుండి లభిస్తుంది. ఫలితంగా వికారం..తలనొప్పి వంటి అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది.
గులాబీ రేకులను ఎండబెట్టి..వాటితో టీ తయారు చేసుకుని తాగాలి. వేడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా డయేరియా వంటి సమస్యలు తగ్గుతాయి.

11:01 - March 27, 2017

శరీరంపై పలువురు మచ్చలు వస్తుండడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ఇందుకు పలు మందులు..ఆరోగ్య సాధనాలను వాడుతుంటూ సమస్యలను మరిన్ని ఎదుర్కొంటున్నారు. మరి మచ్చలు పోవడానికి కొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. కరివెపాకులను తీసుకుని చిటికెడు పసుపు వేయాలి. వీటిని మిక్సీ పట్టి మచ్చల పై ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల అనంతరం కడిగేసుక్కోవాలి. ఎండిన తులసి..వేప..పుదీన ఆకులను తీసుకోవాలి. ఇవి ఒక్కోటి వంద గ్రాములుండాలి. అందులో చిటికెడు పసుపు వేసుకుని పొడిగా మిక్సీ చేసుకోవాలి. వాడే సమయంలో రెండు స్పూన్ల పొడికి తగినంత పన్నీరు వేసుకుని కలుపుకుని ముఖానికి పట్టించుకోవాలి. అనంతరం కడిగేసుకోవాలి. కొబ్బరి నూనెకు గోరింటాకు పొడి కలిపి పేస్టు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. అర టీ స్పూన్‌ నిమ్మరసంలో నాలుగు చుక్కల గ్లిజరిన్‌ కలిపి మచ్చల మీద రాస్తుంటే మచ్చలు పోతాయి. తులసి ఆకు ఎంతో శ్రేయస్కరం అనే సంగతి తెలిసిందే. తులసీ ఆకుల్లో కొద్దిగా పసుపు వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించడం వల్ల మచ్చలు తొలగిపోయే అవకాశం ఉంది.

13:28 - March 26, 2017

ఎండలు అప్పుడే మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో భానుడు మరింత ఉగ్రరూపం దాల్చనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ఎండ నుండి కాపాడుకొనేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎక్కువ మంది వడదెబ్బకు గురవుతుంటారు. శరీరంలో నీటి శాతం లోపించి బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. జ్వరం..వాంతులు..విరేచనాలు..తల తిరగడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలోని లవణాలు చెమటరూపంలో బయటకు వెళ్లిపోవడంతో మనిషి నీరసించిపోతాడు. దీనికి చికిత్స చేస్తే సరిపోతుంది. శరీష ఉష్ణోగ్రత తగ్గే విధంగా చూడాలి. మెడ..ఇతర భాగాల్లో ఐస్ ప్యాక్ లు పెట్టారు. వడ దెబ్బకు గురైన వ్యక్తిని వెంటనే నీడలోకి తీసుకరావాలి. బట్టలను వదులు చేయాలి. నీటితో శరీరాన్ని తడపాలి. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి సకాలంలో చికిత్స అందించాల్సి ఉంటుంది. వడదెబ్బకు గురికాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారంలో ఎక్కువగా ద్రవ పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. కారం, మసాలాలు లేని వంటలు తినడం ఉత్తమం. బయటకు వెళ్లిన సందర్భంలో కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలను ఎక్కువగా తీసుకోవాలి. వేపుడు పదార్థాలు, కాఫీ, ఫాస్ట్‌ఫుడ్, ఆల్కహాల్ తాగడం మానేయాలి. వదులుగా ఉండే కాటన్ దుస్తులనే ధరించాలి.

13:47 - March 22, 2017

ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్ర పోయే వరకు ఏదో ఒక పనిలో బిజీ బిజీగా గడుపుతూ ఉండేస్తుంటాం. ముఖ్యంగా మహిళలు ఇంటి పని..బయటపనితో ఉక్కిరిబిక్కిరవుతుంటారు. పనుల విషయంలో కొన్ని చిట్కాలు పాటిస్తే పని తొందరగా అయిపోతుంది. వంటింట్లో సామాగ్రీ విషయంలో కొన్ని చిట్కాలు పాటించాలి. ఆ చిట్కాలు..మీ కోసం...

 • వంటింట్లో నూనె ఒలికిపోయిందా ? వెంటనే ఆ ప్రాంతంలతో మైదా పిండి చల్లాలి.
 • క్యాబేజీ ఉడికించే సమయంలో వాసన వస్తోందా ? వాసన పోవాలంటే చిన్న అల్లం ముక్క వేసి చూడండి.
 • కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది.
 • ఇంగువ నిల్వ చేసే డబ్బాలో ఒక పచ్చిమిరపకాయ వేయడం వల్ల తాజాగా ఉంటుంది.
 • గుడ్లు ఉడకబెట్టేటపుడు కొంచెం ఉప్పువేసి ఉడకనిస్తే పెంకులు త్వరగా ఊడిపోతాయి.
 • వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే ఒక స్పూను పాలు వేసి చూడండి.
 • కిచెన్ ను ఎంత కడిగినా ఈగలు పోకపోతే పసుపు నీటితో శుభ్రం చేసి చూడండి.
 • పకోడీలు వేసేటపుడు పిండిలో కొంచెం సోడా కలిపితే లావుగా అవుతాకయి.
 • పట్టుచీరలు ఉతికేటప్పుడు బకెట్‌లో కొంచెం నిమ్మరసం వేయడంవల్ల రంగు పోవు.
14:57 - March 12, 2017

మిరియాలు..అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఇంగువ వంటి వాటిని ఆహార పదార్థాల తయారీలో తప్పనిసరిగా ఉపయోగించాలి. వీటిని తీసుకోవడం వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి ఆరోగ్య సమస్యల నుండి తప్పించుకోవచ్చు.
గ్లాసు గోరువెచ్చని పాలల్లో చిటికెడు పసుపు, మిరియాల పొడి వేసుకోని తాగడం వల్ల జలుబు, గొంతునొప్పి వంటి రాకుండా ఉంటాయి.
క్రమం తప్పకుండా నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగుపడుతుంది.
ఫైబర్ తో పాటు పోషకాలు అధికంగా లభించే పాలకూర, మెంతికూర, అరటికాయ, సోరకాయ వంటి వాటిని తీసుకోవడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కావడానికి దోహద పడుతాయి.

12:32 - March 10, 2017

రోజు రోజుకు డయాబెటస్ వ్యాధి గ్రస్తులు ఎక్కువవుతున్నారు. దీనితో వ్యాధి తీవ్రతను తగ్గించుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తుంటారు. ఫలితం కనిపించకపోవడంతో నిరుత్సాహానికి గురవుతుంటారు. మనం నిత్యం తీసుకొనే ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే షుగర్ ను కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది.
డ‌యాబెటిస్ ఉన్న‌వారు తేనెను నిత్యం ఏదో ఒక విధంగా తీసుకోవాలి.
వెల్లుల్లిని ఉపయోగించడం వల్ల ఫలితం ఉంటుంది. ఇందులో అలియం సాటివం అనే రసాయనం ఉంటుంది. గ్లూకోజ్ స్థాయిలను అదుపు చేస్తుంది.
ప‌ర‌గ‌డుపున 8 గ్లాసుల నీటిని తాగాలి. ఓ గంట పాటు వాకింగ్ చేయాలి. .
బీట్‌రూట్ దుంప‌, మెంతి ఆకు లేదా మెంతుల పొడి, క‌ల‌బంద‌, వేప‌, తుల‌సి వంటి మొక్క‌ల ఆకుల‌ను ఉద‌యం, సాయంత్రం తిని తేడా గమనించండి.
ఉసిరి రసం, లేదా ఉసిరిని ఇతర ఆహార పదార్ధాలలో కలిపి వాడటం కూడా షుగర్ రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది.
గ్రీన్ టీ బ్లడ్ షుగర్ స్ధాయిని తగ్గించి, శరీరంలోని ఇన్సులిన్ స్ధాయిలను పెంచుతుంది.

12:12 - March 10, 2017

పండ్లు..కూరగాయలు..ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పండ్లలో బొప్పాయి పండు ఒకటి. ఈ పండు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
బొప్పాయి పండులో బీటా కెరోటిన్, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి.
కైమోపాపైన్‌, పాపైన్‌ అనే ఎంజైమ్‌లు ఉంటాయి.
పోటాషియం, పీచు ఎక్కువగా ఉంటుంది. ఈ ఫలితంగా హృద్యోగ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువ.
బొప్పాయిలో కోలిన్ అనే పదార్థం ఉండడం వల్ల జ్ఞాపక శక్తిని పెంచుతుంది.
మదుమేహం వ్యాధి ఉన్న వారికి బొప్పాయి పండు చక్కగా ఉపయోగపడుతుంది. చక్కెర శాతం పెరగకుండా కాపాడుతుంది.
కొవ్వును కరిగిస్తుంది. అలాగే నిద్రలేమికి చెక్ పెడుతుంది.
బొప్పాయిలోని పాపైన్‌ అనే ఎంజైమ్‌ జీర్ణక్రియకీ దోహదపడుతుంది.
బొప్పాయి గుజ్జుని ఇన్ఫెక్షన్‌ చేరిన ప్రాంతంలో లేదా కాలిన గాయాలమీద పెట్టడంవల్ల అవి త్వరగా తగ్గుతాయి. 

Pages

Don't Miss

Subscribe to RSS - చిట్కాలు