జమ్మూ కాశ్మీర్

09:40 - September 15, 2018

జమ్మూ కాశ్మీర్ : అక్రమంగా భారతదేశంలోకి ప్రవేశించడానికి ఉగ్రవాదులు ఇంకా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత బలగాలకు..ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరుగుతుండడం పరిపాటిగా మారిపోయింది. తాజాగా కుల్గాంలో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరు లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహీద్ టెర్రరిస్టులుగా గుర్తించారు. 
గాలింపులో భాగంగా ఈ కాల్పులు కొనసాగుతున్నాయి. ఓ ఇంట్లో ఉగ్రవాదులు నక్కారన్న సమాచారం మేరకు భారత బలగాలు గాలింపులు చేపట్టాయి. శుక్రవారం రాత్రి నుండి కొనసాగిన కాల్పులు శనివారం ఉదయం వరకు కొనసాగాయి. ఎన్ కౌంటర్ నేపథ్యంలో భాగంగా బారాముల్లా, కాజీగండ్ ప్రాంతంలో రైళ్ల సర్వీసులను రద్దు చేశారు. పూర్తి వివారాలు తెలియాల్సి ఉంది. 

10:18 - July 6, 2018

జమ్మూ కాశ్మీర్ : మంచు లింగాన్ని దర్శించుకోవడానికి భక్తులు అష్టకష్టాలు పడుతున్నారు. అమర్ నాథ్ యాత్ర నిలిచిపోయింది. వర్షాలు..కొండచరియలు విరిగిపడడంతో యాత్రకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వాతావరణం అనుకూలించకపోవడంతో ఉధంపూర్ లో 1798 మంది యాత్రికులు నిలిచిపోయారు. పహాల్ గావ్, బల్తాల్ మార్గాలత్లో యాత్రను నిలిపివేశారు. ఆయా శిబిరాల్లో తలదాచుకున్న భక్తులకు ఆర్మీ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జమ్మూ బేస్ క్యాంపు నుండి మరో 28వేల మంది భక్తులు బయలుదేరారు. ఈ యాత్ర ఆగస్టు 26వరకు కొనసాగనుంది. ఇంతవరకు మంచు లింగాన్ని 61వేల మంది భక్తులు దర్శించుకున్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి. 

07:34 - April 26, 2018

ఢిల్లీ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. పుల్వామా జిల్లాలో కాంగ్రెస్‌ నేత గులాం నబీ పటేల్‌ను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ పటేల్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ఆయన కన్ను మూశారు. మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పటేల్‌ వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గులాంనబీ పటేల్‌ ఇంతకుముందు పిడిపిలో ఉన్నారు. ఈ దాడిని జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముప్తీ తీవ్రంగా ఖండించారు. ఆయన మృతికి సంతాపం తెలియజేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నట్లు సీఎం ట్వీట్‌ చేశారు. కాల్పులు జరిపిన ప్రాంతాన్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. 

16:33 - April 18, 2018

విజయవాడ : జమ్మూ కాశ్మీర్ లోని కథువాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం..హత్య ఘటనతో యావత్ భారతదేశం సిగ్గుతో తలదించుకోవాలని, వెంటనే నిందితులకు కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు. బుధవారం ముస్లిం హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదిర్శ ఫారూక్ చేపట్టిన 48 గంటల పాటు చేపట్టే దీక్షకు రామకృష్ణ హాజరయి మద్దతు పలికారు. 

11:44 - April 16, 2018

ఢిల్లీ : జమ్ము కశ్మీర్‌ లోని కథువాలో 8ఏళ్ల బాలికపై అత్యాచారం, హత్య ఘటన దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. తన బిడ్డను చంపిన వారిని ఉరి తీయాలని చిన్నారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు.

మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతోందని బాధిత కుటుంబం పేర్కొంటోంది. ఆసిఫా అత్యాచారం, హత్య కేసును కథువా కిందిస్థాయి కోర్టు స్వీకరించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే జమ్మూ కాశ్మీర్ నుండి చండీగడ్ కు ఈ కేసును తరలించాలంటూ బాలిక తండ్రి సుప్రీంను ఆశ్రయించాడు. ఈ కేసుపై మధ్యాహ్నం సుప్రీం విచారించనుంది. కేసును తరలిస్తారా ? లేదా ? అనేది చూడాలి. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

06:28 - April 15, 2018

హైదరాబాద్ : బీజేపీ పాలనలో మహిళలపై దారుణాలు పెరిగాయి. బీజేపీ నాయకులే మహిళలపై అత్యాచారాలు చేయడం సిగ్గుచేటు అని జానారెడ్డి అన్నారు. మహిళలపై దాడులను అరికట్టాలంటూ పీపుల్స్ ఫ్లాజా నుండి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ పాల్గొన్న జానారెడ్డి. ఇప్పటికైన ప్రభుత్వం కళ్లు తెరవాలని.. .మహిళలకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఈ ర్యాలీలో పీసీసీ అధ్యక్షడు ఉత్తమ్, షబ్బీర్ అలీ, పొన్నాల, వీహెచ్ దానం, డికె ఆరుణ, పొంగులేటి పాల్గొన్నారు.

09:25 - April 14, 2018

ఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లోని కథువా గ్యాంగ్‌ రేప్‌ ఉదంతంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. కథువా ప్రాంతానికి చెందిన 8 ఏళ్ల అసిఫాకి మాదకద్రవ్యాలు ఇచ్చి మూడు రోజుల పాటు పాశవికంగా అత్యాచారం చేసి చంపేశారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ అన్నారు. 12 ఏళ్ల లోపు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడేవారికి మరణదండనే సరైన శిక్షగా పేర్కొన్నారు. ఈ మేరకు పోస్కో చట్టంలో సవరణలు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని మేనకాగాంధీ తెలిపారు. మైనర్‌ బాలికపై లైంగిక దాడి కేసులో స్ధానిక పోలీసులు సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో ముఫ్తీ మెహబూబా ప్రభుత్వం క్రైమ్‌ బ్రాంచ్‌కు కేసును అప్పగించింది. 8 ఏళ్ల అసిఫా మర్డర్‌ కేసులో పోలీసులు 8 మందిని నిందితులుగా గుర్తించారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని రక్షించే ప్రయత్నం జరుగుతుండడంతో బాధితురాలి కుటుంబం గ్రామం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది.

13:33 - April 1, 2018

జమ్మూ కాశ్మీర్ : వరుసగా జరిగిన ఎన్ కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతం కాగా ఇద్దరు భారత జవాన్లకు గాయాలయ్యాయి. వేర్వేరు ప్రాంతాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. షోపియాన్ జిల్లాలో సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న భారత బలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీనితో భారత సైన్యం ధీటుగా స్పందించింది. ఎదురు కాల్పులు జరపడంతో ఏడుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. అనంతనాగ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఆయా ఘటనా ప్రదేశాల నుండి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రీ, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉంటే షోపియాన్ లోని కచ్ దూర్ లో స్థానికులను బందీలుగా చేసుకుని ఉగ్రవాదులు నక్కినట్లు తెలుస్తోంది.

21:03 - February 10, 2018

జమ్మూ కాశ్మీర్ : జమ్మూలోని సున్‌జ్వాన్ ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు పంజా విసిరారు. ఉగ్రవాదుల దాడిలో ఇద్దరు సైనికులు అమరులయ్యారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో ఓ సైనికుడి కుమార్తె కూడా ఉంది. ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో సుంజ్‌వాన్‌ఆర్మీ క్యాంపులోకి ప్రవేశించిన ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరుపుతూ గ్రనేడ్స్ విసిరారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులు కాగా...మరో ఆరుగురు సైనికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కల్నల్‌ ర్యాంక్‌ అధికారితో పాటు ఓ జవాను కుమార్తె కూడా ఉంది. సుబేదార్‌ మగన్‌లాల్‌, సుబేదార్‌ మొహమ్మద్‌ అష్రఫ్‌ ఉగ్రదాడిలో అమరులైనట్లు జమ్ముకశ్మీర్‌ మంత్రి అబ్దుల్‌ రెహమాన్‌ వెల్లడించారు.

ఉగ్రవాదులు తొలుత ఓ ఫ్యామిలీ క్వార్టర్‌లోకి చొరబడ్డారు. క్యాంపులో ఏ కుటుంబాన్ని ఉగ్రవాదులు బంధించలేదని అధికారులు స్పష్టం చేశారు. ఉగ్రవాదులను భద్రతబలగాలు చుట్టుముట్టాయి. ఆపరేషన్‌ కొనసాగుతోంది. మహిళలను, పిల్లలను రక్షించేందుకు జెసిఓ ఎమ్‌ అష్రఫ్ మీర్‌ తన ప్రాణాలను అర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో నలుగురైదుగురు ఉగ్రవాదులు పాల్గొని ఉంటారని భావిస్తున్నారు..

ముందు జాగ్రత్త చర్యగా జమ్ము నగరంలోని సుంజ్‌వాన్‌ ప్రాంతంలో క్యాంపునకు దాదాపు 500మీటర్ల దూరంలోని అన్ని పాఠశాలలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. ఈ ఘటనపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ జమ్ముకశ్మీర్‌ డీజీపీకి ఆదేశించారు. ఈ ఘటన నేపథ్యంలో జమ్ము నగరంలో భద్రతను మరింత పెంచారు. 

21:21 - January 15, 2018

జమ్మూ కాశ్మీర్ : నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్‌ భారత్‌ చేతిలో చావుదెబ్బ తిన్నది. పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులను తిప్పికొడుతూ భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాక్‌ రేంజర్లు హతమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. యూరీ సెక్టార్‌లో చొరబాటుకు యత్నించిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. ఆర్మీడే సెలబ్రేషన్స్‌ జరుపుకుంటున్న భారత బలగాలకు జమ్ముకశ్మీర్‌ నియంత్రణ రేఖ వద్ద భారీ విజయం లభించింది. తరచూ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు తగిన రీతిలో బుద్ధి చెప్పింది. పూంచ్‌ జిల్లాలోని ఎల్వోసి వద్ద భారత బలగాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాకిస్తాన్‌ సైనికులు హతమయ్యారు. మరో నలుగురు గాయపడ్డారు. శనివారం నాడు రాజౌరి సెక్టార్‌లో పాక్‌ జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను మృతికి ప్రతీకారంగా భారత్‌ ఈ చర్య చేపట్టింది. జనడ్రాట్‌, కోట్లి సెక్టార్‌ సరిహద్దులో తమ రేంజర్లు నలుగురు మృతి చెందినట్లు పాకిస్తాన్‌ ధృవీకరించింది.

యురీ సెక్టర్‌లో భద్రతా బలగాలు ఉగ్రవాదుల చొరబాటు యత్నాలను భగ్నం చేశాయి. ఆత్మాహుతి దాడి చేసేందుకు యత్నంచిన ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. జైష్‌-ఎ-మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులు యురీ సెక్టార్‌లోకి ప్రవేశించడానికి యత్నించారు. వారి కదలికలను గుర్తించిన భద్రతా బలగాలు వెంటనే అప్రమత్తమై కాల్పులు జరిపినట్లు జమ్ముకశ్మీర్‌ డిజిపి ఎస్పీ వైద్‌ తెలిపారు. ఐదుగురు ఉగ్రవాదుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆర్మీ, సిఆర్‌పిఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు కలిసి ఉమ్మడి ఆపరేషన్‌ నిర్వహించినట్లు అధికారులు పేర్కొన్నారు.

ఢిల్లీలో 70వ ఆర్మీ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరిక చేశారు. సరిహద్దు పరిస్థితుల్లో మార్పు రాకుంటే తీవ్ర చర్యలు చేపట్టక తప్పదని స్పష్టం చేశారు. సరిహద్దులో ఉగ్రవాద చొరబాట్లను ఆపాలని పాకిస్తాన్‌కు రావత్‌ సూచించారు. పాకిస్తాన్‌ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడితే భారత్‌ తగినరీతిలో సమాధానమిస్తుందని పేర్కొన్నారు. 

Pages

Don't Miss

Subscribe to RSS - జమ్మూ కాశ్మీర్