జవాన్

17:14 - July 25, 2018

హైదరాబాద్ : తిరుమలగిరిలో ఓ ఆర్మీ జవాన్ దారుణాలకు పాల్పడుతున్న విషయం వెలుగు చూసింది. ఒంటరిగా ఉన్న ఓ ప్రేమజంటపై ఆర్మీ జవాన్ బ్రిజేష్ కుమార్ అత్యాచారానికి పాల్పడేందుకు యత్నించాడు. అత్యాచారానికి యత్నిస్తున్న సమయంలో యువతి స్నేహితుడు అడ్డుకోవటంతో అతనిపై కూడా జవాన్ దాడి చేశాడు. ఈ దాడిలో ప్రియుడిపై బ్రిజేష్ దాడి చేయడంతో అతని పళ్లు ఊడిపోయాయి. యువతి అరుపులు, కేకలు వేయడంతో గస్తీ తిరుగుతున్న పోలీసులు ఆమెను రక్షించారు. జవాన్‌ను పట్టుకునేందుకు పోలీసులు యత్నించగా... దాడికి పాల్పడ్డాడు. అయినా కూడా పోలీసులు జవాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.కాగా నాలుగు నెలల క్రితం పదో తరగతి విద్యార్థినిపై బ్రిజేష్ అత్యాచారానికి పాల్పడ్డాడు. డీఎన్ఏ ఆధారంగా ఈ రెండు కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లుగా సమాచారం. 

12:33 - January 6, 2018

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. సోపోర్‌లోని గోల్‌ మార్కెట్‌ ప్రాంతంలో శక్తివంతమైన ఐఈడీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో నలుగురు పోలీసులు మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పేలుడు దాటికి దుకాణాలు ధ్వంసమయ్యాయి. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

22:20 - December 9, 2017

ఛత్తీస్ ఘడ్ : బీజాపూర్ సీఆర్పీఎఫ్ క్యాంపులో దారుణం జరిగింది. సహచరులపై తోటి జవాన్ శాంత్ కుమార్ కాల్పులకు తెగబడ్డారు. రైఫిల్ తో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు.  మృతులు ఎస్సై వీకే శర్మ, ఎస్సై మేగ్ సింగ్, ఏఎస్ ఐ రాజ్బీర్, కానిస్టేబుల్ జీఎస్ రావు. మరో ఏఎస్ ఐ గజనంద్ కు గాయాలయ్యాయి. మృతదేహాలను బీజాపూర్ నుంచి బసగుదాకు తరలించారు. నిందితుడు శాంత్ కుమార్ ను అరెస్టు చేశారు. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం..

 

19:26 - December 1, 2017

మొదట హిట్స్ మీద హిట్స్ కొట్టి తరువాత స్క్రిప్ట్స్ ఎంపికలో కన్ ఫ్యూజ్ అయిన సాయిధరమ్ తేజ్ కొంచెం గ్యాప్ తీసుకుని కమర్షియాలిటీ తో పాటు దేశభక్తి కూడా మిక్స్ చేస్తూ జవాన్ అనే సినిమా చేసాడు.రైటర్ BVS రవి డైరెక్షన్ లో ప్రెసెంట్ టైం లో లక్కీ గర్ల్ గా పేరుతెచ్చుకున్న మెహ్రీన్
హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే ఆడియన్స్ ముందుకు వచ్చింది.ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది ?

సినిమా కథ...
ఈ సినిమా కథ విషయానికి వస్తే.....చిన్నపటినుండి క్రమశిక్షణ అంటూ పెరిగిన జై.. DRDO లో జాబ్ సంపాదించడమే టార్గెట్ గా ఫిక్స్ అవుతాడు.చిన్నతనం నుండి వైల్డ్ నేచర్ అలవాటయిన కేశవ్ ఎలాగయినా ఎదగాలని అడ్డదాదారులు తొక్కి క్రిమినల్ గా మారతాడు.అయితే DRDO రూపొందించిన ఆక్టోపస్ అనే మిస్సైల్ లాంచర్ కోసం 5oo కోట్ల భారీ డీల్ ఒప్పుకుంటాడు కేశవ.అయితే ఆక్టోపస్ ని ఎవరో దొంగిలించబోతున్నారు అని తెలుసుకుని వాళ్ళ నుండి ఆక్టోపస్ ని రక్షించి DRDO లో ఉద్యోగం కూడా సంపాదించుకుంటాడు జై.దాంతో జై పై పగబట్టి అతనితోనే ఆక్టోపస్ ని తెప్పించడానికి అతని ఫామిలీ ని టార్గెట్ చేస్తాడు కేశవ్. ఈ విషయం తెలుసుకున్న జై కేశవ నుండి ఎలా తన ఫ్యామిలీ ని రక్షించుకున్నాడు, ఆక్టోపస్ కేశవ్ కి దక్కకుండా ఎలా అడ్డుకున్నాడు అన్నది మిగతా కథ.

నటీ నటుల ప్రతిభ...
నటీనటుల విషయానికి వస్తే.... ఈ సినిమా విజయం తన కెరీర్ కి కీలకంగా మారడంతో లుక్ నుండి యాక్టింగ్ వరకు చాలా కేర్ తీసుకున్నాడు తేజు.చాలా స్టైలిష్ గా కనిపించిన తేజు నటనపరంగా కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాడు.జై క్యారెక్టర్ లో ఒదిగిపోయి నటించాడు.ఎమోషన్స్ పండించడంలో,డైలాగ్స్ చెప్పేటప్పడు డిక్షన్ లో గాని చాలా మెచ్యూరిటీ చూపించాడు.ఇక విలన్ గా తెలుగు తెరకు పరిచయమయిన హీరోయిన్ స్నేహ భర్త ప్రసన్న కూడా స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నాడు. అతనికి హేమ చంద్ర చెప్ప్పిన డబ్బింగ్ బాగా హెల్ప్ అయింది. ప్రసన్న రూపంలో టాలీవుడ్ కి మరో విలన్ దొరికాడు. ఇక హీరోయిన్ మెహ్రీన్ ఈ సినిమాలో మునుపెన్నడూ లేనంత గ్లామరస్ గా కనిపించింది. ముఖ్యంగా పాటల్లో ఆమె లుక్స్ యూత్ ని, మాస్ ని బాగా ఆకట్టుకుంటాయి. నటన పరంగా పెద్దగా స్కోప్ లేదు,ఉన్నంతలో కూడా ఆమె పెద్దగా ఎఫర్ట్ పెట్టలేదు. మిగతా నటీనటులంతా తమ పరిధిమేర పరవాలేదనిపించారు.

టెక్నిషీయన్స్...
టెక్నీషియన్స్ విషయానికి వస్తే.... మొదటి సినిమా వాంటెడ్ తో దారుణమయిన డిజాస్టర్ అందుకున్న BVS రవి ఈ సారి పేట్రియాటిక్ టచ్ తో ఉండే యాక్షన్ కథ రాసుకున్నాడు. అయితే సినిమాలో చాలా సన్ని వేశాలు మాత్రం రొటీన్ గా ఉన్నాయి. లవ్ ట్రాక్ కూడా చాలా లైటర్ గా ఉండడంతో అస్సలు ఫీల్ లేదు. హీరో, విలన్ లింక్ అప్, ఆక్టోపస్ సేవింగ్, ఇంటర్వెల్ బ్యాంగ్స్ లో తన రైటర్ గా తన ప్రతిభ చూపించాడు రవి. క్లయిమాక్స్ కూడా బాగానే డీల్ చేసాడు. కానీ హడావిడిగా ముగించినట్టు అనిపించింది. పేట్రియాటిక్ టచ్ తో ఉండే డైలాగ్స్ బాగున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చాలా ఎఫర్ట్ పెట్టి మ్యూజిక్ చేసాడు. పాటలు పరవాలేదనిపించేలా ఉన్నాయి. ఆర్.ఆర్ మాత్రం సీన్స్ ఎలివేషన్ లో బాగా ఉపయోగపడింది. కెమెరా వర్క్ కూడా బాగుంది. ఎడిటింగ్ చాలా స్టైలిష్ గా ఉంది. గ్రాఫిక్స్ క్వాలిటీ వల్ల విజువల్స్ కి రిచ్ లుక్ వచ్చింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

ఓవర్ ఆల్ గా చెప్పాలంటే.... హీరో, విలన్ బ్రెయిన్ గేమ్ హైలైట్ గా తెరకెక్కిన జవాన్ అన్ని వర్గాలకు రీచ్ అయ్యే కంటెంట్ తో వచ్చింది. అయితే అక్కడక్కడా రొటీన్ టచెస్ ఉండడంవల్ల కొంచెం డిజప్పాయింట్ గా అనిపిస్తుంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మార్కులు వేయించుకునే లక్షణాలున్న, ఈ సినిమా ఫైనల్ గా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందోచూడాలి.

ప్లస్ పాయింట్స్:
సాయిధరమ్ తేజ్ నటన
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
ఫైట్స్,కెమెరా వర్క్
ప్రొడక్షన్ వాల్యూస్
మైనస్ పాయింట్స్ :
కధలో రొటీన్ టచెస్
ఫార్ములా స్క్రీన్ ప్లే
వీక్ గా ఉన్న ఎమోషన్స్
నాటకీయత ఎక్కువైన బ్రెయిన్ గేమ్
రేటింగ్ గురించి తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.....

11:56 - December 1, 2017

జమ్మూకాశ్మీర్ : వివాహేతర సంబంధం మూడు ప్రాణాలను బలిగొన్నది. భార్య తోటి సైనికుడితో సన్నిహిత బంధాన్ని కొనసాగిస్తుండటంతో తట్టుకోలేక ఓ జవాన్ తుపాకీతో ఇద్దరినీ కాల్చి చంపాడు. అంతటితో ఆగక సదరు సైనికుడి భార్యనూ హతమార్చాడు. జమ్మూ కాశ్మీర్‌లో ఈ సంఘటన జరగగా.. పాల్వంచ మండలం సంగం గ్రామంలో కలకలం సృష్టించింది. సంగం గ్రామానికి చెందిన ఇంజలపు సురేందర్ జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీ జవాన్‌గా పని చేస్తున్నాడు ఇతడికి ఏడేళ్ల క్రితం లావణ్యతో వివాహం జరిగింది. మూడు సంవత్సరాల క్రితం కుటుంబంతో కలిసి జమ్మూ కాశ్మీర్ లో నివాసం ఉంటుంన్నారు. ఈక్రమంలో లావణ్య వేరే జవాన్ తో వివాహేతర సంబంధం ఏర్పరుచుకుంది. సురేందర్ రాత్రి విధులు నుంచి ఇంటికి రాగా..  భార్య సదరు జవాన్ తో సన్నిహితంగా ఉండడం చూసి...  ఆగ్రహోదగ్ధుడై సురేందర్‌.. తన చేతిలో ఉన్న తుపాకీతో లావణ్య,సదరు జవాన్‌ను కాల్చి చంపాడు. తుపాకీ శబ్దంతో పక్క ఇంట్లో ఉన్న జవాన్ భార్య సురేందర్ ఇంటికి వచ్చింది. రక్తపు మడుగులో ఉన్న భర్తను చూసి హతాశురాలైంది.వెంటనే తేరుకుని సురేందర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది ఎందుకు నా భర్తను చంపావంటూ నిలదీసింది ఆగ్రహం చల్లారని సురేందర్ ఆమెను కూడా తుపాకీతో కాల్చి చంపాడు. తుపాకీతో నేరుగా పోలీసులకు సరెండర్ అయ్యాడు.

 

11:12 - November 26, 2017

హైదరాబాద్ : నగరంలోని నెక్లెస్ రోడ్డులో ఫ్రీడం హైదరాబాద్ 10 కె రన్ జరిగింది. మంత్రి లక్ష్మారెడ్డి, డీజీపీ మహేందర్ రెడ్డిలు పాల్గొన్నారు. అంతేగాక ఈ రన్ ఈవెంట్ లో 'జవాన్' సినిమా హీరో 'సాయి ధరమ్ తేజ', హీరోయిన్ మెమరిన్, ‘దిల్' రాజులు పాల్గొన్నారు. రన్ లో పాల్గొన్నన వారందరికీ 'జవాన్' చిత్ర టీం శుభాకాంక్షలు తెలిపింది. ఈ కార్యక్రమంలో అవయవ దానం గురించి అవగాహన కల్పించారు. అందరితో అవయవదాన ప్రతిజ్ఞ చేయించారు. రన్ లో పాల్గొని విజేతగా నిలిచిన వారికి మంత్రి లక్ష్మారెడ్డి బహుమతులు అందచేశారు. ప్రతొక్కరూ అవయవదానంపై అవగాహన పెంచుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డి సూచించారు. 

11:50 - August 29, 2017

ఒకే రోజు రెండు సినిమాలు రిలీజ్ అయితే పోటీ అనే చెప్పాలి. థియేటర్స్ కొరత, స్క్రీన్ లు పంచుకోడంలో తికమకలు ఇవన్నీ ఉంటాయి. తెలిసిందే. కదా. మరి అలాంటిది నేమ్ ఫేమ్ ఉన్న హీరోల సినిమాలు రెండు ఒకే రోజు ఉంటె...ఆటా రసవత్తరంగా ఉంటుంది కదా. 'బెంగాల్ టైగర్' సినిమా తరువాత 'రవితేజ'కి సినిమాలు ఫ్లో తగ్గిపోయింది అని టాక్. అలానే 'సాయి ధరమ్ తేజ్' కూడా తన రీసెంట్ వన్ 'నక్షత్రం' తో కొంచెం వెనుకబడ్డాడు అని అనుకుంటున్నారు అంతా.

అలానే సాయి ధరమ్ తేజ్ విన్నర్ సినిమా కూడా అనుకున్నంత ఆడలేదు అని టాక్. 'రవితేజ' రీసెంట్ గా 'దిల్' రాజు నిర్మాణం లో 'రాజా ది గ్రేట్' సినిమాతో రాబోతున్నాడు. 'దిల్' రాజు బ్యానర్ లో తెరకెక్కుతున్న 'రవితేజ' సినిమా 'రాజా ది గ్రేట్' ని దీపావళి కానుకగా అక్టోబర్ 13న విడుదల చేసేందుకు ప్లానింగ్ నడుస్తుంది. అయితే ఇదే రోజున 'సాయిధరమ్ తేజ్' 'జవాన్' ను కూడా రిలీజ్ చేయాలనే ప్లానింగ్ లో 'దిల్' రాజు ఉన్నట్లు సమాచారం.మరి ఫిలిం నగర్ టాక్ ఏంటంటే ఈ రెండు సినిమాల వెనుక 'దిల్' రాజు ఉన్నాడని అనుకుంటున్నారట. అఫీషియల్ గా అయితే 'రాజా ది గ్రేట్' కి 'దిల్' రాజే బ్యాక్ బోన్. మరి 'జవాన్' గురించి మాత్రం అధికారిక ప్రకటన రాలేదు. ఏది ఏమైనా ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్స్ ఒకే రోజు ఉండటం కొంచం ఆలోచించాల్సిన విషయమే.

12:45 - June 1, 2017

సాయిధరమ్ తేజ నటిస్తున్న తాజా చిత్రం 'జవాన్' షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. బీవీఎస్ రవి దర్శకత్వంలో 'దిల్' రాజు సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 'సాయి ధరమ్' సరసన 'మెహ్రీన్ ఫిర్జాదా' హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుందని..రెండు ఫైట్స్..పాటలు చిత్రీకరించాల్సి ఉందని దర్శకుడు బీవీఎస్ రవి పేర్కొన్నారు. ఆగస్ట్‌లో 'జవాన్‌' ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. 'దేశానికి జవాన్‌ ఎంత అవసరమో... ప్రతీ ఇంటికి మా కథానాయకుడి లాంటి వాడు ఉండాలని చెప్పడమే తమ ఉద్దేశ్యం.జ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ఎలాంటి కష్టాలు వచ్చాయి. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడన్నదే కథ. అందుకే 'ఇంటికొక్కడు' అనే క్యాప్షన్‌ పెట్టడం జరిగిందని దర్శకుడు తెలిపారు.

15:43 - May 23, 2017

చిత్తూరు : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన భక్తుల కారును దొంగలు దోచేశారు. రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌కు చెందిన ఆర్మీ జవాన్ గజేంద్రారెడ్డి ఫ్యామిలీతో కలిసి ఈనెల 20 న తిరుమలకు వచ్చాడు. రాత్రి కారును యాత్రికుల సముదాయంలో పార్క్ చేశారు. దర్శనం అనంతరం బయటకు వచ్చేసరికి కారు కనిపించలేదు. లబోదిబోమంటూ భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు ఖరీదు 9 లక్షలు కాగా.. కారులో రూ.25 వేల నగదు, 7 సెల్ ఫోన్లు ఉన్నాయని గజేంద్రారెడ్డి చెబుతున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

09:48 - April 20, 2017

ఢిల్లీ : తమకు నాణ్యమైన ఆహారం పెట్టడం లేదంటూ పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో వీడియో పోస్టు చేసిన బీఎస్ఎఫ్ జవాన్ తేజ్ బహదూర్ యాదవ్ పై వేటు పడింది. సర్వీసు నుండి తొలగిస్తున్నట్లు అధికారులు బుధవారం ప్రకటించారు. కానిస్టేబుల్‌ హోదా కలిగిన జవాను తప్పుడు అభియోగాలు మోపినట్టు దర్యాప్తులో తేలినట్టు చెప్పారు. ఈ తీర్పుకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకునేందుకు అతనికి మూడు నెలల గడువు వుంటుంది.
సరిహద్దు వెంబడి రాత్రి..పగలు అనే తేడా లేకుండా ఎంతో మంది జవాన్లు పహార కాస్తుండడం తెలిసిందే. వీరికి నాణ్యమైన భోజనం..ఇతరత్రా సౌకర్యాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ నాణ్యతలేని ఆహారం పెడుతున్నారంటూ బీఎస్ఎఫ్ జవాన్ యాదవ్‌ సామాజిక మాధ్యమంలో మూడు వీడియోలు పోస్టు చేశారు. ఈ వీడియోలు వైరల్ అయిపోయాయి. వీడియోలు పోస్టు చేసిన తర్వాత అతనిని జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్‌ జిల్లా నియంత్రణ రేఖ వద్దకు బదిలీ చేశారు. తనను వేధిస్తున్నారంటూ మార్చిలో మరో వీడియోను బహదూర్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు.

Pages

Don't Miss

Subscribe to RSS - జవాన్