జర్మనీ

08:52 - December 6, 2018

జర్మనీ : ప్రపంచంలోనే మొట్టమొదటి త్రీడీ ప్రింటింగ్ బైక్ రోడ్డెక్కింది. నెరా పేరుతో తయారైన ఈ త్రీడీ బైక్ ను బిగ్ రెప్, నౌలబ్ అనే జర్మన్ కంపెనీలు రూపొందించాయి. నెరా త్రీడీ బైక్ రోడ్డుపై పరుగులు పెట్టింది. జర్మన్ త్రీడీ దిగ్గజం బిగ్ రెప్, నౌలబ్ లు సంయుక్తంగా ఈ బైక్ ను రూపొందించాయి. కొత్తతరం అనే అర్థం వచ్చే న్యూఎరా నుంచి తీసుకున్న పదాలతో నెరా అనే పేరు పెట్టారు.

నెరా బైక్ తయారీలో ఎలక్ట్రిక్ కాంపోనెంట్ బ్యాటరీ తప్పితే మిగిలినవన్నీ కూడా త్రీడీ టెక్నాలజీతోనే తయారు చేసిన భాగాలు వాడతారు. బైక్ బరువు కూడా చాలా తక్కువ...దాదాపు 60 కేజీలు మాత్రమే ఉండగా.. బైక్ తయారీకి 12 వారాల గడువే పట్టిందని చెబుతున్నారు. ప్రస్తుతం స్పీడ్ తక్కువున్న నెరా బైక్ ను కమర్షియల్ గా విక్రయించడం లేదు. 

 

21:04 - September 18, 2018

జర్మని :  మనిషి తలచుకుంటే అద్భుతాలకు కొదవేలేదు. మానవ మేధస్సుకు కొలమానం లేకుండాపోతోంది. ఒకప్పుడు పొగతో గుపు్పగుప్పుమంటు చుక్ చుక్ మంటు దూసుకుపోయే రైలుబండిని చూసి పరమానంతభరితులైన రోజుల నుండి కన్ను మూసి తెరించే సమయంలో కనుమరుగైపోయే రైళ్ల తయారీ వరకూ కొనసాగిన మానవ మేథస్సు అంతకంతకూ కొత్త పుంతలు తొక్కుతోంది. టెక్నాలజీ డెవటప్ మెంట్ తో సుఖాలను, సౌకర్యాలకు అనుభవిస్తున్న మనిషి అది చాలదన్నట్లుగా మరి దేనికో పరుగులు పెడుతున్నాడు. దీంతో పర్యావరణానికి చేటు కలుగుతో మానవ మనుగడకే ప్రశ్నార్థకంగా తయారవుతోంది. ఈ నేపథ్యంలో మనిషి తాను డెవలప్ చేసిన టెక్నాలజీకి మరింత మెరుగులు దిద్ది పర్యావరణ హితంవైపు కూడా యోచిస్తున్నాడు. ఈ ఆలోచనల నుండి పుట్టిందే ‘హైడ్రోజన్ టై్న్’.
టెక్నాలజీతో అద్భుతాలు సృష్టించే రోజుల్లో వున్న మనం  ప్రపంచంలోనే తొలిసారిగా హైడ్రోజన్‌తో నడిచే రైలు జర్మనీలో పరుగులు పెట్టింది. పూర్తిగా పర్యావరణ హితమైన ఈ రైళ్లు డీజిల్‌తో నడిచే రైళ్లతో పోలిస్తే ఖరీదైనవే అయినప్పటికీ పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ రైళ్లు. ఒక్కసారి దీని హైడ్రోజన్ ట్యాంకును నింపితే ఏకంగా వెయ్యి కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. ట్యాంకు నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. గరిష్టంగా 140 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవు. కొరాడియా ఐలింట్‌గా పిలుస్తున్న ఈ రైళ్లను ఫ్రాన్స్‌కు చెందిన ‘అల్‌స్టోమ్’ తయారు చేసింది. 2021 నాటికి 14 హైడ్రోజన్ రైళ్లను తయారుచేయనున్నట్టు అల్‌స్టోమ్ తెలిపింది.  

హైడ్రోజన్ రైళ్లలో ఉపయోగించే ఇంధనం వల్ల కాలుష్య ఉద్గారాలు ఉత్పత్తి కావు. అందుకనే ఇది పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ. హైడ్రోజన్, ఆక్సిజన్‌లను కలపడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేసే వ్యవస్థ ఇందులో ఉంటుంది. అవసరానికి మించి విద్యుత్తు కనుక ఉత్పత్తి అయితే, అది నేరుగా రైలులో ఏర్పాటు చేసిన లిథియం బ్యాటరీల్లోకి చేరి నిల్వ ఉంటుంది.  తొలి రైలును జర్మనీ సోమవారం పట్టాలపైకి తెచ్చింది. కక్సావెన్‌, బ్రెమెరావెన్‌, బ్రెమెర్‌వోర్డ్‌, బక్సెహుడ్‌ నగరాల మధ్య 1000 కిలోమీటర్ల మార్గంలో రెండు హైడ్రోజన్‌ రైళ్లు సేవలు అందించనున్నాయి.

08:46 - August 24, 2018

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ జర్మనీలోని హాంబర్గ్‌లో చేసిన ప్రసంగంపై బిజెపి మండిపడింది. 23 దేశాల ప్రతినిధుల ముందు రాహుల్‌ దేశాన్ని చులకన చేసి మాట్లాడారని బిజెపి అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్ర విమర్శించారు. ఎన్డీయే పాలనలో భారత్‌లో నిరుద్యోగం, అసమానతలు, మూక హత్యలు, దళితులపై దాడులు అధికమవుతున్నాయని రాహుల్‌ ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల వల్లే ఐఎస్‌ఐఎస్‌ వంటివి ఏర్పడుతాయని చెప్పారు. మైనారిటీలకు ఉద్యోగాలు రాకపోతే ఐఎస్‌ఐఎస్‌ వైపు మళ్లుతారని చెప్పడం ద్వారా రాహుల్‌  భయోత్పాతం సృష్టిస్తున్నారని ... ఉగ్రవాదానికి ఊతమిచ్చే ఈ ప్రకటనపై రాహుల్‌ సమాధానం చెప్పాలని సంబిత్‌పాత్ర డిమాండ్ చేశారు.

 

08:20 - May 6, 2018

జర్మనీ : జర్మనీలో కార్ల్‌ మార్క్స్‌ రెండో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం బహుకరించిన పదిహేడు అడుగుల మార్క్స్‌ కాంస్య విగ్రహాన్ని ఈ వేడుకల సందర్భంగా ఆవిష్కరించారు. మార్క్స్‌ జయంతి వేడుకల్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు చేరుకున్నారు. 

 

21:58 - May 5, 2018

జర్మనీ : జర్మన్ శాస్త్రవేత్త, తత్త్వవేత్త, ఆర్థికవేత్త, సామాజికవేత్త, పాత్రికేయుడు, సోషలిస్టు విప్లవకారుడు. కార్ల్ మార్క్స్ ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. రాజకీయ ఆర్థికశాస్త్రం, హెగెలియన్ తత్త్వశాస్త్రాన్ని అవపోసన పట్టిన మేధావి కార్ల్ మార్క్స్. యుక్తవయస్సులోనే ఏ దేశపు పౌరసత్వం లేని స్థితిలో లండన్లో జీవితాన్ని కొనసాగించాడు. లండన్లోనే మరో జర్మన్ ఆలోచనాపరుడైన ఫ్రెడెరిక్ ఏంగెల్స్ తో కలిసి మెలిసి ఎన్నో విషయాలపట్ల చర్చించేవాడు. ఈ క్రమంలో ఆయన పలు పుస్తకాలు ప్రచురించాడు.

సుప్రసిద్ధమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో
1848 నాటి కరపత్రమైన కమ్యూనిస్ట్ మేనిఫెస్టో వాటన్నిటిలోకీ సుప్రసిద్ధమైంది. తదుపరి కాలపు మేధో, ఆర్థిక, రాజకీయ చరిత్రను అతని రచన ప్రభావితం చేసింది. సమాజం, ఆర్థిక శాస్త్రం, రాజకీయాలు వంటివాటిపై మార్క్స్ సిద్ధాంతాలను కలగలిపి మార్క్సిజంగా పిలవబడేస్థాయికి ఆయన చేరుకున్నారు. పరాయీకరణ, విలువ, వస్తు పూజ, మిగులు విలువ వంటి తన సిద్ధాంతాల ద్వారా మార్క్స్ పెట్టుబడిదారి వ్యవస్థ వినియోగదారి మనసత్తత్వం అభివృద్ధి చేయడం, సామాజిక అంతరాలు, శ్రమశక్తిని దోపిడీ చేయడం ద్వారా సామాజిక సంబంధాలు, విలువలను ఏర్పరుస్తోందని వాదించాడు. చారిత్రిక భౌతికవాదం అనే విమర్శనాత్మక దృక్పథాన్ని ఉపయోగించి, మార్క్స్ పునాది, పైనిర్మాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. సమాజంలోని సాంస్కృతిక, రాజకీయ స్థితిగతులను, అలానే వాటి మానవ స్వభావపు భావనలను ప్రధానంగా నిగూఢమైన ఆర్థిక పునాదులే నిర్ధారిస్తాయని ఈ సిద్ధాంతం చెప్తోంది. ఈ ఆర్థిక విమర్శలు 1867 నుంచి 1894 వరకూ మూడు భాగాలుగా ప్రచురితమైన ప్రభావశీలమైన దాస్ కేపిటల్లో పొందుపరిచారు.

పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత సమస్యలు వినాశనానికి దారితీస్తాయన్న మార్క్స్
గత సామాజిక ఆర్థిక వ్యవస్థల్లాగానే పెట్టుబడిదారీ వ్యవస్థలోని అంతర్గత సమస్యలు స్వయం వినాశనానికి దారితీసి, దాని స్థానంలో కొత్త వ్యవస్థ ఐన సామ్యవాదం ఏర్పడుతుందని ఊహించారు. మార్క్స్ కార్మిక వర్గం పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి, సామాజిక ఆర్థిక విముక్తి తీసుకువచ్చేందుకు సంఘటిత విప్లవ చర్య చేపట్టాలని వాదిస్తూ క్రియాశీలకంగా దాని ఆచరణ కోసం పోరాడారు. కార్ల్ మార్క్స్ మానవ చరిత్రలోకెల్లా అత్యంత ప్రభావశీలమైన వ్యక్తుల్లో ఒకరిగా పేరొందారు, ఆయన కృషి, సిద్ధాంతం అటు ప్రశంసలు, ఇటు విమర్శలు కూడా విస్తృతంగా పొందాయి. ఆర్థిక శాస్త్రంలో ఆయన కృషి శ్రమ గురించి, దానికీ పెట్టుబడికీ ఉన్న సంబంధం గురించి ప్రస్తుత అవగాహనకీ, తత్ సంబంధితమైన ఆర్థిక ఆలోచనకీ చాలావరకూ పునాదిగా నిలుస్తోంది. మార్క్స్ ని సామాన్యంగా ఆధునిక సామాజికశాస్త్ర నిర్మాతల్లో ఒకరిగా పేర్కొంటారు. మార్క్స్ మరణించేంతవరకూ ఆయన భావాలు ప్రధానంగా వ్యాప్తి చెందకపోయినా, ఆయన మరణానంతరం వాటి ప్రభావం విస్తరించింది. రష్యన్ విప్లవం మొదలుకొని ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక విప్లవాలు మార్క్సిజం సిద్ధాంతం పునాదిగా చేసినట్టు ప్రకటించుకున్నాయి. 20వ శతాబ్దిలో అనేక దేశాలు మార్క్సిస్టు దేశాలుగా తమను ప్రకటించుకున్నాయి. వ్లాదిమిర్ లెనిన్, మావో జెడాంగ్, ఫిడెల్ కాస్ట్రో, సాల్వడార్ అలెండె, జోసిప్ బ్రొజ్ టిటో, క్వామె క్రుమా సహా ఎందరో 20వ శతాబ్దికి చెందిన ప్రముఖ ప్రపంచ నాయకులు మార్క్స్ తమపై గాఢ ప్రభావం చూపాడని పేర్కొన్నారు.

జర్మనీలో మార్క్స్ జయంతోత్సవాలు
కార్ల్‌ మార్క్స్‌ రెండో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం బహుకరించిన పదిహేడు అడుగుల మార్క్స్‌ కాంస్య విగ్రహాన్ని ఈ వేడుకల సందర్భంగా ఆవిష్కరించారు. మార్క్స్‌ జయంతి వేడుకల్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు చేరుకున్నారు.

 

18:48 - May 5, 2018

ఢిల్లీ : జర్మనీలో కార్ల్‌ మార్క్స్‌ రెండో శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చైనా ప్రభుత్వం బహుకరించిన పదిహేడు అడుగుల మార్క్స్‌ కాంస్య విగ్రహాన్ని ఈ వేడుకల సందర్భంగా ఆవిష్కరించనున్నారు. మార్క్స్‌ జయంతి వేడుకల్ని చూసేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో ప్రతినిధులు చేరుకుంటున్నారు. కాసేపట్లో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించనున్నారు. 

20:59 - July 30, 2017

జర్మనీ : కాన్‌స్టాంజ్‌ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. స్థానిక నైట్‌క్లబ్‌లో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్లబ్‌ను చుట్టుముట్టారు. అప్పటికే అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించిన దుండగుడిపై కాల్పులు జరిపి హతమార్చారు. కాల్పుల వెనుక కారణాలు తెలియరాలేదు. అయితే ఇది తీవ్రవాద ఘటన కాదని పోలీసులు తెలిపారు.

06:48 - May 30, 2017

ఢిల్లీ : ఉగ్రవాద వ్యతిరేక పోరాటానికి ఐరోపా దేశాలు నేతృత్వం వహించాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు నిచ్చారు. ఆరు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఆయన జర్మనీలో పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా బెర్లిన్‌లో స్థానిక న్యూస్‌ ఏజెన్సీలతో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ ఉగ్రవాదమేనని.. దానిని ఎదుర్కోడానికి ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా పోరాడాలన్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం యూరోప్‌ దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణిని విడిచిపెడితేనే ప్రపంచ ఆర్థిక రంగానికి మేలు జరుగుతుందన్నారు. సరుకుల చేరవేత, పెట్టుబడుల ప్రవాహం, ప్రజల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు ఉండరాదని మోదీ అన్నారు. ఇవాళ జర్మనీ ఛాన్సలర్‌ ఎంజెలా మార్కెల్‌తో సమావేశంలో పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు.

11:30 - May 29, 2017

ఢిల్లీ : నేటి నుంచి యూరప్‌, రష్యాల్లో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభం అవుతోంది. ఆరు రోజుల పాటు కొనసాగనున్న ఈ పర్యటనలో వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఉగ్రవాద వ్యతిరేకపోరు లాంటి కీలక అంశాలపై చర్చలు జరపనున్నారు. పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ పర్యటనలో ప్రధాని మోదీ జర్మనీ, స్పెయిన్‌, రష్యా, ఫ్రాన్స్‌ దేశాల్లో పర్యటించనున్నారు. జర్మనీ ఛాన్సలర్‌ ఏంజెలా మెర్కెల్‌తో సమావేశమై ఇరు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరపనున్నారు. అనంతరం జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్‌ వాల్టర్‌తో సమావేశం కానున్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత, ఉగ్రవ్యతిరేక పోరు, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ తదితర అంశాల గురించి ఇరు దేశాధినేతలు చర్చిస్తారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో జరిగే ఇరు దేశాల ప్రముఖ పారిశ్రామికవేత్తలతో ఏర్పాటు చేసిన సదస్సులో మోదీ, మెర్కెల్‌ పాల్గొననున్నారు.

మూడు దశాబ్దాల తరువాత..
జర్మనీ పర్యటన అనంతరం ప్రదాని మోదీ మంగళవారం స్పెయిన్‌ చేరుకుంటారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత భారత ప్రధాని తొలిసారిగా స్పెయిన్‌లో పర్యటిస్తుండటం విశేషం. స్పెయిన్‌ రాజు ఆరవ ఫిలిప్‌, అధ్యక్షుడు మారియానో రోజోయ్‌తో భేటీ అవుతారు. అక్కడ నుంచి మే 31న రష్యాలోని సెయింట్‌పీటర్స్‌ బర్గ్‌కు ప్రధాని మోదీ చేరుకుంటారు. జూన్‌ 2వరకు రష్యాలో పర్యటిస్తారు. 18వ భారత్‌-రష్యా వార్షిక సదస్సులో మోదీ పాల్గొని ప్రసంగిస్తారు. జూన్‌ 2న జరిగే అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి ప్రసంగిస్తారు. జూన్‌ 3న ఫ్రాన్స్‌కు చేరుకుని అక్కడ కొత్తగా ఎన్నికైన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానుయేల్‌ మాక్రోన్‌తో మోదీ జరుపుతారు. అనంతరం భారత్‌కు తిరుగు పయనం అవుతారు.

21:31 - March 10, 2017

హైదరాబాద్: జర్మనీలోని దుస్సెల్‌దోర్ఫ్ రైల్వే స్టేషన్‌పై దాడి జరిగింది. కొందరు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. దాడికి సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇది ఉగ్రవాద దాడై ఉండొచ్చన్న అనుమానంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. జర్మనీలో ఉన్న పదివేల మంది ఇస్లామిక్‌ తీవ్రవాదుల్లో 1600 మందికి ఐసిస్ ఉగ్రవాద సంస్థతలో సంబంధాలు ఉన్నాయని జర్మనీ భద్రతా విభాగం అధికారులు చెబుతున్నారు.

Pages

Don't Miss

Subscribe to RSS - జర్మనీ