జగ్గారెడ్డి

21:42 - December 6, 2018

హైదరాబాద్: ఎన్నికల వేళ ఎలక్షన్ కమిషన్ కొరడా ఝళిపించింది. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన నాయకులు, అభ్యర్థులపై కేసులు నమోదు చేసింది. కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి, టీడీపీ నేత జూపూడి ప్రభాకర్, శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి భవ్య ఆనంద్ ప్రసాద్, సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డి, మేడ్చల్ టీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి, కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణలపై సెక్షన్ 171(ఈ) కింద కేసులు నమోదు చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలు ఇప్పటివరకు 7వేల 852 కేసులు నమోదు చేసినట్టు ఈసీ తెలిపింది. ఇక పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ పిలుపునిచ్చింది.

 

20:48 - October 24, 2018

సంగారెడ్డి : కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిపై మరో కేసు నమోదు అయింది. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ నెల 17న సంగారెడ్డి రోడ్‌షోలో అనుచిత వ్యాఖ్యలు చేశారని, అనుమతించిన సమయానికి మించి రోడ్‌షో నిర్వహించారంటూ ఆయనపై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సంగారెడ్డి పట్టణ పోలీసులు ఆయనపై ఐపీసీ 504, 506 సెక్షన్లు, టీఎస్‌ ఏరియా పోలీస్‌చట్టంలోని సెక్షన్‌ 26 కింద కేసు నమోదు చేశారు.
కుటుంబ సభ్యుల పేరిట ఇతరులను అక్రమంగా అమెరికాకు తీసుకెళ్లారన్న కేసులో ఇటీవల జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. మానవ అక్రమరవాణా, పాస్‌పోర్టు దుర్వినియోగం, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన కేసుల్లో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు కావడంతో ఆయనకు జైలు శిక్ష పడింది. బెయిల్‌పై బయటకు వచ్చిన జగ్గారెడ్డి సంగారెడ్డిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

 

16:37 - September 29, 2018

సంగారెడ్డి : కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిపై టీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. మహిళలను అక్రమ రవాణా చేసే జగ్గారెడ్డికి కాంగ్రెస్ టిక్కెట్ ఇవ్వటం సిగ్గుచేటన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల పేరిట కూడా జగ్గారెడ్డి భూ కుంభ కోణాలకు పాల్పడ్డారనీ..కుంభకోణాకలు జగ్గారెడ్డి మారుపేరని తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కు మహిళల పట్ల గౌరవం, బాధ్యత వుంటే జగ్గారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీకి హరీశ్ రావు సవాల్ విసిరారు. కాగా ఇటీవల జగ్గారెడ్డిపై మహిళల అక్రమ రవాణా కేసు మోసబడి జైల్ కు వెళ్లి బెయిల్ పై బైటకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్రంగా మండిపడిన జగ్గారెడ్డి టీఆర్ఆర్ కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు బనాయించి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందని విమర్శించారు. 

 

21:08 - September 24, 2018

హైదరాబాద్ : చంచల్‌గూడ జైలు నుంచి కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి విడుదలయ్యారు. మానవ అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగ్గారెడ్డికి సికింద్రాబాద్‌ కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేయడంతో.. కొద్దిసేపటి క్రితం ఆయన విడుదలయ్యారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతుందని.. త్వరలోనే సోనియా, రాహుల్‌గాంధీలతో భారీ సభ ఏర్పాటు చేస్తామన్నారు. తనపై పెట్టిన కేసు నుంచి తాను బయటపడుతానన్నారు. 

15:06 - September 24, 2018

హైదరాబాద్ : 2004లో నకిలీ పత్రాలు, పాస్ పోర్టుతో మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి బెయిల్ లభించింది. సికింద్రబాద్ కోర్టు ఆయనకు బెయిల్ ను మంజూరు చేస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన చంచల్ గూడ‌జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పలు ఆరోపణలతో ఆయన్ను పోలీసులు అరెస్టు చేసింది. గుజరాత్ కు చెందిన ముగ్గుర్ని తన కుటుంబసభ్యులుగా పేర్కొంటూ వారిని అమెరికాకు తీసుకెళ్లి వదిలేసి వచ్చినట్టు కేసులో ఆరోపణలు ఉన్నాయి. కింద్రాబాద్ సివిల్ కోర్టు‌లో 18వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ముందు జగ్గారెడ్డిని హజరుపర్చారు. కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. అనంతరం ఆయనను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించారు. ఈక్రమంలో జగ్గారెడ్డి దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. తాజాగా బెయిల్ లభించింది. బయటకు వచ్చిన అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

07:44 - September 12, 2018

హైదరాబాద్ : సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి... కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టైన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి ఉచ్చు బిగుస్తోంది. పాస్‌పోర్టు దుర్వినియోగం, ప్రభుత్వ అధికారులను మోసం చేసిన కేసుల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు సికింద్రాబాద్‌లోని సిటీ సివిల్‌కోర్టులో హాజరు పర్చారు. వాద ప్రతివాదనలు విన్న న్యాయస్థానం జగ్గారెడ్డికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో జగ్గారెడ్డిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు.

పాస్‌పోర్టు సందర్భంగా జగ్గారెడ్డి చూపించిన పత్రాలు, ప్రస్తుతం వారి కుటుంబ సభ్యుల వివరాలు సేకరించిన పోలీసులు.. రెండింటికి ఎక్కడా పొంతన లేదని తెలిపారు. ఆధారాల కోసం జగ్గారెడ్డి కుటుంబ సభ్యుల ఆధార్‌ కార్డులు, ఫొటోలు సేకరించారు. తన పాస్‌పోర్టు పోయిందంటూ 2016 జనవరిలో... మరో కొత్త పాస్‌పోర్టును జగ్గారెడ్డి పొందినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే తనను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేయించిందంటూ జగ్గారెడ్డి ఆరోపించారు.

మానవ అక్రమ రవాణాకు సంబంధించిన కేసు ఉన్నందున హైకోర్టుకు వెళ్లాలని న్యాయమూర్తి సూచించారు. కేసులో పురోగతి కోసం జగ్గారెడ్డిని పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. పోలీసులు దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేసింది.

13:39 - September 11, 2018

హైదరాబాద్ : మనుషుల అక్రమ రవాణా కేసులో అరెస్టయిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి రిమాండ్ విధించారు. పోలీసులు సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు ఎదుట హాజరు పరిచారు. 104 రోజుల పాటు రిమాండ్ విధిస్తున్నట్లు కోర్టు వెల్లడించింది. దీనితో జగ్గారెడ్డిని చంచల్ గూడ జైలుకు తరలించారు. 2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.  అనంతరం గాంధీ ఆసుపత్రిలో వైద్య చికిత్సలు నిర్వహించారు. అనంతరం కోర్టులో హాజరు పరిచారు. మరోవైపు ఈ కేసులో జగ్గారెడ్డి బెయిల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం.  కేవలం తనను రాజకీయ సాధింపు చర్యలో భాగంగానే తనపై అక్రమ కేసులు పెట్టారని జగ్గారెడ్డి ఆరోపించారు. 

11:16 - September 11, 2018

హైదరాబాద్ : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారనే దానిపై ఉత్తర మండల డీసీపీ సుమతి వివరణనిచ్చారు. భార్య పిల్లల పేరిట ఇతరులను అమెరికాకు తీసుకెళ్లి అక్కడే వారిని వదిలేసి వచ్చారనే ఆరోపణలతో ఆయన్ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 2004లో జగ్గారెడ్డితో తనతో పాటు భార్య, పిల్లల పేరిట పాస్ పోర్టులు తీసుకున్నారని, వేకొరని అమెరికాకు తీసుకెళ్లారని గుర్తించినట్లు తెలిపారు. ఎవరు వెళ్లిందో గుర్తించాల్సి ఉందని, తెలంగాణకు చెందిన వారు మాత్రం కాదని స్పష్టం చేశారు. సికింద్రబాద్ పీఎస్ ఎస్ఐ అంజయ్యకు వచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అక్రమంగా తరలించిన ముగ్గురి నుండి జగ్గారెడ్డి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించినట్లు వెల్లడించారు. ఆయనపై అధికార దుర్వినియోగం కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. 

09:07 - September 11, 2018

సంగారెడ్డి : మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పట్టణ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా సంగారెడ్డిలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పలువురు కార్యకర్తలు..నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. జగ్గారెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 14 సంవత్సరాలుగా లేనిది ఇప్పుడు తెర మీదకు ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే జగ్గారెడ్డిని అరెస్టు చేసిన అనంతరం పీఎస్ లో మూడు గంటల పాటు పోలీసులు విచారించారు. అనంతరం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ చికిత్స నిర్వహించారు. అనంతరం సికింద్రాబాద్ కోర్టు స్పెషల్ జడ్జి ముందు జగ్గారెడ్డిని హాజరు పరచనున్నారు. 

2004లో జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తన భార్య నిర్మల, కుమార్తె జయలక్ష్మి, కుమారుడు భరత్‌సాయిరెడ్డి పేర్లతో గుజరాత్‌కు చెందిన ఓ కుటుంబానికి నకిలీ పాస్‌పోర్టులు సృష్టించి.. అమెరికాకు తీసుకెళ్లారనే అభియోగాలతో అదుపులోకి తీసుకున్నారు. అయితే.. జగ్గారెడ్డి తీసుకెళ్లినవారు 14 ఏళ్లు అయినా.. ఇంకా తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన అమెరికా కాన్సులేట్‌ అధికారులు ఈ విషయంపై ఆరా తీయాలంటూ నార్త్‌జోన్‌ పోలీసులకు సమాచారమిచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు.. జగ్గారెడ్డి 2004లో తన సిఫారసుతో ఇప్పించిన పాస్‌పోర్టుల డాక్యుమెంట్లను పరిశీలించారు. దీంతో... అందులో భార్య, కూతురు, కొడుకు పేర్లు ఉన్నా ఫొటోలు వేరేవిగా గుర్తించారు. 

06:47 - September 11, 2018

సంగారెడ్డి : తన భర్త ప్రాణానికి ముప్పు ఉందని జగ్గారెడ్డి భార్య నిర్మల పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో పాస్ పోర్టు, వీసా పొందారనే ఆరోపణలతో జగ్గారెడ్డిని పటన్ చెరులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కనీసం తనతో మాట్లాడనీయకుండా జగ్గారెడ్డిని ఎటు తీసుకెళ్లారో తెలియడం లేదన్నారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకు... రాజకీయ కుట్రతోనే తన భర్తను అరెస్ట్‌ చేశారని నిర్మల అంటున్నారు. తన భర్త పట్ల పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - జగ్గారెడ్డి