చెంగిచెర్ల

21:16 - January 14, 2018

హైదరాబాద్‌ : శివార్లలోని చెంగిచర్ల వద్ద పెట్రోల్ ట్యాంకర్ల పేలుడు ఘటనకు కారణమైన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 10 ఆయిల్ ట్యాంకర్లు, ఐదున్నర లక్షల నగదు, రెండు కార్లు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. బోడుప్పల్‌లోని భీంరెడ్డినగర్‌కు చెందిన కులాల్‌ రాజు, అతని సోదరుడు జగదీప్‌ కలిసి గత ఏడెనిమిదేళ్లుగా చెంగిచర్ల రహదారి సమీపంలో ఓ అక్రమ కార్ఖానా ద్వారా చమురు సంస్థలకు చెందిన ఆయిల్ ట్యాంకర్ల నుంచి పెద్ద ఎత్తున అక్రమంగా పెట్రోల్, డీజిల్‌, కిరోసిన్ చోరీ చేసి వాటిని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని రాచకొండ జాయింట్ సీపీ తరుణ్‌ జోషీ తెలిపారు. వెల్డింగ్ ద్వారా ఆయిల్ తీసే క్రమంలో ట్యాంకర్లకు మంటలు అంటుకొని పేలుడు జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారంలో నిందితులకు చమురు సంస్థల సిబ్బందితో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే అంశంపై కూడా విచారణ జరుపుతామని జాయింట్ సీపీ తెలిపారు.

 

15:24 - January 12, 2018

మేడ్చల్ : జిల్లా శివారు ప్రాంతమైన మేడిపల్లి శుక్రవారం మధ్యాహ్నం వణికిపోయింది..బోడుప్పల్ ప్రాంతంలోని చెంగిచెర్లలో భారీ పేలుడు సంభవించింది..అకస్మాత్తుగా పెట్రోల్ వాహనానికి మంటలు అంటుకున్నాయి.. స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురై పరుగులు తీశారు. పెట్రోల్ ట్యాంకర్ పేలడం..పక్కనే ఉన్న సిలిండర్ల లారీలకు మంటలు వ్యాపించాయి. భారీగా నిప్పు రవ్వలు ఎగిసిపడ్డాయి. రోడ్డుపై వెళుతున్న వారిపై పడడంతో హాహాకారాలు మిన్నంటాయి. ఈ ఘటనలో ఐదుగురు కాలిపోయారని..వారి పరిస్థితి విషమంగా ఉందని ఓ ఫైర్ సిబ్బంది టెన్ టివికి తెలిపారు. ఏడు వాహనాలు దగ్ధమయ్యాయని, పది మందికి గాయాలయ్యాయని పేర్కొన్నారు. సమాచారం తెలుసుకున్న అధికారులు మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

పెట్రోల్ కంపెనీ నుండి బయటకు వచ్చాక ప్రైవేటు గోడౌన్ లో పెట్రోల్ దొంగిలిస్తుండగా ప్రమాదం జరిగినట్లు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ప్రమాదంలో మంటలు అంటుకుని పలు వాహనాలు దగ్ధమయ్యాయి. భారీ పేలుడుతో స్థానికులు తీవ్ర భయాందోనళకు గురయ్యారు. దీని గురించి పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. ఘటన గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి...

Don't Miss

Subscribe to RSS - చెంగిచెర్ల