జార్ఖండ్

13:33 - April 16, 2018

జలం ప్రాణాధారం, జలం జీవాధానం, జలమే జీవం, జలమే ప్రాణం. జలం లేకుంటే ప్రాణికోటి సమస్తం అంతం!! ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకూ నీటితోనే పని. అది లేకుంటే అన్ని పనులు బంద్! అసలు మానవ మనుగడే బంద్!! మనిషి బతకాలన్నా, పంట పండాలన్నా, జీవకోటి మనుగడ సాగించాలన్నా నీరే ఆధారం! అది లేకుంటే ? అసలు ఆ మాట తలచుకునేందుకే ధైర్యం చాలదు కదూ? నీటి కోసం గ్రామాలకు గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు కొట్టుకుంటున్నాయంటే కారణం మనుగడ, బ్రతికేందుకు ఆధారం? జీవాధానం. నీటి యుద్ధాలతో దేశాలకు దేశాలకు కొట్టుకున్న దాఖలాలు కూడా లేకపోలేదు. సాధారణంగా నీటికొరత అనేది చాలా ప్రాంతాలలో వుంది. అదీ వేసవి వచ్చిందంటే ఇక చెప్పేదేముంది. స్నేహితులుగా వుండే ఇరుగు పొరుగు వారు కూడా శతృవుల్లా మారిపోతారు. కారణం నీరు.

ప్రాణి మనుగడకు నీరు..
భూమిమీద వృక్షాలు, జంతువులు, మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు గాలి తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది ప్రకృతి సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనె జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. ఘన రూపము. అనగా మంచు గడ్డల రూపంలోను, ద్రవ రూపం వాయు రూపంలో అటే మేఘాలు, ఆవిరి రూపాలలో అన్నమాట. మరి నీరు ప్రాణి మనుగడను సాసిస్తోంది. 

నీటికోసం మైళ్ల దూరం కాలినడక..
నీటికోసం మైళ్లకొద్దీ దూరాలు వెళ్లి తెచ్చుకునే దుస్థితి నేటి కంప్యూటర్ యుగంలో కూడా వుంది అంటే పరిస్థితులు ఎంతటి దారుణంగా వున్నాయో ఊహించుకోవచ్చు..హలో అంటే పొలో మంటు ఇంటి ముంగిట్లో వచ్చి పడిపోయే పదార్ధాలు, వస్తువులు. కానీ వేసవి వచ్చిందంటే మాత్రం లీటరు నీరు రూ.100లు పెట్టి కొనుకునే పరిస్థితులు. బీటలు వారిని నేలమ్మ తల్లి. గంగమ్మ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి. పంటే వేసిన రైతన్న వరుణుడి కోసం ఎదురు చూస్తున్నట్లు..దాహార్తితో కటకటలాడిపోతున్న నేలమ్మను అభిషేకించేందుకు వానమ్మ కానరాని దుర్భర పరిస్థితులు.

వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు..
నడి వేసవి రాకముందే దేశవ్యాప్తంగా 140 జిల్లాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. మంచి నీటి కోసం అలమటించే పరిస్థితి ఏర్పడింది. వాతావరణ శాఖ తాజా గణాంకాల ప్రకారం... 404 జిల్లాల్లో గతేడాది అక్టోబర్ తర్వాత వర్షాల్లేకపోవడంతో కరువు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో 140 జిల్లాల్లో మాత్రం పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. మరో 109 జిల్లాల్లో ఓ మోస్తరు కరువు ఉంది.

156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు..
156 జిల్లాల్లో మాత్రం స్వల్ప స్థాయిలో కరువు ఉంది. నిజానికి ఏటా చాలా జిల్లాల్లో ఈ పరిస్థితులు వేసవిలో కనిపిస్తూనే ఉంటాయి. కాకపోతే ఈ ఏడాది శీతా కాలంలో అసలు వర్షాలే లేకపోవడంతో పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో దేశవ్యాప్తంగా 63 శాతం వర్షాభావం ఉంది. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే రిజర్వాయర్లలో తక్కువ నీటి లభ్యత కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.

18:43 - March 30, 2018

సిద్దిపేట : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ వరప్రదాయని అని అన్నారు జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్. ఆయన ఇవాళ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో కలిసి.. మహదేవపూర్ మండలం మేడిగడ్డ బరాజ్‌ను సందర్శించారు. హైదరాబాద్ నుంచి నేరుగా మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు చేరుకుని పనులను పరిశీలించారు. ప్రాజెక్టు పనుల వివరాలను మంత్రి హరీశ్‌రావు, నీటిపారుదల శాఖ అధికారులు సోరెన్‌కు వివరించారు. అనంతరం అక్కడి నుంచి అన్నారం బరాజ్ పనులను కూడా సోరెన్ పరిశీలించారు. 

 

13:15 - March 30, 2018

ఢిల్లీ : సీబీఎస్ఈ ప్రశ్నాపత్రం పేపర్ లీక్ అవ్వటంతో విద్యార్ధులు పలు నగరాలలో ఆందోళన బాట పట్టారు. 1000మందికి పేపర్ లీక్ అయినట్లుగా సమాచారం. దీంతో సీబీఎస్ఈ కార్యాలయం ముందు విద్యార్ధులు ఆందోళన చేపట్టారు. అనంతరం సీబీఎస్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు విద్యార్ధులు యత్నించటంతో పోలీసలు అడ్డుకుని వారిపై లాఠీచార్జ్ చేశారు. కాగా ఒకొక్క విద్యార్ధి వద్ద నుండి రూ.35వేలు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి 30మందిని సీబీఐ విచారించింది. సీబీఎస్ పదవ తరగతి గణితం, 12 వ తరగతి అర్థశాస్త్రం ప్రశ్నపత్రాలు సోషల్‌ మీడియా ద్వారా లీక్‌ అవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. పేపర్‌ లీక్‌ బయటపడడంతో లీకైన రెండు పేపర్లకు తిరిగి పరీక్ష నిర్వహిస్తామని సిబిఎస్‌ఈ బుధవారం ప్రకటించింది. సిబిఎస్‌సి తీరును నిరసిస్తూ విద్యార్థులు జంతర్‌ మంతర్‌ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.కాగా 12వ తరగతి అర్థశాస్త్రం పరీక్ష మార్చి 26న జరగ్గా, టెన్త్‌ గణితం పరీక్ష మార్చి 28న జరిగింది. పరీక్షలకు కొద్ది గంటల ముందుగా పదో తరగతి గణితం, పన్నెండో తరగతి అర్థశాస్త్రం ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియా ద్వారా లీక్ అయిన విషయం తెలిసిందే. ప్రశ్నాపత్రం లీక్ తో దేశంలోని పలు నగరాలలో విద్యార్దులు ఆందోళన బాట పట్టారు. జార్ఖండ్ లో ఆరుగురు విద్యార్ధులకు పోలీసులు అరెస్ట్ చేశారు. 

16:32 - February 23, 2018

ఢిల్లీ : పశుగ్రాసం కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు చుక్కెదురైంది. దాణా స్కాంలో బెయిల్ ఇచ్చేందుకు జార్ఖండ్ హైకోర్టు నిరాకరించింది. దియోఘర్ ట్రెజరీ నుండి అక్రమంగా నిధులు డ్రా చేసుకున్నారనే కేసులో బెయిల్ ఇవ్వాలని లాలూ చేసుకున్న విజ్ఞప్తిని కోర్టు కొట్టిపారేసింది. ఈ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు లాలూకు మూడున్నరేళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. జార్ఖండ్ లో ఐదు, పాట్నాలో ఒక కేసులో లాలూ విచారణ ఎదుర్కొంటున్నారు. దోషిగా తేలిన లాలూ రాంచీలోని జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. 

13:13 - December 23, 2017

జార్ఖండ్ : బీహార్ లో ఉత్కంఠ కొనసాగుతోంది. లాలూ ప్రసాద్ యాదవ్ భవితవ్యం ఎలా ఉంటుంది ? ఆయనపై ఎలాంటి తీర్పు వస్తుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ‘దాణా' కుంభకోణంపై శుక్రవారం సీబీఐ స్పెషల్ కోర్టు శివపాల్ సింగ్ న్యాయమూర్తి వెలువరించనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ భవితవ్యం ఏంటో ఈ కోర్టు తీర్పు నిర్ణయించనుంది.

25 సంవత్సరాల నుండి ఈ కేసు విచారణ జరుగుతోంది. 1991-94 మధ్యకాలంలో దియోగఢ్ (ఇప్పుడు దియోగఢ్ జార్ఖండ్ లో ఉంది) ట్రెజరీ నుండి దాణా కోసం రూ. 89 లక్షలను ఫోర్జరీ సంతకాలు చేసి డ్రా చేసినట్లు లాలూతో పాటు 34 మందిపై కేసులు నమోదు చేశారు. సీబీఐ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. 1997 అక్టోబర్ 27న సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. విచారణ సమయంలో 11 మంది చనిపోగా ముగ్గురు అప్రూవల్ గా మారిపోయారు. తీర్పు సందర్భంగా లాలూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని..బీజేపీ కావాలనే తనను టార్గెట్ చేస్తోందని పేర్కొంటున్నారు. మరి లాలూతో పాటు జగన్నాథమిశ్రాలపై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. 

10:31 - December 23, 2017

న్యూఢిల్లీ : మొన్న 2 జి స్కాం తీర్పు వచ్చేసింది..ఆదర్శ్ స్కాంలపై కూడా తీర్పులు వచ్చేశాయి. అందులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి ఊరట లభించే తీర్పులు వచ్చాయి. తాజాగా 'దాణా' స్కాం పై కూడా తీర్పు రాబోతోంది. ఈ తీర్పు కూడా అదే విధంగా ఉంటుందా ? లేదా ? అనేది కాసేపట్లో తేలనుంది. సీబీఐ స్పెషల్ కోర్టు కాసేపట్లో శివపాల్ సింగ్ న్యాయమూర్తి వెలువరించనున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ భవితవ్యం ఏంటో ఈ తీర్పు నిర్ణయించనుంది.

25 సంవత్సరాల నుండి ఈ కేసు విచారణ జరుగుతోంది. 1991-94 మధ్యకాలంలో దియోగఢ్ (ఇప్పుడు దియోగఢ్ జార్ఖండ్ లో ఉంది) ట్రెజరీ నుండి దాణా కోసం రూ. 89 లక్షలను ఫోర్జరీ సంతకాలు చేసి డ్రా చేసినట్లు లాలూతో పాటు 34 మందిపై కేసులు నమోదు చేశారు. సీబీఐ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. 1997 అక్టోబర్ 27న సీబీఐ ఛార్జీషీట్ దాఖలు చేసింది. విచారణ సమయంలో 11 మంది చనిపోగా ముగ్గురు అప్రూవల్ గా మారిపోయారు. తీర్పు సందర్భంగా లాలూ పలు వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుకు తనకు ఎలాంటి సంబంధం లేదని..బీజేపీ కావాలనే తనను టార్గెట్ చేస్తోందని పేర్కొంటున్నారు. మరి లాలూతో పాటు జగన్నాథమిశ్రాలపై ఎలాంటి తీర్పు వస్తుందో వేచి చూడాలి. 

12:55 - December 13, 2017

జార్ఖండ్‌ : బొగ్గు బ్లాక్‌ల కుంభకోణంలో జార్ఖండ్‌ మాజీ సీఎం మధుకోడాకు సీబీఐ ప్రత్యేక కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.  మధుకోడా సహా మరో నలుగురిని దోషులుగా తేల్చింది.  కేంద్ర బొగ్గుగనులశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా, జార్ఖండ్‌ ప్రభుత్వ మాజీ కార్యదర్శి అశోక్‌బసు, మరో ప్రభుత్వ అధికారి ఈ కేసులో దోషులుగా నిర్దారించింది.  నలుగురూ నేరపూరిత కుట్రకు పాల్పడినట్టు వెల్లడించింది. వీరికి రేపు శిక్ష ఖరారు చేయనుంది. అయితే ఇదే కేసులో న్యాయస్థానం మరో నలుగురిని నిర్దోషులుగా తేల్చింది. కలకత్తా కేంద్రంగా పనిచేస్తోన్న వినీ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ఉద్యోగ్‌ లిమిటెడ్‌కు జార్ఖండ్‌లోని రాజ్హరా బొగ్గు బ్లాక్‌ కేటాయించడానికి కోడా సహా మిగతా నిందుతులు కలిసి కుట్ర చేశారని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది. 

 

14:02 - October 17, 2017

జార్ఖండ్‌ : ఓ పాప ఆకలితో అలమటించి ప్రాణాలు కోల్పోయిన హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. సిమ్‌డెగాకు 
చెందిన ఓ పేద కుటుంబానికి రేషన్‌ షాపులో నిత్యావసర వస్తువులు నిరాకరించడంతో రెండు రోజులుగా పస్తులున్న 11 ఏళ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. ఆధార్‌ కార్డును అనుసంధానం చేయలేదన్న కారణంతో నెల రోజుల క్రితం స్థానిక రేషన్‌ డీలర్‌ ఆ కుటుంబం రేషన్‌ కార్డును రద్దు చేశాడు. దీంతో ఆ కుటుంబానికి గోధుమలు తదితర నిత్యావసర వస్తువులు ఇవ్వడం మానేశాడు. 4-5 రోజులుగా తమ కుటుంబం పస్తులుగానే ఉందని చనిపోయిన పాప తల్లి కోయలాదేవి పేర్కొంది. పాప స్కూలుకు వెళ్తుందని, స్కూలుకు సెలవులుండడంతో మిడ్‌ డే మీల్‌ కూడా లభించలేదని తెలిపింది. స్థానిక నేతలెవ్వరూ తమ గోడును వినిపించుకులేదని కోయలా దేవి చెప్పింది. అడవిలో దొరికే ఆకులు అలములు తిని రోజులు వెళ్లదీస్తున్నామని తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని పౌరసరఫరాల శాఖా మంత్రి పేర్కొన్నారు.

 

07:49 - October 8, 2017

జార్ఖండ్ : తొలి టీ ట్వంటీలో టీం ఇండియా ఘన విజయం సాధించింది. వర్షం అడ్డంకిగా మారినా విరాట్‌ ఆర్మీ ఆసిస్‌ను కంగారెత్తించింది. రాంచీ మ్యాచ్‌ విజయంలో బౌలర్లు అదరగొట్టారు. ఏకంగా ఐదుగురు ఆసిస్‌ బ్యాట్స్‌మెన్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసి సత్తా చాటారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1...0 ఆధిక్యంలో దూసుకెళ్లింది.
అదరగొట్టిన కోహ్లీ బ్యాచ్‌ 
రాంచీ టీ ట్వంటీ మ్యాచ్‌లో కోహ్లీ బ్యాచ్‌ అదరగొట్టింది. పొట్టిఫార్మాట్‌లో బాయ్స్‌  మరోసారి సత్తా చాటారు. 9వికెట్ల తేడాతో కంగారులను చిత్తుచేశారు. మొదట బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో 8వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. వర్షం కారణంగా గంటన్నరపాటు మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. దీంతో డక్‌వర్త్‌లూయిస్‌  పద్దతి అనుసరించి భారత్‌కు 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యం నిర్దేశించారు. అనంతరం లక్ష్యఛేదన ప్రారంభించిన భారత్‌ 5.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి టార్గెట్‌ను  ఛేదించింది.భారత్‌ బ్యాట్స్‌మెన్లలో రోహిత్‌ శర్మ11, శిఖర్‌ ధావన్‌ 15, విరాట్‌ కోహ్లీ 22 పరుగులు చేశారు.  
భారత్‌ 1-0 ఆధిక్యం
అంతకు ముందు టాస్‌ గెలిచిన కెప్టెన్‌కోహ్లీ బౌలింగ్‌ను ఎంచుకున్నాడు. కెప్టెన్‌ నమ్మకాన్ని భారత బౌలర్లు వమ్ము కానివ్వలేదు. వరుసగా రెండు ఫోర్లు బాది వూపు మీదున్న కెప్టెన్‌ వార్నర్‌ ను భువనేశ్వర్‌ క్లీన్‌బౌల్డ్‌ చేసి వికెట్ల కూల్చేపని మొదలు పెట్టాడు. మరోవైపు ఓపెనర్‌ ఫించ్‌ 42 పరుగులు చేసినా.. మాక్స్‌వెల్‌ 17, హెడ్‌ 9, హెన్రిక్స్‌8 , క్రిస్టియన్‌ 9లకే పెవిలియన్‌ చేరారు. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన పెయిన్‌17, నైల్‌ 1 స్వల్ప స్కోర్లకే పరిమితమయ్యారు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్లలో ఐదుగురు క్లీన్‌బౌల్డ్‌ అయ్యారు. భారత్‌ బౌలర్లలో కుల్‌దీప్‌ 2, బుమ్రా 2, భువనేశ్వర్‌, పాండ్య, చాహల్‌ తలో వికెట్‌ తీశారు. దీంతో మూడు టీ20ల సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది.

21:37 - September 25, 2017

రాంచి : జార్ఖండ్‌లోని కుమార్డూబి ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బాణసంచా పరిశ్రమలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందగా.. మరో 25 మందికి గాయాలయ్యాయి. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తోంది. 

Pages

Don't Miss

Subscribe to RSS - జార్ఖండ్