చెమట

11:22 - April 21, 2017

ఎండకాలం అనగానే చెమట సమస్య ఏర్పడుతుంది. కొంతమంది ఈ సమస్య నుండి బయట పడాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో కొందరికీ చెమటతో పాటు శరీరం మొత్తం దుర్వాసన కూడా వస్తుంటుంది. మరి ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి ? కొన్ని చిట్కాలు..

  • ద్రాక్ష పండ్లు తినాలి. నిత్యం తగినంత మోతాదులో కొన్ని ద్రాక్ష పండ్లను తిన్నా అధిక చెమట సమస్య తగ్గిపోతుంది.
  • రెండు టీ స్పూన్ల వెనిగర్, ఒక టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ లను బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు మూడు సార్లు భోజనానికి ఒక గంట ముందు తాగాలి.
  • టీ ట్రీ ఆయిల్ ను కొద్దిగా తీసుకుని చెమట వచ్చే ప్రదేశాల్లో రాయాలి.
  • ఒక టేబుల్ స్పూన్ ఉప్పు..నిమ్మ రసాలను బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శరీర భాగాలపై రాసుకుంటే చెమట సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంది.
15:45 - January 12, 2017

ఎండా..వాన..చలికాలం..ఇలా ఏ కాలమైనా కొందరిని చెమట ఇబ్బంది పెడుతూ ఉంటుంది. నలుగురిలో కలవలేక పోతుంటారు. బాడీ స్ర్పేలు వాడుతూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఇలాంటి వారు ఆహార విషయంలో కొద్ది జాగ్రత్రలు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడే అవకాశం ఉంది.
అల్లం..ఇందులో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయ పడుతుంది. టాక్సిన్స్ తొలగించడం వల్ల దుర్వాసనను దూరం చేస్తుంది.
ఆరెంజ్..పండులో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుందనే విషయం తెలిసిందే. దీనిని తీసుకోవడం వల్ల టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. బాడీ మంచి వాసనతో ఉంటుంది.
ఆరెంజ్ లాగే నిమ్మరసంలో కూడా విటమిన్ సి కంటెంట్ అధికంగానే ఉంటుంది. ఇది శరీరంలో ఎలాంటి దుర్వాసనైనా నివారిస్తుంది.
యాపిల్స్ ..ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. రోజుకు ఒక్క యాపిల్ తినడం వల్ల ఆరోగ్యంగా ఉండడంతో పాటు టాక్సిన్స్ బయటకు పంపుతాయి. దీనితో చెమట వాసన దూరమౌతుంది.
కొత్తమీరలో ఎంజైమ్స్ శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించి చెమట నుండి విముక్తి కల్పిస్తుంది.

13:00 - December 8, 2016

చెమట చుక్కతో ఆర్యోగం ఎలా తెలుస్తుంది. ప్రస్తుతం సాంకేతికత ఎంత అభివృద్ధి చెందిందో తెలిసిందే. రోజుకో పరికరం మార్కెట్ లో లభ్యమౌతున్నాయి. అందులో ఆరోగ్యం గురించి ఎన్నో వస్తువులు దొరుకుతున్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన పలు యాప్స్ ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే నార్త్ వెస్టర్న్ విశ్వ విద్యాలయానికి చెందిన పరిశోధకులు ఓ స్టిక్కర్ ను తయారు చేశారు. చెమట చుక్కతో ఈ స్టిక్కర్ ఆరోగ్యాన్ని తెలియచేస్తుందంట. నాలుగు భాగాలుగా ఉండే ఈ స్టిక్కర్ లో నాలుగు రకాల రసాయనాలు ఉంటాయి. శరీరంలో నుండి వెలువడే చెమటతో కలిసినప్పుడు ప్రతిచర్య కలిగి వాటి రంగు మారుతుంది. తమ దగ్గరున్న స్మార్ట్ ఫోన్ తో ఇలా రంగు మారిన స్టిక్కర్ ను ఫొటో తీస్తే ఫోన్లో వాటికి సంబంధించిన యాప్, రంగులను బట్టి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేయవచ్చంట. ఆమ్లశాతం, లాక్టేట్‌ పరిమితులు, క్లోరైడ్‌ నిల్వలు, గ్లూకోజ్ స్థాయిలను ఇవి పసిగడుతాయి. ఈ స్టిక్కర్ అన్ని సందర్భాల్లో పనిచేస్తుందా ? లేదా ? అని టెస్ట్ కూడా చేశారని తెలుస్తోంది. అన్ని రకాల పరిస్థితుల్లోనూ ఇది శుభ్రంగా పనిచేస్తున్నట్లు తేలింది. తక్కువ ఖరీదులో ఈ స్టిక్కర్స్ దొరుకుతాయంట. 

07:21 - April 24, 2016

చెంచా తేనెలో టేబుల్‌ స్పూన్‌ కొబ్బరి నూనె, చెంచా నిమ్మరసం వేసి బాగా కలిపి ఫ్రిజ్‌లో ఉంచుకోండి. దీన్ని ప్రతిరోజూ ముఖానికి రాసుకుని కాసేపయ్యాక కడిగేస్తే, చర్మం మృదుత్వాన్ని సంతరించుకుంటుంది. ఒక స్పూను గంధంలో స్పూను పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టిస్తే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. పావుకప్పు బంగాళాదుంప తురుము, రెండు టేబుల్‌ స్పూన్ల గ్రీన్‌టీ ఆకులు, చెంచా నువ్వుల నూనె తీసుకుని మిక్సీలో మెత్తగా చేసుకోవాలి. రాత్రిపూట ఈ మిశ్రమాన్ని కళ్ల కింద నల్లని వలయాలపై పూతలా వేసి, మర్నాడు కడిగేసుకోవాలి. ఇలా చేస్తే క్రమంగా నల్లని వలయాలు మాయమైపోతాయి. అంతేకాదు, బాదం నూనెను ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు కళ్ల కింద రాసి మర్దన చేసినా నల్లటి వలయాలు తగ్గుముఖం పడతాయి.
చేతులు, చేతిగోళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే... కనీసం నెలకోసారి మెనిక్యూర్‌ చేయించుకోవాలి. గోరువెచ్చని నీటిలో కాస్త ఉప్పు కలపాలి. ఆ నీటిలో చేతివేళ్లను కాసేపు ఉంచితే ఎంతో అందంగా కనిపిస్తాయి.
చర్మానికి ప్రోటీన్‌ లాంటి పోషణ అందించాలంటే, కోడిగుడ్డు పచ్చసొనలో పావుకప్పు పాలు, కొద్దిగా కొబ్బరినూనె కలిపి రాసుకోవాలి. అంతేకాక, పావుకప్పు వెన్నలేని పాలల్లో మూడు స్పూన్ల ఆలివ్‌నూనె, కాసిని గులాబీరేకలు వేసి, మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. సహజసిద్ధమైన ఈ క్రీంను ప్రతిరోజూ ముఖానికి రాసుకుంటే చర్మం ఎంతో ప్రకాశవంతంగా ఉంటుంది. మరింత తాజాగా ఉండాలంటే ఎప్పటికప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు.
నెలకోసారి కొబ్బరి పాలతో శిరోజాలను తడిపి గంటయ్యాక షాంపూతో తల స్నానం చేస్తే జుట్టు చిట్లడం అదుపులో ఉంటుంది. రోజుకి ఒకటి లేదా రెండు అరటిపండ్లు తీసుకుంటే దానిలోని పోషకాలు జుట్టు సమస్యలను దూరం చేస్తాయి.

Don't Miss

Subscribe to RSS - చెమట