జనంపాట

13:25 - July 16, 2017

సాహిత్యం సమాజంలోని ప్రజలను చైతన్య పరుస్తుంది. దోపిడివర్గాల గుట్టును రట్టు చేస్తుంది. సామాజిక అసమానతలను బయట పెడుతుంది. అట్టడుగు వర్గాల ప్రజలను  ఉద్యమాల బాట పట్టిస్తుంది. అలాంటి రచనలు చేసిన రచయితలు మన మధ్య ఎందరో ఉన్నారు. వారిలో అభ్యుదయ గేయ రచయిత నూనెల శ్రీనివాసరావ్. ఆయనపై కథనంతో ఈ వారం మీ ముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం. తెలుగు నాట వచన కవిత్వం రాసే కవులతో పాటు గేయరచయితలెందరో ఉన్నారు. కవిత్వం మేధావులను ఆలోచింపజేస్తే.... గేయాలు సామాన్య ప్రజలను చైతన్యవంతం చేస్తాయి. అలాంటి గేయాలు రాసిన విశాఖ జిల్లా రచయిత నూనెల శ్రీనివాసరావు. ఆయన వందకు పైగా గేయాలు రాసారు. శ్రమైక గేయాలు అన్న పాటల పుస్తకం కూడా వెలువరించారు. గేయకవి నూనెల శ్రీనివాస్ రావు జనం పాట మీ కోసం. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

13:34 - March 26, 2017

తెలంగాణాలో ఎందరో గేయ రచయితలు ఉన్నారు. ప్రజాసమస్యలను అక్షరీకరిస్తూ ఎన్నో పాటలు రాస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. అలాంటి వారిలో దేవణ్ణ ఒకరు. సమాజంలోని అనేక సమస్యలపై ఎప్పటికప్పడు స్పందిస్తూ వందలాది పాటలు రాసిన గేయరచయిత దేవణ్ణ జనం పాటలు చూద్దాం....

12:48 - February 26, 2017

ఓ సాహిత్య కార్యక్రమం ఎలక్ట్రానిక్ మీడియాలో ఇముడుతుందా? ప్రతీ వారం ఇవ్వగలరా? అసలు అక్షరాన్ని విజువల్ గా ఎలా చూపిస్తారు..? ఇప్పటికే కొందరు ప్రయత్నించారు.. విరమించుకున్నారు.. మరి ఈ ప్రయత్నం మాత్రం ఎంతవరకు విజయవంతమౌతుంది? ఇలాంటి ప్రశ్నలు అనేకం వినిపించాయి.. అన్ని ప్రశ్నలకు సమాధానంగా నాలుగేళ్లు... రెండువందల వారాలు.. పూర్తి చేసుకుని .. సరికొత్త ప్రణాళికలతో, మరిన్ని విన్నూత్న కార్యక్రమాలతో మీ ముందుకు రాబోతోంది టెన్ టీవీ అక్షరం.. అక్షరం 200వ ఎపిసోడ్ సెలబ్రేషన్స్ తో పాటు.. ఈ నాలుగేళ్ల పయనంలోని అనుభవాలతో ఈ వారం అక్షరం ప్రత్యేకంగా మీముందుకొచ్చింది. సమున్నత ఆశయంతో సాగుతున్న టెన్ టీవీ అక్షర ప్రయాణంలో ఓ మైలు రాయి లాంటి సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నిర్వహించిన చిన్న వేడుక 'అక్షరం సమీక్షణం' పలువురు సాహితీవేత్తల సమక్షంలో జరిగింది.

14:06 - September 4, 2016

సాహిత్యం మానవసమూహాలను కదిలిస్తుంది. ఆలోచింప చేస్తుంది. ప్రజా ఉద్యమాలకు ఊపిరి పోస్తుంది. సామాజిక పరిణామాలను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తుంది. ఎందరో సృజనకారులు తమ రచనలచేత ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. అలాంటి వారిలో అభ్యుదయ కవి బిల్ల మహేందర్ పరిచయ కథనంతో పాటు కస్తాల వెంకన్న జనం పాట, వివిధ సాహితీ వేదికల వేడుకల సమాహారంగా ఈ వారం మీముందుకొచ్చింది 10 టి.వి.అక్షరం.

పాట మనిషిని కదిలిస్తుంది. మనసుకు ఊరట నిస్తుంది.  ప్రజాసమూహాలను  చైతన్యబాట లో నడిపిస్తుంది. పాటకు అంతటి శక్తి ఉంది. అలాంటి పాటలు రాసిన ప్రజాకవి కస్తాల వెంకన్న. అక్షరాలను జ్వలిత రాగాలుగా వెలుగు దీపాలుగా మార్చి ప్రజలకు చైతన్య బాటచూపిన గేయకవి ఆయన. కస్తాల వెంకన్నను పరిచయం చేస్తున్నారు ప్రముఖ గేయకవి స్ఫూర్తి నేటి జనం పాటలో..

17:07 - July 17, 2016

తెలుగు, తమిళం, కన్నడం సినిమాలలో వందకు పైగా పాటలు పాడిన ప్రముఖ సినీ గాయకుడు 'రాంకీ'. రాంకీ అంటే తమిళ పేరులాగా అనిపిస్తుంటుంది. తెలుగు సినిమాల్లో అందరికీ పరిచయమైనా వంద పాటలు పాడడమంటే అంత చిన్న విషయం కాదు. టెన్ టివిలో 'జనం పాట' కార్యక్రమంలో రాంకీ పలు విశేషాలను తెలియచేశారు. రాంకీ ఓ హీరో పేరు అని..తన అసలు పేరు రామకృష్ణ అని తెలిపారు. తనకు 'గుండె జారి గల్లంతయ్యిందే' పాట తొలి హిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించారో...ఆయన ఎలాంటి పాటలు పాడారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

13:09 - February 28, 2016

`నా చిట్టీ చేతులు చక్కని రాతలు నేర్వలేదయ్యో `లాంటి చక్కని గేయాలతో సమాజంలో చైతన్యం వెల్లువెత్తించిన అభ్యుదయగేయకవి  చింతల యాదగిరి. ప్రచార పటాటోపాలకు దూరంగా ఉంటూ... సమాజంలోని ప్రతి దృశ్యానికి చలించిపోతూ పాటై కరిగిపోతుంటాడాయన. ఇటీవలే తీగో నాగో ఎన్నియలో అనే గేయసంపుటిని వెలువరించిన ప్రజాగేయ రచయిత ,గాయకులు చింతల యాదగిరి పై 10 టి.వి.ప్రత్యేక కథనం.

12:47 - July 26, 2015

అంటరానితనం దేశానికి తలవంపులు తెస్తున్న కళంకం. నిచ్చెనమెట్ల కుల సమాజంలో దళితులపై ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. డా.అంబేద్కర్ నుండి వెన్నెలకంటి రాఘవయ్యదాకా ఎందరో కులవ్యవస్థ పోవాలని ఆశించారు. మహారాష్ట్రలోని దళిత పాంథర్స్ ఉద్యమం నుండి, కారంచేడు, చుండూరు పోరాటాల వరకు దళిత విముక్తికోసం ఎందరో తపించారు. అలాంటి వారిలో దళితులపై జరిగిన చారిత్రక విద్రోహాలకు అక్షర రూపమిచ్చి వారి గాయాల బతుకులను గేయాలుగా మలిచిన అక్షర శిల్పి పోతపోలు రెడ్డెప్ప. కవి, గేయ రచయిత, గాయకుడు పోతపోలు రెడ్డెప్పపై ప్రత్యేక కథనం.

 

Don't Miss

Subscribe to RSS - జనంపాట