ఛత్తీస్ ఘడ్

12:59 - October 10, 2018

చత్తీస్‌గఢ్‌ : పరిశ్రమల్లో అగ్రిప్రమాదాలు సంభవించి తొమ్మిది మంది మృతి చెందిన ఘటన స్థానికింగా భయాందోళనలకు గురిచేసింది. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో భిలాయ్ ఉక్కు పరిశ్రమలో సంభవించిన ఘోర ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. కర్మాగారంలోని గ్యాస్ పైపులైను పేలడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్లాంటులోని కోక్ ఓవెన్ సెక్షన్ సమీపంలో మంగళవారం ఈ ప్రమాదం సంభవించింది. ఘటనలో మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్నవెంటనే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక కార్యక్రమాలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు దుర్గ్‌ రేంజ్‌ ఐజీ జీపీ సింగ్‌ వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్లాంట్‌లో 24 మందికిపైగా కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది.
 

11:29 - August 10, 2018

ఛత్తీస్ ఘడ్ : దంతేవాడలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. లారీ అసోసియేషన్ కార్యాలయంలో నిలిపిన లారీలకు నిప్పుపెట్టారు. 5 లారీలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు.

12:32 - August 6, 2018

ఖమ్మం : ఛత్తీస్ గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. పోలీసులు - మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మావోయిస్టులపై కేంద్రం, రాష్ట్రాలు ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే కాంకేర్ జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం మరో భారీ ఎన్ కౌంటర్ సోమవారం చోటు చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవలే మావోయిస్టు వారోత్సవాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆ రోజుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. గట్టి నిఘా ఏర్పాటు చేసిన పోలీసులు విశ్వసనీయ సమచారం మేరకు సోమవారం ఉదయం ఓ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. మావోయిస్టులు ఎదురు పడడంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రతిగా పోలీసులు జరిపిన కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. కానీ దీనిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. 

22:20 - December 9, 2017

ఛత్తీస్ ఘడ్ : బీజాపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపులో దారుణం జరిగింది. సహచరులపై తోటి జవాన్ శాంత్ కుమార్ కాల్పులకు తెగబడ్డారు. రైఫిల్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.  మృతులు ఎస్సై వీకే శర్మ, ఎస్సై మేగ్ సింగ్, ఏఎస్ ఐ రాజ్బీర్, కానిస్టేబుల్ జీఎస్ రావు. మరో ఏఎస్ ఐ గజనంద్ కు గాయాలయ్యాయి. మృతదేహాలను బీజాపూర్ నుంచి బసగుదాకు తరలించారు. నిందితుడు శాంత్ కుమార్ ను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

21:53 - October 27, 2017

ఛత్తీస్‌గడ్‌ : బిబిసి మాజీ జర్నలిస్ట్‌ వినోద్‌వర్మను ఛత్తీస్‌గడ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెక్స్‌ వీడియోకు సంబంధించి ఛత్తీస్‌గడ్‌ మంత్రిని బ్లాక్‌ మెయిల్‌ చేశారన్న ఆరోపణలతో సీనియర్‌ జర్నలిస్టు వినోద్‌ను ఇవాళ ఉదయం పోలీసులు గజియాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు.  సెక్స్ స్కాండల్‌తో సంబంధం ఉన్న ఆ మంత్రి పేరు రాజేష్‌ మునత్‌గా ఓ మీడియా సంస్థకు వినోద్‌ వెల్లడించారు. మంత్రికి చెందిన స్కాండల్‌ కావడంతో కావాలనే తనని ఇరికించినట్లు వినోద్‌ పేర్కొన్నారు. అరెస్ట్‌కు ముందు ఢిల్లీలోని ఓ వీడియో పార్లర్‌పై పోలీసులు దాడి చేశారు. వినోద్‌ 1000 సీడీలను తయారు చేయాలని కోరినట్లు ఆ వీడియో నిర్వాహకుల నుంచి సమాచారం రాబట్టారు. వినోద్‌ ఇంటి నుంచి 5 వందల సీడీలు, పెన్‌డ్రైవ్‌ను స్వాధీనం చేసుకున్నారు. తన వద్ద కేవలం ఓ పెన్ డ్రైవ్ ఉందని, సీడీలతో తనకు సంబంధం లేదని, నన్ను ఈ కేసులో ఇరికించారని వినోద్ తెలిపాడు. పోలీసులు ఆరు గంటలపాటు విచారణ జరిపిన తర్వాత వినోద్‌ను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఘటనను ప్రెస్‌పై దాడిగా ఆప్ నేత ఆశుతోష్ ట్వీట్ చేశారు.

 

10:15 - April 20, 2017

దేశంలో అమానవీయ దృశ్యాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడో ఒకచోట విషాదమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇటీవలే పలువురు తమ సభ్యుల మృతదేహాలను మోసుకెళ్లిన ఘటనలు వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా ఛత్తీస్ గడ్ రాష్ట్రంలో మరో విషాదం వెలుగు చూసింది. దంతేవడాలోని ఒక గిరిజన యువకుడు బిజ్జీ (37) మృతి చెందాడు. అడవి పంది దాడి చేయడంతో అతను కన్నుమూశాడు. ఈ ప్రమాదంపై గ్రామస్తులకు పోలీసులు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని చెప్పారు. మృతదేహాన్ని తీసుకరావాలని ఆదేశించారు. కానీ పోస్టుమార్టం కోసం ప్రభుత్వ వాహనాలనే ఉపయోగించాల్సి ఉంటుంది. మృతదేహాన్ని తీసుకరావడానికి మృతుడి కుటుంబసభ్యుల్లో ఎవరికీ వాహనం లేదు. చేసేది ఏమీ లేక మృతదేహాన్ని మంచానికి కట్టేసి దాదాపు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. బంధువుల రోదనల మధ్య మృతదేహాన్ని తీసుకెళుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమ్యంలో వైరల్ అయిపోయాయి. దీనిపై పోలీసులు స్పందిచంఆరు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం..వారి కుట్రలో భాగమని ఆరోపణలు గుప్పించడం గమనార్హం.

10:55 - November 20, 2016

ఖమ్మం : పాతనోట్ల రద్దు దేశంలోని అన్ని రంగాల మీద తీవ్రప్రభావం చూపిస్తోంది. దీనికి అడవి అన్నలుగా పిలవబడే మావోయిస్టులు కూడా అతీతంకాదు. పాతనోట్లకు మార్చుకునే యత్నంలో మావోలు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చర్లకు తరలిస్తుండగా బీజాపూర్ పామేడులో రూ.6లక్షలను పోలీసులు పట్టుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజల ద్వారా మావోలు నోట్ల మార్చుకునేందుకు యత్నిస్తున్నారు. డబ్బును తరలిస్తున్న గ్రామస్తులు వాటికి సంబంధించి ఎటువంటి ఆధారాలు చూపించకపోవటంతో పామేడు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా ఇప్పటికే ఏవోబీలో భారీ ఎన్ కౌంటర్ ద్వారా పదుల సంఖ్యలో మావోలు మృతిచెందారు. దీంతో వారికి గట్టిదెబ్బే తగిలింది. ఇప్పుడు నోట్లు మార్చుకునే క్రమంలో వారి ఉనికి పోలీసులకు తెలిసే అవకాశాలు చాలానే వున్నట్లుగా తెలుస్తోంది. జనజీవన స్రవంతిలో వున్నవారే నోట్లు మార్చుకునేందుకు నానా అగచాట్లు పడుతున్నారు. మరి అడవిలో తమ రహస్య జీవనాన్ని సాగిస్తున్న అన్నలు ఈ విషయంలో గిరిజనులు,ఆదివాసీలపై ఆధారపడి నోట్ల మార్పిడి కొనసాగించాల్సి వస్తోంది. ఈ క్రమంలో వారి ఉనికికి ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నట్లుగా సమాచారం.

19:26 - October 21, 2016

ఛత్తీస్ ఘడ్ : అమెరికాలోని నయాగరా జలపాతాన్ని మించిన అందాలు మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్‌ వాటర్‌ ఫాల్స్‌, కర్నాటకలోని జోగ్‌ ఫాల్స్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంతాల జలపాతం... ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కానీ వీటి దగ్గర సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఆదరణకు నోచుకోవడంలేదు. ప్రకృతి అందాలతో కనువిందు చేస్తున్న చత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్‌ జలపాతంపై 10 టీవీ ప్రత్యేక కథనం...

ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం..బస్తర్‌ జిల్లా..చిత్రకూట్‌ వాటర్‌ ఫాల్స్‌
ఎత్తైన కొండల మీద నుంచి జాలువారుతున్న ఈ జలపాతం ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రంలోని బస్తర్‌ జిల్లాలో ఉన్నచిత్రకూట్‌ వాటర్‌ ఫాల్స్‌. బస్తర్‌కు 36 కిలో మీటర్లు, జగ్దల్‌పూర్‌కు 40 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం.. ఒడిశాలోని కలహండి జిల్లా కత్తిగూడ గ్రామం దగ్గర పుట్టిన చిన్నవాగు... కొండలు, గుట్టలు, వాగులు, వకంలు, లోయలు దాటుకుంటూ 236 కిమీ మీటర్లు ప్రవహించి ఛత్తీస్‌గఢ్‌లోని చిత్రకూట్‌ దగ్గర భారీ జలపాతంగా మారి ఇంద్రావతి నదిలో కలిసే సుందర దృశ్యాలు అందర్నీఆకట్టుకుంటాయి.

పర్యాటకులకు కట్టిపడేస్తున్న చిత్రకూట్
వర్షాకాలంలో చిత్రకూట్‌ జలపాతం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. మినీ నయాగారగా పిలువబడే ఈ వాటర్‌ ఫాల్స్‌ను చూసేందుకు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తెలంగాణతోపాటు దేశ, విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. నూటయాభై మీటర్ల ఎత్తు నుంచి కిందకు దుమికే ఈ జలపాతం పర్యాటకుల మనసును దోచేస్తుంది. కదలకుండా కట్టిపడేస్తుంది.

సౌకర్యాల లేమితో వన్నె తగ్గిన చిత్రకూట్
చిత్రకూట్‌ శివాలయానికి పక్కనే ఉన్న ఈ జలపాతాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవని పర్యాటకులు చెబుతున్నారు. ఇంత ఎత్తు నుంచి పడుతున్న జలపాతాలను ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని పర్యాటకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇంత మనోహరమైన చిత్రకూట్‌ జలపాతాల దగ్గర సరైన సౌకర్యాలు లేకపోవడంతో పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. బసచేసేందుకు కాలేజీలు, హోటళ్లు నిర్మిస్తే పర్యాటకం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని సూచిస్తున్నారు. అయితే వర్షాల కాలంలో కొద్ది రోజులు మాత్రమే కనువిందు చేసే ఈ జపాతాల దగ్గర శాశ్వత ప్రాతిపదికపై కాటేజీలు, హోటళ్లు నిర్మించే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు. 

14:52 - August 23, 2016

ఛత్తీస్ ఘడ్ : దండకారణ్యం.. మావోయిస్టుల శిక్షణ వేదికగా మారింది. ముఖ్యంగా మహిళా మావోయిస్టులకు యుద్ధవిద్యలు, గెరిల్లా పోరాట విద్యలను నేర్పుతున్నారు. పారామిలటరీ బలాలు ఏ దిశగా వచ్చినా.. ఎన్ని రూపాల్లో వచ్చినా దీటుగా తిప్పికోట్టేలా మహిళా మావోయిస్టులు శిక్షణ పొందుతున్నారు. భూమి, ఆకాశ మార్గాల్లో ఎదురయ్యే ఎలాంటి దాడినైనా సమర్థంగా ఎదుర్కోవడంపై కఠోర శిక్షణనిస్తున్నారు. దీనికి సంబంధించి వెలుగు చూసిన వీడియో దృశ్యాలు.. దండకారణ్య పరిసర ప్రాంతాల్లోనూ... పోలీసు వర్గాల్లోనూ కలలం సృష్టిస్తున్నాయి. ఈ అంశంపై మరింత సమాచారం కోసం ఈ వీడియో చూండండి..

08:36 - May 5, 2016

హైదరాబాద్ : ఛత్తీస్ ఘడ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బర్లంపూర్ సమీపంలోని బర్లంపూర్ వద్ద ఓ ప్రయివేటు బస్సు లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందారు. 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటాస్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ఆసుపత్రికి తరలించారు. మృతులంతా బర్లంపూర్ వాసులుగా పోలీసులు గుర్తించారు.

Don't Miss

Subscribe to RSS - ఛత్తీస్ ఘడ్