జమ్మూ

21:33 - October 3, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని బిఎస్‌ఎఫ్‌ క్యాంపుపై మంగళవారం తెల్లవారు జామున ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఉదయం 3.45 గంటలకు BSF 182వ బెటాలియన్‌ను లక్ష్యంగా చేసుకుని ముగ్గురు టెర్రరిస్టులు చొరబాటుకు యత్నించారు. ఇద్దరు ఉగ్రవాదులు చీకటిని ఆసరాగా చేసుకుని కాల్పులు జరుపుతూ గ్రెనేడ్లు విసరగా... మరో ఉగ్రవాది అడ్మిన్‌ భవనంలో దాక్కున్నాడు. వెంటనే అప్రమత్తమైన జవాన్లు ఉగ్రదాడిని దీటుగా ఎదుర్కొన్నారు. ఇరువర్గాల మధ్య హోరాహోరిగా కాల్పులు జరిగాయి. సుమారు 10 గంటలపాటు జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.

బిఎస్‌ఎఫ్‌కు చెందిన ఎఎస్‌ఐ మృతి
ఉగ్రవాదుల కాల్పుల్లో బిఎస్‌ఎఫ్‌కు చెందిన ఎఎస్‌ఐ అమరుడు కాగా.... మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. భద్రతాదళాలు ఉగ్రదాడిని సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఆపరేషన్‌ త్వరితగతిన ముగిసిందని వారు పేర్కొన్నారు. శ్రీనగర్‌ విమానాశ్రయంపై దాడి జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. ఎయిర్‌పోర్టు సమీపంలో కాల్పులు జరగడంతో విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాద సంస్థ జైష్‌-ఎ మహ్మద్‌లోని 'అఫ్జల్‌ గురు స్క్వాడ్‌' ఈ దాడికి పాల్పడినట్లు నిఘా వర్గాల సమాచారం. శ్రీనగర్‌ బిఎస్‌ఎఫ్‌ క్యాంపు నలువైపులా భద్రత కలిగి ఉంటుంది. ఓవైపు శ్రీనగర్‌ ఎయిర్‌పోర్టులో నిరంతరం వాయుసేన అప్రమత్తంగా ఉంటుంది. మరోవైపు బిఎస్‌ఎఫ్‌, సిఆర్‌పిఎఫ్‌ శిక్షణా కేంద్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇంతటి చక్రవ్యూహాన్ని ఛేదించి ఉగ్రవాదులు క్యాంపులోకి ఎలా చొరబడ్డారన్నది ప్రశ్నార్థకంగా మారింది.

18:03 - September 9, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గుర్తుతెలియని ఓ ఉగ్రవాది హతమయ్యాడు. సోపోర్‌ సమీపంలోని రేబన్‌ గ్రామంలో ఉగ్రవాదులు దాక్కొన్నారనే సమచారం మేరకు భద్రతాదళాలు తెల్లవారుజామున సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఉగ్రవాదులు లొంగిపోవాలని అధికారులు హెచ్చరించారు. కానీ వీటిని లెక్కచేయని ఉగ్రవాదులు భద్రతాదళాలపైకి కాల్పులకు తెగ్గబడ్డారు. భద్రతాదళాలు జరిపిన ఎదురు కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. కాల్పులు కొనసాగుతున్నాయి. ఎన్‌కౌంటర్‌ జరిగే ప్రాంతంలో మొబైల్‌, ఇంటర్‌నెట్‌ సేవలు నిలిపివేశారు.

08:08 - September 7, 2017

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌ ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కేసులో శ్రీనగర్‌, ఢిల్లీలో NIA దాడులు జరిపింది. శ్రీనగర్‌లో 11 చోట్ల, ఢిల్లీలో 5 చోట్ల ఈ సోదాలు నిర్వహించింది. క‌శ్మీర్ వ్యాలీలో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్ర సంస్థలు ఫండింగ్ చేస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ ఏడుగురు వేర్పాటువాద నేత‌ల‌ను అరెస్టు చేసి విచారణ జరిపింది. ఇంతకు ముందు హంద్వాడా, బారాముల్లాల్లో ఎన్‌ఐఏ 12 చోట్ల దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. హవాలా వ్యాపారుల ఇళ్లల్లోనూ ఎన్‌ఐఏ సోదాలు చేసింది. మరోవైపు కశ్మీర్‌ వేర్పాటువాద నేత షబ్బీర్‌షాకు ఢిల్లీ కోర్టు బెయిలు తిరస్కరించింది. పాకిస్థాన్‌తో పాటు కొన్ని మిలిటెంట్ సంస్థలు క‌శ్మీర్ అల్లర్లకు ఆర్థిక స‌హ‌కారం అందిస్తున్నాయ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. వేర్పాటువాద నేత‌ల‌కు, ఉగ్ర మూక‌ల‌కు డ‌బ్బు చేరుతున్నట్లు ఎన్ఐఏ ద‌ర్యాప్తులో తేలింది.

15:56 - August 12, 2017

శ్రీనగర్ : పాకిస్తాన్‌ మరోసారి కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌లోని మెండర్‌ సెక్టార్‌లో పాకిస్తాన్‌ కాల్పులు జరిపింది. పాక్‌ ఆర్మీ మోర్టార్లతో జరిపిన కాల్పుల్లో 45 ఏళ్ల మహిళ మృతి చెందడంతో ఆ కుటుంబం దుఃఖసాగరంలో మునిగిపోయింది. ఎల్వోసి వద్ద పాకిస్తాన్‌ సేనకు భారత్‌ తగినరీతిలో జవాబు చెప్పింది. పాకిస్తాన్‌ ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 250 సార్లు సరిహద్దులో కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. మరోవైపు కుప్వారా జిల్లాలో ఉగ్రవాదులు నిన్న అర్ధరాత్రి దాటాక దూరం నుంచి కాల్పులు జరిపారు. జవాబుగా ఆర్మీ కూడా కాల్పులు జరపడంతో చీకటిని ఆసరగా చేసుకుని ఉగ్రవాదులు పారిపోయారు. ఉగ్రవాదుల కోసం సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది.

09:35 - July 11, 2017

శ్రీనగర్ : అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రదాడి నేపథ్యంలో జమ్ము, కశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య అమర్‌నాథ్‌కు యాత్రికులు బయలుదేరారు. అమర్‌నాథ్‌ యాత్ర కొనసాగుతుందని అధికారులు తెలిపారు. జమ్మూలో ఇంటర్‌నెట్‌ సేవలను అధికారులు నిలిపివేశారు. అమర్‌నాథ్‌ యాత్రికులపై ఉగ్రవాదుల దాడిని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ తీవ్రంగా ఖండించారు. అమాయకుల ప్రాణాలను బలితీసుకోవడంపై రాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. మరోవైపు జమ్మూలో రెండు రోజుల బంద్‌కు విపక్షాలు పిలుపునిచ్చాయి. దీంతో రెండు రోజులపాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

10:12 - July 3, 2017

శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్లోని పుల్వామా జిల్లాలో భారీ ఎన్ కౌంటర్ జరుతోంది. తెల్లవారు ఝామునుంచి ఎన్ కౌంటర్ కొనసాగుతోంది. ఉగ్రవాదులు బమ్నూ ప్రాంతంలో ఇంట్లోకి చొరబడి కాల్పులు జరుపుతున్నారు. మరో ఇద్దరు ఇంట్లో దాగి ఉన్నారు. ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది మరణించినట్లు తెలుస్తోంది. చనిపోయిన ఉగ్రవాది కిఫాయిత్ గా భద్రతా బలగాలు గుర్తించారు. మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

16:00 - July 1, 2017

శ్రీనగర్ :జమ్ముకశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతాదళాలు, టెర్రరిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు మృతి చెందారు. ఇరువర్గాలకు మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందగా మరో ముగ్గురు పౌరులు గాయపడ్డట్లు అధికారులు తెలిపారు. బత్పోరా గ్రామంలోని ఓ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉండడంతో పోలీసులు ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్ల నుంచి 17 మందిని ఖాళీ చేయించారు. ఉగ్రవాదుల్లో లష్కరే తోయిబాకు చెందిన టాప్‌ లీడర్‌ బషీర్‌ కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. కాల్పుల్లో గాయపడ్డ 44 ఏళ్ల తాహిరా బేగంను ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతోంది. 

14:30 - July 1, 2017

శ్రీనగర్ : జమ్మూలో మరోసారి ఉగ్రకలకలం రేగింది. అనంత్ నాగ్ లో భద్రతాదళాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందింది. పూర్తి వివరాలకు కోసం వీడియో చూడండి. 

20:47 - June 25, 2017

శ్రీనగర్ : జమ్మూలో రోప్‌వే కూలి ఏడుగురు పర్యాటకులు దుర్మరణం చెందారు. శ్రీనగర్‌లోని గుల్మార్గ్‌లో పెనుగాలికి భారీ వృక్షం కూలీ రోప్‌వే తీగపై కూలింది. దీంతో 30 మీటర్ల ఎత్తులో ఉన్న కార్‌చైర్ ఒక్కసారిగా కుప్పకూలి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పిల్లలు, టూర్ గైడ్‌తో సహా ఓ కుటుంబం మృతిచెందింది. ఈ ఘటన తరువాత కేబుల్ కార్ల సర్వీసులను వెనువెంటనే నిలిపివేశారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 1998లో ప్రారంభమైన గుల్మార్గ్ కేబుల్ కారు సర్వీసులో ఇటువంటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారని స్థానికులు పేర్కొన్నారు. 

06:48 - May 28, 2017

జమ్మూ కాశ్మీర్ : జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతాదళాల ఎదురు కాల్పుల్లో హిజ్బుల్‌ కమాండర్‌ సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ మృతి చెందాడు. సబ్జర్‌ భట్‌ బుర్హాన్‌ వాని స్థానంలో కమాండర్‌ బాధ్యతలు చేపట్టాడు. దీంతో కశ్మీర్‌ లోయలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాద మిలిటెంట్‌ సంస్థ హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిజ్బుల్‌ ముజాహిదీన్‌ టాప్‌ కమాండర్ సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం తొమ్మిది మంది ఉగ్రవాదులు మరణించినట్లు భద్రతా దళాలు తెలిపాయి. పుల్వామా జిల్లాలోని త్రాల్‌ సెక్టార్‌లో ముగ్గురు, బారాముల్లా జిల్లాలోని రాంపూర్‌ సెక్టార్‌లో ఎల్‌వోసీ మీదుగా చొరబాటుకు ప్రయత్నించిన ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది.

త్రాల్ సెక్టార్ లో..
ఉగ్రవాదులు పుల్వామా జిల్లాలోని త్రాల్‌ సెక్టార్‌లో ఓ ఇంట్లో దాక్కున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుముట్టాయి. ఆర్మీ, సిఆర్‌పిఎఫ్, జమ్ముకశ్మీర్‌ పోలీసులు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో హిజ్బుల్‌ టాప్‌ కమాండర్‌ సబ్జర్‌ అహ్మద్‌ భట్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ స్థానంలో సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ పగ్గాలు చేపట్టాడు. ఎన్‌కౌంటర్‌లో సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ హతమవ్వడంతో కశ్మీర్‌లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. దక్షిణ కశ్మీర్‌లో పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. అనంతనాగ్‌లో భద్రతాదళాలతో జరిగిన ఘర్షణల్లో ఓ వ్యక్తి గాయపడ్డాడు. పరిస్థితి విషమిస్తుండడంతో అధికారులు కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. లోయలో షాపులు మూతపడ్డాయి. గత ఏడాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ తర్వాత కశ్మీర్‌లో శాంతిభద్రతల పరిస్థితి పూర్తిగా విషమించింది. భద్రతాదళాలపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంలాంటి హింసాత్మక ప్రదర్శనలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. తాజాగా సబ్జర్‌ అహ్మద్‌ భట్‌ ఎన్‌కౌంటర్‌తో లోయలో పరిస్థితి విషమించే అవకాశం ఉండడంతో అధికారులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - జమ్మూ