జనం పాట

20:54 - December 10, 2017

జనం పాటం. ప్రజల గొంతుక 'జనం పాట'. తెలుగు భాషకు ఎంతో ప్రాచీన చర్రిత ఉంది. తెలంగాణ పాటకు సమాజంలోని ప్రతి దశలోనూ ప్రత్యేకస్థానం ఉంది. తెలుగు మహాసభల సందర్భంగా వాడుక తెలుగును కాపాడుకోవాల్సిన  అవసరం ఉంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో గాయకుడు జయరాజ్, గాయకురాలు స్వర్ణ పాల్గొని, మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాట అంటే భయపడతరని, వణికిపోతారని తెలిపారు. జనం పాట అనేక ఉద్యమాలకు పునాది వేసిందన్నారు. పలు పాటలు పాడి వినిపించారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

12:46 - May 14, 2017

హైదరాబాద్: సమాజం బాగుపడాలంటే మంచి సాహిత్యం రావాలి. ప్రజలను చైతన్య పరిచే సాహిత్యాన్ని ఎందరో రచయితలు సృష్టిస్తున్నారు. ప్రజా ఉద్యమాల్లో కవులు, కళాకరుల పాత్రలను మరువలేము. అలాగే కవిత్వం, గేయాలు ప్రజలకు రసానందాన్ని కలిగిస్తూ ఆలోచింప చేస్తాయి. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తోన్న కవియిత్రి శైలజా మిత్ర ప్రత్యేక కథనంతో పాటు.. గేయకవి వీరభద్రం జనం పాటతో ఈ వారం మీ ముందుకు వచ్చింది 'టెన్ టివి' 'అక్షరం'. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను క్లిక్ చేయండి...

13:19 - June 28, 2015

పుట్టుక నీది..చావు నీది..కానీ బతుకు సమాజానిది అంటారు మహాకవి కాళోజీ. సామాజిక చైతన్యం కోసం ఎందరో కవులు..గాయకులు..గేయ రచయితలు తమ కలాలకు పదును పెడుతున్నారు. పాటల ఏరువాకలై ఎగిసిపడుతున్నారు. అలాంటి వారిలో తెలంగాణ ఉద్యమాన్ని గుండె నిండా నింపుకుని అక్షరాలను ఆయుధాలుగా సంధించిన కలం యోధుడు లింగాల వెంకన్న. కేవలం ఉద్యమపాటలే కాకుండా ఆయన గుండెలను పిండేసే ప్రజా గీతాలకు ప్రాణం పోశారు. తెలంగాణ మట్టి పాటల మాణిక్యం లింగాల వెంకన్న జనం పాట..

 

Don't Miss

Subscribe to RSS - జనం పాట