జస్టిస్ చంద్రకుమార్

19:49 - January 12, 2018

తిరుగుబాటు సరియైంది కాదని, న్యాయవ్యవస్థలో ప్రక్షాళన చేయడంలో వీరు ముందుకొచ్చారని తెలిపారు. న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యల అనంతరం జరుగుతున్న రూమర్స్ పెద్ద ప్రమాదమన్నారు. అన్యాయాలు..అక్రమాలు..తదితర విషయాలపై సరియైన విధంగా అనుసరించడం లేదన్నప్పుడు సరి చేయాలన్నారు. అనేక కుంభకోణాలను న్యాయవ్యవస్థ బయటపెట్టిందని..ఆయా కుంభకోణాల్లో చాలా మందికి శిక్షలను జడ్జి విధించారని గుర్తు చేశారు. కోట్లాను కోట్లు సంపాదించిన వారు కూడా జైలు శిక్ష అనుభవించారని తెలిపారు. న్యాయవ్యవస్థను ప్రతిష్టను పెంచుతూ వచ్చాయని, ఎక్కడో చిన్న లోపాలు జరుగుతున్నాయంటే..లోపాలను..సరిదిద్దలేదని అనుకోవచ్చా అని ప్రశ్నించారు. న్యాయవాదులు ఎన్నో ప్రయత్నాలు..చేసిన తరువాత బహిరంగంగా వచ్చే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందులో భాగంగా చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ రాయడం జరిగిందని, ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. 

12:43 - November 9, 2017

హైదరాబాద్‌ : సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో.. తెలంగాణ రైతు ఐక్య కార్యచరణ కమిటీ ఆధ్వర్యంలో దీక్ష జరుగుతోంది. జస్టిస్ చంద్రకుమార్‌, రైతుసంఘం కార్యదర్శి సారంపల్లి మల్లారెడ్డి, రంగయ్య ఈ దీక్షలో పాల్గొన్నారు. రైతుల ఆత్మహత్యలు ఆపడానికి ప్రభుత్వం భరోసా ఇవ్వాలని.. పంటకు 50 శాతం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 

17:40 - December 26, 2016

హైదరాబాద్‌ :సక్రమమైన పద్ధతిలో ప్రాజెక్ట్‌లు నిర్మించాలని.. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయాలని జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. తెలంగాణ భూ సేకరణ చట్టం, పర్యవసనాలు అనే అంశంపై... వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని జస్టిస్‌ చంద్రకుమార్‌ విమర్శించారు. . రైతులకు సరైన నష్టపరిహారాన్ని ఇవ్వాలని చంద్రకుమార్‌ సూచించారు.

17:31 - September 4, 2016

హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ సర్కార్‌ పనిచేయడం లేదని తెలంగాణ ప్రజా వేదిక అధ్యక్షులు జస్టిస్‌ చంద్రకుమార్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రజలు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమయిందన్నారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలు అనే మూడు ముఖ్యమైన అంశాలతో మొదలైందని ఆయన గుర్తుచేశారు. ప్రజలందరి భాగస్వామ్యంతో తెలంగాణ ప్రజావేదిక పనిచేస్తుందని జస్టిస్‌ చంద్రకుమార్‌ తెలిపారు. 

18:16 - August 25, 2016

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో ప్రాజెక్టులపై చేసుకున్న మహా ఒప్పందం చారిత్రక నేరం అని తెలంగాణ రైతు సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. మహారాష్ట్రతో ఒప్పందమైనట్టు ప్రాజెక్టుల ఎత్తు తగ్గిస్తే...అది తెలంగాణకు ఐరావతం అవుతుంది కాని చరిత్రాత్మకం ఎలా అవుతుందని ప్రశ్నించారు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల...మహారాష్ట్రకు తలొగ్గి, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు.

17:23 - July 28, 2016

హైదరాబాద్ : ఎంసెట్-2 పరీక్షను రద్దు చేసి మరలా పరీక్ష నిర్వహించే అవసరం లేదని జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. ఇప్పటికే విద్యార్థులు పెద్ద ఎత్తున దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన కొంతమంది విద్యార్థులను శిక్షించి, మిగిలిన వారందరికీ న్యాయం చెయ్యాలని చెప్పారు. విద్యార్థుల తల్లిదండ్రులకు మానసిక క్షభ కలిగించొద్దని అన్నారు. దీనిపై సీఎం, మంత్రులు సానుకూలంగా స్పందిస్తారని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు.

21:43 - July 21, 2016

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న మల్లన్నసాగర్ ముంపు బాధితుడు నర్సయ్య మృతదేహానికి జస్టిస్ చంద్ర కుమార్ నివాళులర్పించారు. ప్రాజెక్ట్ వలన ఎంతో మంది రైతులు మానసిక క్షోభను అనుభవిస్తున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ సర్కార్... ఇప్పటికైనా మేల్కొని ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన బాధితుని కుటుంబానికి 20లక్షల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు.

18:46 - June 20, 2016

హైదరాబాద్ : మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ భూసేకరణ, పరిహారంపై ప్రభుత్వం అవాస్తవాలు చెబుతుందని.. జస్టిస్‌ చంద్రకుమార్‌ నేతృత్వంలోని ప్రాజెక్ట్ నిర్వాసిత జేఏసీ నేతలు ఆరోపించారు. 2003 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వకుండా.. సర్కార్‌ 123 జీవో తెస్తామనడం ఎంతవరకు సబబు అన్నారు జస్టిస్‌ చంద్రకుమార్‌. ప్రాజెక్ట్‌ నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్న జేఏసీ నేతలు.. ప్రభుత్వం మెరుగైన పరిహారం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తమ ఆవేదనను హేళన చేస్తూ.. ప్రభుత్వమే అనేక సంఘాలతో సభలు పెట్టించడం దారుణమన్నారు నిర్వాసిత జేఏసీ నేతలు. 

19:55 - April 23, 2016

కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం కరవును గ్రహించడంలో విఫలమైందని హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ విమర్శించారు. కరీంగనర్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ రైతు సంఘం ఆరో మహాసభ సెమినార్‌కు ఆయన ముఖ్యతిధిగా హజరై, మాట్లాడారు. ప్రభుత్వం వెంటనే యుద్ధప్రాతిపదికన సహయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతులకు వెంటనే రుణమాఫీ చేసి తక్షణ రుణాలు మంజూరు చేయాలని కోరారు. 

 

21:21 - April 16, 2016

హైదరాబాద్ : ప్రాణహిత ప్రాజెక్టు రీడిజైన్ వల్ల తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందని జస్టిస్ చంద్రకుమార్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జలసాధన సమితి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి చంద్రకుమార్‌ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, టిడిపి నేతలు పాల్గొన్నారు. తుమ్మిడి హట్టి దగ్గర 152 మీటర్ల ఎత్తుతో బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని సూచించారు. ప్రధాన ప్రాజెక్టును తుమ్మిడి హట్టి నుండి మేడి గడ్డకు మారిస్తే వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని చెప్పుకొచ్చారు. నేతల అభిప్రాయాలు వినాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Pages

Don't Miss

Subscribe to RSS - జస్టిస్ చంద్రకుమార్